• అమ్మాయిల పైన లెక్కలేనన్ని అఘాయిత్యాలు. కాలుబయటపెడితే ఆపదలు. వాళ్ళ వేషధారణను జీవన విధానాన్ని వేలెత్తి చూపించే సామాన్యుల నుంచి అధికారులు ప్రజా ప్రతినిధులు. పగటి వేళఅయినా వీధిలో తిరిగేందుకు భయపడే తరుణంలో నేను తోడుగా వున్నానంటూ సెలబ్రెటీస్ . బాక్సింగ్ ఛాంపియన్ మేరీకోమ్ రూపిందించిన లూప్ ఫాలో అయితే మాములు అమ్మాయిలు కిక్ బాక్సింగ్ లో ప్రావీణ్యులౌతారు. ఇందులో సభ్యులైతే తప్పకుండా మంచి వింటున్నారు నేర్చుకుంటున్నారు. అలాగే ఇంకో యాప్ వుంది . పేరు సెల్ఫ్ డిఫెన్స్ ఫర్ విమెన్. అకస్మాత్తుగా ఎవరైనా దాడి చేస్తే చటుక్కున ఎలా ఎదుర్కోవాలో ఎలా కదలాలో చేతులు కాళ్ళని ఆయుధాలుగా ఎలా వాడాలో నేర్పిస్తుందీ యాప్ . చేతి వేళ్ళు తేలికపాటి కర్రలు ఇనుప వస్తువులు ఆత్మ రక్షణకు ఎలా ఉపయోగించుకోవచ్చో నేర్పుతుంది యాప్. ఏ పంచ్ ఎక్కడ వాడాలో నేర్పించే యాప్ లున్నాయి . అమ్మాయిలు కాస్త తెలివిగా ఆలోచిస్తే చాలు ఎప్పటికీ వాళ్ళ జీవితం వాళ్ళ చేతుల్లోనే.

    పంచ్ విసరటం నేర్పిస్తుంది

    అమ్మాయిల పైన లెక్కలేనన్ని అఘాయిత్యాలు. కాలుబయటపెడితే ఆపదలు. వాళ్ళ వేషధారణను జీవన విధానాన్ని వేలెత్తి చూపించే సామాన్యుల నుంచి అధికారులు ప్రజా ప్రతినిధులు. పగటి వేళఅయినా వీధిలో…

  • కడుపులో ఆకలిగా ఉందేమో అందుకే నిద్రపోవటం లేదేమో చూసుకోండి . అంటున్నారు ఎక్స్ పెర్ట్స్ డైటింగ్ వల్లనో ఇంకేమైనా కారణం చేతనో ఏమీ తినకుండా పడుకుంటే ఆకలితో నిద్ర రాదు. ఇలా నిద్ర పట్టని రాత్రివేళ వెంటనే ఓ కోడిగుడ్డు ఉడికించి తిని చూడండి . ఐదు నిమిషాల పని. అదీ ఓపిక లేదా ఓ పండు తినండి. ఒక్కసారి హార్మోన్ల హెచ్చు తగ్గుల వల్ల కూడా సరిగ్గా నిద్ర పట్టదు. దీన్ని అధికమించాలంటే వ్యాయామాన్ని జీవితంలో ఓ భాగం చేసుకోండి. ముఖ్యంగా పడుకునేముందర వీలైతే గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయండి. గదిలో వెలుతురు ఎక్కువగా వున్నా నిద్ర రాదు. కాబట్టి వీలైనంత తక్కువ డిమ్ లైటింగ్ ఉండాలి. నిద్రపోయే ముందు ఫోన్లో లాప్ టాప్ లు దూరం పెట్టాలి. పైగా ఎన్ని పనులున్నా ఒకే సమయానికి నిద్రకు ఉపక్రమించటం సరైన అలవాటు. అలాగే ఏదైనా విషయం గురించి పదే పదే మనసులోకి తెచ్చుకోవద్దు. అసలా ఆలోచనే ముందు నిద్రకు దూరం చేస్తుంది. మనసులో దోబూచులాడే ఆలోచనల్లోంచి బయటకి రండి అంటున్నారు ఎక్స్ పెర్ట్స్.

    ఆకలేస్తుందేమో చూసుకోండి

    కడుపులో ఆకలిగా ఉందేమో  అందుకే  నిద్రపోవటం లేదేమో చూసుకోండి . అంటున్నారు ఎక్స్ పెర్ట్స్ డైటింగ్ వల్లనో ఇంకేమైనా కారణం చేతనో ఏమీ తినకుండా పడుకుంటే ఆకలితో…

