• ఏడు సూపర్ పదార్ధాలను అధ్యయన కారులు ఎంపిక చేసారు.ఈ ఏడింటినీ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల గుండె పదిలంగా వుంటుందని బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రచురించింది. ఇవి కొలెస్ట్రాల్, రక్త పోటు, గుండె జబ్బులకు కారణం అయ్యే ఇతర సమస్యలు తగ్గిస్తాయి. వారానికి రెండు స్పూన్లు వెల్లుల్లి తింటే వీటి లో వుండే యాంటి ఆక్సిడెంట్ల వల్ల 21 శాతం రిస్క్ తగ్గుతుంది. చేపల్ని వారంలో నలుగు సార్లు అయినా తింటే వీటిలో వుండే ఒమేగా-3 ప్యాటి యాసిడ్స్, ఆర్టరీ క్లాగ్గింగ్ ప్లెక్ ఏర్పడటాన్ని నెమ్మదించేలా చేసి 14 శాతం రిస్క్ తగ్గిస్తాయి. రోజుకు కొన్ని బాదాం పప్పులు విటమిన్-ఇ లభించి, రిస్క్ 12.5 శాతం తగ్గుతుంది. రోజుకో గ్లాసు అంటే ఐదు ఓన్సుల వైన్ తాగితే యంటి ఆక్సిడెంట్స్ లభించి, ౩2 శాతం రిస్క్ తగ్గుతుంది. పెద్ద డార్క్ చాక్లెట్ కాండి బార్ రోజుకోకటి తింటే ఫాలి ఫెనాల్స్ లభించింది రిస్క్ 21 శాతం తగ్గిపోతుంది.

    ఈ ఏడింటినీ తీసుకోవడం మేలు

    ఏడు సూపర్ పదార్ధాలను అధ్యయన కారులు ఎంపిక చేసారు.ఈ ఏడింటినీ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల గుండె పదిలంగా వుంటుందని బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రచురించింది. ఇవి…

  • గోల్డెన్ మిల్క్ తగైతే అది యాంటీ ఆక్సిడెంట్ గా బ్రహ్మాండంగా పనిచేతుందని ప్రాచీన ఆయుర్వేద విజాననఁ చెప్పిందనీ నవీన యుగం దాన్ని తుచా తప్పకుండ ఆచరిస్తా నంటోంది. మరి గోల్డెన్ మిల్క్ తయారీ ఎలాగా అంటే వేడి పాలలో అర స్పూన్ పసుపు వేయటం అది చక్కగా బంగారపు రంగు పాలయిపోతుంది. ఇప్పుడీ అలవాటు ప్రపంచవ్యాప్తంగా మారుతోంది. పాలతో పాటు అల్చిన చెక్క మిరియాలు శొంఠి వంటివి జత చేసి పంచదార లేకుండా తాగితే ఆరోగ్యం మహత్తరంగా ఉంటుందని అందరు అంగీకరిస్తున్నారు. కాఫీ టీ చాక్లేట్ వంటి పానీయాల బదులు ఈ గోల్డెన్ మిల్క్ తగైతే వాపులు తగ్గిస్తుందని కాన్సర్ రాకుండా చేస్తుందనీ చెపుతున్నారు. పాలల్లోని పసుపు మనలోని హ్యాపీనెస్ హార్మోన్ అయిన సెరటోనియన్ ఉత్తేజితం చేసి జీర్ణవ్యవస్థను బాగుచేస్తుంది. శరీరంలోని విషతుల్యాలు బయటకి పోతాయి . పసుపు మిరియాలు కలిపి ముద్దగా నూరి కొబ్బరిపాలు లేదా సొయా పాలు లేదా బాదం పాలు కలపాలి. ఒక చుక్క కొబ్బరినూనె లేదా ఆలివ్ ఆయిల్ వేయాలి. పంచదార వేయకుండా రుచికోసం తేనె దాల్చిన చెక్క చేర్చాలి. వేడివేడిగా తాగితే ఈ శీతాకాలపు దివ్యౌషధం ఇదే అవుతుంది.

    శీతా కాలపు దివ్యౌషధం

    గోల్డెన్ మిల్క్ తగైతే అది యాంటీ ఆక్సిడెంట్ గా బ్రహ్మాండంగా పనిచేతుందని ప్రాచీన ఆయుర్వేద విజాననఁ చెప్పిందనీ నవీన యుగం దాన్ని తుచా తప్పకుండ ఆచరిస్తా నంటోంది.…

  • సౌదామినీ అందరూ ఒకేలాగా చదివి ఒకే డిగ్రీ తీసుకుంటారు. కానీ ఎవరో ఒకళ్ళే వేళల్లో ఒక్కళ్లుగా నిలబడతారు. ఇది జతకపు ప్రభావమేనా అన్నావు. జూకర్ బెర్గ్ ఏమంటాడంటే రిస్క్ తీసుకోకపోవటమే మనం చేస్తున్న పెద్ద రిస్క్. కరెక్ట్. రిస్క్ లేనిదే జీవితం లేదు. అంతేకానీ జాతకం కాదు. మనం పాకేదశ నుంచి ప్రతి దశలో మనకు తెలియకుండానే రిస్క్ తీసుకుంటాం. సైకిల్ తొక్కటం రద్దీగా ఉండే రహదార్లలో వేగంగా ప్రయాణించటం అన్నీ రిస్క్ కదా. ఒక్క రోజులో సాధించే మహాద్భుతాలు మంత్రదండాలు ఏవీ ఉండవు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు వెళితేనే శిఖరాగ్రం చేరటం. వేలకోట్ల వ్యాపారం చేస్తున్న వారి పెట్టుబడి వందల్లోనే. ఎన్నిసార్లు వైఫల్యాల పాకుడు కాళ్ళు వాళ్ళని జార్చేసి ఉంటాయి. అయినా మళ్ళీ ప్రయత్నం చేస్తారు. కొందరు ఒక వైఫల్యం తోనే వెనకడుగు వేస్తారు. భిన్నమైన మార్గాన్ని ఎన్నుకోవటం ఏ దశ లోనూ జంకు చూపించకపోవటం కష్టపడిపోతున్నామనే ఆలోచన కాక ఇష్టంతో పనిచేయటం కొత్త ఆలోచనలను నిరంతరం స్వాగతించటం ఓపెన్ మైండ్ తో వినటం ఇవన్నీ విజేతల లక్షణాలు. వీళ్ళే కోట్లలో ఒకళ్ళు. అంతేకానీ జాతకాలు మంత్రాలు దేవుళ్ళ దీవెనలు వుండవు. కష్టపడి సౌదామినీ నువ్వు సాధిస్తావు.

