• అంతర్జాతీయ సైన్స్ అకాడమీలో మహిళా సైంటిస్టుల సంఖ్య పైన ఒక గ్లోబల్ సర్వే జరిగింది. 66 దేశాల్లోని సైన్స్ అకాడమీలో మహిళా సభ్యులు కేవలం 12 శాతం మాత్రమే వున్నారని సర్వే రిపోర్ట్. ఒక్క మన దేశంలో 2011-12 లెక్కల ప్రకారం రీసెర్చ్ అండ్ డెవలెప్మెంట్ మొత్తం 1.93 లక్షల మంది సైంటిస్టులు పనిచేస్తుంటే వారిలో మహిళా సైంటిస్టులు 27,532 మంది మాత్రమే అంటే 14 శాతంగా ఉన్నారు. పెళ్లి కుటుంబ బాధ్యతలు పిలల్ల పెంపకం ఉద్యోగ బదిలీలు వంటి విషయాల కారణం తోనే స్త్రీలు ఈ రంగంలో సుదీర్ఘమైన కాలం కొనసాగలేకపోతున్నారు. రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్ ద్వారా స్త్రీలను ఎక్కువగా తీసుకోవటం ద్వారా సాంకేతిక రంగంలో అసమానతలు పోగొట్టాలని భారత ప్రభావం భావించింది. మహిళా శాస్త్ర వేత్తలను ప్రోత్సాహకరంగా ఎన్నో కార్యక్రమాలు చెప్పట్టింది. ఇండియన్ ఎకాడమీ ఆఫ్ సైన్సెస్ లో కూడా మహిళా సభ్యుల సంఖ్య ఎక్కువగా వృద్ధి చేయాలన భావిస్తోంది. ఈ రిపోర్టుల అమ్మాయిలు సవాల్ గా తీసుకుంటేనే మహిళా సైంటిస్టులు సంఖ్యా పెరుగుతోంది.

    మహిళా సైంటిస్ట్ సంఖ్య చాలా తక్కువ

    అంతర్జాతీయ సైన్స్ అకాడమీలో మహిళా సైంటిస్టుల సంఖ్య పైన ఒక గ్లోబల్ సర్వే జరిగింది. 66 దేశాల్లోని సైన్స్ అకాడమీలో మహిళా సభ్యులు కేవలం 12 శాతం…

  • నీహారికా , ఇప్పుడు రెండు వేమన పద్యాల్లోని ఒక్క లైను చెపుతూ కోపముండు బతుకు కొంచమై పోవును. ఇదొక పద్యం లోది. శాంతభావ మహిమ చర్చించ లేమయా. ఇది ఇంకో పద్యంలోని లైవ్. ఎంచెపుతున్నాడంటే కోపం వలన మనిషి తన వివేకాన్ని ఆలోచననీ కోల్పోతున్నాడు. పరాజయానికి కారణం విశ్లేషించుకోలేడు. అంచేత ఎంతటి విద్యావంతుడైన కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే అందరినీ దూరం చేసుకుంటాడు అని. అలాగే శాంతం వలన మనిషి తన ఆలోచనలు అదుపులో వుంచుకోగలుగుతాడు. అన్నింటా జయం కలుగుతోంది. శాంత స్వభావి ప్రజల మన్నన పొందుతాడు అవి, పదకొండవ శతాబ్దపు దక్షిణ భారత దేశపు సంఘ సంస్కర్త మహర్షి బసవన్న ఇంట్లో మంటలు చెలరేగితే ఇంటిని దహిస్తాయి. కోపం అన్న అగ్ని అది తెచ్చి పెట్టుకున్న మనిషిని దగ్ధం చేస్తుంది. తర్వాత ఇతరులకు హాని చేస్తుంది అవి. ఇలా పద్యాలూ సుభాషితాలు చెప్పి కోపం వస్తే చంపుకో నిన్ను నువ్వే బాధించుకో అని కాదు చెప్పటం. అసలు శాంతంగా కోపకారణమైన అంశం గురించి ఒక్క నిమిషం ఆలోచించి తప్పు నీదా ఇతరులంతా అని నిస్పక్షపాతమైన జడ్జిమెంట్ ఇచ్చుకో. ఒకవేళ నీదే అయితే కోపం తెచ్చుకోవటం ఖచ్చితంగా నీ అసమద్దత నిస్సహాయత. తప్ప అవతల వాళ్లదే అయితే నిగ్గదీసి అడుగు. నిలదీసి తేల్చుకో. అప్పుడు నోరెత్తకపోవటం నీ తప్పు. సమాధానం చెప్పలేకపోతే ఎదుటివాళ్ళ పరాజయం. నీ గెలుపు. ఇక గెలుపులో కోపం ఎందుకే నీహారికా !!

    తప్పునీదా ఇతరులదా ? తేల్చుకోముందు

    నీహారికా , ఇప్పుడు రెండు వేమన పద్యాల్లోని ఒక్క లైను చెపుతూ కోపముండు బతుకు కొంచమై పోవును. ఇదొక పద్యం లోది. శాంతభావ మహిమ చర్చించ లేమయా.…

