• సీజన్ తో సంభంధం లేకుండా ఈ వాతావరణం లోని కాలుష్యానికి జుట్టు ఎండినట్లయి పోతుంది. ఇలాంటప్పుడు కలబంద సహజ కండిషనర్ గా పనిచేసి జుట్టుకు పోషణ అందిస్తుంది . తల స్నానం చేసాక జుట్టు తడిగా ఉన్నప్పుడే తలకు ఈ గుజ్జు కొంచెం రాసేస్తే పది నిమిషాల తర్వాత నీళ్లతో కడిగేస్తే జుట్టు చాలా మెరుపు ఉంటుంది. అదే పనిగా రసాయనాలు వాడటం కాలుష్యం వాతావరణంలో మార్పులు సైక్లింగ్ ఉత్పత్తుల వలన జుట్టు ఎక్కువగా చిట్లిపొతూ ఉంటుంది. కలబంద గుజ్జుతో అల్లల్లా తేలినట్లు ఉండాలనుకుంటే తల స్నానం చేసి జుట్టు ఆరాక కలబంద గుజ్జులు కాస్త చుక్కల నిమ్మరసం కలిపి రాసుకుని పది నిమిషాలు కడిగేసి చుస్తే జుట్టు ఎంత అందంగా కనిపిస్తుంది. జుట్టుకు జీవం వస్తుంది. అరకప్పు కలబంద గుజ్జు రెండు మూడు చుక్కల కొబ్బరినూనె నీళ్లు కలిపి తలంతా రాసుకుని అరగంట తర్వాత తలస్నానం చేస్తే కలబంద జుట్టుకు తేమ అందించి తాజాగా పట్టులా మార్చేస్తుంది. జుట్టు ఆరోగ్యానికి కలబంద అద్భుతంగా పనిచేస్తుంది.

    జుట్టు మెరుపునిచ్చే కలబంద

    సీజన్ తో సంభంధం లేకుండా ఈ వాతావరణం లోని కాలుష్యానికి జుట్టు ఎండినట్లయి  పోతుంది. ఇలాంటప్పుడు కలబంద సహజ కండిషనర్ గా పనిచేసి జుట్టుకు పోషణ అందిస్తుంది…

  • నీహారికా ,ఒక ప్రత్యేకమైన రోజు అది పుటిన రోజు కావచ్చు. స్కూల్ ఫంక్షన్ కావచ్చు. పరీక్ష పాసయిన రోజు కావచ్చు. ఆరోహు ప్రత్యేకంగా కొత్త దుస్తులు వేసుకుని శ్రద్ధగా అలంకరించుకొంటాం. అంటే ఆరోజుని సెలబ్రేట్ చేయటం ఇవ్వాళ నాకెంతో ముఖ్యం నేనేదో సాధించాననే పాజిటివ్ ఫీలింగ్ మనల్ని ఉత్సాహంలో నింపుతుంది. ఆరోజు చూడు చిన్న ఆకు గాలికి కదిలినా మనల్ని పలకరించినట్లు ఉంటుంది మనలో ఒక ఆత్మ స్థైర్యం ఉంటుంది. అదెలా వచ్చిందంటే సంతోషం లోంచి మనల్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్న ఆనందం లోంచి వచ్చింది . మనం ప్రతి రోజునే ప్రతి నిమిషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలంటాను . అప్పుడు మనలో నెగిటివ్ ధాట్స్ రావు. ఒత్తిడి ఉండదు. రిలాక్స్ గా ఉంటాం. సృజనాత్మకత పెరుగుతుంది. మంచి ఫలితాలు వస్తాయి. ప్రతి రోజునీ పుట్టిన రోజు లాగే భావిస్తే మన పుట్టుక ఎదో సాధించటానికనే ఆలోచన నీలో కలిగితే దానికోసం నువ్వు కష్ట పడేందుకు కదిలితే ఇంకేముంది చెప్పు . కష్టపడేందుకు సిద్ధం అయితే ఏది అసాధ్యం . ఒక వ్యాపారం లాభం సాధించినవారిని ఒక ఐఏఎస్ పాసయినవాడిని అదే ఇదెలా అంటే ఏమంటారు. దానిపైనే దృష్టి పెట్టాం అంటారు. విజయానికి దగ్గర దార్లు ఎప్పుడు వుండవు. రాజ మార్గమే. అలసట అనుకోకుడన నడిచి తీరటమే ! గమ్యం చేరటమే !

    ప్రతి నిమిషాన్ని సెలబ్రేట్ చేసుకుందాం

    నీహారికా , ఒక ప్రత్యేకమైన రోజు అది పుటిన రోజు కావచ్చు. స్కూల్ ఫంక్షన్ కావచ్చు. పరీక్ష పాసయిన రోజు కావచ్చు. ఆరోహు ప్రత్యేకంగా కొత్త దుస్తులు…

  • తూబస్సుమ్ మొఘల్ ప్రముఖ పాకిస్థానీ ఫ్యాషన్ డిజైనర్. ఈ మధ్య కాలంలో ఆమె యువతులు ఆడ పిల్లల కోసం ఫార్మల్ డ్రెస్ లి విడుదల చేసారు. వీటితో పాటు ఆమె డిజైన్ చేసిన కాజువల్ వేర్ వెస్ట్రన్ పార్టీ వేర్ డ్రెస్ లు కూడా అమ్మాయిల కళ్ళు కట్టేస్తున్నాయి. ఎప్పుడు అనార్కలీ పరికిణీల ఓణీ లేనా అని చిరాకుపడే అమ్మాయిలు లెహెంగా లేదా గాగ్రా పొడవాటి కుర్తీలు పర్లేదనిపిస్తే మొఘల్ వస్త్రాల వైపు చూడచ్చు. ఎంబ్రాయిడరీ డిజిటల్ ప్రింటులతో మోడ్రన్ లుక్ తీసుకొచ్చే ఎన్నో రకాల డిజైన్లు లెహెంగా లపైనా ఎంబ్రాయిడరీ పనితనం ఎంతో స్పెషల్ గా ఉన్నాయి. మోడ్రన్ ట్రెడిషనల్ నగలతో ఈ డ్రెస్ లతో ఎంతో ప్రత్యేకంగా కనబడచ్చు. ఒకసారి ఈ అందమైన డ్రెస్ లు చూసేయండి.