  • బ్యూటీ పార్లర్ కి వెళ్లాలన్నా సమయం ఉండదు. ఏ ఫేస్ క్రీమ్ వాడినా ఇంట్లో ఏదైనా చిట్కాలు ఉపయోగించినా పార్లర్ కు వెళ్లినంత చక్కగానే చర్మం మెరుస్తుంది . సహజమైన ఏ రసాయనాలు కలపని కొన్ని వస్తువుల్లో బ్లీచ్ కంటే మొహాన్ని తేటగా చేసే మంచి గుణాలుంటాయి. రెండు స్పూన్ల బియ్యం పిండి లో కొద్దిగా తేనె పెరుగు కలిపి ఈ మిశ్రమాన్ని మొహానికి మెడకీ మర్దనా చేసుకోవాలి. పావుగంటయ్యాక కడిగేసుకుంటే మురికి పోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. స్పున్ బియ్యంపిండి లో నాలుగైదు చుక్కల ఆముదం కలిపి కళ్ళ కింద పూతలా వేసి కడిగేసుకుంటే వలయాలు మడతలు క్రమంగా మాయం అవుతాయి. పాలు లేదా పాల మీగడలో కొద్దిగా బియ్యంపిండి కలిపి ఫెస్ ప్యాక్ వేసుకోవాలి. పది నిముషాల తర్వాత కడిగేస్తే మురికిపోయి చర్మం శుభ్రపడుతుంది. బియ్యం పిండిలో తేనె ఆలివ్ ఆయిల్ కలిపి స్నానానికి ముందు మర్దన చేస్తే మృతకణాలు పోయి ముఖం కళగా ఉంటుంది. బియ్యం పిండి మినపప్పు పిండి కలిపితే మంచి ఫేస్ ప్యాక్ అవుతుంది. ఇది తప్పకుండా ట్రై చేయచ్చు.

    ఇది అద్భుతమైన ఫేస్ ప్యాక్

    బ్యూటీ పార్లర్ కి వెళ్లాలన్నా సమయం ఉండదు. ఏ ఫేస్ క్రీమ్  వాడినా ఇంట్లో ఏదైనా చిట్కాలు ఉపయోగించినా పార్లర్ కు వెళ్లినంత చక్కగానే చర్మం మెరుస్తుంది…

  • ఆఫీస్ పనితో చాలా ఉద్రిక్తత ఉంటుంది. పని వత్తిడి పై అధికారి అజమాయిషీ తోటి ఉద్యోగులతో ఇమడలేకపోవటం పని గంటలు ఏదైనా కావచ్చు. ఆ అసహనం ఇంటిదాకా టీయూస్కుపోతే నష్టమే అంటున్నారు ఎక్స్ పెర్ట్స్. ఆ విసుగు కోపం ఇంటికి వెళ్ళగానే భాగస్వామి పైనో. పిల్లల పైనో వెళ్లగక్కితే ఇంకా ఇంటి వాతావరణం గందరగోళం అయిపోతుంది. అలా ఆఫీస్ సమస్యల్ని ఇంటివరకుతేకుండా చిన్న పరిష్కారం చెపుతున్నారు ఎక్స్ పెర్ట్స్. రోజు కనీసం ఐదొందల కేలరీలు ఖర్చు చేసేలా ఎదో ఒక వ్యాయామం చేయగలిగితే ముందుగా మనసులో వత్తిడీ నిస్పృహ ఉండదంటున్నారు. రోజుకి ఎదో రకంగా పదివేల అడుగులు వేసి వేలకు నిద్ర పోకపోతే మనసు అలజడికి గురికాక తప్పదంటున్నారు. ఆఫీస్ లో వుండే ఎలాంటి ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కో గలిగే శక్తి సామర్ధ్యాలు వ్యాయామం యోగా వల్లనే సమకూరుతాయంటున్నారు . ఒకేసారి నడవటం కష్టం అయింది. మధ్యలో బ్రేక్ తీసుకుంటూ అయినా సరే నడవాలి. శరీరానికి కాస్త శ్రమ ఇవ్వాలి. అలాగే కోపమొచ్చినా అంతే. పని పక్కన బెట్టి కాసేపు బయటకివచ్చి నడవమంటున్నారు.

    కోపం విసుగు కు గొప్ప మందు

    ఆఫీస్ పనితో చాలా  ఉద్రిక్తత ఉంటుంది. పని వత్తిడి పై అధికారి అజమాయిషీ తోటి ఉద్యోగులతో ఇమడలేకపోవటం పని గంటలు ఏదైనా కావచ్చు. ఆ అసహనం ఇంటిదాకా…

  • నీహారికా , ప్రతిదానికీ ఒక సమయం ఉంటుందా ? ఒకప్పుడు విజయవంతంగా చేసిన పని ఇంకోసారి ఎందుకు చేయలేము అని అడిగావు కరెక్టే. చిన్న లాజిక్ విను మనిషి జీవితంలో మూడు దశలుంటాయి. యవ్వనం కౌముదం వార్ధక్యం . యవ్వనంలో పుష్కాలమంతా శక్తీ సమయం ఉంటాయి. డబ్బు ఇంకా సంపాదించవలసిన సమయం ఇది. అంటే డబ్బు ఉండదు. ఇక రెండో కౌముదం 25 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు. డబ్బు సంపాదిస్తారు శక్తీ ఉంటుంది దాన్ని అనుభవించే సమయం ఉండదు. ఇక మూడోది వార్ధక్యం ఇప్పుడు డబ్బు సమయం ఉంటుంది ఓపిక ఉండదు. పై మూడు దశల్లో డబ్బు వయస్సు శక్తీ మూడు ముఖ్యాంశాలు. ఇప్పుడు వయసులో డబ్బు సంపాదించి కౌముద దశలో కాస్త సమయం మిగుల్చుకుని డబ్బు జీవితం కూడా అనుభవించాలి. వార్ధక్యంలో ఆ డబ్బుతో మిగిలిన జ్ఞాపకాలు అనుభవాలతో సుఖంగా బతకండి అంటాం. అంచేత ఒక్కో సమయంలో చేయవలిసిన పని అప్పుడే చేయాలి. 70 ఏళ్ళు వచ్చాక వ్యాపారం మొదలెడతాననటం కరెక్టా ?? ఇప్పుడు చెప్పు ప్రతిదానికీ సమయం సందర్భం ఉంటాయా ? ఉండవా ? సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని సక్రమంగా ఆ పని ముగించాలి. ఏమంటావు ??