    రిస్క్ లేనిదే జీవితమే లేదు

    సౌదామినీ,  అందరూ ఒకేలాగా చదివి ఒకే డిగ్రీ తీసుకుంటారు. కానీ ఎవరో ఒకళ్ళే వేళల్లో ఒక్కళ్లుగా  నిలబడతారు. ఇది జతకపు  ప్రభావమేనా అన్నావు. జూకర్ బెర్గ్ ఏమంటాడంటే…

  • పూర్వం ఒక ఋషి ఒక ఔషధ పదర్ధాన్ని తిని యవ్వనాన్ని పొందాడు. దాన్నేమంటారో తెలుసా చవన ప్రాస. అదే ఉసిరి బేస్డ్ ఔషధ లౌహ్యం. సులువుగా బరువు పెరిగే వారికీ మెటాబాలిజమ్ తక్కువగా ఉంటుంది. మెటబాలిజమ్ ఉంటే కొవ్వును కరిగించే నాజూగ్గా ఉంటే శరీర సామర్ధ్యాన్ని ఇస్తుంది. ఇదిగో ఉసిరి మెటాబాలిజాన్ని మెరుగుపరిచే మందుల ఖజానా. ఇది ఉసిరి కాయల సీజనే. ఒక ఉసిరికాయ తిన్నా చాలు. ఉసిరి హేయిర్ ఆయిల్ తో కలిపితే జుట్టు దృఢంగా ఆరోగ్యాంగా పెరుగుతోంది. రక్తంలో చక్కెర క్రమ బద్దీకరిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. పళ్ళు కళ్ళు రక్షిస్తుంది. వార్ధక్యం తో పోరాడుతుంది. ఐరన్ వంటి ఖనిజాలని గ్రహించి ఆహారాన్ని శరీరం సులువుగా జీర్ణం చేసుకోవటానికి ఉసిరి సాయపడుతుంది. ఒక్క చిన్న ఉసిరికాయ రెండు నారింజ పండ్లతో లభించే విటమిన్ సి కి సమానంగా ఉంటుంది. ఉసిరి తో తయారు చేసిన మురబ్బా జామ్ లాగా బావుంటుంది. ఉసిరి రైతా చక్కని డైటరీ సప్లిమెంట్.

    మందుల ఖజానా ఉసిరి

    పూర్వం ఒక ఋషి ఒక ఔషధ పదర్ధాన్ని తిని యవ్వనాన్ని పొందాడు. దాన్నేమంటారో తెలుసా చవన ప్రాస. అదే ఉసిరి బేస్డ్ ఔషధ లౌహ్యం. సులువుగా బరువు…

  • నా వయస్సు 30 అని చెప్పుకునేందుకు నేను గర్వపడతా. పర్ ఫెక్ట్ బార్బీ డాల్ లా ఉండాలని నాకెప్పుడూ ఉండదు. ఉదయం లేస్తూనే బెడ్ పైన ఊడిన వెంట్రుకలు చూసి కళ్ళ కింద వలయాలు చూసుకుని నిట్టూర్పులు విడిచే మామూలు అమ్మాయిని అంటోంది. గోవా అమ్మాయి ఇలియానా. దక్షిణాది కోటి రూపాయల పారితోషకానికి శ్రీకారం చుట్టిన మొదటి తార గా క్రెడిట్ పొందిన ఇలియానా ఇప్పటికీ ఇన్ని సినిమాలు చేసినప్పటికీ టాలీవుడ్ లోనో బాలీవుడ్ లోనో సెటిలయ్యాననుకొను అనిశ్చితి కుదురు లేకపోవటాన్నే కోరుకుంటాను. అప్పుడే సరైన డ్రైవ్ ఉంటుంది. సినిమా అంటే మాత్రం చచ్చేంత ప్రేమ. కానీ దానిలో అతిగా మునిగి పోవద్దని నాకు నేనే సజెషన్స్ ఇచ్చుకుంటాను. ఎందుకంటే అనేకమందిని అదెలా ప్రభావం చేసిందో నేను కళ్లారా చూసాను అంటోంది. ఇలియానా. నేను చిన్నగా కనపడతాను. వయస్సు 30 ఏళ్ళు మెటాబాలిజమ్ నెమ్మదిస్తుంది. బరువు పెరుగుతాను. నా అందం చెదరనందుకు నాకు నేను థాంక్స్ చెప్పుకుంటా కానీ వాస్తవం లో ఉంటా నంటోంది ఇలియానా.