    ఆకర్షించే మొఘల్ ఫ్యాషన్ డిజైన్స్

    తూబస్సుమ్ మొఘల్ ప్రముఖ పాకిస్థానీ ఫ్యాషన్ డిజైనర్. ఈ మధ్య కాలంలో ఆమె యువతులు ఆడ పిల్లల కోసం ఫార్మల్ డ్రెస్ లి విడుదల చేసారు. వీటితో…

  • వర్కవుట్ ప్రోగ్రామ్స్ మొదలుపెట్టిన కొత్తల్లో కాళ్ళలో సోర్ నెస్ ఎక్కువగా ఉంటుంది, ఇంతక ముందు ఈ కండరాల లో వ్యాయామం చేయకపోవటం ఇందుకు కారణం తొలివారం ప్లాన్ లో రన్నింగ్ భాగం అయితే సోర్ నెస్ ఉన్న వర్కవుట్స్ పోషించవచ్చు. వారం తర్వాత అదే నెప్పి ఉన్నాయిట్లే రన్నింగ్ సమయాన్ని దూరాన్ని కట్ చేయాలి. దీని బదులు ఇతర వర్కవుట్స్ పెంచుకోవచ్చు . నెమ్మదిగా రన్నింగ్ సమయాన్ని డిజైన్స్ ను పెంచుతూ రావాలి. రోజుకో ఐదు నిముషాలు పెంచుతూ పోయినా చాలు నెమ్మదిగా చేసిన కార్డియో వాస్క్యులార్ సిస్టమ్ మెరుగవుతుంది. క్రమంగా పెంచుతూ పోతే ట్రైనింగ్ వల్ల స్ట్రెంగ్త్స్ మెరుగవుతుంది. వర్కవుట్స్ కాదు వాకింగ్ చేయాలి అనుకుంటే ఫిట్ నెస్ కోసం ఇంట్లో స్టేషనరీ బైస్కిల్ వాడుకోవచ్చు. ఎబ్ డామినల్ ఎక్సర్ సైజులు టార్గెట్ చేయాలి. అయినా రోజుకో ఇరవై నిమిషాల చొప్పున నడుస్తూ ఉంటే విడుదలయ్యే ఫీల్ గుడ్ హార్మోన్లు యాంటీ డిప్రెసెంట్ కాగలవు.

    నెప్పనిపించినా కంటిన్యూ చేయండి

    వర్కవుట్ ప్రోగ్రామ్స్ మొదలుపెట్టిన కొత్తల్లో కాళ్ళలో  సోర్ నెస్ ఎక్కువగా ఉంటుంది, ఇంతక ముందు ఈ కండరాల లో వ్యాయామం  చేయకపోవటం  ఇందుకు కారణం తొలివారం ప్లాన్…

  • ఒక్క డ్రెస్ కొనాలంటే కనీసం పద్దెనిమిది వేలు ఖర్చు చేయాలి. అంత ఖరీదుగా కొన్నాక అవి ఆ కొత్తదనం పోకుండా ఎక్కువ కాలం మన్నికగా ఉంటే బావుండనిపిస్తుంది. ఉతికి ఇస్త్రీ చేస్తే కాస్త షైనింగ్ ఉంటుంది. కానీ అవి చాలా సార్లు వాడేలాగా ఉండాలంటే దుస్తులకు కొత్త మెరుపు కోసం డ్రై క్లీనింగ్ కు ఇస్తాం. కానీ ప్రతి సారీ అవసరం లేదు. డ్రై క్లీనింగ్ రసాయనాలు దుస్తులకు హాని చేస్తాయి. ఒకసారి షాపు నించి వచ్చాక ఐదారు సార్లు మాములుగా ఉతికి ఇస్త్రీ చేయించుకోవద్దు. దుస్తులన్నీ కలిపి ఉతకవద్దు. ఎంబ్రాయడరీ పనితనం వున్నవీ డెనిమ్ వంటివి తిరగేసి ఉతకాలి అప్పుడే అవి రంగు మారకుండా ఉంటాయి. అలాగే ఆరబెట్టేందుకు ముందు దుస్తులు తిరగేసి ఆరేసే పద్ధతి మేలు. నేరుగా ఎండ తగిలి ఒక్కసారి షేడ్ మారుతూ ఉంటుంది. అలాగే నలుపు రంగు దుస్తులైతే సాధారణంగా కొన్నాళ్ల డే షేడ్ తగ్గుతుంది. నలుపు రేంజ్ పూర్తిగా ఉంటే వాటికీ మరోసారి రంగు అద్దించవద్దు. ఇంకొంత కాలం వాడేందుకు బావుంటుంది. ప్రత్యేకంగా ఏ ఫంక్షన్ కోసమో కొన్ని డ్రెస్ ల్లో ఉన్న పూసలు కుందన్ లో కుట్టిన రాళ్లు రాలిపోకుండా సాధ్యమైనంత తక్కువ ఉతుకు ఉతికినప్పుడు ఇంట్లోకి ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే ఆ డ్రెస్ లు కనీసం ఇంట్లో వేసుకున్నా బావుండవు.