    ప్రతిదానికీ సమయం సందర్భం ఉంటాయి

    నీహారికా , ప్రతిదానికీ ఒక సమయం ఉంటుందా ? ఒకప్పుడు విజయవంతంగా చేసిన పని ఇంకోసారి ఎందుకు చేయలేము అని అడిగావు కరెక్టే. చిన్న లాజిక్ విను…

  • నూనెతో మర్దనా చేస్తే సహజమైన మెరుపు

    ముఖ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. వాతావరణం లో వచ్చే ప్రతి మార్పుకు ప్రభావితం అయ్యేది ముఖ చర్మమే. చర్మానికి ఎప్పుడు సహజమైన నూనెలు అవసరం. కొబ్బరి…

  • చిన్న ఇల్లయినా హాయిగా చుట్టూ పచ్చనిచెట్లు వికసించిన పువ్వులు ఒక్కో ఆకు లేకుండా విసిరినా ఎర్రని పూలతోటలు నీలి ఆకాశం రాత్రివేళ ఆరుబయట అందం ,,, అపార్ట్మెంట్ ఇంట్లో ఇవన్నీ కావాలని ఆశగా ఉంటే వెంటనే వినైల్ త్రీడి సీలింగ్ వాల్ పేపర్స్ గురించి వెతకాలి. ఈ త్రీడి వాల్ పేపర్స్ నిమిషాల్లో పై కప్పుకు గది గోడలకు అంటూ కుంటాయి. స్ట్రెచ్ సీలింగ్ వాల్ పేపర్స్ అయితే పై కప్పుకు అయితే కాస్త కిందగా గోడలకు ఫ్రెమ్ ఏర్పాటు చేసి అంటిస్తారు. ఆ ఖాళీలో వాల్ పేపర్ వెనకాల ఎల్ ఇ డీ లైట్లు అమర్చుతారు. ఈ లైట్ల కారణంగా చిత్రాలు త్రీడి ఎఫెక్ట్ తో అచ్ఛం నిజమైన వాటిలా కనిపిస్తాయి. కంపెనీ కి ఆర్డరిస్తే వాళ్లే మొత్తం అమర్చి ఇస్తారు. ఆన్ లైన్ షాపుల్లో వెతికితే బోలెడన్ని రకాలు సాదాసీదాగా వున్నా సీలింగ్ మార్చేయటం చిటికెలో పని.

    సీలింగ్ కు వాల్ పేపర్ అందాలు

    చిన్న ఇల్లయినా  హాయిగా చుట్టూ పచ్చనిచెట్లు వికసించిన పువ్వులు ఒక్కో ఆకు లేకుండా విసిరినా ఎర్రని పూలతోటలు నీలి ఆకాశం రాత్రివేళ ఆరుబయట అందం ,,, అపార్ట్మెంట్…

  • పొట్లకాయలు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెపుతారు నిపుణులు. బరువు తగ్గాలనుకుంటే ఆహారంలో పొట్లకాయ భాగంగా చేసుకోవాలి. వేసవిలో చల్లదనం ఇస్తుంది. పోషకాలు గుండె మంచి టానిక్. అలాగే బాదాం పప్పు వలిచి ఎన్నో స్వీట్స్ వాడతాం. కానీ ఆ పొట్టుని సున్నిపిండి లో కలిపి వంటికి రుద్దుకుంటే మెరుపు వస్తుంది. జుట్టు రాలటం తగ్గాలంటే పరగడుపునే వేయించిన నువ్వులు బెల్లంతో కలిపి తినాలి. నువ్వులు వేయించి డబ్బాలో పోసుకొంటే రోజు వేయించే బాధ తప్పుతుంది. కాళ్ళ పగుళ్లు తగ్గాలంటే కలబంద జిగురు రాయాలి. ఆకుకు నేరుగా చెట్లనుంచి విరిచి దాన్ని కాలుకు రాయాలి. లేదా మెత్తగా గ్రైండ్ చేసి కూడా వాడచ్చు. గోళ్లు పెళుసుగా అయిపోయి విరిగిపోతుంటే నిమ్మరసం గిన్నెలో పోసి వేళ్ళు ముంచి నిమ్మతొక్క తో రుద్దాలి. మోచేతి నలుపు పోయేందుకు కూడా ఈ చిట్కా పనిచేస్తుంది.