  • ఉప్పు లేకుండా ఏ పదార్ధానికి రుచి కాదు. డాక్టర్లు చెప్పే దేమిటంటే 70 కేజీల బరువున్న కాస్త ఎత్తయిన మనిషికి 70 MMO సోడియం రోజుకి అవకాశం అవుతుంది. ఉప్పు ఎంత రుచి ఇచ్చినా ఎంత మంచి పని చేసినా మనం శరీరానికి ఎంత సోడియం అవసరమో అందీ తీసుకోవాలి. సోడియం నిల్వలు పెరిగితే కష్టం అని ఉప్పు ఎక్కువ తిన్నా మరీ తక్కువ తిన్నా శరీరంలో శక్తీ కణాల మార్పుల వల్ల నరాలు బలహీనమై పోతాయి. ఉప్పు నోటికి తగిలిందీ అంటే సరిపడా నీరుకూడా లోపలి పోవాలి. ఇప్పుడు భోజనంలో ఉప్పు కలిపినా కూరలు పెరుగులో ఉప్పు ఊరగాయల్లో ఉప్పు శరీరానికి చేరిపోతుంది కనుక చిరుతిళ్ళ విషయంలో జాగ్రత్త పడాలి. ఏదన్నా కొంటే NO ADDED SALT ప్రకటన వుందో లేదో చూసుకోవాలి. ఈ ఉప్పుని గనుక శ్రద్ధగా చూసి తిన్నామంటే ఇది గుండె చప్పుడుని కదలికల్ని నియంత్రణలో ఉంచుతుంది. నరాల్లోని అంతర్గత శక్తి పుంజుకుని నియంత్రిస్తుంది. కండరాల సంకోచ వ్యాకోచాల్ని క్రమపరుస్తుంది. ఆరోగ్యవంతమైన మాయిషి 2400 మిల్లీ గ్రాముల సోడియం తీసుకోవటం పర్లేదు అంటే మనం తీసుకునే బ్రెడ్ మీగడ షుగర్ పదార్ధాలు ఊరగాయలు మాంసం కూరలు ఆకుకూరలు బిస్కెట్లు సర్వ పదార్ధాల్లో మనకు చేరుతున్న ఉప్పుని అంచనా వేసుకుంటే మన ఆరోగ్యం మన కంట్రోల్ లో ఉంటుంది.

    ఉప్పు రుచికి మాత్రమే

    ఉప్పు లేకుండా ఏ  పదార్ధానికి రుచి రాదు. డాక్టర్లు చెప్పే దేమిటంటే 70 కేజీల బరువున్న కాస్త ఎత్తయిన  మనిషికి 70 MMO  సోడియం రోజుకి అవకాశం…

  • ఇన్ఫోమానియా వైన్ వుంటారు స్మార్ట్ ఫోన్ కు అనారోగ్యకరంగా ఎడిక్ట్ ఆయిపోవటం. వయసులో ఉన్న పిల్లలు భార్యా భర్తలు ఎవరికైనా ఇది ప్రాబ్లమ్. ఉదయం అనగా ఉద్యోగాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకోగానే కొద్దిసేపైనా భార్యాభర్తలు కలిసి గడపటం ఇంటి విషయాలు పిలల్ల విషయాలు మాట్లాడుకోవటం అవసరం. ఇద్దరూ ఇలా అనుకోవాలి. ఆ ఇద్దరిలో ఒకరు ఇంటికి కొచ్చిరాగానే ట్విట్టర్ కు ఫేస్ బుక్ లోనో తల దూర్చితే పక్కన వాళ్ళకి కట్టలు తెంచుకొనే కోపం వస్తుంది. సహజంగా పిలల్లు అంతే ఇంటికి రాగానే అన్నీ నోటికి సిద్ధంగా అందించి తల్లితో కూడా ఒక్క విషయం మాట్లాడకుండా స్మార్ట్ ఫోన్ లో తలదూరిస్తే ఇంకా మనుషుల మధ్య సంబంధాలు ఎక్కడని. ఇదే ఇన్ఫోమానియా ఇది భారీ సమస్యలకు దారితీస్తుంది. ఏ పనిలో ఉన్నా ఇతర కార్యక్రమాలు ఉన్నా ఎవరితోనైనా ముఖ్యమైన సంగతులు మాట్లాడుతున్న ఇక తమకు ఎదో మిస్ అయిపోతున్నామనే భయం పట్టుకుంది. సంబంధ భాంధవ్యాలు సమయం పోగొట్టు కొన్నట్లే. ఇదే మానసిక సమస్యకు దారితీస్తుంది. అలాంటి సమస్యకు తెచ్చే ఫేస్ బుక్ ను ట్విట్టర్ లో పరిమితమైన సమయానికి కుదించేసి మనసుని ఇవతలకు లాక్కోగలిగితే సమస్య ఏముందీ. జీవితం మన మాట వినాలి. మనసు మన కంట్రోల్ లో వుండాలి.

    ఇన్ఫో మానియా

    ఇన్ఫోమానియా వైన్ వుంటారు స్మార్ట్ ఫోన్ కు అనారోగ్యకరంగా ఎడిక్ట్ ఆయిపోవటం. వయసులో ఉన్న పిల్లలు భార్యా భర్తలు ఎవరికైనా ఇది ప్రాబ్లమ్. ఉదయం అనగా ఉద్యోగాలకు…

  • ఇంటిపనులు ఆఫీస్ పనులు ఒక్కసారి రొటీన్ అయిపోయి బోర్ కొట్టేస్తూ ఉంటుంది. ఈ సమస్య దాదాపు గృహిణి లందరూ ఉద్యోగం ఇంటి బాధ్యత నిర్వహించే గృహిణులు కూడా ఎదుర్కుటూవుంటారు. ఎప్పుడూ ఒకే వేళకు లేచి ఏవ్ పనులు చక్కపెడుతూ ఉండటం విసుగే . కానీ ఆ విసుగు రానివ్వని పనులు జీవిత విధానాల్లో భాగంగా ఇముడ్చుకోవాలి. కొన్ని హాబీలు అలవర్చుకుంటే ఉత్సాహంగా కొత్తదనంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది . ఇంకో చాకిరీ అనుకోకుండా వీలైనన్ని పూలమొక్కలు కుండీలతో ఇల్లు నింపేయండి. ఒకటి పచ్చదనం కళ్లపడటం మొదటిలాభం . కళ్ళకు అద్భుతమైన విశ్రాంతి. రెండవది పెరిగే మొక్కలతో అనుబంధం తప్పకుండా పెరుగుతుంది. కామిక్ బుక్స్ వెతికి తెచ్చుకోవాలి. హాస్యం ఉట్టిపడే పాత సినిమాలైనా చివరకు టామ్ అండ్ జెర్రీ సిరీస్ అయినా చూడాలి. ప్రశాంతంగా హాయిగా నవ్వటంలో వత్తిడిపోతుంది. ముఖ్య విషయం ఉద్యోగం చేసే మహిళలు ఆర్ధికంగా స్వతంత్రాలు ప్రాధాన్యత క్రమాలు పసిగ్గట్టి జీవితంలోని ప్రతి అందమైన కోణాన్ని దర్శించాలి. డెడ్ లైన్స్ పట్ల వ్యక్తిగత కమిట్మెంట్ల పట్ల ఖచ్చితమైన సమతౌల్యం సాధించాలి. జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించే హక్కు అవకావం ఉన్న ఈనాటి మహిళా సాధారణ చదవడం నుంచి బయటపడే పరిష్కార మార్గాలు వెతుక్కోలేదా ?