    దుస్తులు మన్నికగా ఉండాలంటే ఇలా చేస్తే సరి

    ఒక్క డ్రెస్ కొనాలంటే కనీసం పద్దెనిమిది వేలు ఖర్చు చేయాలి. అంత ఖరీదుగా కొన్నాక అవి ఆ కొత్తదనం పోకుండా ఎక్కువ కాలం మన్నికగా ఉంటే బావుండనిపిస్తుంది.…

  • జాతీయ మహిళా పార్లెమెంట్ సదస్సు తో సహా ప్రపంచం నలుమూలలా ఎన్నెన్నో విశేషమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కానీ పెరల్ ఎకాడమీ స్టూడెంట్స్ తీహార్ జైల్లో చేసిన కల్చర్ ప్రోగ్రామ్ కు మటుకు ఎంతో ప్రత్యేకత వుంది. ఎవరు వ్యవహరిస్తారు శిక్షపడి తీహార్ జైల్లో ఉన్న ఆడవాళ్లకు ఉపయోగపడే వృత్తి విద్యకు నేర్పించి వాళ్లకు జీవనోపాధి చూపించాలని ఫ్యాషన్ డిజైనర్ రీనా థాకా పెరల్ అకాడమీ సిఇఓ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నందితా అబ్రహం శిక్ష అనుభవిసున్న మహిళా ఖైదీలకు ఫ్యాషన్ డిజైనింగ్ కోరుతూ వస్త్ర పరిశ్రమ ఉపయోగించే భారీ యంత్రాలతో పనిచేసేందుకు కావలిసిన శిక్షణ ఇస్త్రీ చేసే యంత్రాల్లో డ్రై వాష్ పరికరాలు ఎలా వాడాలో కోర్స్ రూపంలో పాఠాలు చెపుతున్నారు. ఈ కార్యక్రమం ఇనాగరేషన్ సెర్మనీ చాలా చక్కగా సాగింది. ఈ తీహార్ జైల్లో వృత్తి విద్య కోర్సులకు జైళ్ల డిప్యూటీ జనరల్ ఆమోదం చెప్పటంతో ఈ కార్యక్రమం విజయవంతంగా మొదలైంది.

    తీహార్ జైలులో ఫ్యాషన్ పాఠాలు

    జాతీయ మహిళా పార్లెమెంట్ సదస్సు తో సహా ప్రపంచం నలుమూలలా ఎన్నెన్నో విశేషమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కానీ పెరల్ ఎకాడమీ స్టూడెంట్స్ తీహార్ జైల్లో చేసిన…

  • జలుబు చేస్తే చాలు గొంతు నొప్పి పరుగెత్తుకొంటూ వచ్చి చేరుతుంది. నొప్పి మంట ఏం చేయాలో తోచకుండా ఉంటే గ్రీన్ టీ హెర్బల్ టీ వైట్ టీ ట్రై చేయమంటున్నారు. వైద్యులు. ఇవే సత్వర ఉపసమానాలు. ఈ టీ ల్లో యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షల దూరం చేస్తాయి . అల్లం దంచి మిరియాలు దాల్చిన చెక్క పొడి చేసి టీ పొడితో పాటు కలిపి మరిగించి ఇందులో తేనె వేసి ఈ హెర్బల్ టీ తాగి చూడండి. ప్రాబ్లమ్ పరార్. వీలైతే తులసి ఆకులు మింట్ టీ కూడా ట్రై చేయచ్చు . ఇష్టమైతే చికెన్ సూప్ కూడా ట్రై చేయచ్చు. చికెన్ లో ఉండే సోడియం మంట ని తగ్గిస్తుంది. గొంతుకు స్వాంతన ఉంటుంది. సూప్ రూపంలో మితంగా తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఎక్కువగా ద్రవ పదార్ధాలు అదీ వేడిగానే తీసుకుంటే గొంతునొప్పి అంతగా విసిగించదు. గొంతు సంగతి అలా వుంచినా రోజుల్లో ఒకేసారి ఈ హెర్బల్ టీ తాగి ఎంతో ప్రయోజనం.

    ఇన్ని హెర్బ్స్ తో ఈ టీ సో టేస్టీ

    జలుబు చేస్తే చాలు గొంతు నొప్పి పరుగెత్తుకొంటూ వచ్చి చేరుతుంది. నొప్పి మంట  ఏం చేయాలో తోచకుండా ఉంటే గ్రీన్ టీ,  హెర్బల్ టీ,  వైట్ టీ…