    పర్ ఫెక్ట్ బార్బీ డాల్ లాగా ఉండాలనుకోను

    నా వయస్సు 30 అని చెప్పుకునేందుకు నేను గర్వపడతా. పర్ ఫెక్ట్ బార్బీ డాల్ లా ఉండాలని నాకెప్పుడూ ఉండదు. ఉదయం లేస్తూనే బెడ్ పైన ఊడిన…

  • హైద్రాబాద్ లో గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ ఇండియన్ ఆరిజన్ ఏడవ వార్షిక సదస్సు జరుగుతోంది. ఈ సదస్సు కు హాజరైన జాతీయ అంతర్జాతీయ వైద్య నిపుణులందరి ఏకాభిప్రాయం ప్రకారం పాలిష్ చేసిన తెల్లని బియ్యం స్వీట్లు జంక్ ఫుడ్ మద్య పాణం వంటి అలవాట్ల వల్లనే ఆరోగ్యం దూరమవుతుందని ఒక విలేకరుల సమావేశంలో తేల్చి చెప్పారు. ఆహారంలో దంపుడు బియ్యం జొన్నలు వుండి తీరాలన్నారు. ఇక మధుమేహం వున్నవాళ్ళైతే పుల్కాలు జొన్న రొట్టెలు టీయూస్కుంటే గ్లూకోజ్ నియంత్రణ లో వుంటుందన్నారు. అలాగే సురక్షితమైన తాగేనీళ్ళు అంటే కాచి చల్లార్చిన నీళ్లు తాగితే 80 శాతం జబ్బులు రావన్నారు. కుర్చీలకు అతుక్కుపోవటం వల్లనే సగం ప్రాబ్లమ్ అనీ రోజుకు 10 వేల నుంచి 20 వేల అడుగులు వేస్తె ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు . ఈ అడుగులు లెక్కించేందుకు అనేక పరికరాలు మొబైల్ యాప్స్ వున్నాయి కదా ఖచ్చితంగా ఈ నడక తో ఆరోగ్యం నిలుపుకోవచ్చన్నారు. కుటుంబ నేపధ్యం దృష్టిలో ఉంచుకుని 25 సంవత్సరాల వయస్సు నుంచే సంవత్సరానికి ఒక్కసారన్నా వైద్య పరీక్షలు చేయించుకోమని సలహా ఇచ్చారు.

    తెల్లని బియ్యమే సగం ప్రాబ్లమ్

    హైద్రాబాద్ లో గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ ఇండియన్ ఆరిజన్ ఏడవ వార్షిక సదస్సు జరుగుతోంది. ఈ సదస్సు కు హాజరైన జాతీయ అంతర్జాతీయ వైద్య…

  • తెర వెనుక తారలుంటారు.తెర పైని స్టార్స్ అందం అంతా డిజైనర్ల కష్టమే . గౌతమీ పుత్ర శాతకర్ణి లో ప్రతి పాత్రకు ఆభరణాలు దుస్తులు వైవిధ్యంలో రూపొందించింది ఫ్యాషన్ డిజైనర్ నీతూ లుల్లా. ఇప్పటిదాకా ఏడు భాషల్లో 375 చిత్రాలకు పనిచేసిందామె. రజినీ కాంత్ విక్రమాదిత్య బాలీవుడ్ భాషల్లో మొహంజేదారో రుద్రమదేవి ఇవన్నీ ఆమె సృష్టించిన మాయాజాలమే. గౌతమీ పుత్రలో హేమ మాలినీ శ్రేయ ల కోసం ఆరుకంటే ఎక్కువ గజాల చీరలు నేయించారట నీతూ... కూరగాయల రంగులు వాడి బ్రాకెడ్ ఎంబ్రాయిడరీ డిజైన్లు చేయించారు. బంగారం రంగు రాళ్ళూ ఆన్ కట్ డైమండ్స్ కలిపి అద్భుతమైన అలనాటి నగలు సృష్టించారు. శాతవాహనుల కాలం నాటి చరిత్రను దుస్తుల తీరులో ఆభరణల్లో చూపించేందుకు నెలల తరబడి రీసెర్చ్ చేశానంటారీమె. అనుష్క ఏనుగు పైకి ఎక్కినా గుర్రపు స్వారీ చేసినా కత్తి యుద్ధం లో రౌడీ రసం ఒలికించినా ఆమె కోసం సౌకర్యంగా అద్భుతంగా ఉండే దుస్తులు సృష్టించగలిగానంటారు ఫ్యాషన్ డిజైనర్ నీతూ లుల్లా. వీళ్ళందరినీ అధ్యయనం చేస్తే అమ్మాయిలకు ఎన్ని రంగాల్లో ఎన్ని అవకాశాలున్నాయో తెలుస్తాయి.

    ఈ చేతుల్లోంచే తెర పైని సౌందర్యం

    తెర వెనుక తారలుంటారు.తెర పైని స్టార్స్ అందం అంతా డిజైనర్ల  కష్టమే . గౌతమీ పుత్ర శాతకర్ణి లో ప్రతి పాత్రకు ఆభరణాలు దుస్తులు వైవిధ్యంలో రూపొందించింది…

