• సరైన దువ్వెన ఎంచుకోక పొతే జుట్టు ఊడిపోవడం, చిక్కులు పడటం తప్పదంటున్నారు హెయిర్ స్టైలిస్ట్ లు. దువ్వెన కొనే ముందే జుట్టు తత్వం ఎలాంటిది? పోదిబారినట్లు వుంటుందా? జిడ్డుగా వుంటుందా? రింగుల జుట్టా? సాదాగా మెత్తగా ఉంటుందా? అవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. మరీ మెత్తగా లేదా మరీ గట్టిగా వుండే పళ్ళ దువ్వెనని తక్కువ ఖరీదైనవి వడక పోవడం మేలు నన్యమైనవి ఎంచుకోవడం వల్ల జుట్టు చిక్కులు పడకుండా పడిన చిక్కుల వల్ల జుట్టు తెగిపోకుండా వుంటుంది. జుట్టు పొదుపుగా వున్నప్పుడు దీర్ఘచతురస్రాకారంలో వుండే పెడల్ బ్రష్ ని ఉపయోగిస్తే మాడుకి రక్త ప్రసారణ సక్రమంగా జరుగుతుంది. జుట్టు అందులో చిక్కుకుని చిక్కులు పడకుండా వుంటుంది. జుట్టు అందులో చిక్కుకుని చిక్కులు పడకుండా వుంటుంది. అలాగే అండాకృతిలో క్విల్ బ్రష్ నూనె పెట్టుకున్నప్పుడు ఉపయోగించుకోవడం మంచిది. జుట్టు తత్వాన్ని బట్టి మంచి దువ్వెన ఎంపిక చేసుకుంటే జుట్టు చిక్కులు పడిపోకుండా వెంట్రుకలు రాలకుండా వుంటాయి.

    జుట్టు తత్వాన్ని బట్టే దువ్వెన ఎంపిక

    సరైన దువ్వెన ఎంచుకోక పొతే జుట్టు ఊడిపోవడం, చిక్కులు పడటం తప్పదంటున్నారు హెయిర్ స్టైలిస్ట్ లు. దువ్వెన కొనే ముందే జుట్టు తత్వం ఎలాంటిది? పోదిబారినట్లు వుంటుందా?…

  • అరుదైన కళాత్మక మీనాకారి, ధెవా పనితనం కలిపి వేసి అద్భుతమైన సోజో అందాల్ని సృష్టించారు జ్యూవెలరీ డిజైన్స్. సోజో అనేది గ్రీకు పదం పరిపూర్ణత్వం అని అర్ధం, బంగారం తో చేసిన నగలకు రంగుల్ని అద్ది, వజ్రాలు, కెంపులు, పచ్చలు వంటి రత్నాలు జోడించి విక్టోరియన్ శైలిలో అందమైన నగల్ని సృష్టించడం ఈ సోజో నగల ప్రత్యేకత బంగారు రేకుల పైన నీలం, ఆకుపచ్చ, పసుపు, ఎరుపు, రంగుల్ని అద్ది పువ్వులూ, లతలు, పక్షులు, జంతువుల్ని రకరకాలుగా కనిపించేలా చేయడం మీనాకారీకళ. అలాగే 23 క్యారెట్ల బంగారు రేకుపైన సూదిల్లాంటి సన్నని పరికరం తో జంతువులు, పక్షుల బొమ్మలు, కొమ్మలు, రెమ్మలు, చెక్క లక్కతో గాజు పైన అతికించే కళ ధెవా. ఈ ధెవా కళమ్ మీనాకారి జోడించి విక్టోరియన్ తరహ డిజైన్ లతో వచ్చేవి సోజో నగలు. ఈ సోజో నగల్లో నెమళ్ళ డిజైన్లు చాలా ప్రత్యేకం. ఇందులో ఎక్కువగా పెండెంట్ల చెవి దిద్దులే ఎక్కువగా వస్తున్నాయి.

    కళా రూపాల కలపోత సోజో

    అరుదైన కళాత్మక మీనాకారి, ధెవా పనితనం కలిపి వేసి అద్భుతమైన సోజో అందాల్ని సృష్టించారు జ్యూవెలరీ డిజైన్స్. సోజో అనేది గ్రీకు పదం పరిపూర్ణత్వం అని అర్ధం,…

  • సీజన్ తో సంబంధం లేకుండా పెదవులు పగులుతూ ఇబ్బంది పెడతాయి. ఖరీదైన లిప్ బామ్ లకంటే వంటింటి చిట్కాలే పెదవుల సంరక్షణకు బాగా పని చేస్తాయి. తేనె లేదా గ్లిజరిన్ పెదవుల మైస్చురైజింగ్ కు పని చేస్తాయి. ఈ రెండింటిలో ఏది అప్లై చేసినా కాసేపట్లోనే ఫలితం కనిపిస్తుంది. నిమ్మఆకుల ముద్ద కానీ, అలోవీరా ముద్ద కానీ పెదవులకు అప్లై చేసినా ఫలితం బావుంటుంది. కీరా ముక్కలతో పెదవులపై రుబ్ చేసినా పెదవులు మృదువుగా అయ్యిపోతాయి. రోజు మొత్తంలో వీలైనన్ని సార్లు ఇలా రబ్ చేయొచ్చు. వీట్ జర్మి ఆయిల్, టొమాటో జ్యూస్ , పాలకూర జ్యూస్ ఇవన్నీ కలిపి అప్లయ్ చేస్తే పెదవులు మెత్తగా, గులబీ రంగులో కనిపిస్తాయి. పెదవులు పగలకుండా నిమ్మరసం మందు లాగా కాపాడుతుంది. తేనె, గులాబీ రేకుల పొడి కలిపి అప్లయ్ చేస్తూ వుంటే పెదవులు మంచి రంగులో వుంటాయి. అలాగే విటమిన్-ఇ వున్న లిప్స్ టిక్ వాడినా పెదవులు సహజమైన అందం కాపాడుకొ వచ్చు. ఖరీదైన రసాయినాలు కలసిన ఉత్పత్తుల కంటే ఈ సహజమైన లిప్ బామ్ లు పెదవుల అందాన్ని కాపాడుతాయి అనడం లో సందేహం లేదు.

