• రోజుకు 70 గ్రాముల పూర్తి స్థాయి ధాన్యాలు తినేవాళ్ళలో ఇరవై రెండు శాతం మరణం రేటు తక్కువగా వుందని అధ్యాయినాలు పేర్కొంటున్నాయి. ఆహారం వీలైనంతగా హోల్ గ్రైన్స్ వుంటే బరువుపైన అదుపు వుంటుంది. ముఖ్యంగా వీట్ జర్మ్, బ్రౌన్ రైస్, డార్క్ బ్రెడ్, పాప్ కార్న్ ఇతర ధాన్యాలు తినే మహిళల్లో తినని వాళ్ళతో పోలిస్తే బరువు పెరిగ్ర్ రిస్క్ సగం తక్కువే పూర్తి స్థాయి ధాన్యాలు 16 గ్రాముల చొప్పున ఒక సర్వింగ్ అనుకోవాలి. వీటిలో వుండే బహుళ బయో యాక్టివ్ కారకాలు ఈ ఆరోగ్య ప్రయోజనాలు అందజేస్తాయని హయ్యాద్ విశ్వవిద్యాలయ పరిశోదన సారంశం. ఇవి అనేక పోషకాలను అంటే పీచు ధయోమిన్లకు ఐరన్ మెగ్నీషియం, సెలానియం వంటి ఖనిజాలకు నెలవు వంటివి. కొన్ని ధాన్యాలతో చక్కరలు, సాల్ట్ వున్నప్పటికీ ఇవి ఆరోగ్యానికి హాని చేయవు. పూర్తి గోధుమలతో తయారైన పాస్తా లేదా బ్రౌన్ బ్రెడ్ తిన్నామంచిదే.

    పూర్తి స్థాయి ధన్యాల్ని ఎంచుకోవడం బెస్ట్

    రోజుకు 70 గ్రాముల పూర్తి స్థాయి ధాన్యాలు తినేవాళ్ళలో ఇరవై రెండు శాతం మరణం రేటు తక్కువగా వుందని అధ్యాయినాలు పేర్కొంటున్నాయి. ఆహారం వీలైనంతగా హోల్ గ్రైన్స్…

  • ఈ వేసవిలో చమట అందరి సమస్యే. చర్మం పై వుండే బాక్టీరియా చమటని యాసిడ్ గా మారుస్తుంది. దాని వల్లనే దుర్వాసన వస్తుంది. ఈ చమట నుంచి తప్పించుకోవాలంటే తీరిగ్గా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి. యాంటీ బాక్టిరియల్ గుణాలున్నా సోపు వాడాలి. వేడి నీళ్ళు బాక్టిరియా చంపేస్తాయి. స్నానం అయ్యాక శరీరం పూర్తిగా తడి ఆరేలా తడుచుకుని వదులుగా వుండే నూలు దుస్తులే వేసుకోవాలి. మసాలాలు, ఉప్పు, కారం, ఉల్లి, వెల్లుల్లి కాస్త తగ్గిస్తేనే మంచిది. మెగ్నీషియం ఎక్కువ వుండే ఆకుకూరలు, బ్రోకోలీ, బంగాళదుంప, నట్స్, తృణధాన్యాలుతీసుకుంటు, నీళ్ళు ఎక్కువ తాగాలి. వంటసోదలో నిమ్మరసం కలిపి శరీరానికి పూనుకుని పదినిమిషాల్లో కడిగేసుకోవాలి. రాత్రి పూట యాపిల్ సైడర్ వెనిగర్ రాసుకోవచ్చు. స్నానానికి ముందు పసుపు చందనం పూత కూడా మంచిదే. వీలున్నప్పుడు, రిలాక్స్ అయ్యేందుకు మంచి గంధపు పొడి మెడకు చేతులకు రాసుకున్న ఈ చమట వాసన నుంచి తప్పించుకోవచ్చు.