    పొట్ల కాయలే వేసవికి బెస్ట్

    పొట్లకాయలు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెపుతారు నిపుణులు. బరువు తగ్గాలనుకుంటే ఆహారంలో పొట్లకాయ భాగంగా చేసుకోవాలి. వేసవిలో చల్లదనం ఇస్తుంది. పోషకాలు గుండె మంచి టానిక్. అలాగే…

  • చదువు పూర్తవుతూనే కాంపని ఇంటర్వ్యూ తో వెంటనే జాబ్ వస్తోంది. అంటే కళాశాల నుంచి ఉద్యోగం లోకి అడుగుపెట్టిన యువతికి ఆ జాబ్ ఎలా హ్యాండిల్ చేయాలో అవగాహన ఉండదు. అందుకు ఎక్స్ పెర్ట్స్ ఏం చెపుతున్నారంటే ముందు బలాలు బలహీనతలు చూసుకుని ప్రతిలోపాన్ని నిజాయితీగా అంగీకరిస్తూ కొత్త కొత్త నైపుణ్యాలు పెంచుకోవాలి ఆఫీస్ లో కొత్తగా పనిచేయగలిగే అవకాశాలు స్వీకరించాలి. సవాళ్లను ఎదుర్కోవాలి. అవసరమైతే అధికారుల సహకారం తీసుకోవాలి. ఇవన్నీ మంచి అనుభవాలే. ఆఫీస్ లో కూర్చుని ఇంటి గురించి ఆలోచించవద్దు. ఇంట్లో విషయాలే పదే పదే కొలీగ్స్ తో చెపుతూ ఆఫీస్ వాతావరణం పాడుచేయద్దు. ఎన్ని పనులైనా ప్రణాళికలు పూర్తిచేసేలా తయారవ్వాలి. ముందుగా వత్తిడినీ తగ్గించే వ్యాయామాలు చేయాలి. మెదడు చురుగ్గా ఉండటం పుస్తకాలు చదవాలి. ప్రపంచం గురించి అప్ డేట్స్ తో సిద్ధంగా ఉండాలి ఇదే ఉద్వేగంతో ఉన్నతమైన స్థానానికి తీసుకుపోయే అవకాశాలు.

    అప్ డేట్స్ తో సిద్ధంగా ఉండండి

    చదువు పూర్తవుతూనే కాంపని ఇంటర్వ్యూ  తో వెంటనే జాబ్ వస్తోంది. అంటే కళాశాల నుంచి ఉద్యోగం లోకి అడుగుపెట్టిన  యువతికి ఆ జాబ్ ఎలా హ్యాండిల్ చేయాలో…

  • ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్ట్ ప్రకారం ఇటీవల మధుమేహం తర్వాత ఎక్కువమంది మహిళల వెన్ను నొప్పి తోనే. శారీరిక బలహీనత మానసిక వత్తిడి కూర్చునే భంగిమ సరిగాలేక పోవటం ఇలా కారణాలు ఏమైనా నడుము కింది భాగంలో వెన్నునొప్పి తో బాధపడేవాళ్లు సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతుంది. ప్రతి పదిమందిలోను ఎనిమిదిమంది దీని బారిన పడుతున్నారని అధిక బరువు ఎత్తటం క్షణం కూడా తీరిక లేని అనేక పనులు పదే పదే చేస్తూ ఉండటం కూడా మరో ముఖ్య కారణమని పరిశోధకులు చెపుతున్నారు . ఇందులో రెండు రకాల్ని ఒకటి దీర్ఘ కాలికంగా వస్తూ పోతుందని ఒకటి ఉదయం పూట ఎక్కువగా ఉంటుందనీ విశ్లేషించారు. తొలిదశలోనే కారణం తెలుసుకుని బరువులు ఎత్తటం ,దించటం ఆపాలనీ యోగా చేయాలనీ కూర్చునే భంగిమలు మార్చుకోవాలని వాటి ద్వారా దీన్ని నివారించుకుంటే మంచిదని చెపుతున్నారు. ఇలా ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే నెప్పి తీవ్ర స్థాయికి చేరుతుందని అది దీర్ఘకాలికంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు . నడుం నొప్పి కదా ఒక మాత్రతో పోతుందని ఆలస్యం చేయద్దంటున్నారు

    నడుంనొప్పే కదా అని నిర్లక్ష్యం వద్దు

    ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్ట్ ప్రకారం ఇటీవల మధుమేహం తర్వాత ఎక్కువమంది మహిళల వెన్ను నొప్పి తోనే. శారీరిక బలహీనత మానసిక వత్తిడి కూర్చునే భంగిమ సరిగాలేక…