    ఇవి సహజమైన లిప్ బామ్ లు

    సీజన్ తో సంబంధం లేకుండా పెదవులు పగులుతూ ఇబ్బంది పెడతాయి. ఖరీదైన లిప్ బామ్ లకంటే వంటింటి చిట్కాలే పెదవుల సంరక్షణకు బాగా పని చేస్తాయి. తేనె…

  • తల్లో చుండ్రు మొదలైందంటే ముందుగా జుట్టురాలడం, తెల్లని పొట్టు, దురదా లాంటి సమస్యలన్నీ వచ్చి పడతాయి. ఇంట్లో వుండే వస్తువులతోనే చుండ్రుకి అద్భుతమైన చికిత్స చేయచ్చు. కలబందలో యంటి ఫుంగల్ గునలుంటాయి. దీన్ని మాడుకు రాసుకుని మర్దన చేసుకోవాలి. అరగంట ఆగి తేలికైన షాంపూ తో తల రుద్దుకుంటే సమస్య కంట్రోల్ లోకి వస్తుంది. రెండు స్పూన్ల వంట సోడాలో కాసిన్ని నీళ్ళు కలిపి తలకు రాసుకోవాలి. ఓ అరగంట ఆగి తేలికైన షాంపూ తో తలస్నానం చేస్తే మాడు పై వున్న మ్రుతకనాలు రాలిపోతాయి. చుండ్రు క్రమంగా వదిలి పోతుంది. వేపాకులు మెత్తగా గ్రైండ్ చేసి పిండి పావు కప్పు రసం వచ్చేలాగ తీసుకోవాలి. అందులో కొబ్బరి పాలు, బీట్ రూట్, కొబ్బరి నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించినా సమస్య పోతుంది. కొబ్బరి నూనె నిమ్మరసం కలిపి తలకు రాసుకున్నా సరే గంటసేపాగి కడిగేస్తే సమస్య దూరమైపోతుంది.

    వేపాకు తో చుండ్రు మాయం

    తల్లో చుండ్రు మొదలైందంటే ముందుగా జుట్టురాలడం, తెల్లని పొట్టు, దురదా లాంటి సమస్యలన్నీ వచ్చి పడతాయి. ఇంట్లో వుండే వస్తువులతోనే చుండ్రుకి అద్భుతమైన చికిత్స చేయచ్చు. కలబందలో…

  • నీహారికా, పాజిటివ్ ధింకింగ్ సరే కానీ దేన్నెయినా పాజిటివ్ ఎలా తీసుకోవాలి అన్నావు చాలా కరెక్ట. ముందు మన చుట్టూ ప్రతికూల వాతావరణం లేకుండా చూసుకోవాలి. ఎలా అంటే మన స్నేహితుల్లో కొందరు ఇప్పుడు ఇతరుల్లో లోపాలు ఎంచేవాళ్ళు ఉన్నారు అనుకుందాం, మొదటిగా వాళ్ళకు దూరంగా వుండాలి. చుట్టూ వుండే వాతావరణం మనసు పైన ప్రభావం చూపెడుతుంది. ఎక్కువ సేపు ప్రక్రుతిలో గడిపితే ఆ ఫీలింగ్ ఆత్మవిశ్వాసం తో పాటు పాజిటివ్ నెస్ ను పెంచుతుంది అంటారు ఎక్స్ పర్ట్స్. మరి అంత సమయం ప్రకృతి లో గడిపడం సాధ్యమా అనుకుంటే ముందు మన గురించి మనం ఆలోచించుకోవాలి. ఏం చేస్తున్నాం? ఏం చేయాలి ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఎలా మెలగాలి. ఒక చిన్న మాటతో అవతలి మనిషి మొహం లో చిరునవ్వు పోయిన విషయం మనకేం అనిపించింది. ఒక మనిషిని కాస్త సంతోష పెడితే ఆ ఆనందం మనకెంత సేపు సంతోషంతో వుంచింది ఇదే పాజిటివ్ ఫీలింగ్స్ ని అలవరచుకునే పద్దతి. ఒక సారి ఈ దిశగా ఆలోచించడం మొదలు పెడితే అలవాటుని ప్రతి అంశాన్ని పాజిటివ్ గా చూసే శక్తిని ఇస్తుంది. ఇష్టమైన పనులు చేస్తే మానస్సు ఆనందంగా వుంటుంది. పాజిటివ్ గా వుండటం జీవితంలో ఒక భాగం అయిపోతుంది.