    ఈ సున్నితమైన సమస్యకు పరిష్కారం

    ఈ వేసవిలో చమట అందరి సమస్యే. చర్మం పై వుండే బాక్టీరియా చమటని యాసిడ్ గా మారుస్తుంది. దాని వల్లనే దుర్వాసన వస్తుంది. ఈ చమట నుంచి…

  • ఎండలోని వెళితే చాలు మాడి పోతుంది. ఎంత కళ్ళజోళ్ళు వాడినా ఏం చేసినా సెగలు పొగలకి చర్మం నల్లబడుతుంది. అందుకే సన్ స్క్రీన్ ని తప్పని సరిగా చర్మనికి రాసుకోవాలి. ఈ సీజన్ లో యాపిల్ సైడర్ వెనీగర్ ని వాడాలి. ఇది కమిలిన చర్మం వేడిని లగేస్తుంది. కళ్ళకు వేడి తగలకుండా గొడుగు పట్టుకు పోయినా నామోషీ ఫీల్ అవ్వోద్దు. వాటర్ బేస్డ్ స్కిన్ ప్రోడేక్ట్స్ మాత్రమే సమ్మర్ లో వాడాలి. S.P.F రక్షణ వున్న మాయిశ్చురైజలను వాడాలి. జిడ్డు చర్మం కనుక అయితే తేలిక పాటి మేకప్ వేసుకోవాలి. కీరా ముక్కలు, పెరుగు, మజ్జిగ వంటివి తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా వుంటుంది. చర్మం బావుండేందుకు ఇంట్లో నేచురల్ బ్లీచ్ తయారు చేసుకోవచ్చు. కొద్దిగా పెరుగు, సెనగపిండి, అందులో నిమ్మకాయ పిండి ఆ పేస్టుని మెడ, మొహం పైన రాసుకుని కొద్ది సేపు ఆరనిచ్చి కడిగేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం శుభ్రంగా వుండటమే కాకా, దుమ్ము ధూళి మురికి లేకుండా చర్మం కాంతి వంతంగా వుంటుంది.

    నేచురల్ బ్లీచ్ అంటే ఇవే

    ఎండలోని వెళితే చాలు మాడి పోతుంది. ఎంత కళ్ళజోళ్ళు వాడినా ఏం చేసినా సెగలు పొగలకి చర్మం నల్లబడుతుంది. అందుకే సన్ స్క్రీన్ ని తప్పని సరిగా…

  • వేసవి వెళ్ళేదాకా ఇవే ఫ్యాషన్

    సమ్మర్ కాటన్స్ అంటాం. సమ్మర్ లో నూలు దుస్తులకు వున్న డిమాండ్, సప్లయ్, మన ఇష్టం అన్నీ కలిసి కాటన్స్ ని ముందు వరుసలో కుర్చోనిస్తాయి. మిగతా…

  • రెండూ అద్భుతమైన కళలే

    నీహారికా, మాట్లాడటమా? వినడమా? ఏది మంచి కళ అన్నావు. మాట్లాడటం సందేహం లేకుండా మంచిదే. కానీ వినడం కూడా మంచిదే తెలుసా ఎక్స్ పర్ట్స్ అంటారు, మనం…

  • అదితీలాల్ హైదరీ పేరు విని ఉత్తరాది అమ్మాయి అనుకుంటారేమో గానీ, అదితి హైదరాబాద్ అమ్మాయి. ఇవ్వక విడుదలైన చెలియా సినిమాలో నటించింది. మొహమ్మద్ సాలె అక్బర్ హైదరీ కుటుంబంలో జన్మించింది. మలయాళ చిత్రం ప్రజాపతి తో సినీ అరంగ్రేట్రం చేసింది. బాలీవుడ్ లో ఏ సాలెజిందగీతో గుర్తింపు వచ్చింది అతిదికి అటు నుంచి వరుసగా హిందీ సినిమాలు చేస్తూ దక్షినాదిలో మణిరత్నం దర్శకత్వంలో చెలియా తో వస్తుంది. సంజయ్ లీలా భస్తారీలో పద్మావతి వృత్తి రిత్యా సంతృప్తిని ఇబ్బంది అంటుంది అతిధి. స్కూల్ లో వున్నప్పట్టి నుంచి ఈమెను మనీషా కొయిరాలా మాదిరిగా ఉందనే వాళ్ళట. సినిమాల్లోకి వచ్చాక నిజాయితిగా ఏ అవసరం వస్తే అంది పుచ్చుకున్నాను. ఇంకా బ్రేక్ రావాల్సి వుంది. ఇక్కడంతా ప్రతిభ తోనే ఏదైనా రావాలనుకుంటున్నాను. ఇక్కడ మెంటార్లు, మేనేజర్లు ప్రోమోట్ చేస్తారు. కానీ చివరికి మాత్రం మెరిట్ ఒక్కటే తోడుగా వుంటుంది. చెలియా సినిమా అలా తనకు ఎంతో పేరు తెచ్చే బ్రేక్ ఇస్తుందని, మణిరత్నం గారితో పని చేయాలనుకున్నా నా కల కూడా నిజమయింది అంటోంది అతిది.