  • తలుపులు మూసి కిటికీలు వేసి దోమ తెరలు కట్టి మస్కిటో కాయిల్స్ ఆయిల్స్ మ్యాట్స్ పెట్టినా ఎలా ఎగురుకుంటూ వచ్చి కుట్టేస్తాయో దోమలు. పైగా ఈ కాయిల్స్ ఎన్నో అనారోగ్యాలు ఇప్పుడు ముంబాయి కు చెందిన నిద్రా టెక్స్టైల్స్ అనే సంస్థకు చెందిన ఇద్దరు అక్కా చెల్లెళ్లు . కస్తూరి శ్రేయా పోడార్ మస్ క్విట్ ఇన్ అనే దుప్పటి తయారు చేసారు. నూటికి నూరు శాతం నూలుతో తయారు చేసిన ఈ బ్లాంకెట్ తో పెర్ మెత్రిన్ అనే రసాయనాన్ని జొప్పించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన ఈ రసాయనాన్ని అమెరికా సైనిక దళ యునిఫారాల్లో వాడుతున్నారు. టెక్సటైల్ డిజైనర్ కస్తూరి ఆలోచనల్లోంచి రూపం పోసుకున్న ఈ దుప్పటి కోసం వాడే కెమికల్స్ స్విజ్జర్ల్యాండ్ నుంచి దిగుమతి చేసుకున్నారు. దీన్నించి ఎలాంటి దుష్ఫలితాలు రావని చిన్న పిల్లలు గర్భిణులు కూడా నిర్ణయంగా వాడుకోవచ్చంటున్నారు. ఉత్పత్తిదారులు. 50 ఉతుకుల వరకు దోమల్ని దగ్గరకు రానీయకుండా కాపాడుతుంది. తర్వాత దాన్ని మాములు దుప్పటిలా వాడుకోవచ్చు.

    దోమలు కుట్టని దుప్పటి

    తలుపులు మూసి కిటికీలు వేసి దోమ తెరలు కట్టి మస్కిటో కాయిల్స్ ఆయిల్స్ మ్యాట్స్ పెట్టినా ఎలా ఎగురుకుంటూ వచ్చి కుట్టేస్తాయో దోమలు. పైగా ఈ కాయిల్స్…

  • ఒక్కరోజు నిద్రపోకపోతే ఏమవుతుంది, లేదా కాస్త లేటయితెం ఈ సినిమా చూసేద్దాం అనుకుంటూ నిద్ర వాయిదా వేస్తె మాత్రం చాలా ప్రమాదం అంటునాన్రు పరిశోధకులు. ఒక్క రాత్రి నిద్ర లేకపోతే అది ఆరు నెలల పాటు అధిక కొవ్వు పదార్ధాలు టీయూస్కున్న దానితో సమానం అంటున్నారు పరిశోధకులు. శరీరంలో ఇన్సులిన్ సరిగా విడుదల అవ్వకపోతే మధుమేహం ఊబకాయం గుండె జబ్బులు వస్తాయని తెలిసిందే. ఇప్పుడు జరుగుతున్న పరిశోధనల్లో నిద్రలేమి అధిక కొవ్వు పదార్ధాలు రెండూ కూడా ఇన్సులిన్ పైన ప్రభావాన్ని చూపెడతాయని తేలింది. రక్తంలో గ్లూకోజ్ శాతం సరిగా ఉండాలన్న జీవక్రియ సరిగా ఉండాలన్నా శరీరానికి నిద్ర అవసరం. నిద్రలేమితో ఆహారం ఎక్కువ తీసుకోవటం జీవక్రియ లోపాలు పగలు ఆ అలసట తోనే మిగతా పనులన్నీ చేయవలిసి రావటం ఇది ఒక్కరోజు నిద్ర మిస్ అయినా జరిగే ప్రాబ్లమ్. ఎన్ని పనులున్నా నిద్ర కోసం కేటాయించిన సమయం దేనికీ వాడద్దు.

    ఒక్క రాత్రి నిద్రపోక పోయినా ప్రాబ్లమే

    ఒక్కరోజు నిద్రపోకపోతే ఏమవుతుంది, లేదా కాస్త లేటయితెం   ఈ సినిమా  చూసేద్దాం అనుకుంటూ నిద్ర వాయిదా వేస్తె మాత్రం చాలా ప్రమాదం అంటునాన్రు పరిశోధకులు. ఒక్క రాత్రి…

  • ఆకుపచ్చ ,ఎరుపు ,నారింజ , పసుపు ఇలా ప్రకాశవంతమైన రంగుల్లో వుండే కూరగాయల్లోనే కాదు తెల్లని రంగులో వుండే ముల్లంగి కాలీఫ్లవర్ వంటి వాటిల్లోనూ బోలెడు పోషకాలుంటాయి. ఇప్పుడు కాలీఫ్లవర్ ను తీసుకుంటే ఇందులో బి విటమిన్ పీచు సమృద్ధిగా ఉంటాయి . అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్ నుంచి రక్షించే ఫైటో న్యూట్రియెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇండోల్ 3 కార్దినాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ స్త్రీ పురుషులిద్దరిలోను రొమ్ము ప్రత్యుత్పత్తి అవయవాల్లో కాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఇందులోని పీచు నీటిశాతాము శరీర బరువును తగ్గిస్తాయి. ఈ రెండు జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అధ్యయనం జ్ఞాపకశక్తి మెరుగుపరిచేందుకు తోడ్పడే కోలిన్ అనే కీలకమైన పోషకం కాలీఫ్లవర్ లో ఉంది. ఎముకల దృఢత్వానికి తోడ్పడుతుంది. కాలీఫ్లవర్ లో పోషకాలు ఎక్కువ క్యాలరీలు తక్కువ.