    జీవన యానమే అత్యుత్తమ శక్తీ ఇస్తుంది

    ఇంటిపనులు ఆఫీస్ పనులు ఒక్కసారి రొటీన్ అయిపోయి బోర్ కొట్టేస్తూ ఉంటుంది. ఈ సమస్య దాదాపు గృహిణి లందరూ ఉద్యోగం ఇంటి బాధ్యత నిర్వహించే గృహిణులు కూడా…

  • చూసేందుకు ఎంతో అందంగా ఉంటాయని ప్లాస్టిక్ కంటైనర్ కు కొంటాం. కానీ కొన్ని పదార్ధాలు అందిట్లో ఉంచి ఫ్రిజ్ లో పెడితే తర్వాత ఎంత కడిగినా వాసనా వస్తూనే ఉంటుంది. ఇక ఇంకో సారి వాటిని వాడలేకపోతాం. అలంటి వాసన లొచ్చే ప్లాస్టిక్ బాక్స్ లు శుభ్రం చేయాలంటే గోరువెచ్చని నీటిలో నాలుగు టేబుల్ స్పూన్ల బేకింగ్ షోడా కలిపి చిన్నవైతే అందులో పడేసి నాననివ్వాలి. కంటైనర్ పెద్దదైతే వాటిలో ఈ మిశ్రమం పోసి కాసేపు ఆలా వదిలెస్తే వాసనలన్నీ పోతాయి. ఆ వాసనొచ్చే డబ్బాల లోపల న్యూస్ పేపర్ ముక్కలు పడేసి మూతగట్టిగా పెట్టేసి రెండు రోజులు అలా వదిలేస్తే వాసనలు పోతాయి. కాయితం వాసనాలని పీల్చేస్తుంది. వేడినీళ్లలో వాష్ లిక్విడ్ కలిపి కడిగి ఆరబెట్టచ్చు. లిక్విడ్ క్లోరిన్ వేసిన నీళ్లలో ఈ డబ్బాలు పడేసి వుంచినా వాసనలు పోతాయి. మూతపైన మరకాలున్న ఈ నీళ్లని వాటిపైన పోసి అరగంట తర్వాత సోప్ కలిపిన నీళ్లతో కడిగేస్తే మరకలు పోతాయ్. కంటైనర్లు తడిగా ఉన్నప్పుడు మూతపడితే మళ్ళీ వాసనొస్తాయి. తడి పూర్తిగా ఆరిన తర్వాత మూతపెట్టేయాలి.

    ప్లాస్టిక్ కంటెయినర్ల వాసన పోవాలంటే

    చూసేందుకు ఎంతో అందంగా ఉంటాయని ప్లాస్టిక్ కంటైనర్ కు కొంటాం. కానీ కొన్ని పదార్ధాలు అందిట్లో ఉంచి ఫ్రిజ్ లో పెడితే తర్వాత ఎంత కడిగినా వాసనా…

  • ఇప్పటికీ మహారుచికరమైన పదార్ధాల్లో వేడన్నం లో పప్పులో నెయ్యి కలుపుకోవటం కూడా మొదటివరసలో వుంటుంది. నెయ్యంత రుచి సనాతన భారతీయ సిద్ధాంతం నెయ్యి మంచిదని మొత్తుకున్నా మనం కవన్నీ భయం వేసి తినం. కానీ ఆయుర్వేదంలో నెయ్యికి రసాయనమానేపేరుంది. అంటే రోగనివారిని అని అర్ధం. నెయ్యి కొవ్వు కాదు అది మజ్జిగ చిలికి తీసిన మృదువైన అమృతం నెయ్యి నెలల తరబడి నిలవుంటుంది. సువాసనలు వెదజల్లే తూనే ఉంటుంది. రోజూ తప్పని సరిగా నెయ్యి తినమని చెపుతోంది ఆయుర్వేదం మనం తిన్న ఆహారం చక్కగా జీర్ణం అయ్యేందుకు నెయ్యి ఉపయోగ పడుతుంది. నెయ్యిలోని బీటాకెరోటిన్ విటమిన్ ఇవి మంచి ఆక్సిడెంట్లు నెయ్యి మెదడుకు మీలు చేస్తుంది . అలాగే జీర్ణకోశం లోని మ్యూకస్ పొరను రక్షించేందుకు కూడా నెయ్యి ఉపాయాగపడుతుంది. నెయ్యి కొంచమైనా ఆహారంలో కలుపుకోవటం ఆరోగ్యమే రుచికరమే.