  • ఓం కార నాడు ఎన్నో లాభాలున్నాయని పరిశోధకులు అంగీకరిస్తున్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు రోజూవారీ ధ్వనానికి విలువ ఉందని తేల్చారు. మంత్రం శక్తి ని నవీన శాస్త విజ్ఞానంగా వివరించే ప్రయత్నం చేస్తున్న సైంటిస్టులు మంత్రం అనేది రెండు సంస్కృత పదాల సమ్మేళనమనీ మన్ అంటే మనసనీ త్రం అంటే తరంగాలు మానసిక తరంగాలు శబ్ద శక్తి ద్వారా ప్రభావితం చేయమనీ స్పష్టంగా చెప్పారు. నవీన శాస్త్రం మంత్రం అనేది ధ్వని శక్తి రూపంగా అంగీకరించింది . ఈ పరిశోధకులు చెప్పిన విషయం. ధ్యానం యొక్క లాభాలను పూర్తీ స్థాయిలో పొందాలంటే ఆ సమయంలో చెవుల్లకు వినబడేట్లుగా ఓంకారాన్ని పలకాలనీ ఆలా పలకటం వల్ల పోషకరాలు బయటకుపోతాయి గొంతు కండరాలు స్వరపేటిక బలపడతాయని రక్త ప్రవాహం మెరుగ్గా ఉంటుందంటున్నారు. ఈ ఓంకారాన్ని ఒకే ఫ్రీక్వెన్సీ లో ఉచ్చరించటం వల్ల లోపలి నాడీ వ్యవస్థ లో కలిగే ఒత్తిడి వాటిలో ఒక స్థిరమైన ప్రశాంతత ఇస్తుందంటున్నారు. ఈ పద ఉచ్చారణకు పెదవులు నాలుక ఊపిరి తిత్తులు అన్నీ కలిసి కట్టుగా పనిచేస్తాయి. నాభి నుంచి నాలుక వరకు ఒకే ధ్రువ రేఖ లో ఉన్న శక్తీ కేంద్రాలు ఉతేజితమౌతాయంటున్నారు. ఇది మతప్రచారమనో ఇదేదో మంత్రాలు చదవటం లా కాకుండా ఒక్కసారి 'ఓం ' అని పెద్దగా అని చూడండి. శరీరం లో ఏ నాడులు కదులుతున్నాయో మనకే తెలుస్తుంది.

    ఓంకార మొక శబ్ద శక్తి

    ఓం కార నాడు ఎన్నో లాభాలున్నాయని పరిశోధకులు అంగీకరిస్తున్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు రోజూవారీ ధ్వనానికి  విలువ ఉందని తేల్చారు. మంత్రం శక్తి ని నవీన శాస్త…

  • ప్రపంచంలోని అన్ని రంగాల కంటే సినిమా రంగానిదే హవా. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఒక కంపెనీ సీఈఓ అయినా ఆ కంపెనీ వరకే పరిమితం. ఈ సినిమా దేవతలు ప్రపంచం మొత్తం పరిచయం. ఉత్తరాది దక్షిణాది మధ్యనే సరిహద్దు గీతాలు ఏనాడో చెరిచేసి ఇప్పుడు హాలీవుడ్ కు పరుగులు పెట్టిన దీపికా పడుకునే వెండితెర సంచలనం. 2017 లో విడుదలవుతున్న ది రిటర్న్ ఆఫ్ క్యాండర్ కేజ్ లో దీపికా పోషించిన పాత్ర పెద్దదే. జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి నుంచి ఫ్యాషన్ మోడల్ దాకా ఆ తర్వాత జాతీయ స్థాయి నటిగా అంతర్జాతీయ తారగా అంచెలంచెలుగా ప్రయాణం సాగించిన దీపికా తనకంటూ ఓ ప్రత్యేకత పొందగలిగింది. ఏడేళ్ల కెరీర్ లో ఎన్నో బాలీవుడ్ హిట్స్ ఉన్నాయి. కాక్ టెయిల్ ఓం శాంతి ఓం ,బాజీరావ్ మస్తానీ , యే జవానీ హై దివానీ , చెన్నయ్ ఎక్సప్రెస్ వంటి హిట్స్ ఇప్పటికే ఆమె ఖాతా లో ఉన్నాయి. ఉమెన్స్ హెల్త్ అండ్ ఫిట్ నెస్ మ్యాగజైన్స్ కాలమిస్ట్ గా కూడా వుంది. చారిటబుల్ సంస్థలకు మద్దతు ఇచ్చే దాన గుణం ఉంది. ఆమె తీరైన ఆకారం కాంతులు చిమ్మే సౌందర్యం ఆమెను అంతర్జాతీయ వేదికలపైన ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి.

    హాలీవుడ్ చేరిన బాలీవుడ్ బ్యూటీ

    ప్రపంచంలోని అన్ని రంగాల కంటే సినిమా రంగానిదే హవా. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఒక కంపెనీ సీఈఓ అయినా ఆ కంపెనీ వరకే పరిమితం. ఈ సినిమా…

  • కొన్ని రకాల పదార్ధాలు కచ్చితంగా కలిపే తినాలి. తాగాలి. కొన్నింటిని విడివిడిగా తీసుకోవాలి. ఉదాహరణకు కాఫీ డికాషన్ ఆరోగ్యం అని తాగుతుంటారు. స్పెయిన్ పరిశోధకులు ఏమంటారంటే మనం తాగే కాఫీ కాంబినేషన్ బెస్ట్ అంటారు. కాఫీ లో వుండే కెఫిన్ అన్న పదర్ధానికి పంచదార జాడిస్తేనే రెండూ కలిసి ఒకదాన్ని మరొకటి ప్రభావితం చేస్తాయి. ఈ రెండు పదార్ధాలు మెదడు లోని రెండు ముఖ్య భాగాల పైన ప్రభావం చూపెడతాయి. ఒకటి జ్ఞాపక శక్తికీ రెండవది దృష్టి కేంద్రీకరించటానికీ ఉపయోగపడతాయి. అలాగే పాలు కమలాఫలం రెండూ ఒకేసారి తినటం తాగటం తప్పు. అది ఉదయం వేళ అయితే శరీరం ఆమ్లాలను గ్రహించలేదు కనుక జీర్ణక్రియకు ఇబ్బంది చేస్తుంది. అరటి జామ కలిపి తినకూడదు. బొప్పాయి నిమ్మ మంచి కాంబినేషన్ కాదు. నారింజ క్యారెట్ కలిపి తీసుకుంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. అదే తేనె నిమ్మరసం అల్లంరసం కలిపి తీసుకుంటే ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ పోతుంది. కొన్ని పదర్ధాలు వుండే రసాయనాలు ఇంకో దానికి జోడిస్తే ప్రమాదం.