    'చెలియా' తో నా కల నిజమైంది

    https://scamquestra.com/25-yuridicheskaya-chast-afery-questra-world-i-atlantic-global-asset-management-questraworldes-i-atlanticgames-7.html

  • సినిమాల విషయంలో ఇప్పుడు హీరో హీరోయిన్లు కూడా చాలా పరిశోధన చేస్తున్నారు. ప్రతి సినిమా స్క్రిప్ట్ వెనుక ఎంతో చారిత్రక నేపధ్యం ఉంటూనే వుంది. బాజీరావు మస్తానీలో, మస్తానీ గా ప్రేక్షకులను అలరించిన దీపికా పడుకొనే పద్మావతి చిత్రం కోసం చాలా కష్టపడిందిట. ఎప్పుడు చూసినా పద్మావతి చరిత్రకు సంబందించిన పుస్తకాలతోనే కనిపిస్తుందిట. ఈ చరిత్రలో తన పాత్ర కోసం రాజస్థాన్ లోని బిత్తుర్ ఘడ్ ప్రాంతానికి వెళ్లి ఆ పరిసరాలను చుసిందిట దీపికా. చిత్ర బృందం తో సంబందం లేకుండా తనోక్కర్తే ప్రశాంతంగా ఆ ప్రాంతం చూసి పద్మావతి పాత్రని గురించి ఎంతో సమాచారం సేకరించిందిట. బిత్తుర్ ఘడ్ లో సినిమా చిత్రీకరణ చేసిన సందరభాగా మాట్లాడుతూ దీపికా ఇదొక మాయ వంటి అనుభవం. పద్మావతిని నామనసు నిండా ఈ ప్రాంతంలో ఊహించుకొంటూ, పద్మావతి పాత్రలో నటిస్తూ వుండటం నాకు మరపు రాని అనుభవం అని చెపుతుంది దీపిక. నిజమె సినిమా సక్సెస్ అవ్వాలంటే వట్టి స్క్రిప్ట్, లోకేషన్స, అందమైన చిత్రీకరణకు రోజులు చెల్లాయి. సినిమా సక్సెస్ అవ్వాలంటే ప్రేక్షకులు ఆ సినిమాలో లీనం అయ్యేంత నిజాయితీనో, చక్కని ఉహగానీ కావాలి.

    పద్మావతి కోసం రహస్యంగా వెళ్ళొచ్చా

    సినిమాల విషయంలో ఇప్పుడు హీరో హీరోయిన్లు కూడా చాలా పరిశోధన చేస్తున్నారు. ప్రతి సినిమా స్క్రిప్ట్ వెనుక ఎంతో చారిత్రక నేపధ్యం ఉంటూనే వుంది. బాజీరావు మస్తానీలో,…

  • తెలిసో తెలియకో చాల అపార్ధాలు చేస్తాం. ముఖ్యంగా స్త్రీల విషయంలో చాలా నిర్లక్ష్యాలు జరుగుతాయి. జాతీయ మానసిక ఆరోగ్య అధ్యాయినం ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టం చేసాయి. మగవారిలో కంటే ఆడవాళ్ళలో కుంగుబాటు లక్షణాలు ఎక్కువని అధ్యాయినం చెపుతుంది. పిల్లలు పుట్టిన వెంటనే తల్లుల్లో ఏర్పడే ప్రసవానంతర కుంగుబాటు, పోస్ట్ పార్టిమ్ డిప్రషెన్ ఎక్కువగా వున్న ఇళ్ళల్లో దాని పై ద్రుష్టి సాదించారంటున్నారు. మాతృత్వం, దైవత్వంతో సమానం అంటారు కానీ బిడ్డ పై చూపించిన శ్రద్ధ తల్లిపై చూపించ మంటున్నారు. తల్లి దనమంటే ఎంతో గొప్పదని ఆడపిల్లలకునూరి పోయడం తో వాళ్ళు కూడా ప్రసవానంతరం వచ్చే ప్రతి ఇబ్బందిని భర్తీ చేస్తారని తమ ఆరోగ్యం పరోపకారంగా క్షీణిస్తోందని గ్రహించరని, చికిత్స గురించి ఆలోచించారు కనుక సమస్య ఎక్కువైపోతోందంటున్నాయి అధ్యాయినాలు. కుటుంబ సభ్యులు, వైద్యులు కూడా ఈ సమస్య పై ద్రుష్టిసారించాలని అద్యాయినాలు హెచ్చరిస్తున్నాయి.