    రసాయనమంటే నెయ్యే

    ఇప్పటికీ మహారుచికరమైన పదార్ధాల్లో వేడన్నం లో పప్పులో  నెయ్యి కలుపుకోవటం కూడా మొదటివరసలో  వుంటుంది. నెయ్యంత రుచి సనాతన భారతీయ సిద్ధాంతం నెయ్యి మంచిదని మొత్తుకున్నా మనం…

  • సినిమాల్లో ఏడుపు సీన్లోస్తే చాలా ఏడ్చేస్తూ వుంటారు. కొన్ని దయనీయమైన దృశ్యాలను చుస్తే మనసు కరుగుతుందనీ భోరున ఏడవటం బావుండక మనసు బరువెక్కి పోయి మాట్లాడలేకపోతాం. నిజానికి అలంటి సందర్భాల్లో ఏడిస్తే మనసు తేలికవుతుందికూడా కానీ మనం నిబ్బరంతో ఉండటం ఏడుపు మునిపంటితో నొక్కిపెట్టి కనీళ్ల్లు రాకుండా ఎంతో శ్రమతో నిగ్రహించుకుంటాం. ఇప్పుడు డాక్టర్లు ఏమంటున్నారంటే కనీళ్ళు మానసిక వత్తిడిని తగ్గిస్తాయని శరీరంలో విషతుల్యమైన వాటిని తొలగించి శరీరం స్వస్థత చెందేందుకు సాయపడతాయంటున్నారు. కొన్ని పరిశోధనలు చేస్తే హాయిగా ఏడవ గలిగిన వాళ్ళు శారీరికంగా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నట్లు ఫలితాలు తేలాయి. ఏడిస్తే ఒత్తిడి తగ్గిపోతుంది . మెదడులో నొప్పి నివారణ ఎంజైములు ఎక్కువగా విడుదలవుతాయి. కనుక మనసారా కడుపులో బాధ ఆవిరై పోయేలా హాయిగా ఏడవండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటున్నారు.

    కలత పోగొట్టే కళ్ళ నీళ్లు

    సినిమాల్లో ఏడుపు సీన్లోస్తే చాలా ఏడ్చేస్తూ వుంటారు. కొన్ని దయనీయమైన దృశ్యాలను చుస్తే మనసు కరుగుతుందనీ భోరున ఏడవటం బావుండక మనసు బరువెక్కి పోయి మాట్లాడలేకపోతాం. నిజానికి…

  • ఈ ప్రకృతి అపురూపంగా ఇచ్చిన ఎన్నో వస్తువులను మనం కష్టపడి కూడా తినలేం. చేదుగా వుండే వేపాకునో నష్టానికి అంటే పచ్చిమిర్చి నో మంచివన్నా సరే ఇష్టం తినగలమా ? అలాంటివాటి లిస్ట్ లో వెల్లులి కూడా ఒకటి. ఎన్నో దినుసుల్లో కలిపితే కూరలకు ఘుమాయింపు రుచి వస్తుందేమో కానీ వెల్లులిని ఆలా ముక్కలు చేసి చితక్కొటో తినగలమా ? అందుకే ఖ్ఆరోగ్యం తలచుకుని దాన్ని వేయించో ఉడకబెట్టో తినాలని చూస్తాం. కానీ అలా వేయిస్తే ఇందులో ఉండే హైడ్రోజన్ సల్ఫయిడ్ సామర్ధ్యం తగ్గుతుందనీ అందువల్ల అలా తీసుకుంటే అట్టే ప్రయోజనం కలుగదని అంటున్నారు నిపుణులు. అదే వెల్లులి పచ్చిగా తినగలిగితే హైడ్రోజెన్ సల్ఫయిడ్ రసాయనాలు వేసే వాహనంగా పనిచేస్తుందని ఇది రక్తనాళాల ద్వారా రక్తం చక్కగా ప్రవహించటానికి సహాయపడుతుందనీ పరిశోధనల్లో వెల్లడైంది. అంచేత ఎలాగోలా పచ్చి వెల్లులి రోజుకు రెండు మూడు రెమ్మలైన తీసుకోవటం వల్ల ఫలితాలు పొందవచ్చని చెపుతున్నారు.

    వెల్లులి పచ్చగానే తినాలి

    ఈ ప్రకృతి అపురూపంగా ఇచ్చిన ఎన్నో వస్తువులను మనం కష్టపడి కూడా తినలేం. చేదుగా వుండే వేపాకునో నష్టానికి అంటే పచ్చిమిర్చి నో మంచివన్నా సరే ఇష్టం…

  • ఎప్పుడూ సందేహించటం కూడా ఒక లాంటి అనారోగ్యమే. అనుమానం పెనుభూతం అన్న పెద్దల మాట నిజమే నంటున్నాయి కొన్ని కొత్త రిపోర్ట్స్. ఈ అనుమానం సామజిక సంబంధాలను దెబ్బ తీయటమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా నష్టం కలిగిస్తుందని పరిశోధనల రిపోర్ట్. కొందరు ఎదుటి వారిని ఎప్పుడూ అనుమానిస్తూ ఉంటారు. వారిపైన అపనమ్మకం పెంచుకుంటారు. దీనివలన మానసిక అశాంతి కలగటమే తాకకుండా జ్ఞాపక శక్తి సన్నగిల్లే ప్రమాదం ఉందని ఫిన్లాండ్ పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ అభద్రతా భారం మహిళల్లోనే ఎక్కువగా ఉంటుందనీ ఈ విషయాన్నీ దీర్ఘకాలం పరిశోధించి రిపోర్ట్ రూపొందించామన్నారు. ఎదుటి వారిని అనుమానించే మహిళల్లో చిత్త వైకల్యం వచ్చే అవకాశం మూడు రెట్లు ఉందన్న విషయం వీరి పరిశోధనల్లో వెల్లడైంది. రిపోర్ట్ విషయం ఎలా ఉన్న అనుమానం అసూయ అగ్నికంటే శక్తిమంతమైనవనీ ఈ అభద్రత తో బాధపడటం అనారోగ్యాలకు మానవ సంబంధాలకు దెబ్బ తీసేందుకు కారణమౌతాయని నిస్సందేహంగా చెప్పవచ్చు.