  • ఎదో ఒక స్వీట్ ఉంటేనే గానీ భోజనం సంపూర్ణం కాదంటారు. అంచేత చాక్లేట్ భోజనంలో తుది పదార్థంగా కేక్ ట్రిఫిల్ ఎక్లైర్స్ చీజ్ కేక్ టోఫీ ప్లాన్ పై మఫిన్లు ఐస్ క్రీమ్ లు చిపొడుగైనా లిస్ట్ గా పాప్యులర్ అయిపోయింది . అయినా చాక్లేట్ తింటే మొటిమలు వస్తాయని పళ్ళు పుచ్చిపోతాయని అన్నా సరే దాన్ని ఎదురుగా చూసాక మాత్రం ఇలాంటికంప్లెయింట్స్ గాలికి ఎగిరిపోతాయి. ఎర్రని పచ్చని కోకో పండ్ల గింజలను పులియ బెట్టి వేయించి పొడి కొడితే కోకో పొడి తయారవుతుంది. బీన్స్ నుంచి వెతికి తీసే కొవ్వు కోకో బటర్ . ఇది చాక్లేట్ కు క్లాసీ మృదువైన టెక్చర్ ఇస్తుంది. గ్రీన్ టీ మాదిరిగానే చాక్లేట్ లో సమాన స్థాయిలు ఫెనోలిక్ గుణాలు గాలిక్ యాసిడ్స్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రయోజనం పొందాలంటే ఉదయాన్నే ఒక కప్పు హాట్ కోకో ,మధ్యాహ్నం గ్రీన్ టీ తాగాలని నిపుణుల సూచన. డార్క్ చాక్లేట్ల నుంచి పూర్తి ప్రయోజనాలు పొందాలంటే వాటి నుంచి లభించే క్యాలరీల మోతాదును సమంగా డైట్ లోని ఇతర పదార్ధాల క్యాలరీలను కట్ చేసుకోవాలి. పూర్తి ఆహారంలో చాక్లేట్ ను ఉంచేసుకుని మిగిలిన పదార్ధాల్లో క్యాలరీలు లేకుండా చూసుకోవాలి.

    కప్పు హాట్ కొకో తాగితే మంచిది

    ఎదో ఒక స్వీట్ ఉంటేనే గానీ భోజనం సంపూర్ణం కాదంటారు. అంచేత చాక్లేట్ భోజనంలో తుది పదార్థంగా కేక్ ట్రిఫిల్ ఎక్లైర్స్ చీజ్ కేక్ టోఫీ ప్లాన్…

  • పెద్దగా శారీరిక శ్రమ లేని ఉద్యోగం చేస్తున్న పని ముగిసే సరికి చాలా అలసటగా ఉందని వెన్నునొప్పిగా ఉందని చాలా ,మంది ఉద్యోగినులు కంప్లైంట్ చేస్తారు. డైటీషియన్లు ఈ అలసట ఆహారానికి సంబంధించినది అనే చెపుతారు. ఆరోగ్యవంతమైన బ్రేక్ ఫాస్ట్ చేయాలన్నారు. ఇంట్లో అన్ని పనులకూ సమయం ఖర్చు చేసి బ్రేక్ ఫాస్ట్ ఎగ్గొట్టేస్తే వచ్చే ముప్పు గుడ్డు తెల్ల సొన లో ఫ్యాట్ మిల్క్ బ్రౌన్ సెరల్స్ వంటి ఆరోగ్యవంతమైన ఆప్షన్లు ఎంచుకోవాలి. మిక్సడ్ ఫ్రూట్స్ ఓ గిన్నెడు తినాలి . మల్టీ గ్రేయిన్ బ్రేడ్ టోస్ట్ కూడా శక్తి ఇచ్చేది. ప్రతి రెండు గంటలకు ఆహారం తినాలి. డ్రెస్సింగ్ లేని సలాడ్స్ ఎంచుకోవాలి. బ్రు రోల్ బెల్ పెప్పర్స్ బేబీ టొమాటోలు చిలకడ దుంపలు పుచ్చ ఆరెంజ్ బెర్రీలు తినచ్చు . ఆరోగ్య వంతమైన సూప్స్ వాల్నట్స్ నువ్వులు పొద్దు తిరుగుడు గింజలు చాలా మంచివి. చక్కెర లు తక్షణ శక్తీ ఇస్తాయి కానీ తర్వాత ఆ శక్తీ నెమ్మదిగా తగ్గుతూ పోతుంది. కూర్చున్నప్పుడు పోశ్చర్ సరిగ్గా ఉంటే వెన్ను నొప్పి సమస్య ఉండదు. గంటకోసారి లేచి చుట్టు పక్కల నడుస్తూ స్ట్రెచ్ చేస్తుంటే ఈ సమస్య ఉండదు.

    ఈ అలసట ఆహారానికి చెందిందే

    పెద్దగా శారీరిక శ్రమ లేని ఉద్యోగం చేస్తున్న పని ముగిసే సరికి చాలా అలసటగా ఉందని వెన్నునొప్పిగా ఉందని చాలా ,మంది ఉద్యోగినులు కంప్లైంట్ చేస్తారు. డైటీషియన్లు…

  • ఇంటికో దేవుడు ఆయనకో పూల మందిరం తప్పకుండా ఉంటాయి. కళా దర్శకులు కేవలం స్టూడియోలకే పరిమితం కాకుండా ఓ అడుగు ముందుకేసి ధీమ్ పూజా మందిరాలు డిజైన్ చేసి ఇచ్చేస్తున్నారు. ఎదో ఒక సినిమా లో అచ్ఛం మీనాక్షీ దేవి ఆలయం కట్టినట్లు నెట్లో చార్మినార్ నిర్మించినట్లు అన్నమయ్య సినిమా కోసం వెంకటేశ్వర స్వామి గుడి డిజైన్ చేసినట్లు పూజా మందిరాల డిజైన్స్ వసున్నాయి. పూజారుల సిద్ధాంతుల సలహాలతో గది ప్రవేశ ద్వారం నుంచి లోపల అమర్చే దేవుడి పీఠం వరకు అంతా పర్ ఫెక్ట్ డిజైన్. గ్రానైట్ పాలరాళ్లు రత్నాలు చెక్కిన నగిషీలు గూళ్ళలాగా గంటలు హారతికి దీపాలు అసలెప్పుడు హారతి ఇస్తున్నట్లే వెలుగులు వాస్తు శాస్త్ర ప్రకారం ఒక తలుపో రెండు తలుపులో అమర్చేసి ఇంటిలో దేవుడికో ప్రత్యేకమైన గుడి ఇచ్చేస్తున్నారు. ఇంట్లో ప్రతిష్టించే ఈ కోవెలలో ఎలా ఉన్నాయో ఓసారి చూడండి. కొత్తగా ఇల్లు కట్టించుకోవాలనుకున్న వాళ్ళకి ఓ ఐడియా వస్తుంది. దేవుడికీ ఓ ఇల్లొస్తుంది.