    సంతోషం ఇస్తే వచ్చేస్తుంది

    నీహారికా, పాజిటివ్ ధింకింగ్ సరే కానీ దేన్నెయినా పాజిటివ్ ఎలా తీసుకోవాలి అన్నావు చాలా కరెక్ట. ముందు మన చుట్టూ ప్రతికూల వాతావరణం లేకుండా చూసుకోవాలి. ఎలా…

  • చాలా ఖరీదైన సౌందర్య లేపనాలున్నాయి. ఇవి వాడండి తెల్లగా అయిపోతాయి, ఇలా రాసుకుంటే మొటిమలు, మచ్చలు మాయం అని అందమైన హీరోయిన్లు మ్యాజిక్ చేస్తుంటారు. మాఫలాని ఫేస్ క్రీమ్ లో ఫలాని గుణాలతో మీ అందమైన మొహం మెరుపులు మెరుస్తుంటుంది అని చెప్పాయి అడ్వర్ ట్రీట్మెంట్స్ ఏవి నమ్మాలి. అంటారు అమ్మాయిలు సరే కాసేపు అన్ని అవతల పెట్టండి. సింపుల్ గా వాడే ఇంట్లో వుండే వస్తువులతో న్యాయంగా మీ చేతులతో ఈ ఫేస్ పాక్ చేసుకోండి చక్కగా వుంటుంది అంటుంటారు. ఇంట్లో అమ్మమ్మలు నాన్నమ్మలు నిజానికి ఇవే సరైనవి. ఏ పసుపు, తేనె, పెరుగు, కలిపి మిక్సి చేయాలి. మొహం చల్లని నీళ్ళతో సుబ్రం చెసుకుని ఈ ఫేస్ ప్యాక్ అప్లయ్ చేసి, ఓ ఇరవై నిముషాలు ఆగి గోరు వెచ్చని నీళ్ళతో కడుక్కొని చూసుకోండి. ఇంకా ఏ ఫేషియల్ ఇంతందం ఇస్తుంది అంటారు. వారానికి రెండు సార్లు ఈ పాక్ వేసుకుంటే మొహం పై జిడ్డు, మరకలు, మొటిమలు, మచ్చలు అన్నీ పోతాయి. చర్మం నిజంగా చెక్కగా మెరిసిపోతుంది.

    ఇంత మంచి ఫేస్ పాక్ మరోటి లేదు

    చాలా ఖరీదైన సౌందర్య లేపనాలున్నాయి. ఇవి వాడండి తెల్లగా అయిపోతాయి, ఇలా రాసుకుంటే మొటిమలు, మచ్చలు మాయం అని అందమైన హీరోయిన్లు మ్యాజిక్ చేస్తుంటారు. మాఫలాని ఫేస్…

  • ఫ్యాషన్ ప్రపంచం దేన్నీ వదలదు. డ్రస్సులు, మేకప్, నగలు, ఈ ప్రపంచలో ప్రతి వస్తువు, మార్కెట్ చేయగలిగే ప్రతి అంశం ఫ్యాషన్ వరుసల్లోకి చేరిపోయింది. ఇప్పటి వరకు మే జోళ్ళ పైన ఫ్యాషన్ దృష్టి పడి వుండదు. నల్లవో, గ్రే కలర్వో, తెలుపువో కళ్ళకు కనిపిస్తూ వుంటాయి కదా. ఇప్పుడు వాటి పై కొత్త రంగులు, చెక్కని డిజైన్ల తో మెరుస్తున్నాయి. బూట్లకి ఈ మేజోళ్ళు నప్పుతాయా? ఆడవాళ్ళ డ్రెస్సులు, వాళ్ళ మోడల్ చెప్పులు ఈ ఫుల్ సాక్స్, యాంకిల్ సాక్స్ బావుంటాయా, అనే సందేహాలు వద్దే వద్దు. అక్షరాలు, నాము మొహాలు, ఆలివ్ గ్రీన్, ఆర్మీ డిజైన్లు, పువ్వులు, ఆకులూ, గీతలు, గళ్ళు, కలిపేసుకుని సరికొత్త స్టాక్ మార్కెట్ లోకి లాంచ్ అయింది. సాక్సేగా అనుకోవద్దు. ఒక వేళఇవే వేసుకున్నా డ్రేస్సుకు మ్యాచ్ అయ్యి పోయి, చీర కుచ్చుల్లకు తగులుతూ బావుంటే మాత్రం ఇక ఆడ పిల్లలకు యాంకిల్ సాక్స్ వాదలనే వదలరు. పిల్లలయితే ఈ పాటికి వీటికి ఓటేసే వుంటారు.

    ఫ్యాషన్ లోకి ఇవీ నడిచాయి

    ఫ్యాషన్ ప్రపంచం దేన్నీ వదలదు. డ్రస్సులు, మేకప్, నగలు, ఈ ప్రపంచలో ప్రతి వస్తువు, మార్కెట్ చేయగలిగే ప్రతి అంశం ఫ్యాషన్ వరుసల్లోకి చేరిపోయింది. ఇప్పటి వరకు…