    పోషకాలు ఎక్కువ క్యాలరీలు తక్కువ

    ఆకుపచ్చ ,ఎరుపు ,నారింజ , పసుపు ఇలా ప్రకాశవంతమైన రంగుల్లో వుండే కూరగాయల్లోనే కాదు తెల్లని రంగులో వుండే ముల్లంగి కాలీఫ్లవర్ వంటి వాటిల్లోనూ బోలెడు పోషకాలుంటాయి.…

  • గులాబీల అందమే అందం. ఎన్ని రంగుల గులాబీలు సృష్టించారు లెక్కలేదు. బొకేలుగా అమర్చేప్పుడు పెళ్ళిళ్ళకి పువ్వుల డిజైన్లు చేసినప్పుడు గులాబీలను ఎన్ని రకాలుగా చేస్తారో లెక్కలేదు. ఉదాహరణకు అవలాంచి రోజాలు చాలా తెల్లగా చెప్పలేనంత అందంగా ఉంటాయి. వీటిని ఫ్లోరోసెంట్ రంగుల్లో ముంచటం వల్ల అవి పగలు మాములు గులాబీ పువ్వుల్లా రాత్రిపూట దివ్యమైన కాంతి వెదజల్లుతున్నట్లు ఉంటాయి. అలాగే చెట్టుకే హరివిల్లు రంగుల గులాబీ పుసిందా అన్నట్లు కనిపించే రెయిన్బో రోజాలు ఇంకా స్పెషల్. తెల్లని పువ్వు కాడను నిలువుగా చీరి ఒక్కో చీలిక ఒక్కో ద్రవణంలో మునిగేలా పెట్టటంలో ఆరంగులు పీల్చుకుని రేకలు ఎన్నో రంగుల్లోకి మారిపోతాయి. ఎంతో సహజంగా అందంగా ఉంటాయి. వీటిని శాటిన్ బట్టల్లా మెరిపించాలన్నా క్రీమ్ కేక్ లాగా ఉండాలన్నా శాటిన్ రంగులో ఉంచటం ప్యాక్ క్రీమ్ లాంటి మైనంతో ముంచటం తో పువ్వులు అచ్ఛం అలాగే వికాశంబియా అనేలా చేస్తున్నారు. ప్రకృతే మనిషి గుప్పెట్లో వదిగిపోతుంది.

    చీకట్లో మెరుస్తాయి రంగుల్లో వెలుస్తాయి

    గులాబీల అందమే అందం. ఎన్ని రంగుల గులాబీలు సృష్టించారు లెక్కలేదు. బొకేలుగా అమర్చేప్పుడు పెళ్ళిళ్ళకి పువ్వుల డిజైన్లు చేసినప్పుడు గులాబీలను ఎన్ని రకాలుగా చేస్తారో లెక్కలేదు. ఉదాహరణకు…

  • నీహారికా , ఇవ్వాళ నువ్వు చెప్పిన కబురు చాలా అవసరం అయినది ఆలోచించి జాగ్రత్తగా వుండవలిసిందీ నా ఫ్రెండ్ కాస్త బొద్దుగా ఉంటుంది తనను టీజ్ చేస్తే నవ్వేస్తోంది కానీ చాలా కుంగిపోతుంది. కానీ అలా అనద్దని మిగతా ఫ్రెండ్స్ తో ఎలా చెప్పాలి అన్నావు కరెక్టే. చాలా ఇబ్బంది. సన్నిహితులే కదా అని బొద్దుగా బరువుగా ఉండేవారని సరదాగా చనువుగా ఆటపట్టిస్తూ వుంటాను. వాళ్ళ గురించి ఏవో వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళు కూడా సరదాగా తీసుకుంటారు అనుకుంటారు. కానీఇలాంటి నవ్వులాటలు ఎగతాళి వారిని శారీరికంగా మానసికంగా దెబ్బ తీస్తున్నట్లు కొన్ని అధ్యయనాల్లో రుజువైంది. అధికంగా బరువు ఉన్నామనే భావం ఒక్కసారి డిప్రెషన్ కు గురిచేస్తుందిట పదే పదే లావుగా ఉన్నావంటూ వ్యాఖ్యానిస్తుంటే సన్నబడే ప్రయత్నాలు చేసి చాలా అనారోగ్యాలపాలవుతుంటారని భావం. ఎందుకంటే బరువు పెరగటానికి బోలెడంత ఆహారం తినటం కారణం ఒక్కటే కాదు హార్మోన్స్ కారణం కూడా అవ్వచ్చు. జీన్స్ లో ఉండచ్చు . ఏదైనా కావచ్చు కానీ సరదాకైనా సాటి స్నేహితులను అలా వేధించి ఆనందించే ప్రయత్నం చేయటం అనాగరికం . అలంటి అలవాటున్న స్నేహితులతో కఠువుగానైనా సరే ఇతరులను అవమానించి బాధపెట్టవద్దని హెచ్చరిస్తేనీ మంచిదనిపిస్తోంది. తప్పులు ఎవరైనా చేస్తారు. అది తప్పని సక్రమంగా చెపితే అర్ధం చేసుకునే సంస్కారం వుంటుందనే ఆశిద్దాం .