    కొన్నింటిని కలిపి తేనే మంచిది

    కొన్ని రకాల పదార్ధాలు కచ్చితంగా కలిపే తినాలి. తాగాలి. కొన్నింటిని విడివిడిగా తీసుకోవాలి. ఉదాహరణకు కాఫీ డికాషన్ ఆరోగ్యం అని తాగుతుంటారు. స్పెయిన్ పరిశోధకులు ఏమంటారంటే మనం…

  • WHO IS GOING TO PROTEST WOMEN IN INDIA FROM US WE ARE AMONG THE WORST అంటూ సినీ హీరో సిద్దార్ధ పెట్టిన ట్వీట్ సంచలనం. మగాళ్ల నుంచి మహిళలను ఎవరు కాపాడతారు. ఈ భూమి మీద ఉండే చెత్త మగాళ్ళం మనమే అంటూ సిద్దార్ధ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా బెంగుళూరు లో మహిళల పై జరిగిన లైంగిక దాడుల పట్ల రీసెంట్ గా తన స్పందని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే సిద్దార్ధ ఇప్పుడు సోషల్ మీడియాలో రియల్ హీరో అనిపించుకున్నాడు. స్త్రీలకు గౌరవించే సంస్కృతి గల భారత దేశంలో మహిళలను దిగ జార్చేలా ఓ ప్రకటన కనిపించిందని తన ట్వీట్ తో చెన్నయ్ అసభ్యంగా కనిపించిన ఒక హోర్డింగ్ కు తొలగించేలా చేసాడు. చెన్నై వరదబాధితులకు ఆహారం నీరు అందించి మానవత్వం చాటుకున్నారు . ఇప్పుడు పడవ తీరాన ఇచ్చిన ట్వీట్ లో తమకు ఎలాంటి దుస్తులు నచ్చితే అలాంటివి మహిళలు ధరిస్తారు . వారి వస్త్రధారణ ఆసరాగా వారిని వేధించే వారు ఆ పాడు పనికి స్వస్తి పలకాలని హీరో సిద్దార్ధ హితవు పలికాడు. ఇతని స్పందను కు నెటిజన్లు ఆనందంలో ఆహ్వానించి మద్దతు పలికారు.

    సిద్దార్థ స్పందించిన తీరు అమోఘం

    WHO IS  GOING TO  PROTEST WOMEN IN  INDIA FROM US  WE ARE AMONG THE  WORST అంటూ సినీ హీరో సిద్దార్ధ పెట్టిన…

  • నెలసరిలో మూడ్ స్వింగ్స్ డిప్రెషన్ క్రంప్స్ వంటివి చాలా మందిని బాధిస్తాయి. ఆహారంలో అత్యవసర పోషకాలు మిస్ అయిన ఫలితం ఇది. చాలినంత ప్రోటీన్ పదార్ధాలు తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ స్థిరంగా ఉంటాయి. మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి. మహిళల సైకిల్ ఫంక్షనింగ్ స్మూత్ గా సాగేందుకు అవసరం అయిన హార్మోన్ లను ఉత్పత్తి చేసేందుకు ప్రోటీన్స్ అవసరం. విటమిన్ సి ,ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ క్రామ్ప్స్ లను తొలగిస్తాయి. ఆకుకూరలు బ్రొకోలీ బొప్పాయి కాలీఫ్లవర్ విటమిన్ ఇ అధికంగా వుండే నట్స్ హాల్ గ్రేయిన్స్ టొమాటోలు యాపిల్స్ ఎక్కువగా తినాలి. ఆహారంలో జంక్ లోపం లేకుండా నువ్వులు గుమ్మడి బీన్స్ శెనగలు బాదం బఠాణీలు తినాలి. బీకాంప్లెక్ విటమిన్స్ గల సప్లిమెంట్ డైట్ ఎనర్జీ లెవెల్స్ ని పెంచుతుంది. వ్యాయామాలు తప్పకుండా చేసి చక్కగా నిద్రపోవాలి. తీపి పదర్ధాలు ప్రాసెస్డ్ పదర్ధాలు తగ్గించాలి. సూర్య రశ్మి తగిలేలా ఆరుబయట వాకింగ్ చేస్తే మంచిది.

    సక్రమమైన డైట్ తో ఈ ప్రాబ్లమ్ పోతాయి

    నెలసరిలో మూడ్ స్వింగ్స్ డిప్రెషన్ క్రంప్స్ వంటివి చాలా మందిని బాధిస్తాయి. ఆహారంలో అత్యవసర పోషకాలు మిస్ అయిన ఫలితం ఇది. చాలినంత ప్రోటీన్ పదార్ధాలు తీసుకుంటే…