  • ఫ్యూచర్ లో మనకు ఎలాంటి ఫెసిలిటీస్ రాబోతున్నాయో ఒక్కసారి చుస్తే ఎంత అద్భుతంగా, అబ్బా ఇప్పుడే వచ్చేస్తే బావుండు, హాయిగా శుభప్రదమైన జీవితం గడపొచ్చు అనిపిస్తుంది. ప్యూచరిస్టిక్ కిచెన్ కౌంటర్ ఓపెన్ చేయండి. ఇది ఇంటరాక్టివ్ వాయిస్ సిస్టం ద్వారా సూచనలు అందుకుంటూ వంట చేస్తుంది. కోరిన పదార్ధం ఇలా అడిగితె అలా చేసేస్తుంది. ఏదైనా స్పెషల్ తినాలని ఉందనుకోండి ఉదాహరణకు పిజ్జా తినాలంటే పిజ్జాహట్ కు పోవాల్సిందే. ఇంట్లో మనం కష్టపడి చేద్దామని, శుభ్రంగా ఉంటుందని పోషకాలు పోకుండా చూస్తామని ఎంత నచ్చ చెప్పినా పిల్లలు మొహం చిట్లించేసి అబ్బా.. రెస్టారెంట్ రుచి రాలేదు అనేస్తారు. కానీ ఈ ఫ్యుచరిస్టిక్ కిచెన్ కౌంటర్ వచ్చేస్తే. పిజ్జా తినాలనుకుంటే మాన్ ఫ్రిజ్ లో నుంచి అందుకు కావాల్సిన పదార్ధాలు మిగిలిన దినుసులతో ఖచ్చితమైన కొలతలతో బయటకు వస్తాయి. పది నిమిషాల్లో వేడి వేడి పిజ్జా ఘుమఘుమలాడుతూ బయటకు వస్తుంది. ఇలాంటి వింతలన్నీ మన వంటింట్లోకి వచ్చేందుకు ఎంతో కాలం పట్టదు.

    కోరుకుంటే కొలతలతో సహా వంట సిద్దం

    ఫ్యూచర్ లో మనకు ఎలాంటి ఫెసిలిటీస్ రాబోతున్నాయో ఒక్కసారి చుస్తే ఎంత అద్భుతంగా, అబ్బా ఇప్పుడే వచ్చేస్తే బావుండు, హాయిగా శుభప్రదమైన జీవితం గడపొచ్చు అనిపిస్తుంది. ప్యూచరిస్టిక్…

  • స్మార్ట్ గార్డెన్ గురించి చదవండి. కిచెన్ కౌంటర్ వెనకాలే వున్న ఇంటి పెరటిలో ఎల్ ఇ డి లైట్ల సాయంతో ఆ గార్డెన్ ఏర్పాటు చేసుకోవచ్చు. మనకు నచ్చిన పచ్చని అకుకురాల్ని పండించుకోవచ్చు. దీపాల వెలుతురులో కృత్రిమమైన మట్టిలో ఎప్పటికీ అరణి తడి తో ఆ మొక్కలు మొలిచి ఎరువులు అడక్కుండా పెరుగుతాయి. పురుగులు పట్టవు, ఆకులు వదలిపోవు. అంతా ఫ్రెష్. వంటింట్లోకి రావడం , పొయ్యి మీద తిరగ మాత పెడేయడం. ఊహలు ఇవన్నీ ఇలా వుంటే బావుండు అన్న కోరికలు. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయి. అడిగితె కూరలు పండుతాయి. కుండీ తనంతట తానే తెలుసుకుని చెట్లకు నీళ్ళదుగుతుంది. ఫోన్ లో యాడ్ తో ఈ మాయలన్ని జరుగుతాయి. వుంది లే మంచి కాలం ముందు ముందునా అని పాడుకోవాలి.

    వంటింట్లో కోరిన కూరలు పెరుగుతాయ్

    స్మార్ట్ గార్డెన్ గురించి చదవండి. కిచెన్ కౌంటర్ వెనకాలే వున్న ఇంటి పెరటిలో ఎల్ ఇ డి లైట్ల సాయంతో ఆ గార్డెన్ ఏర్పాటు చేసుకోవచ్చు. మనకు…

  • ఆడవాళ్ళ చేతుల్లో ఎదో ఓ అద్భుతం వుంది. వాళ్ళు దేన్నయినా ఒక మాజిక్ చేస్తారు. ఒక పాట పాడమానండి, చక్కగా వినసొంపుగా వుంటుంది, ఒక పోయిట్రీ రాయమనండి వాళ్ళ గుండె పరిచి చూపిస్తారు. దౌటా... ఇప్పుడు చూడండి. ఈ అమ్మాయి పేరు మార్టినా సెలరిన్. అమెరికన్ ఫైబర్ ఆర్టిస్ట్. ఆమె చేతిలో ఒక పూల వుండ పెట్టామానుకోండి. ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు నెట్ లో ఇమేజస్ చూడండి. ఒక నిరమలాకరం, సింధటిక్ దారాల్లోనుంచి నురగలు కక్కే సముద్రం, పచ్చని అడవి, ఇల్లు, వాకిలి, ముచ్చటైన చెట్లు, ఇలాంటివి సృష్టించి, ఊలు దరల ఆర్టుని అందమైన చెక్క ఫ్రేముల్లో బిగిస్తే ఇంక కళ్ళు తిప్పుకోవడం కష్టమే. పైగా త్రీడీ లో ఆమె అల్లిన వృక్షాలు ఆన్ లైన్ అందమైన చక్కని చెట్ల లాగే కనువిందు చేస్తాయి. మార్టినా సెలరిన్ సృష్టించిన త్రీడీ ఫైబర్ ఆర్ట్స్ కి మనసిచ్చేయండి.