    అభద్రత అనుమానపు తొలిమెట్టు

    ఎప్పుడూ సందేహించటం కూడా ఒక లాంటి అనారోగ్యమే. అనుమానం పెనుభూతం అన్న పెద్దల మాట నిజమే నంటున్నాయి కొన్ని కొత్త రిపోర్ట్స్. ఈ అనుమానం సామజిక సంబంధాలను…

  • మ్యూజిక్ మనసుతో వింటే నిశబ్దం. చెవులతో మాత్రం వింటే శబ్దం అన్నాడో కవి. నిజంగానే సంగీతమా ఒక స్వాంతన సంగీతం ఒక అనాధ హేల. ఇంత గొప్ప సంగీతం వినటం ద్వారా గుండె ఎంతో ఆరోగ్యాంగా ఉంటుందని లయబద్దమైన సంగీత సుస్వరాలకు మనసు స్వాంతన చెందటం ద్వారా వత్తిడులకు దూరంగా ఉండచ్చని పరిశోధన వెల్లడైంది. రోజుకో అరగంట పాటు సంగీతం వినాలని దానితో మానసిక ప్రశాంతత తో పాటు రక్త నాళాలు సాఫీగా మారతాయని పరిశోధనల సారాంశం. 200 మంది గుండె జబ్బున్న రోగులకు లీనులవిందైన సంగీతాన్ని వినిపించి తర్వాత వారి రక్త ప్రసరణ తీరు పరిశీలించారు . మంచి సంగీతం విన్నాక రక్త ప్రసారణా తీరు మెరుగుపడగా రక్త ప్రసరణ లో విడుదల అయ్యే నైట్రిక్ యాసిడ్ రక్తనాళాల్లో గడ్డలను అవరోధాలను తగ్గిస్తోందన్న విషయం గమనించారు. అయితే ప్రశాంతమైన సంగీతం మాత్రమే వినాలనీ హోరు వాయిద్యాల ద్వారా సంగీత ధ్వని వింటే ఒత్తిడి మరింత పెరిగే అవకాశం వుందన్న విషయం కూడా గుర్తించారు. మంద్ర స్థాయిలు సాగే సంగీతం ఆరిథమ్ లో మంచి ఫలితం పొందవచ్చునని చెపుతున్నారు.

    సంగీతంతో గుండె పదిలం

    మ్యూజిక్ మనసుతో వింటే నిశబ్దం. చెవులతో మాత్రం వింటే శబ్దం అన్నాడో కవి. నిజంగానే సంగీతమా ఒక స్వాంతన సంగీతం ఒక అనాధ హేల. ఇంత గొప్ప…

  • నీహారికా , ఒక విషయం గమనించావా మనం సాధారణంగా పలకరించుకొనేప్పుడు బావున్నారా ? అంటాం. అంటే ఏమిటి మీరు సంతోషంగా ఉన్నారా ? జీవితం బాగా నడుస్తోందా అని. ఇప్పడూ చూడు సంతోషంగా అంటే సంతోషాన్ని ఎలా కొలిచి చెపుతాం ? ఈ లెక్కన మన భావాల్ని మనం ఎవరిపట్ల ఎంత ప్రేమగా ఎంత కోపంగా ఎంత ద్వేషంగా ఉన్నామో చెప్పగలమా ? మన మనస్థితిని నిర్ణయించేది మన దృక్పధం. పెద్దవాళ్ళు ఏమని చెప్తారంటే ప్రతి క్షణం మనం ఉన్న నిమిషం అంతా సంతోషమనీ సంతోషంగానే ఉండాలనీ దానికి దారి ఇతరులను సంతోష పెట్టటమనీ అంటారు . ప్రపంచంలో ఉత్తమమైంది ఆనందమే. నేనేదో ధర్మ సూత్రాలు చెపుతున్నానుకోకు. మనం ఓ పాపాయి దగ్గరకు వెళ్తాం. పసివాడు మొదట్లో మన వంక సందేహంగా చూస్తాడు . వాడిలో మాట్లాడే మార్గం చిరునవ్వు. ఆ నవ్వు మనస్ఫూర్తిగా మానమొహాన కనిపిస్తేనే అందులో నువ్వు నాకెంతో ఇష్టం నీకోసం నవ్వుతున్నాను నీకోసం నిన్నుహత్తు కోవటం కోసం చేతులు జాస్తున్నాను. అన్న మెసేజ్ పసిబిడ్డకు అందితేనే వాడు నవ్విచేతుల్లోకి దూరుతాడు . లేకపోతే నీ నవ్వులు నాకు తెలుసులే అన్నట్లు వాళ్ళ అమ్మ భుజం మీదనుంచి మొహం వెనక్కి తిప్పుకుంటాడు . అదీ సంతోష ఆనంద భాష. అది ఉత్తుంగ తరగంగా ఎగసిపడుతుంది. రారమ్మంటుంది. ఎగసిపడే కెరటాలు దాటి సముద్రంలోతులకు వెళితే ప్రశాంతంగా ఉంటుంది. ఇదే సంతోషం ఆనందం . దీన్ని మనం మాత్రమే పంచగలం ఒక్క చిరునవ్వుతో ఏమంటావు??

    సంతోషమొక ఉత్తుంగ తరంగం

    నీహారికా , ఒక విషయం గమనించావా మనం సాధారణంగా పలకరించుకొనేప్పుడు బావున్నారా ? అంటాం. అంటే ఏమిటి మీరు సంతోషంగా ఉన్నారా ? జీవితం బాగా నడుస్తోందా…