  • నీహారికా , ఈ లోకం లో ప్రమాదకరమైన దేదీ అని అడిగావు కదా అది జెలసీ . అసూయ అడవిలో పుట్టే కార్చిచ్చు తో సమానం. ఇది బాధ పడేవారిని బాధకు కారణమైన వారినీ సమానంగా దహిస్తుంది. ఈ లోకం లో ఆనందం లేకపోవటనికి ఎన్నో కారణాలు. కోరికలు అంచనాలు అవసరాలు బులపాటం అసంతృప్తి అత్యాశ అన్నింటికంటే ప్రధానం ప్రమాదం అసూయ. అసూయాపరులకు రెండే చింతలు తనకులేదని ఇతరులకు ఉందనీ. మానసిక శాస్త్ర పరంగా చుస్తే ఈ అసూయకు పాజిటివ్ గా వాడుకుంటే స్ఫూర్తి అభివృద్ధి సాధించవచ్చు. ఈర్ష్య తో దేన్నయినా సాధించాలన్నా పట్టుదల పెంచుకోవచ్చు. కానీ మనుషులకు దృష్టిలోపం. మనకున్న బలహీనతలను ఇతరులకు బలాల తో పోల్చుకుంటాం. మనల్ని బాధ పెట్టె బాధలు ఎన్నో ఉంటాయి. అందుకే పోల్చుకోకూడదు. అప్పుడు మన కున్న సంపదను గుర్తించలేదని గుడ్డివాళ్లం అవుతాము. అనుబంధాలు ఏర్పరుచుకోలేకపోతాము. ఎంత నష్టపోతామో చూడు. ఎప్పుడైతే మనం దృఢమైన చిరకాలం నిలిచే అనుబంధాలు నమ్మటం పరస్పర గౌరవం స్నేహాలు నిలుపుకుంటామో అప్పుడిక ఈ నిర్దయమైన కార్చిచ్చు మన దగ్గరకు రాకుండా పోతుంది. ఏమంటావు ??

    అసూయ అడవిలో కార్చిచ్చు ఎంతో

    నీహారికా , ఈ లోకం లో  ప్రమాదకరమైన దేదీ అని అడిగావు కదా అది జెలసీ . అసూయ అడవిలో పుట్టే కార్చిచ్చు తో సమానం. ఇది…

  • ఒక చక్కని హిట్ సినిమాలో రీమేక్ లో నటించబోతోంది తమన్నా. విజయ్ దేవరకొండ రీతూ వర్మ నటించిన పెళ్లి చూపులు తమిళ రీమేక్ లో తమన్నా హీరోయిన్ గా దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మించనున్నారు, చాలా అందమైన చక్కని సినిమాగా తెలుగులో మార్మోగిన పెళ్లి చూపులు తమన్నా స్టార్ డమ్ తోడైతే బావుంటుందంటున్నారు గౌతమ్ మీనన్. తమన్నా కూడా ఈ సినిమా తోనే గానూ అసలు సినిమాల్లో కథానాయికల కిచ్చిన స్థానంలోనే తన సంతోషం అంటోంది. స్టార్ కిరీటాలు సెట్లో సకల సౌకర్యాలు కల్పించిన ఈ సినీ రంగంలో నాకెప్పుడూ లోటు లేదన్నది తమన్నా . సెట్లో దర్శకుడు చెప్పినట్టు విని ఆ పాత్రలో చాలా కాలం ప్రయాణం ఉంటుంది కాబట్టి అనుకోకుండానే తెలియకుండానే ఆ పాత్ర పై ఇష్టం వస్తుంది అందుకే న పాత్రలన్నీ హిట్. ఇలాంటి మంచి వాతావరణం ఉంటుంది కనుక సెట్టు కూడా ఇల్లు లాగే ఉంటుందంటోంది తమన్నా. తెలుగు ప్రేక్షకులు మెచ్చిన పెళ్లిచూపులు తమిళ ప్రేక్షకులనీ అలరించబోతోంది.

    పెళ్లి చూపులు రీమేక్ లో తమన్నా

    ఒక చక్కని హిట్ సినిమాలో రీమేక్ లో నటించబోతోంది తమన్నా. విజయ్ దేవరకొండ రీతూ వర్మ నటించిన పెళ్లి చూపులు తమిళ రీమేక్ లో తమన్నా హీరోయిన్…

  • భగవంతుడిని పూజించటం గురించి కోట్లమంది చెప్పి వుంటారు. కనే దేవుడిని పూజించే పుష్పాల్లో ఇవి ఉండాలంటారు. హింసించకుండా ఉండటం ఒక పుష్పం. ఇతరులకు గాయపరచకుండా తొలినాడకుండా ఉండటం కూడా భగవంతుడికి అర్పించే ఒక పువ్వులాగా జీవించటం. పుష్పంఇంద్రియ నిగ్రహం పలుక కూడని మాటలను పెదవులు పలకకపోవటం నాలుకను చూపును ఘ్రణ శక్తినీ అదుపులో పెట్టుకోవటం ఇంకో పుష్పం. ఎదుటివారికి కష్టం వస్తే మనకే వచ్చిందని భావించటం. ఓర్పు కలిగి ఉండటం. జ్ఞానంతో ఉండటం సత్య గుణంతో ఉండటం పెద్దలు దేన్నైతే అర్ధం చేసుకుని దాన్ని అనుసరించటకమ్ ఇవన్నీ అష్టాదశ పద్మాల్లాంటివి. నిజానికి ఈ పుష్పాలతో ఈ జగత్తులో అణువణువుగా వ్యాపంచి ఉన్న అసలు రూపం అంటూ లేని అన్నీ రూపాల్లోనూ తానై నిండిన ఆ సర్వసాక్షిని అర్ధించాలట. ఇంతకీ ఆ సర్వ సాక్షి నివాసస్థలం నిర్మలంగా వుండే మన హృదయం.