    ఊలు దారాల్లో నిర్మలాకాశం

    ఆడవాళ్ళ చేతుల్లో ఎదో ఓ అద్భుతం వుంది. వాళ్ళు దేన్నయినా ఒక మాజిక్ చేస్తారు. ఒక పాట పాడమానండి, చక్కగా వినసొంపుగా వుంటుంది, ఒక పోయిట్రీ రాయమనండి…

  • వీచే గాలి లో బోలెడు రకాలున్నాయి. తుఫాన్ లా అదరగొట్టేస్తుంది. చలిగా వణికిస్తుంది. వేడిగా వడదెబ్బ తీస్తుంది. వసంత సమీరంలా హాయిగా ఉంచుతుంది. ఫ్యాషన్ లూ ఇలాంటివే. మొన్న మొన్నటి వరకు ఏ రాంప్ షో లో చూసినా టైట్ డ్రెస్సులు, తిగ్ట్ ఫిట్టింగ్ ల తో అమ్మాయిలు అష్ట కష్టాలు పది నడుస్తూ కనిపించే వాళ్ళు. ఇప్పిడు చూడండి ఏ షోలో అయినా ఒక్కటే పై నుంచి కింద వరకు వదులుగా వేళ్ళాడే డ్రేస్సులే. ఫ్యాషన్ ప్రపంచపు హాట్ టాపిక్ పేపర్ బ్యాగ్ స్కర్టులు, ప్యాంట్లు. నడుము దగ్గర నుంచి కిందకు లూజు గా నెల పైన జీరాడే స్కర్టులు కనిపిస్తాయి. వీటికి మ్యాచింగ్ గా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే టాప్ లు. ఈ పేపర్ బ్యాగ్ స్కర్టులు, ప్యాంట్లు అయితే ఫ్లాట్ గా చక్కగా కనిపిస్తాయి. కొంచం బొద్దుగా వున్న వాళ్ళకి చాలా అందంగా వుంటాయి. బొద్దుతనం కనబడకుండా లూజు కుచ్చుళ్ళ లంగా మాదిరిగా లెహంగా లాగానూ సాదా సిల్క్ తో కుట్టిన ఈ డ్రెస్సు ఈ సమ్మర్ ఫ్యాషన్.

    నయా ఫ్యాషన్ పేపర్ బ్యాగ్ డ్రెస్ లు

    వీచే గాలి లో బోలెడు రకాలున్నాయి. తుఫాన్ లా అదరగొట్టేస్తుంది. చలిగా వణికిస్తుంది. వేడిగా వడదెబ్బ తీస్తుంది. వసంత సమీరంలా హాయిగా ఉంచుతుంది. ఫ్యాషన్ లూ ఇలాంటివే.…

  • వెండీ, బంగారం తీగల జర్దోసి పనితం చాలా బావుంది. చక్కని సన్నని తీగల తో ఆకులు, పువ్వులు, మధ్యలు మెరిసే రాళ్ళూ, వజ్రాలు, ముత్యాల తో జర్దోసీ వర్క్ చీరలు ఏ కాలానికి లొంగని ఎవ్వర్ గ్రీన్ స్టయిల్ ఇక జర్దోని కలాక్రుతులకైతే లెక్కలేదు. ఒక డ్రాయింగ్ రూమ్ ఖరీదుగా కనబడాలి అంటే సోఫా కవర్లు, కుషాన్ కవర్లు చివరకు టెలిఫోన్ టేబుల్ మ్యాట్ కుడా జర్దోసీ పనితనం తో కనబడ్డాయి. సినిమా సెట్టింగ్స్ తో రాజమహళ్ళ అలంకరణ తో ఇదే కీలకం అయిందా! ఇప్పుడు చూడండి అమ్మాయిల మనస్సు లాకున్నాట్లే జర్దోసీ ఎంబ్రాయిడరీ పనితనం తో మిలమిలా మెరిసిపోయే పడరక్షకులు వచ్చాయి చూడండి. పాదాల అందానికి మెరుగులు దిద్దే ఈ అందమైన ఆర్టిస్టిక్ చెప్పులని తప్పకుండా నెట్ లో చూడండి. వెంటనే ఆర్డర్ ఇచ్చేంత అందంగా వున్నాయి.

    పదాలకు మెరుపులనగల కళ

    వెండీ, బంగారం తీగల జర్దోసి పనితం చాలా బావుంది. చక్కని సన్నని తీగల తో ఆకులు, పువ్వులు, మధ్యలు మెరిసే రాళ్ళూ, వజ్రాలు, ముత్యాల తో జర్దోసీ …

  • ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ రిబ్బన్ ఐ లైనర్ ఇమేజస్ ను పెడితే మూడు లక్షల మంది చూసారట. కోనల సోయగం అంత బావుంది. ఇవ్వాల్టి ఫ్యాషన్ స్టేట్ మెంట్. కొంత ప్రాక్టిస్ చేస్తే ఈ అలంకరణ చేయవచ్చు. ముందుగా ఐ లైనర్ తో రెప్పల వెంట్రుకల దగ్గర నల్లని చక్కని గీతలను కోనలు దాటి పోయేలా గీయాలి. గతంలో బి సరోజాదేవి వంటి హీరోయిన్, ఈ కళ్ళు దాటిన కాటుక రేఖాలు దిద్దుకుని వాళ్ళే మహానటి సావిత్రి వచ్చిన కళ్ళు చుస్తే రెప్పలు దాటి కోసుగా ఈ గీత, చక్కని కళ్ళ అనడంతో కనిపిస్తుంది. ఇప్పుడైతే ఆ గిసిన గీత చుట్టూ కలర్ లిక్విడ్ ఐలైనర్ తో వంకీలు ఎంతో బావుంటాయి. ఇవ్వాల్టికి ఫ్యాషన్ ట్రెండ్ ఇదే.