    తల్లి ఆరోగ్యం నిర్లక్ష్యం చేస్తున్నాం

    తెలిసో తెలియకో చాల అపార్ధాలు చేస్తాం. ముఖ్యంగా స్త్రీల విషయంలో చాలా నిర్లక్ష్యాలు జరుగుతాయి. జాతీయ మానసిక ఆరోగ్య అధ్యాయినం ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టం చేసాయి.…

  • ఎన్నో డిజైనర్ డ్రెస్సులకు లేస్ ఏటాచ్ చేస్తుంటారు. డ్రెస్ పని అయిపోయినా లేస్ చేక్కుచెదరకుండా వుంటుంది. దాన్ని అలా పారేయకుండా. ఇంటి అలంకరణ కోసం ఉపయోగించింది అని చేఅపుతున్నారు. ఇంటీరియర్ డెకరేటర్లు. పాత కుండీలకు చెక్కగా రంగులు వేసి వాటి చుట్టూ జిగురుతో ఈ లేస్ అంటించి మద్య మధ్యలో కుందన్ రాళ్ళు అతికించి అందులో ఆర్టిఫిషియల్ డెకొరేషన్ కోసం పెట్టే పువ్వులు, ఆకులూ పెట్టొచ్చు. దీన్ని కదలకుండా హాల్లో ఉంచుతాం కాబట్టి ఈ కుండీ మురికిగా అయ్యే ప్రమాదం లేదు. అచ్చం నిజమైన పువ్వుల్లా వుండే చైనా మేడ్ ఫ్లవర్స్ కు మార్కెట్ లో కొదవ లేదు అలాగే డిజైనర్ కొవ్వొత్తుల స్టాండ్ తాయారు చేయొచ్చు. పాతవైపోయిన డ్రేస్సుల నుంచి సేకరించిన లేస్ లు, అంచులు, గాజు పాత్రని చక్కగా అలంకరించి అందులో కొన్యుత్తులని పెట్టి టేబుల్ పైన పెట్టుకోవచ్చు. కొన్ని పనులు మొదలు పెడితే ఇంకా ఇలాంటి మిగిలి పోయిన అంచులు, లేసులు, రంగురాళ్ళు కుందనాలతో ఎలాంటివి అలంకరించ వచ్చో తెలుస్తుంది.

    ఏదీ నిరుపయోగం కాదు

    ఎన్నో డిజైనర్ డ్రెస్సులకు లేస్ ఏటాచ్ చేస్తుంటారు. డ్రెస్ పని అయిపోయినా లేస్ చేక్కుచెదరకుండా వుంటుంది. దాన్ని అలా పారేయకుండా. ఇంటి అలంకరణ కోసం ఉపయోగించింది అని…

  • బ్యాగ్ బావుంది కదా అని కోనేస్తాం. తిరిగి ఇంటికి తెచ్చాక అది ఆఫీసుకు పోయేందుకు తక్కువ, ఏ సినిమాకు పట్టుకెళ్ళెందుకు ఎక్కువగా అయిపోతుంది. అందమైన బ్యాగ్ కాస్తా మూలన పడేయడం జరుగుతుంది. అందుకే బ్యాగ్ కొనే ముందే అది ఏ సందర్భంలో వాడబోతున్నామో ద్రుష్టిలో పెట్టుకోవాలి. ఖరీదు ఎక్కువైన నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆఫిస్ కు తీసుకెళ్ళె బ్యాగ్ లో టిఫెన్ డబ్బాలు, కాలేజీ బ్యాగ్ లో పుస్తకాలు ఎన్నో తీసుకోవాలి. అదే పార్టీలకయితే చిన్నది కావాలి. బ్యాగ్ కొనేటప్పుడు దాన్ని క్లీన్ చేసే విషయం తెలుసుకోవాలి. వాటికోసం ప్రత్యేకంగా ద్రవ రూప క్లీనర్లు అందుబాటులో వున్నాయి. లెదర్ హ్యాండ్ బ్యాగ్స్ పొడిబారుతున్నప్పుడు తప్పనిసరిగా తేమ అందేలా చూడాలి. లేకపొతే రంగు షేడ్ మారిపోతాయి. తెల్లని మరకలు కనపడతాయి. బ్యాగ్ వాడినప్పుడు ఆలమారలో విసిరేయకుండా మెత్తటి వస్త్రంలో చుట్టి పెట్టాలి.