    ఆ సర్వ సాక్షి ఆరాధనకు ఈ అష్టదళ పద్మాలు

    భగవంతుడిని పూజించటం గురించి కోట్లమంది చెప్పి  వుంటారు. కనే దేవుడిని పూజించే పుష్పాల్లో ఇవి ఉండాలంటారు. హింసించకుండా ఉండటం ఒక పుష్పం. ఇతరులకు గాయపరచకుండా తొలినాడకుండా ఉండటం…

  • శరీరానికి విటమిన్లు అందితేనే ఆరోగ్యంగా చర్మానిగారింపు తో ఉంటుంది. ఆ విటమిన్లు లభించే ఆహారం కోసం వెతికిపట్టుకోవటం మంచిది. చిలకడదుంపలు బ్రొకోలీ క్యారెట్ లివర్ ఫిష్ ఆయిల్ ఆప్రికాట్స్ లో ఫ్యాట్ మిల్క్ విటమిన్ ఎ కు మంచి ఆధారం. ఇవి చర్మ కణాల పునరుత్తేజానికి ఉపకరిస్తాయి. బి కాంప్లెక్ విటమిన్లు స్కిన్ ఫుడ్స్ ఈ విటమిన్ లోపిస్తే పెదవుల చివరలు మిగిలిపోతాయి. బి .కె లోపిస్తే చర్మం కమిలిపోతుంది. బి 6 లోపిస్తే చర్మం పైన ర్యాష్ వస్తుంది. రైస్ పాలు గుడ్లు పెరుగు లో బి 6 పుష్కలం. విటమిన్ C తో చర్మ మృదువుగా ఉంటుంది. బ్రోకలీ కొత్తిమీర మొలకలు కాలీఫ్లవర్ నిమ్మరసం కమలా ద్రాక్ష పైనాపిల్ అన్నింటిలో సి విటమిన్ దొరుకుతుంది. విటమిన్ ఇ బాదం పొద్దు తిరుగుడు గింజలు గుమ్మడి గింజలు పాలకూర ఆలివ్స్ ఆలివ్ ఆయిల్ బొప్పాయిలో లభిస్తుంది. విటమిన్ కె కళ్లకింద వలయాల తో పోరాడుతుంది. పాలకూర తోట కూర ద్రాక్ష కివి పండ్లు ఈ విటమిన్ లభిస్తుంది.

    విటమిన్స్ మంచి ఫ్రెండ్

    శరీరానికి విటమిన్లు అందితేనే ఆరోగ్యంగా చర్మానిగారింపు తో ఉంటుంది. ఆ విటమిన్లు లభించే ఆహారం  కోసం వెతికిపట్టుకోవటం మంచిది. చిలకడదుంపలు బ్రొకోలీ క్యారెట్ లివర్ ఫిష్ ఆయిల్…

  • ఈ సీజన్ చల్లగా హాయిగా ఉంటుంది కానీ శరీరం ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేస్తుంది. కనుక అలసట అనిపిస్తూ ఉంటుంది. సాధారణ ఉష్ణోగ్రత మేనేజ్ చేయటానికి జీవక్రియ పెరుగుతుంది. దీనివల్ల చలిఅనిపించినప్పుడు వణుకు వస్తుంటుంది. శరీరం ఉషోగ్రతను ఉత్పత్తి చేసుకునే మార్గం ఇది. అలసటగా ఉందీ అంటే శరీరం త్వరగా వేడి ఉత్పత్తి కోసం క్యాలరీలు దాచుకునే ప్రయత్నం అన్నమాట. అంతేకాక వేసవితో పోల్చితే కండరాలు లిగమెంట్లు టెండాన్లు ఎక్కువ సఫర్ అవుతాయి. ఇవన్నీ కలిసి ఈ సీజన్ లో తాజాగా ఉండేందుకు దారితీస్తాయి. అలసట ఎదుర్కొనేందుకు వర్కవుట్స్ మిస్ చేయకూడదు. ఎక్కువ క్యాలరీల కోసం శరీరం కొవ్వును కరిగిస్తుంది కాబట్టి మంచి నాణ్యమైన ప్రోటీన్లు ఫ్యాట్స్ లోడ్ చేసుకోవాలి. చల్లని తియ్యని పానీయాలు దూరంగా ఉంచి ఓ కప్పు కాఫీ ఎంజాయ్ చేయాలి. అవుట్ డోర్ వర్కవుట్స్ కార్డియో చెస్ట్ వర్కవుట్స్ చేయాలి. వార్మప్ మరచి పోవద్దు , వర్కవుట్లకు కండరాలు సిద్ధం కావాలంటే డైనమిక్ స్ట్రెచ్ చేయాలి. వర్కవుట్స్ తర్వాత సక్రమంగా కూల్ అయితే ఎలాంటి నొప్పులూ సోర్ నెస్ వుండవు.

    అలసట వస్తుంది జాగ్రత్త

    ఈ సీజన్ చల్లగా హాయిగా ఉంటుంది కానీ శరీరం ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేస్తుంది. కనుక అలసట అనిపిస్తూ ఉంటుంది. సాధారణ ఉష్ణోగ్రత మేనేజ్ చేయటానికి జీవక్రియ…

  • అలవాటుగా కొన్ని పనులు చేస్తాం. వంటల విషయమైతే కొన్ని ఇలాగె వండాలని పేదవాళ్ళనుంచో ఆలా చేస్తే రుచిగా ఉందని తెలుసుకున్నాకనో దాన్ని ఫాలో అయిపోతాం. మాంసాహార పదర్ధాలు ఉడికించి ముందర అందులో వేసే కొన్ని దినుసుల్ని కలిపి నానబెడతాం. ఇలా మెరినేట్ చేయటం వల్ల ఉప్పు కరం మసాలాలు ముక్కలకు బాగా పడతాయని త్వరగా ఉడుకుతుందనుకుంటాం. కానీ మాంసాహారాన్ని ఇలా దినుసులతో నానబెట్టి వండటం వల్ల అందులోని కార్సినోజన్ల ప్రభావం తగ్గుతుందని శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో గుర్తించారు. గ్రిల్ల్డ్ మీట్ లో హెటేరో సైక్లిక్ ఎమెన్లు అనే కార్సిజెనిక్ ఉత్పత్తి అవుతుంది. అయితే మాంసాన్ని రోజ్ మేరీ వెల్లుల్లి వంటి ఇతర హెర్బ్స్ స్పైస్ లతో కొద్దిసేపు నానబెట్టి గ్రిల్ చేస్తే కార్సిజెనిక్ ప్రభావం 87 శాతం తగ్గిపోయిందని శాస్త్ర వేత్తల రిపోర్ట్. ఆహారం లోని కార్సినోజెన్స్ అనేక రకాల కాన్సర్ లకు దారితీసే అవకాశాలున్నాయట. ఆవటుగానో రుచిగా వుంటుందనో ఈ నానబెట్టే ప్రక్రియ మొత్తానికి ప్రయోజనకారమే నాని తేలింది.