    కళ్ళ కోనలకు వంపుల సొంపులు

    ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ రిబ్బన్ ఐ లైనర్ ఇమేజస్ ను పెడితే మూడు లక్షల మంది చూసారట. కోనల సోయగం అంత బావుంది. ఇవ్వాల్టి ఫ్యాషన్…

  • గొప్ప అందం ఇస్తాయని, అంత అందమైన, సహజమైన పండ్ల రంగులన్నీ మొహం మీద కనబడతాయని అస్సలు ఉదయం లేవగానే గ్లాస్ జ్యుస్ తాగి, ప్లేట్ నిండా పండ్ల ముక్కలు తినేస్తే మంచి రంగును కొంటున్నారేమో పొరపాటు అంటున్నాయి అధ్యయనాలు. రాత్రి హాయిగా భోజనం చేసి నిద్ర పోయి పొట్ట తేలికగా అయిపోయి నిద్రలేచాక పండ్ల కంటే చిరు ధాన్యాల ఉపహరాలే మంచివి అంటున్నాయి రిపోర్టులు. పిండి పదార్దాలతో నిండి వున్న చిరు ధాన్యాలు తక్షణమే శక్తినిస్తాయి. ఆరోగ్య కరమైన బ్రేక్ ఫాస్ట్ లోకి చిరు ధాన్యాలు, ప్రోటిన్లు, పిచు పదార్ధాలు వుండాలి. అంటే చిరు ధాన్యాలతో తాయారు చేసిన బ్రేక్ ఫాస్ట్ తో పాటు పాలు, పండ్లు కలిపి తీసుకోవాలి. పరగడుపునే కేవలం పండ్లు తిని సారి పెట్టుకుంటే శరీరానికి కావాల్సిన పోషణ, శక్తి రెండు అందుతాయి. జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు వస్తాయి. ఉదయపు వేల శక్తి నిచ్చే ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి.

    వట్టి పండ్లతో కడుపు నింపితే కష్టం

    గొప్ప అందం ఇస్తాయని, అంత అందమైన, సహజమైన పండ్ల రంగులన్నీ మొహం మీద కనబడతాయని అస్సలు ఉదయం లేవగానే గ్లాస్ జ్యుస్ తాగి, ప్లేట్ నిండా పండ్ల…

  • నీహారికా, కొత్త సంవత్సరం తీర్మానాలుచేసుకున్నాను కానీ దానికి కట్టుబడి వుండటం చాలా కష్టం. అలా ఎవరైనా వుంటారా అన్నావు. నిజమే ప్రతి అరంభంలోనూ కొత్త నిర్ణయాలుతీసుకోవడం సాధారణంగా జరిగేదే. ఉదాహరణకు ఏడాది ముగిసేలోగా పది కిలోల బరువు తగ్గాలి అని తిర్మానించుకున్న మనకు దానికి తగ్గ కమిట్ మెంట్ వుండాలి. పెట్టుకునే లక్ష్యం వాస్తవానికి దగ్గరగా వుంటే ఫలితాలకి చిరుకుగలం. తీర్మానాలు సాధించగలమని ముందుగా మనస్సుకో నిర్ణయం వుండాలి. అలాగే వ్యక్తి గత డేడ్ లైన్స్ వుండాలి. వచ్చిన ఆలోచనను దృఢమైన ద్రుక్పడంలో అందుకోగలగాలి. ఇందుకోసం జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవచ్చు కూడా. ఈ మార్పులకు ముందుగా మన మనస్సు సిద్దమై వుంటే తర్వాత శరీరం కూడా కొన్ని విషయాలలో పట్టుదలకు తలవంచుతుంది. సానుకూలమైన స్పందనతో మిగతా పనులు సజావుగా జరుగుతాయి. ఒక్కోసారి అనుకొన్న పనులు పూర్తి కాక పోవచ్చు. సాధించలేకపోవచ్చు. వైఫల్యాలు రావచ్చు. వాటన్నింటికీ షార్ట్ టంపర్ తో సమాధానం చెప్పుకోకూడదు. తీర్మానాల వెనక అనుకూల దృక్పదం వుండాలి. అప్పుడే అనుకొన్నవి సాధ్యపడతాయి.

    ఫెయిల్యూర్స్ కూడా మంచి అనుభవాలే

    నీహారికా, కొత్త సంవత్సరం తీర్మానాలుచేసుకున్నాను కానీ దానికి కట్టుబడి వుండటం చాలా కష్టం. అలా ఎవరైనా వుంటారా అన్నావు. నిజమే ప్రతి అరంభంలోనూ కొత్త నిర్ణయాలుతీసుకోవడం సాధారణంగా…

  • కూరలకు చెక్కని రంగు ఇవ్వగలదీ, యంటి బయోటిక్ గా పని చేసేది, అన్ని అనారోగ్యాలను మాయం చేసేది, ముఖ్యంగా పూజల్లో అగ్ర స్థానం లో వున్నది. ఏమిటీ అంటే పసుపు. మూడు అక్షరాల పసుపులో వుండే కర్కుమిన్ అనే పదార్దంలో ఎన్నో ఔషదాల్లో కీలకం. క్యాలరీలు పుష్కలంగా వుండేది. పీచు కలిగి వుండేది, పసుపులో వుండే గుణాల తో పుస్తకం రాయొచ్చు. అన్నింటికంటే ముఖ్యం ఇది సౌందర్య రక్షణ లో పసుపు పాత్ర అంతా ఇంతా కాదు. ఇనుము, పోటాషియం, మాంగనీస్, విటమిన్స్ ఇందులో వున్నాయి. విటమిన్-ఇ కంటే 8 రెట్లు శక్తివంతమైనది. శరీరంలో వుండే అధిక కొవ్వును కరిగించే బైల్ రసం ఉత్పత్తిని మెరుగు పరిచే గుణం పసుపుకుంది. ఇది బరువుని నియంత్రించడం తో పాటు ఓబిసిటీ సంబందిత వ్యాధులను నియంత్రణలో ఉంచుతుంది. ప్రతి రోజు పసుపు టీ తాగడం వల్ల జీవిత కాలం పెరుగుటుంది. ప్రతి రోజు పసుపు టీ తాగడం వల్ల జీవిత కాలం పెరుగుతుంది.నాలుగు కప్పుల నీళ్ళల్లో టీ స్పూన్ పసుపు వేసి మరగనిచ్చితేనె తో కలిపి తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్ స్థాయిల్ని క్రమబద్దికరించి మధుమేహ వ్యాధి నివారణలో మందుల ప్రభావం అధికం చేస్తుంది. శరీరంలో వ్యాధి కారకాలను నాశనం చేస్తుంది. బెణుకు, వాపు సమస్యలు చిటికెడు పసుపు, సున్నం, ఉప్పు ల మిశ్రమం చిటికెలో మాయం చేస్తుంది.