  • చైనా సంస్కృతి నుంచి వచ్చిన చికిత్స విధానం ఆక్యుపేజర్ శరీరం మరున్న భాగాల పైనచేతివేళ్ళ తో నెమ్మదిగా నొక్కటం వల్ల ఆ ప్రాంతలో పెట్టె ఒత్తిడి వల్ల ఎన్నో రకాల అనారోగ్యాలు వదిలించుకోవచ్చని ఆక్యుపేజర్ నిపుణులు చెపుతారు. ఆక్యుపేజర్ వెనక ఓ సిద్ధాంతం చెపుతున్నారు . మానవ శరీరంలో చి అనే శక్తి ప్రవహిస్తూ వుంటుంది. అటువంటి శక్తి ప్రవాహానికి ఏదైనా అడ్డుపడితే ఆనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి. ఎపుడైతీ శక్తీ ప్రవాహం అడ్డుకోబడుతుందో ఆ ప్రదేశంలో వత్తిడి పెడితే ఆ శక్తి ప్రవాహం మళ్ళీ ప్రవహించటం మొదలవుతుంది. ఆక్యుపేజర్ లో శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలై బాధను తగ్గించి ప్రశాంతత ఇస్తాయి. శరీరం పైన కీలకమైన ప్రదేశాలు గుర్తించి ఆ ప్రదేశం పైన తగిన విధంగా వత్తిడి పెట్టాలి. ఆ ఒత్తిడి ఏ స్థాయిలో వుండాలి ఎంతసేపు పెట్టాలి అన్నది శరీరం అనుభవిస్తున్న అసౌకర్యన్ని బట్టివుంటుంది. ఉదాహరణకు నిద్ర రాకపోతే కనుబొమ్మల మధ్య భాగంలో వేళ్ళలో వత్తిడి పెడితే మనసు తేలిక పది నిద్ర వస్తుంది. ఇది ట్రయ్ చేసి చూసి నిద్ర వస్తే అప్పుడు దీన్ని నమ్మి ఏదైనా సమస్య కోసం ఆక్యుప్రేజర్ స్పెషలిస్ట్ ని సంప్రదించండి.

    ఒత్తిడితో చికిత్స ఆక్యుపెజర్

    చైనా సంస్కృతి నుంచి వచ్చిన చికిత్స విధానం ఆక్యుపేజర్ శరీరం మరున్న భాగాల పైనచేతివేళ్ళ తో నెమ్మదిగా నొక్కటం వల్ల  ఆ ప్రాంతలో పెట్టె ఒత్తిడి వల్ల…

  • ఫ్యాషన్ ట్రెండ్స్ లో తెలుపు కు ఎంతో ప్రాధాన్యం వుంది. సరైన యాటిట్యూడ్ లో సరైన కలర్ స్క్రీమ్ తో స్టయిల్ గా ధరిస్తే గ్లామర్ పవర్ కూడా సొంతం అవుతుంది. సృజనాత్మకమైన రూపానికి తెలుపు కాన్వాస్. తెల్లని డ్రెస్ లేదా చీర ఉద్యోగ ప్రదేశంలో క్లీన్ ప్రొఫెషనల్ లుక్ ఇస్తుంది. తెల్లని వస్త్రధారణ కు యాక్సిసరీస్ ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. భారీగా ఉండాలనుకుంటే ఎరుపు నేవీబ్లూ మేజెంటా వంటి బెల్టుల హీల్స్ క్లచెప్ నెక్పీస్ ల రూపంలో జత చేసుకోవాలి. సింపుల్ గా కనిపించాలంటే సిల్వర్ గ్రే బ్రౌన్ గోల్డ్ చీజ్ క్యామెజ్ వంటి రంగులు జోడించాలి. గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ వంటి మెటాలిక్ కలర్స్ తెల్లని దుస్తులకు బాగా నప్పుతాయి. సిల్వర్ ముత్యాల నగలు బావుంటయి . తెల్లని వస్త్రశ్రేణి ఎంపికలో ట్రాన్సఫరెన్సీ కి ప్రాధాన్యత ఇవ్వాలి. క్లాత్ వెనక చేయిపెట్టి చుస్తే ఫ్యాబ్రిక్ ట్రాన్స్ ఫరెన్సీ అర్ధంఅవుతుంది. లోదుస్తులు ఎంపికలో శ్రద్ధ తీసుకోవాలి. సరైన రంగు ఎంచితీసుకోవాలి . ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తెల్లని ఏ సమయంలో నైనా అందంగా ఉంటాయి.

    వెన్నెలంటి అందం కోసం

    ఫ్యాషన్ ట్రెండ్స్ లో తెలుపు కు ఎంతో ప్రాధాన్యం వుంది. సరైన యాటిట్యూడ్ లో సరైన కలర్ స్క్రీమ్ తో స్టయిల్ గా ధరిస్తే గ్లామర్ పవర్…

  • ఒకేఒక్క చిన్న సమస్య స్నేహితులను దూరం చేస్తుంది. ఒకే ఒక చిన్న నిర్లక్ష్యం ఇమేజ్ ని దెబ్బ తీస్తుంది కూడా. ఎవళ్ళూ ఎప్పటికీ మొహమాటంతో చెప్పలేని ఇబ్బంది నోటి దుర్వాసన , దీనికి ప్రధాన కారణం నోటిలో వుండే సల్ఫియిడ్లు . ఏదన్న తిన్న వెంటనే మృదువుగా పుక్కలించగలిగితే పోయే సమస్యని అనవసరంగా పెద్దది చేసుకుంటారుకొందరు. చాలినంత హైడ్రేషన్ దీనికి పరిష్కారం. లాలాజలం నోటిలో బాక్టీరియా ని డైల్యూట్ చేస్తుంది. దాల్చిన చెక్క టీ తాగటం కూడా దీనికి పరిష్కారం. విటమిన్ సి గల పదార్ధాలు ఆరెంజ్ కమలా నిమ్మ కివిల్లాంటి సిట్రిక్ పండ్లన్నీ తాజా శ్వాసకు దోహదపడతాయి. యాపిల్ తింటే శాలివరీ ఎక్కువగా స్టిమ్యులేట్ అవుతుంది. రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకున్నంత మాత్రాన సరిపోదు. పరిశుభ్రత రొటీన్ లోటింగ్ స్క్రాపర్ అవసరం. షుగర్ ఫ్రీ గమ్ చప్పరిస్తున్నా మేలే. ఫలితంగా నోటిలో లాలాజలం పెరుగుతుంది. ఈ సమస్య కారణం దంతక్షయం. చిగుళ్ల ఇన్ఫెక్షన్ కూడా కారణం కావచ్చు. కనుక వైద్యుల చెకప్స్ నిర్లక్ష్యం చేయకూడదు.