    నానబెట్టి వండటం వల్లనే ఈ ప్రయోజనం

    అలవాటుగా కొన్ని పనులు చేస్తాం. వంటల విషయమైతే కొన్ని ఇలాగె వండాలని పేదవాళ్ళనుంచో ఆలా చేస్తే రుచిగా ఉందని తెలుసుకున్నాకనో దాన్ని ఫాలో అయిపోతాం. మాంసాహార పదర్ధాలు…

  • తలకింద మెత్తని తలగడ వుంటేనే నిద్ర సుఖంగా హాయిగా పడుతుంది. దిండు లేకపోతే ఎదో అసఔకర్యంగానే ఉంటుంది. మంచి నిద్ర లకు ఇదెంత అవసరమో దాని పట్ల జాగ్రత్తలు తీసుకోవలిసిన అవసరమో అంతే ఉంటుంది. దాని పట్ల జాగ్రత్తలు తీసుకోవలిసిన అవసరమూ అంతే వుంటుంది. ఆర్నెల్లు వాడేశాక తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మొటిమలు ఎలర్జీలకు ఆ దిండే కారణం అవుతుంది. పాతబడుతున్న దిండ్ల పై తల అదిమి పెట్టుకోవటం వల్ల వాటిలోని దుమ్ము జిడ్డు మృతకణాలు వంటివన్నీ మొటిమలకు కారణం అవుతాయి. డస్ట్ మైట్స్ కూడా దిళ్ళలో నివాసం ఏర్పరుచుకుంటాయి. వాటివల్ల ఆస్తమా ఇతర ఎలర్జీ రియాక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎలర్జీలు 20 శాతం మంది బాధపడుతున్నారంటే వారిలో రెండొంతుల మందికి బెడ్స్ పై నివసించే డస్ట్ మైట్స్ కారణం అవుతుంటాయి. వీటిని మంచి ఎండలో ఆరబెడుతూ ఉండాలి. నాలుగైదు రోజులకు దిండు కవర్లు మార్చేయాలి.

    తలగడల్లో దుమ్మే సగం కారణం

    తలకింద మెత్తని తలగడ వుంటేనే  నిద్ర సుఖంగా హాయిగా పడుతుంది. దిండు లేకపోతే ఎదో అసఔకర్యంగానే ఉంటుంది. మంచి నిద్ర లకు ఇదెంత అవసరమో దాని పట్ల…

  • ప్రతిభ అనేది ప్రాంతాలకు భాషలకు పరిమితం కాదనీ సినీ నటులు రుజువు చేస్తూనే వున్నారు. ఇప్పుడు భారత దేశ సరిహద్దులు చెదిరిపోయి అంతర్జాతీయ పరుగులు మొదలయ్యాయి. ఉదాహరణకు ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ సౌందర్యవతిగా ఐశ్వర్య రాయ్ కు తిరుగేలేదు. బహుశ ఈ ట్యాగ్ దక్కించుకున్న ఏకైక భారతీయురాలు కూడా ఐశ్వర్యానే. 1994 లో విశ్వసుందరి కిరీటం ధరించాక ఇరువది చిత్రం ఇదే తెలుగులో ఇద్దరుగా వచ్చిన సినిమాల్లో మెరిసిపోయాక జార్ ప్యాక్ హోగయా తో హిందీ చిత్రసీమకు వెళ్లిపోయి అన్నీ బ్లాక్ బస్టర్లే సాధించి అవార్డులు తీసుకుంది . అందంతో అభినయంతో బ్రహ్మాండమైన కీర్తితో పాటు పద్మశ్రీ అవార్డు తీసుకుంది బ్రేడ్ అండ్ ప్రెజుడీస్ ది మిసెస్ ఆఫ్ మ్రిసెస్ ,ప్రహాక్ట్ లాఫ్ట్ లెజియన్ పింక్ ఫాందర్ 2 వంటి అద్భుతమైన చిత్రాలున్నాయి. పెళ్లియినా పాపాయికి తల్లయినా ఆమె అంతర్జాతీయ ఖ్యాతిని ఎవళ్ళూ అందుకోలేదు. అంతర్జాతీయ మేకప్ బ్రాండ్ లోరియల్ లో ఆమెను చుస్తే లోరియల్ కొనాల్సిందే. ఇక క్వీన్స్ చిత్రోత్సవాలు ఆమె అందం గురించి మాటల్లో చెప్పలేనంత ప్రశంసలు. ప్రపంచ సినిమాలో భాగం అయిన ఐశ్వర్య అందం చెక్కు చెదరలేదంటే ఆ రహస్యం ఏమిటోమరి .

    ప్రపంచ సినిమా లో భాగం ఐశ్వర్య

    ప్రతిభ అనేది ప్రాంతాలకు భాషలకు పరిమితం  కాదనీ సినీ నటులు రుజువు చేస్తూనే వున్నారు. ఇప్పుడు భారత దేశ  సరిహద్దులు చెదిరిపోయి అంతర్జాతీయ పరుగులు మొదలయ్యాయి. ఉదాహరణకు…