    మేలైన సుగుణాలున్న పసుపు

    కూరలకు చెక్కని రంగు ఇవ్వగలదీ, యంటి బయోటిక్ గా పని చేసేది, అన్ని అనారోగ్యాలను మాయం చేసేది, ముఖ్యంగా పూజల్లో అగ్ర స్థానం లో వున్నది. ఏమిటీ…

  • పెరిగే వయస్సున్న చిన్న పిల్లల తల్లిదండ్రులు ఈ అధ్యయనాన్ని శ్రద్ధగా చదువుకోవాలి. రిపోర్టు ఇలా వుంది. పిల్లల ప్రవర్తనకు సంబందించిన చర్చలు, ఆరోగ్యవంతమైన నిబందనలు పెట్టే వారికి, ఏ మాత్రం చరచాలకు ఆస్కారం ఇవ్వకుండా. కఠినమైన నిబందనలు పెట్టేవారికి ఈ నిభందనల విశ్లేషనల్ని విస్తృత స్థాయిలో నిర్వహించినప్పుడు, ఎక్కువ ఆంక్షలకుగురయ్యే పిల్లలు అధిక బరువు తో ఉన్నాట్లు గుర్తించారు. బాగా కఠినంగా వుంటూ పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టాలని తల్లిదండ్రులు సంతృప్తిగా వుంటారు. అయితే ఈ కఠిన నియంత్రణకు లోనైన పిల్లలు విపరీతమైన వత్తిడికి గురై బరువు పెరిగిపోతారట. పిల్లల బరువు వాళ్ళు తినే పదార్ధాలు. ప్రభావితం చేస్తాయి అనడంలో సందేహం లేదు. పెంపకం తీరు,వాళ్ళ గురించి నిరంతరం చేసే చర్చలు, తీర్మానాలు, వాళ్ళు పిల్లలను శాశించే తీరుఇవి పిల్లల పైన ప్రభావం చూపెడతాయి. ఈ టెన్షన్ కు పెద్దవాళ్ళ లాగే ఎదో ఒక్కటి తియ్యనిది తినేస్తుంటారు. మనస్సు మరల్చుకునేందుకు తల్లిదండ్రుల నియమాల బాధ తప్పించుకోలేక పిల్లలు తిండిని ఆశ్రయిస్తారు. ఇలాంటి స్థితిని పిల్లలకు కల్పించ వద్దని పిల్లల పెంపకంలో పరిమితులు ఆంక్షలు నడుమ సరైన సమతుల్యం వుండాలని రిపోర్టు చెపుతుంది.

    బరువు పెంచుతున్న ఆంక్షలు

    పెరిగే వయస్సున్న చిన్న పిల్లల తల్లిదండ్రులు ఈ అధ్యయనాన్ని శ్రద్ధగా చదువుకోవాలి. రిపోర్టు ఇలా వుంది. పిల్లల ప్రవర్తనకు సంబందించిన చర్చలు, ఆరోగ్యవంతమైన నిబందనలు పెట్టే వారికి,…

  • పిల్లల విషయంలో స్లీప్ హైజీన్ అంటే ఆరోగ్యవంతమైన నిద్ర అలవాటు అంటే తగినంతగా, నాణ్యమైన నిద్ర పోయేలా సరైన చర్యలు తిసుకోమంటున్నారు. చిల్డ్రన్స్ స్పెషలిస్టులు. పిల్లల విషయంలో పడుకునే సమయం, స్లీప్ రోటీన్ సౌకర్యంగా నిర్ణీత పద్దతిప్రకారం వుండాలి. పడుకునే వెలలు, నిద్ర లేచే సమయాలు నిర్ణీత క్రమంలో సాగాలి. వారాంతాల్లో సైతం ఈ రోటీన్ కు ఇబ్బంది కలుగ కూడదు. నిద్రించే వేళల్లో ఓ గంట కూడా మార్పు లేనట్లు వుండాలి. పడుకునే ముందు ఆటలు, టెలివిషన్ చూడటం, కంప్యుటర్ గేమ్స్ అడనివ్వకూడదు. ఆకలితో నిద్ర పొమ్మనడం లేదా పడుకునే ముందు అతిగా ఆహారం పెట్టడం రెండు తప్పే. కాఫీ, టీలు, పానీయాలు చాక్లెట్స్ అస్సలు ఇవ్వకూడదు. క్రమం తప్పకుండా అవుట్ డోర్ ఆటలకు ప్రోత్సహించాలి. పిల్లల పడక గది చాలా ప్రశాంతంగా వుండాలి. బాల్యంలో నిద్ర లేమికి గల కారణాలు వైద్యులను సంప్రదించి తెలుసుకోవాలి. అప్పుడే సమస్య పరిష్కారం అవుతుంది.