    ఇది పెద్ద సమస్యే

    ఒకేఒక్క చిన్న సమస్య స్నేహితులను దూరం చేస్తుంది. ఒకే ఒక చిన్న నిర్లక్ష్యం ఇమేజ్ ని దెబ్బ తీస్తుంది కూడా. ఎవళ్ళూ  ఎప్పటికీ మొహమాటంతో చెప్పలేని ఇబ్బంది…

  • ఈ వాతావరణానికి చర్మం పొడిబారి పోతూవుంటుంది. చర్మం పొట్టు రేగటం దురదలు కూడా వస్తాయి. మందుగా కావలిసింది చర్మానికి కావలిసిన నూనెను అందించటం. తేలికైన ఆలివ్ ఆయిల్ తో మస్సాజ్ చేస్తే మృదువుగా వుంటుంది. సబ్బుకుబదులు సోప్ ప్రీ క్లీన్సర్ వాడాలి స్నానం చేయగానే క్రీమ్ మాయిశ్చరైజర్ లేదా బాడీ బటర్ ను అప్లయ్ చేయాలి . పాలు అవిసెగింజల పొడి బ్రౌన్ షుగర్ కలిపి వారానికి ఒక్కసారి స్క్రబ్ చేయాలి. బ్రౌన్ షుగర్ లేకపోయినా మాములు పంచదార కలిపినా అదే ఫలితం ఉంటుంది. తేనె నిమ్మరసం అలోవెరా జెల్ బాదం నూనె లేదా నిమ్మరసం కలిపినా అవకాడో రాయటం వల్ల కూడా చర్మానికి తేమ లభిస్తుంది. రోజుకు 8 నుంచి పది గ్లాసుల మంచి నీళ్లు దాహం వేయకపోయినా తాగాలి సోయా టోఫు డైరీ ఉత్పత్తులు చికెన్ చేపలు ఆహారంలో భాగంగా ఉండాలి. క్యారెట్లు టమాటో బీట్ రూట్ బొప్పాయి కమలా నారింజ ఆకుకూరలు పుచ్చ వంటి ఆక్సిడెంట్స్ అధికంగా లభించే వివిధరంగుల పండ్లు కూరగాయలు తినాలి.

    పొడిబారి చర్మానికి ఈ జాగ్రత్తలు

    ఈ వాతావరణానికి చర్మం పొడిబారి పోతూవుంటుంది. చర్మం పొట్టు రేగటం దురదలు కూడా వస్తాయి. మందుగా కావలిసింది చర్మానికి కావలిసిన  నూనెను అందించటం. తేలికైన ఆలివ్ ఆయిల్…

  • మనసులో వత్తిడి పెరిగిందనుకో జుట్టు రాలిపోవటం చర్మం నిర్జీవంగా మారటం చాలా మంది ఆడవాళ్ల సమస్య. టెన్షన్ అనిపించినప్పుడల్లా వేడి కాఫీ తాగటం వల్ల కూడా చర్మం తేమ పోగొట్టుకుని డల్ గా అవుతుందంటారు డెర్మటాలజిస్టులు. దీని బదులు పండ్ల రసం లేదా మంచి నీళ్లు తాగితే చర్మం పాడవకుండా ఉంటుంది. మాయిశ్చరైజర్ ముఖం కాళ్ళు చేతులకు రాసుకోవాలి. పోషకాల కోసం నట్స్ మాంసకృత్పతులు పిండి పదార్ధాలు ఎంచుకోవాలి. ఈ పోషకాలు జుట్టుకే కాదు చర్మానికి మేలు చేస్తాయి. కళ్ళు అలసిపోకుండా కళ్ల పైన కీరా బంగాళా దుంప ముక్కలు ఉంచుకోవాలి. బొప్పాయి కీరా గుజ్జు సమపాళ్లలో టీయూస్కుని అందులో కాస్త సెనగ పిండి కలిపి ముఖం మెడకు పూతలా వేసుకుంటే చర్మం తేమగా తాజాగా ఉంటుంది. కొబ్బరి నూనె వేడిచేసి తలకు మస్సాజ్ చేస్తూవుంటే జుట్టు రాలిపోవడం ఆగిపోతుంది. శరీరంలో జరిగే ప్రతి చర్య చర్మం పైన జుట్టు పైన ప్రభావం చూపెడుతుందని వత్తిడి టెన్షన్ లు తగ్గించుకునేందుకు కాసేపు ధ్యానం చేయటం అలవర్చుకోవాలంటున్నారు.

    జుట్టు రాలిందంటే మానసిక వత్తిడే

    మనసులో వత్తిడి పెరిగిందనుకో జుట్టు రాలిపోవటం చర్మం నిర్జీవంగా మారటం చాలా మంది ఆడవాళ్ల  సమస్య. టెన్షన్ అనిపించినప్పుడల్లా వేడి కాఫీ తాగటం వల్ల  కూడా చర్మం…