    ఆరాధించే దేవుడికో సొంతిల్లు

    ఇంటికో దేవుడు ఆయనకో పూల మందిరం తప్పకుండా ఉంటాయి. కళా  దర్శకులు కేవలం స్టూడియోలకే  పరిమితం కాకుండా ఓ అడుగు ముందుకేసి ధీమ్  పూజా మందిరాలు డిజైన్…

  • పసుపు గడపకు రాస్తే శుభ సూచకం . పాదాలకు రాసుకంటే అందం అదే పసుపు పదార్ధాలకు చేర్చి వాడుకుంటే భారతీయుల వంటకాల్లో ఇతర వాడకల్లో పసుపు అంతర్గతంగా వుంది. ఆసియా లో విరివిగా వాడే పసుపు లోని కర్కుమిన్ కు ఇన్ఫలమేషన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను పెంచే శక్తి ఉన్నట్లు గుర్తించారు. పచ్చని రంగుకు ఈ పదార్థమే కారణం అవుతుంది. డయాబెటిస్ ను నియంత్రించే శక్తి గలది పసుపు. కర్కలిన్ లో యాంటీ డయాబెటిక్ యాక్టివిటీ ఉన్నట్లు లేబొరేటరీ పరీక్షలు పేర్కొన్నాయి. పసుపు లోని కర్కుమిన్ బయటకు తెచ్చి తయారు చేసిన కాప్సూల్స్ ను బ్రేక్ ఫాస్ట్ తర్వాత డిన్నర్ తర్వాత వేసుకుంటే ఫలితం కనిపిస్తుంది. పసుపు సురక్షిత పదార్థంగా పెద్దలు భావిస్తున్నప్పటికీ ఈ కాప్స్యూల్స్ వల్ల అజీర్ణం వికారం వచ్చే ప్రమాదం కూడా ఉంటుందంటున్నారు . పసుపు వల్ల మాత్రం రుతు స్రావ క్రమ బద్ధీకరణ జీర్ణ సహాయకారిగా లివర్ పనితీరు మెరుగుపరిచే ఔషధంగా ఎగ్జిమా కి చికిత్సగా ఎన్నో లాభాలున్నాయి. రోజువారీ గా ఆహార పదార్ధాల్లో పసుపు విరివిగా వాడితే టాక్సిన్లు శరీరం నుంచి వెళ్లి పోతాయి. నోటి ఆరోగ్యం బావుంటుంది.

    శుభ సూచకం అద్భుత ఔషధం

    పసుపు గడపకు రాస్తే శుభ సూచకం . పాదాలకు రాసుకంటే  అందం అదే పసుపు పదార్ధాలకు చేర్చి వాడుకుంటే భారతీయుల వంటకాల్లో ఇతర వాడకల్లో పసుపు అంతర్గతంగా…

  • నీహారికా , ఇందాక మా ఫ్రెండ్ మాట్లాడిన ఫ్రిజ్ లకు స్టిక్కర్ల వ్యవహారం నీకు నవ్వొచ్చింది కానీ చాలా మంది కుటుంబాలు ఇలాగె ఉంటున్నాయి, మా ఇంట్లో ఉన్న నలుగురం తలోదారిన ఉదయాన్నే ఉద్యోగాలు కాలేజీలు అంటూ బయటకి పోతాం. ఏవైనా చెప్పుకోవాలిసి వస్తే ఓ స్లిప్ రాసి ఫ్రిజ్ కి అంటించుకుంటాం. ఆ స్లిప్ లీ మామధ్య కమ్యూనికేషన్ అందామె. చాలా స్కూళ్లల్లో ఇంతే . కలిసి కూర్చుని భోజనం చేయటం మాట్లాడుకోవటాలు చర్చలు అన్నీ బంద్. హడావుడిగా మొక్కుబడిగా పరుగులతో జీవితం .. ఎవరి చేతిలో వాళ్ళ ఫోన్లు లాప్ టాప్ లు. అసలు ఒకళ్ళ నొకళ్ళు అర్ధం చేసుకునే అవకాశం కూడా లేని బిజీ ఉద్యోగాల భార్య భర్తలు వాళ్ళ పిల్లల డే కేర్ సెంటర్లలో ఏం జరుగుతోంది. మానవ సంబంధాలు నశించి పోతున్నాయి. అసలు మాటలే కరువైతే సంబంధాలెక్కడ? కానీ ఒకటి మాత్రం బలంగా చెప్పాలని వుంది. పగలంతా ఎవళ్ళ జీవితం వాళ్ళదిగా గడిపినా కనీసం రాత్రివేళ కలిసి భోజనం చేయండి. ఆ కాస్త సమయం మీకోసం మిగుల్చుకోండి. ఇంటి గురించి పిల్లల గురించి ఫ్యూచర్ గురించి మాట్లాడుకోండి. మనుషుల మధ్య మాటల వంతెనలు లేకపోతే మాటలే తెగిపోతే ఆప్యాయతలు ఎలా వస్తాయి. అప్పుడు సౌకర్యాలు సంపదలే ఉంటాయి. కానీ ప్రేమించే మనుషులే వుండరు. ఆ స్థితి తెచ్చుకోవద్దు అని . ఏమంటావ్ !