    కళ్ళ పైకి నిద్ర వచ్చి వాలాలి అంటే!

    పిల్లల విషయంలో స్లీప్ హైజీన్ అంటే ఆరోగ్యవంతమైన నిద్ర అలవాటు అంటే తగినంతగా, నాణ్యమైన నిద్ర పోయేలా సరైన చర్యలు తిసుకోమంటున్నారు. చిల్డ్రన్స్ స్పెషలిస్టులు. పిల్లల విషయంలో…

  • వస్త్ర ధారణ విషయంలో ఎన్నెన్నో ఫ్యాషన్స్ వైపు దృష్టి పెట్టే చాలా మంచి మహిళలు సరైన లో దుస్తుల గురించి పట్టించుకోరు. మంచి లో దుస్తుల సెట్ తో సరైన పెర్స్ నాలిటీ కనిపిస్తుంది. అధిక బరువు కానీ సరైన ఆకృతిగానీ లేనట్లు అయితే సమస్య గల శారీరక ప్రదేశాల పై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఏభాగాల పట్ల ఎటెక్షన్ చుపాలన్నదీ ఇక్కడి ప్రధాన అంశం. మహిళల వార్డ్ రోబ్ లో షేప్ వేర్ అనేది అత్యవసర భాగం. ఏ రూపానికైనా ఇది పునాది వంటిది. షేప్ వేర్ శరీరానికి సరైన ఆకృతి ఇస్తుంది. తమ శరీరాకృతిని తమ కంట్రోల్ లో వుంచుకోవాలనుకుంటే మహిళలకు షేప్ వేర్ చాలా కరక్ట్ అయిన సమాధానమని డిజైనర్లు చెపుతారు. షేప్ వేర్ లో వుండే ఎలాస్టిక్ గుణం సమస్య గల ప్రదేశాన్ని అదుపు చేసి స్లిమ్మర్, సిల్వేట్టేలను దరించటానికి మార్గాన్ని సుగమం చేస్తంది. పోశ్చర్ ను సారి చేస్తుంది. నిలబడ్డ, కూర్చున్న, నడుస్తున్న పోశ్చర్ లో మెరుగుదల కనబడటం వల్ల నాజూకుగా కనబడుతారు. వెన్ను పైన అలసట లేకుండా ఎక్కువ సేపు కూర్చునే వారికి షేప్ వేర్లు సహకరిస్తాయి.

    వీటి గురించి శ్రద్ధ తీసుకోండి

    వస్త్ర ధారణ విషయంలో ఎన్నెన్నో ఫ్యాషన్స్ వైపు దృష్టి పెట్టే చాలా  మంచి మహిళలు సరైన లో దుస్తుల గురించి పట్టించుకోరు. మంచి లో దుస్తుల సెట్…

  • శిరోజాల పరిరక్షణ విషయంలో శ్రద్ధగా ఉంటేనే జుట్టు రాలి పోకుండా పొడిబారకుండా వుంటుంది. ప్రతి రోజు సిరోజాలను కడగటం, మృదువుగా వుంటుందని అతిగా కండీషనర్ అప్లయ్ చెయడం చూస్తుంటారు. తరచూ హెయిర్ చాలా అవసరం లేదు. కుదుళ్ళ వద్ద వుండే కొత్త జుట్టు ఆరోగ్యంగా వుంటుంది కనుక కండీషనర్ వెంట్రుకల టిప్స్ పైనే లక్ష్యం చేసుకోవాలి. హెయిర్ డ్రయ్యర్, స్రెయిట్ నర్లు ఉపయోగిస్తున్నప్పుడు సరైన జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువగా బ్లో డ్రై చేయకూడదు. హెయిర్ డ్రయ్యర్ వాడేటప్పుడు 8 నుంచి 12 అంగుళాలు జుట్టుకు దూరంగా పట్టుకోవాలి. శిరోజాలను వీవ్ఇన్ కండీషనర్ తో లేదా దూరంగా పెట్టుకోవాలి. అలోవీరాజెల్, గుడ్డు సోన, తేనె వాడుతూ హెయిర్ మాస్క్ అప్లై చేయాలి. ప్రోటీన్లు అధికంగా తీసుకోవాలి. జుట్టు ఒక వేళ తెల్లబాడుతుంటే శరీరం మరే కొద్ది తెల్లబడుతుండేతప్పుడు బాహ్య కారణాలు అంతగా ప్రభావితం చేయవని గుర్తుంచుకోవాలి. మానసిక వత్తిడి, జీన్స్ కుడా జుట్టు రంగు మారడంలో కీలక పాత్ర వహిస్తాయి. తెల్లజుట్టు కొట్టోచ్చినట్టు కనిపించ కుండా మృదువైన రూపంలో ఉండేందుకు ఎటువంటి జాగ్రత్తలు అవసరమో తెలుసుకోవాలి.

    ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి

    శిరోజాల పరిరక్షణ విషయంలో శ్రద్ధగా ఉంటేనే జుట్టు రాలి పోకుండా పొడిబారకుండా వుంటుంది. ప్రతి రోజు సిరోజాలను కడగటం, మృదువుగా వుంటుందని అతిగా కండీషనర్ అప్లయ్ చెయడం…