    సరదాకైనా ఇది తప్పే

    నీహారికా , ఇవ్వాళ నువ్వు చెప్పిన కబురు చాలా అవసరం అయినది ఆలోచించి జాగ్రత్తగా వుండవలిసిందీ నా ఫ్రెండ్ కాస్త బొద్దుగా ఉంటుంది తనను టీజ్  చేస్తే…

  • చిన్న కృష్ణుడికి వెన్నంటే ఇష్టమంటారు. మరి ఆయనకు వెన్నలో సుగుణాలన్నీ ఎలా తెలుసో. మరి ఇప్పుడు వెన్నలో ఆరోగ్యం ఉందని వైద్యులు కనుగొన్నారు. వెన్న తింటే కొవ్వు పెరుగుతామని బరువు పెరుగుతారని అభిప్రాయానికి పడతారు. కానీ ఇది తప్పంటున్నారు. నిపుణులు. ఇందులోని విటమిన్ ఏ గుండెను ఆరోగ్యంగా వుంచుతోందిట. ఇందులో వుండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను దృఢంగా ఉంచుతాయి. వెన్న ఆహారంలో తీసుకుంటే బరువు పెరిగరు. ఎక్కువసేపు ఆకలి వేయదు. మంచి కొలెస్ట్రాల్ వుండే వెన్నకు చిన్న పిల్లలలకు ఇస్తే వారి మెదడు నాడీ వ్యవస్థ ఎదుగుదల చక్కగా ఉంటాయట. చిన్నతనం నుంచి పిల్లలకు తగుమోతాదులో వెన్న తినటం అలవాటు చేయమని ఇది వారికీ జీవితాంతం ఆరోగ్యాంగా ఉండేలా చేస్తుందని చెపుతున్నారు .

    వెన్న తిందువు గాని రారా !

    చిన్న కృష్ణుడికి వెన్నంటే ఇష్టమంటారు. మరి ఆయనకు వెన్నలో సుగుణాలన్నీ ఎలా తెలుసో. మరి ఇప్పుడు వెన్నలో ఆరోగ్యం ఉందని వైద్యులు కనుగొన్నారు. వెన్న తింటే కొవ్వు…

  • ఆస్కార్ పురస్కార వేడుకల్లో పాల్గొనటం పురస్కారం అందుకోవటంతో సమానం ముఖ్యంగా హీరోయిన్స్ ఈ అవకాశాన్ని వదులుకునేందుకు అసలు ఇష్టపడరు. రెడ్ కార్పెట్ పైన నడవటం ఒక మంచి అవకాశం అనుకుంటారు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ లో సందడి చేస్తున్న ప్రియాంక చోప్రా. దీపికా పదుకునే కు ఈ అవకాశం దక్కింది. ప్రియాంక ఆస్కార్ వేడుకల్లో పాల్గొనటం రెండవసారి. మెరిసే వెండి రంగు దుస్తులతో ఆస్కార్ వేడుకల్లో సందడి చేసిన ప్రియాంక డ్రెస్ ను వేల మంది వీక్షకులు మంచి మార్కులే వేశారు. తర్వాత ఆఫ్టర్ పార్టీ లో నల్ల రంగు డ్రెస్ ల్లో కనబడింది. ఈ ఆఫ్టర్ పార్టీల్లో దీపికా ఫ్రిదా ప్రింట్లో కూడా సందడిచేసారు. 89 వ ఆస్కార్ పురస్కార వేడుక ఎంతో మంది నటుల కలల్ని సాకారం చేసింది. పురస్కారం తీసుకున్న వారి సంతోషాలు రెడ్ కార్పెట్ పైన నడిచిన అందాల రాణుల చిరునవ్వులతో పురస్కార వేడుక వెలిగి పోయింది. .

    ఆస్కార్ వేడుకల్లో బాలీవుడ్ అందం

    ఆస్కార్ పురస్కార వేడుకల్లో పాల్గొనటం పురస్కారం అందుకోవటంతో సమానం ముఖ్యంగా హీరోయిన్స్ ఈ అవకాశాన్ని వదులుకునేందుకు అసలు ఇష్టపడరు. రెడ్ కార్పెట్ పైన నడవటం ఒక మంచి…

  • వంటింట్లో ఒక ఫ్రూట్ ప్లాంట్ మల్టీ కిచెన్ టూల్ సెట్ ఉందనుకోండి. ఎన్ని పనులు చేస్తుందంటే బత్తాయి నిమ్మ రసాలు తీయటం బటర్ ని తురమటం పండ్లు కోయటం లాంటి ఎన్నో పనులు ఈ చిన్న యాపిల్ లా కనిపించే పరికరంతో చేసేయచ్చు. రెండు మూడు పనులకు ఉపయోగపడేలా వస్తువు మల్టీ పర్పస్ వస్తువులకు ఎంతో క్రేజ్. పైగా బోలెడు స్థలం ఆదా. కొత్తగా పెళ్ళైన దంపతులు చూసే వస్తువుల్లో ఇదొకటి చాలా ఉపయోగం. ఇది యాపిల్ షేప్ లో ఉంటుంది. అడుగు భాగంలో ఒక చిన్న గిన్నె. దానిపైన నిమ్మ బత్తాయి జ్యుసర్లు పైన మెష్ కట్టర్ ఆ పైన గ్రేటర్ యాపిల్ కట్టర్ ఇలా చాలా భాగాలున్నాయి. ఇక పూర్తిగాపైన అవకాడో స్కూప్ మేషర్ నిమ్మజాతి పండ్ల తొక్క తీసేందుకు ఉపయోగించే చాకులుంటాయి . ఇదంతా వంటగది గట్టున ఓ మూల వుంచేసినా చాలు. అందుబాటులో అలా తీసి ఇలా వాడుకోవచ్చు.