    మాటలే తెగిపోతే ప్రేమ లెక్కడ

    నీహారికా , ఇందాక మా ఫ్రెండ్ మాట్లాడిన ఫ్రిజ్ లకు స్టిక్కర్ల వ్యవహారం నీకు నవ్వొచ్చింది కానీ చాలా మంది కుటుంబాలు ఇలాగె ఉంటున్నాయి, మా ఇంట్లో…

  • ిరుమల తిరుపతి దేవస్థానం మండలి సభ్యురాలిగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధా నారాయణ మూర్తిని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, నియమించారు. ఈమెకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జె. ఎస్వీ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేసారు. సుధా నారాయణ మూర్తి పేరు పొందిన రచయిత్రి గొప్ప సంఘ సేవకురాలు. ఆమె ఎన్నో ఆర్ఫనేజ్ లు స్థాపించారు. ఎన్నో ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు కంప్యూటర్స్ లైబ్రరీ ఫెసిలిటీస్ కల్పించారు. కన్నడ లో ఆమె రాసిన డాలర్ బహు ఇంగ్లిష్ తెలుగు తో పాటు ఎన్నో భాషల్లోకి అనువాదం చేశారు. ఎన్నో అవార్డులు ఆమెను కోరి వరించాయి.

    టిటిడి ధర్మ కర్తల మండలి సభ్యురాలిగా సుధామూర్తి

    ిరుమల తిరుపతి దేవస్థానం మండలి సభ్యురాలిగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధా నారాయణ మూర్తిని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, నియమించారు. ఈమెకు  దేవాదాయ శాఖ ముఖ్య…

  • కల్పనా చావ్లా సునీతా విలియమ్స్ తర్వాత వ్యోమగామిగా పరిశోధనలు చేసేందుకు ముందు కోస్తున్నారు. షావనా పాండ్యా. పాండ్యా పూర్వీకులు భారతీయలు. ఆమె కుటుంబం ముంబాయి లో వుంది. ఆమె కెనెడా లో పుట్టి పెరిగింది. ఆమె మంచి గాయని రచయిత. వైద్య విద్య చదివింది. కెనెడా లోని ఆల్చర్టా యూనివర్సిటీ హాస్పిటల్ లో వైద్యురాలిగా పని చేస్తున్నారు. సిటిజెన్ సైన్స్ ఆస్ట్రోనాట్ ప్రోగ్రామ్ ద్వారా జరిగిన ఎంపికలో 3200 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. అందులో పాండ్యా ఒకరు. మొత్తం ఎనిమిది మంది బృందంగా అంతరిక్షంలోకి వెళ్లి పరిశోధనలు చేసేందుకు ఎంపికయ్యారు బయో మెడిసన్ వాతావరణ మార్పుల ద్వారా ప్రయోగాలు చేశామన్నారు బృందం.

    అంతరిక్షంలోకి మూడో అమ్మాయి

    కల్పనా చావ్లా సునీతా విలియమ్స్ తర్వాత వ్యోమగామిగా పరిశోధనలు చేసేందుకు ముందు కోస్తున్నారు. షావనా  పాండ్యా. పాండ్యా పూర్వీకులు భారతీయలు. ఆమె కుటుంబం ముంబాయి లో వుంది.…

  • నటించటం అంటే ఒక మనిషి ఇంకో మనిషి గా పరకాయ ప్రవేశం చేయటం మరి సంవత్సరానికో నాలుగైదు సినిమాలు చేసే నటీ నటులకు ప్రేక్షకులను మెప్పించాలంటే ఎన్ని ఉత్తమ లక్షణాలు అలవర్చుకోవాలి. ఎన్ని నైపుణ్యాలు అభ్యాసం చేయాలి. అక్షరాలా ఇప్పుడు తాప్సీ చేస్తోందదే. సినిమా సినిమాకు ఆమె లో ఒక వైవిధ్యం . బేబీ సినిమాలు సీరియస్ పాత్ర చేసి తాప్సీ లో అమితాబ్ తో పోటీపోటీగా నటించింది. ఇప్పడు రాణా హీరోగా వస్తున్నా ఘాజీ సినిమాలో అనన్య గా నటించింది. ఇది కూడా ఆమెను ఓ సవాల్ వంటి పాత్రే నట. ఈ పాత్ర కోసం తా ప్సీ బెంగాలీ నేర్చుకుందిట. అందుకోసం ఒక ట్యూటర్ ని నియమించుకుంది. పాత్రల కోసం కొత్త భాషలు నేర్చుకునే అవకాశం అరుదుగా వస్తుంది. నేర్చుకుంటూ నటిస్తే ఆనందం ఇంకో స్థాయిలో ఉంటుంది. అరుదుగా వస్తుంది. ఇప్పుడు నాకు చాలా మంచి పత్రాలు వస్తున్నాయి. అందులో ఘాజీలో అనన్య పాత్ర ఒకటి అంటోంది తాప్సీ. ఈ సినిమా 17 న విడుదలవుతుంది.