  • ఇటు ముఖ సౌందర్యం శిరోజాల రక్షణ కోసం చర్మం ఆరోగ్యంగా ఉండటంకోసం ఎప్పుడూ తేనె నిమ్మ కాంబినేషన్ ప్రస్తావన వస్తుంది తేనే నిమ్మలతో ఉన్నటువంటి యాంటీ బ్యాక్తీరియాల్ యాన్తి ఆక్సిడెంట్ లక్షణాల వల్ల ఇవి ప్రకృతి సిద్ధంగా చర్మ రక్షణ కు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి . శరీరం బరువు పై అదుపు విషయంలో తేనెలో ఫ్రక్టోజ్ వుంటుంది. యాడ్ ప్రకృతి సిద్ధంగా దొరికే పండ్ల చక్కెర నిమ్మరసం కడుపు నిండేట్లుగా చేస్తుంది. ఉదరం లోపల ఆల్కలైన్ వాతావరణాన్ని నిమ్మ ఎక్కువ జెసి బరువు తగ్గేందుకు సాయపడుతుంది. నిమ్మరసం తేనె సమాన భాగాలుగా చేసి ఆ మిశ్రమ మొహం పై రాసుకుంటే చర్మం రంగొస్తుంది. తేనె నిమ్మ పైనాపిల్ తో ముఖం పై ఉండే మొటిమలు మచ్చలు తొలిగిపోతాయి. నిమ్మ చెక్క పైన తేనె వేసి బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో రుద్దితే అవిపోతాయి. నిమ్మ తేనెల్లో వుండే యాంటీ ఆక్సిడెంట్స్ వయసుతో పాటు శరీరంలో మార్పులను ఆలస్యం చేస్తాయి. తేనె లో అధికంగా ఉండే చెక్కర వల్ల మైక్రోబ్స్ పోతాయి. నిమ్మలో ఉన్న ఆమ్లాల వల్ల బ్యాక్తీరియా వృద్ధి చెందదు.

    ఇవి ప్రకృతి ప్రసాదాలు

    ఇటు ముఖ సౌందర్యం శిరోజాల రక్షణ కోసం చర్మం ఆరోగ్యంగా ఉండటంకోసం ఎప్పుడూ తేనె  నిమ్మ కాంబినేషన్ ప్రస్తావన వస్తుంది తేనే నిమ్మలతో ఉన్నటువంటి యాంటీ బ్యాక్తీరియాల్…

  • స్వేదం చిరాకు కలిగిస్తుంది. బ్యాక్తీరియాలో కలిసి దుర్వాసన కు కారణం అవుతుంది. ఈ ఇబ్బంది గురించి అదే పనిగా యాంటీ పరిస్పిరెంట్స్ వాడుతూవుంటారు. వీటి వాడకం అంత క్షేమేం కాదంటారు వైద్యులు. ముందుగా లేబుల్ చెక్ చేసుకోవాలి. చాలా ఉత్పత్తులు యాంటీ పరిస్పిరెంట్ డియోడరెంట్ కలగలిసి ఉంటాయి. యాంటీ పరిస్పిరెంట్ వల్ల చెమట బయటకు రాకుండా అడ్డుకుంటుంది. శరీరంలోని కొన్ని ప్రదేశాల్లో టాక్సిన్స్ విడుదలవుతాయి . మోకాళ్ళ వెనుక చెవుల వెనుక ముంజేతుల కింద ఈ ప్రదేశాలుంటాయి. ఈ టాక్సిన్స్ పరిస్పిరెంట్ తో మాయం కావు.శరీరం వాటిని లింప్ ల రూపంలో నిల్వ చేస్తుంది. ఇదీ నష్టమే. డియోడ్రెంట్స్ కొంత మంచివే అయినా కొన్ని కమర్షియల్ రకాల్లో శరీరానికి టాక్సిక్ పదార్ధాలు వుండే అవకాశాలున్నాయి. ఇవి చేతుల కింద చర్మ రంధ్రాలని బ్లాక్ చేస్తాయి. అప్పుడు అసలైన సమస్య వస్తుంది. యాంటీ పరిస్పిరెంట్స్ బదులుగా సహజ డియోడ్రెంట్స్ వాడటం కొంతవరకు క్షేమం.

    యాంటీ పరిస్పిరెంట్స్ వద్దు

    స్వేదం చిరాకు కలిగిస్తుంది. బ్యాక్తీరియాలో కలిసి దుర్వాసన కు కారణం అవుతుంది. ఈ ఇబ్బంది గురించి అదే పనిగా యాంటీ పరిస్పిరెంట్స్  వాడుతూవుంటారు. వీటి వాడకం అంత…

  • కంప్యూటర్స్ స్మార్ట్ ఫోన్స్ రాత్రివేళ వాడితే బరువు పెరుగుతుందంటున్నారు అధ్యయనాలు. సాధారణంగా కదలకుండా కూర్చుని పనిచేస్తూ ఉంటే ఆహారం తింటే లావయిపోతామని అనుకుంటారు. కానీ ఈ అధ్యయనం బ్లూ లైట్ ఎక్సపోజర్ కు బరువుకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుందంటున్నారు స్మార్ట్ ఫోన్లు ట్యాబ్లేట్ల నుంచి వచ్చే నీలి కాంతులు ఆకలి స్థాయిని అనేక గంటలు పెంచుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. కడుపు నిండా తిన్నా సరే ఇలాంటి భావాలు కలుగుతాయంటున్నారు. డిమ్ లైట్ ఎక్సపోజర్ తో పోలిస్తే బ్లూ లైట్ ఎక్సపోజర్ వల్ల ఆకలి ఎక్కువవుతుంది. లైట్ కు ఎక్సపోజ్ అవటం మొదలుపెట్టిన పావు గంట నుండి ఈ ప్రభావం మొదలవుతుంది. భోజనం చేసి రెండు గంటలైనా కాకముందే ఆకలి ఎందుకవుతుంది అని ఆందోళన పడేవారు ఈ నీలి కాంతులకు ఎంతగా ఎక్సపోజ్ అవుతున్నారు తరచి చూసుకుంటే తెలుస్తుంది. ఇది నిద్ర లేమి రిస్క్ ను కూడా పెంచుతుంది.

    ఆకలిని పెంచే బ్లూలైట్

    కంప్యూటర్స్ స్మార్ట్ ఫోన్స్ రాత్రివేళ వాడితే బరువు పెరుగుతుందంటున్నారు అధ్యయనాలు. సాధారణంగా కదలకుండా కూర్చుని పనిచేస్తూ ఉంటే ఆహారం తింటే లావయిపోతామని అనుకుంటారు. కానీ ఈ అధ్యయనం…