    ఇదొక్కటే ఎన్నో పనులు చేస్తుంది

    వంటింట్లో ఒక ఫ్రూట్ ప్లాంట్ మల్టీ కిచెన్ టూల్ సెట్ ఉందనుకోండి. ఎన్ని పనులు చేస్తుందంటే బత్తాయి నిమ్మ రసాలు తీయటం బటర్ ని తురమటం  పండ్లు…

  • ఇళ్లల్లో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు వాగ్వివాదాలు వస్తాయి. పిల్లల ముందు గట్టిగా అరుచుకుంటారు. ఇలా వాళ్ళు తరుచు గొడవ పడుతుంటే పిల్లల్లో కుంగుబాటు మానసిక ఆందోళన పెరుగుతాయంటున్నారు. ఎక్స్ పెర్ట్స్. చిన్న పిల్లలను భయానికి గురిచేసే విషయాల్లో మొదటిది తల్లి తండ్రులు ఇలా పోట్లాడుకుని విడిపోతారేమోనని చాలా టెన్షన్ పడతారట. ఎడ మొహం పెడమొహం తో పెద్దవాళ్ళంటే వాళ్లకు చదువు పైన ఏకాగ్రత వుండదంటున్నారు . కాబట్టి ఈ విషయం దృష్టిలో పెట్టుకుని పెద్దవాళ్ళు తమ కోపాన్ని వ్యక్తం చేసే మార్గాల్ని వెతకమంటున్నారు. పిల్లల్ని భయాందోళనలకు గురిచేయద్దు. మీ సమస్యలకు ఒక పేపర్ పై రాసి పరస్పరం ఇచ్చుకోండి. ఇది పిల్లల వరకు వెళ్ళదు కనుక ప్రాబ్లమ్ లేదు. లేదా ఎంత ఉద్వేగం వచ్చినా పిల్లల ముందు బయటపడకుండా వాటిని గురించి వాళ్ళు లేనప్పుడే మాట్లాడుకుని పరిష్కరించుకోండి. సమస్య పరిష్కారం కాకపోయినా వాళ్ళ ముందు మౌనంగా అయినా వుండండి. భార్య భర్తలు తల్లి తండ్రుల పాత్రలోకి వచ్చాక వాళ్లకు బాధ్యత ఉంటుంది కనుక దాన్ని గుర్తుంచుకుని ప్రవర్తించమంటున్నారు నిపుణులు .

    వాళ్ళు ఆందోళన పడతారు. జాగ్రత్త

    ఇళ్లల్లో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు వాగ్వివాదాలు వస్తాయి. పిల్లల ముందు గట్టిగా  అరుచుకుంటారు. ఇలా వాళ్ళు తరుచు  గొడవ పడుతుంటే పిల్లల్లో  కుంగుబాటు మానసిక…

  • వంట్లో కలిగే ప్రతిచిన్న అనారోగ్యానికి పరిగెత్తుకుంటూ షాపుకు వెళ్లి ఎదో ఒక ఉపశమనం మాత్రం తెచ్చుకోవద్దు. గృహ వైద్యం చేయండి. మరీ తగ్గకపోతే డాక్టర్ ను చూడండి అంటున్నారు నిపుణులు. మైగ్రేన్ తో బాధపడేవారికి కాఫీ ఒక ఉపశమనం ఒక పెయిన్ కిల్లర్. ముందు వేడిగా కాఫీ తాగి మరీ సమస్య గా ఉంటే ఎలా వుంటారు కదా దాల్చిన చిక్కని మెత్తగా నూరి అందులో తేనె కలిపి నొప్పులున్న చోట రాసి మస్సాజ్ చేస్తే మంచిది. నోటిలో పుండ్లు గొంతు నొప్పికి తేనె చక్కగా పనిచేస్తుంది ఆవాలు వాపును బ్రహ్మాండంగా తగ్గిస్తాయి. శరీరంలో నొప్పులు వాపులకు ఆవ నూనెతో మర్దనా చేసుకోవచ్చు. భోజనం ముందు ఒక గ్లాస్ లో ఆపిల్ సిడార్ వెనిగర్ రెండు మూడు స్పూన్ల వేసుకుని తాగితే ఆర్థరైటిస్ కీళ్ల నొప్పులు కొంచెమైన ఉపశమిస్తాయి. టొమాటో జ్యూస్ లో కండరాలు పట్టుకోవటం నొప్పి పోతాయి. గొంతు ఇన్ఫెక్షన్ వస్తే ఉప్పు నీటిలో పుక్కిటపడితే సమస్య తర్వాత ఖచ్చితంగా తగ్గుతుంది .

    ఇవన్నీ ఉపశమనం కోసమే

    వంట్లో కలిగే ప్రతిచిన్న అనారోగ్యానికి పరిగెత్తుకుంటూ షాపుకు వెళ్లి ఎదో ఒక ఉపశమనం మాత్రం తెచ్చుకోవద్దు. గృహ వైద్యం చేయండి. మరీ తగ్గకపోతే డాక్టర్ ను చూడండి…