    బెంగాలీ నేర్చుకున్న తాప్సీ

    నటించటం అంటే ఒక మనిషి ఇంకో మనిషి గా పరకాయ ప్రవేశం చేయటం మరి సంవత్సరానికో నాలుగైదు సినిమాలు చేసే నటీ నటులకు ప్రేక్షకులను మెప్పించాలంటే ఎన్ని…

  • ఆంధ్రప్రదేశ్ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు నేపథ్యంలో లోక్ సభ లో సంఖ్య పరిశీలిస్తే అంతంత గానే ఉన్నారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో దేశ చరిత్రలో మొదటి సారిగా 62 మంది మహిళలు ఎంపికయ్యారు. 2009 ఎన్నికల్లో గెలుపొందిన మహిళల సంఖ్యా 59. మొత్తం 543 సీట్లలో మహిళలు దక్కించుకున్న సీట్ల సంఖ్య 11.23 గా వుంది. మొట్టమొదటి లోక్ సభ ఎన్నికల్లో గెలుపొందిన మహిళల శాతం 4.4 శాతం మాత్రమే. అతి తక్కువ శాతం గెలుపొందింది 1977 లోక్ సభ ఎన్నికల్లోనే . ఆ ఎన్నికల్లో గెలుపొందిన మహిళల శాతం 3.5 గా వుంది . ప్రపంచ వ్యాప్తంగా 189 దేశాల్లో పార్లమెంట్ లో మహిళల సంఖ్య గమనిస్తే ఇండియా 111 వ స్థానంలో వుంది. బంగ్లాదేశ్ 19 వ స్థానంలో నేపాల్ 30 వ స్థానంలో వుంది. చట్ట సభలో మహిళా ప్రాతినిధ్యం పెరగాలని అందరు కోరుకుంటారు కానీ అందుకు ఉపయోగపడే మహిళా రిజర్వేషన్ బిల్లు మాత్రం ఇంతవరకు ఆమోదంపొందలేదు .

    మహిళా ప్రాతినిధ్యం అతి తక్కువ

    ఆంధ్రప్రదేశ్ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు నేపథ్యంలో లోక్ సభ లో సంఖ్య పరిశీలిస్తే అంతంత గానే ఉన్నారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో దేశ  చరిత్రలో మొదటి…

  • అద్దం ముందర నిలబడితే అది నిజమే చెపుతోంది. ,మన మనసులో ఎలా వుండాలనుకొన్నామో ఆలా లేకపోతే శరీర లావణ్యం తీరు మనం ఊహించే అందం ఇవన్నీ వుండకపోవటానికి మన బద్ధకం మాత్రమే కారణం . అందంగా అంటే ఆరోగ్యంగా అని అర్ధం చెప్పుకోవాలి ముందు మనసుకి. ఇప్పుడు మనసు డిసైడ్ చేస్తుంది తప్పనిసరిగా వ్యాయామం చేయి. ప్రతి పూట చూస్తున్నాం. ఈ ఫలాన్ని సినిమాలో హీరో ఓ సినిమా కోసం 30 కిలోల బరువు పెరిగి మళ్ళీ వెంటనే 40 కిలోల బరువు కేవలం ఫిట్ నెస్ శిక్షకుడి ఆధ్వర్యంలో కష్టపడి తగ్గించుకున్నాడని మనం మాత్రం అందులో ఐదో వంతైనా చేయలేమని నెట్ లో వెతికితే పెద్దగా బరువులో వత్తిడి ఆయాస పడనక్కర్లేదని తేలికైన వ్యాయామాలు ఉంటాయి. అవన్నీ ఒక ఆటలాగా సరదాగా ప్రేమగా మొదలుపెడితే చాలు. ఐదు నిముషాలు నుంచి మొదలు పెట్టి అరగంట వరకు సాగదీయచ్చు. అంతెందుకు మన శరీరం లో వచ్చే మార్పులు చెమటోడిస్తే మోహంలో కనబడే మెరుపు మనకు తప్పనిసరిగా ఉత్సాహం ఇస్తాయి . ఓ నెలయ్యాక ఎవరో ఫ్రెండ్ ఎదురై ఎంత బావున్నావో కాస్త తగ్గావు మోహంలో ఎదో సమ్ థింగ్ స్పెషల్ కనిపిస్తోంది. అన్నారనుకోండి ఇంకా ఉత్సాహమే ఉత్సాహం !!

    ఇదే నిమిషాలతో మొదలెట్టండి

    అద్దం  ముందర నిలబడితే అది నిజమే చెపుతోంది. ,మన మనసులో ఎలా వుండాలనుకొన్నామో ఆలా లేకపోతే శరీర లావణ్యం తీరు మనం ఊహించే అందం ఇవన్నీ వుండకపోవటానికి…

  • శిరోజాలకు ఎదో ఒక దువ్వెన తో దువ్వవద్దనీ కొన్ని ప్రత్యేకమైన బ్రష్ ప్రత్యేకమైన శిరోజాలకు మేలు చేస్తాయని చెపుతున్నారు. ఎక్స్ పెర్ట్స్ ఒత్తయిన జుట్టున్న వాళ్ళు స్టర్చి నైలాన్ బ్రష్ లు ముఖ్యంగా చివరలో గుండ్రంగా బాల్ మాదిరిగా ఉండేవి వాడితే అవి మాడుకు హాని చేయవు. వైర్ బ్రిస్టల్స్ కూడా ప్రయత్నం చేయవచ్చు. పల్చని శిరోజాలు ఉంటే బ్రష్ కొనే సమయంలో బ్రిస్టల్స్ బాగా మృదువుగా వున్న వాటిని ఎంచుకోవాలి. వెంట్ బ్రెష్ లు ముఖ్యంగా హేయిర్ డ్రయ్యర్ తో స్టయిల్ చేసినవి జుట్టు కుదుళ్ళని వ్యాల్యుమ్ ఇస్తాయి. మీడియం హేయిర్ అయితే పెద్ద సమస్యలు లేకుండా అన్ని రకాల హేయిర్ బ్రెష్ లు దువ్వెన లు ఒకే మాదిరి పనిచేస్తాయి. దువ్వుకున్నప్పుడు మాడుకు మసాజ్ చేసినట్లు ఉండాలి. ఇక కర్ల్ హేయిర్ అయితే తేలిగ్గా పైపైన బ్రష్ చేయాలి. స్టయిల్ లేదా హెవీ హేయిర్ మాదిరి కాకుండా జుట్టు పొడిబారక ముందు తడిగా ఉన్నప్పుడే దువ్వుకోవాలి. బ్రిస్టల్స్ లేదా దువ్వెన పళ్ళ నడుమ ఖాళీ ని బట్టి ఎంతసేపు దువ్వుకోవచ్చు మనకే తెలిసిపోతుంది. సాధ్యమైనంత వరకు గబగబా తెగిపోయేంత స్పీడ్ గా జుట్టు దువ్వుకోకూడదు.

    దువ్వెనలదీ కీలకమైన విషయమే

    శిరోజాలకు ఎదో ఒక దువ్వెన తో దువ్వవద్దనీ కొన్ని ప్రత్యేకమైన బ్రష్ ప్రత్యేకమైన శిరోజాలకు మేలు చేస్తాయని చెపుతున్నారు. ఎక్స్ పెర్ట్స్ ఒత్తయిన  జుట్టున్న వాళ్ళు స్టర్చి…

  • ఈ మధ్య కాలంలో సోయా వినియోగం పెరిగింది. సొయా పాలు చీజ్ ఎన్నో ఉత్పత్తులు మార్కెట్ లోకి వస్తున్నాయి . న్యూట్రీషన్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయని మహిళలకు ఎంతో ప్రయోజనాకరమని అందరు చెపుతున్నారు. దీన్నో అద్భుతమైన ఆహారం అంటున్నారు. సోయాను సహజ రూపాల్లో అంటే సోయాపిండి పాలు టోఫు ఇలా ఏ రూపంలో అయినా హాయిగా తినచ్చు. ఎలాంటి దుష్ప్రభావాల భయము లేదు. ప్రోటీన్ కు ఇది మంచి ఆధారం రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గిస్తుంది. కాబట్టి ఇది గుండెకు మంచిదని ఎముకల్లో సాంద్రత పెంచుతుందని అలాగే ఆస్ట్రియో పోరోసిస్ రాకుండా ఏది రక్షిస్తుందని మెనోపాజ్ లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తుందని గుర్తించారు. ఇది మహిళలకు నిస్సందేహంగా మంచి ఆహారం. బ్రేడ్స్ కుకీస్ వంటి బెకెడ్ ఫుడ్స్ సోయాలోని ఏ ఆహార విలువను పోకుండా తయారవుతున్నాయి. ఉదయపు ఆహారంగా సొయా తీసుకుంటే ప్రోటీన్స్ కావలిసినన్ని దక్కినట్టే . సోయాలో ఎన్నో రకాలు టెక్నీక్స్ ఎలా చేసుకోవాచ్చొ అంతర్జాలం లో వెతకచ్చు.

    సోయాచాలా మంచిది

    ఈ మధ్య కాలంలో సోయా వినియోగం పెరిగింది. సొయా పాలు చీజ్ ఎన్నో ఉత్పత్తులు మార్కెట్ లోకి వస్తున్నాయి . న్యూట్రీషన్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయని మహిళలకు…

  • మంచి గుమ్మడి కాయ తో చేసే తియ్యని హాల్వా చాలా బావుంటుంది. అలాగే ఈ గుమ్మడి ముక్కాలా దప్పళం కూడా భోజనాల స్పెషల్. ఏడాది పొడవుగా దొరికే మంచి గుమ్మడి కాయను వింటర్ స్క్వాష్ అని పిలుస్తారు. కాయ పూర్తిగా ఆకు పచ్చ రంగు వదిలి బాగా ఎండి ఎర్రగా అయ్యాకే కోసి వాడతారు . కొంచెం తియ్యని రుచి తో వుండే ఈ గుమ్మడి లో ఎన్నో వెరైటీలు. రోగనిరోధిక వ్యవస్థను బలోపేతం చేసే అద్భుతమైన ఆధారం. ఈ తియ్య గుమ్మడి ప్రీ రాడికల్స్ ను అడ్డు కోగల విటమిన్ సి ఇందులో పుష్కలం క్యాలరీలు చాలా తక్కువ. డైటరీ పీచు చాలా ఎక్కువ. గుమ్మడి గింజల్లో 75 శాతం లినో లిక్. ఓలిక్ యాసిడ్స్ ఉండటం వల్ల తిరుగులేని చిరు తిండిగా పరిగణించబడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ సపోర్ట్ ఇస్తుంది. కాన్సర్ డయాబెటిక్ గుండె జబ్బులపై పోరాడే శక్తి నిస్తుంది. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు ఉంటాయి. బీటా కెరోటిన్ ఉండటం వల్ల ఆస్తమా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్ ల నుంచి పరిరక్షించడంలో ముందుంటుంది. తియ్య గున్నదిలో చేసే కూడా చాలా బావుంటుంది.

    తిరుగు లేని చిరు తిండి గుమ్మడి

    మంచి గుమ్మడి కాయ తో చేసే తియ్యని హాల్వా చాలా బావుంటుంది. అలాగే ఈ గుమ్మడి ముక్కాలా దప్పళం కూడా భోజనాల స్పెషల్. ఏడాది పొడవుగా దొరికే…