    పనికొస్తుందో, రాదో ముందే చూడండి

    బ్యాగ్ బావుంది కదా అని కోనేస్తాం. తిరిగి ఇంటికి తెచ్చాక అది ఆఫీసుకు పోయేందుకు తక్కువ, ఏ సినిమాకు పట్టుకెళ్ళెందుకు ఎక్కువగా అయిపోతుంది. అందమైన బ్యాగ్ కాస్తా…

  • ఈ ప్రపంచం అంతా మేల్ డామినేషన్ తోనే నడుస్తుంది. ఇందుకు తెలుగు సినిమా మినహయింపు ఏమీ కాదు. సినిమా లన్ని మేల్ సెంట్రిక్ మీదే నడుస్తాయని, కధానాయిక ప్రాధాన్యం వున్న సినిమాలు ఇక్కడ రావని చాలా మంది అనడం, ఇది వున్న మాటే అంటోంది కధానాయిక రాకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల ఐఫా ఉత్సవంలో గ్రీన్ కార్పెట్ పైన నల్ల గౌనుతో క్యాట్ వాక్ చేసి ఈ అమ్మాయి, సినిమా రంగమనే ప్రపంచంలో ఏ రంగం తీసుకున్న నూటికి నూరు శాతం పురుషాధిక్యతే సినిమా అన్నది ఎంటర్ టైన్మెంట్ కాబట్టి, జనం ఫోకస్ అంతా సినిమాల పైన హీరో పాత్రల పైన వుంటుంది. కధానాయిక ప్రాధాన్యత తక్కువే. కానీ హీరోయిన్ ఓరియెంటెడ్ కధలోస్తే నాలాంటి వాళ్ళం ఎంతో మంది సిద్ధంగా వున్నాం. ఎప్పటికైనా ఈ విధానం మారుతుందని అనుకుంటున్నా. అలంటి రోజులొస్తే బావుండు అంటోంది రాకుల్.

    డామినేషన్ హీరోలదే

    ఈ ప్రపంచం అంతా మేల్ డామినేషన్ తోనే నడుస్తుంది. ఇందుకు తెలుగు సినిమా మినహయింపు ఏమీ కాదు. సినిమా లన్ని మేల్ సెంట్రిక్ మీదే నడుస్తాయని, కధానాయిక…

  • తాటి గెలల నుంచి వూరే రసాన్ని నీరా అంటారు. మంచి వాసన రంగుతో తియ్యగా వుంటుంది. పులిస్తే కల్లు అంటారు. ఈ నీరా మంచి తాటి బెల్లం తయారు చేస్తారు. ఈ బెల్లంలో తేమ 8.61 శాతం, సుక్రోజు 7686, రెడ్యుసింగ్ చక్కర 1.66, కొవ్వు 0.19, మంసాకృతులు 1.04, కాల్షియం 0.86, ఖనిజాలవనాలు, ఇనుము వంటి పోషక విలువలుంటాయి. స్త్రీల లో, పిల్లల్లో రక్తహీనత తగ్గిస్తుంది. శరీరానికి చల్లదనం ఇస్తుంది. తక్కువ పొటాషియం, ఎక్కువ చక్కర ఉంటాయి. ఔషధాల తయారీ లో వాడుతారు. పటిక బెల్లం, పంచదార మాములు బెల్లం బదులుగా ఈ తాటిబెల్లం చాక్లెట్ల నుంచి వివిధ తీపి పదార్ధాల తయ్యారీలో వాడుకోవచ్చు. పంచదారకు బదులు ఈ తాటి బెల్లం పొడిని వాడుకోవచ్చు.

    ఇదెంతో ఆరోగ్యం, ఉపయోగం

    తాటి గెలల నుంచి వూరే రసాన్ని నీరా అంటారు. మంచి వాసన రంగుతో తియ్యగా వుంటుంది. పులిస్తే కల్లు అంటారు. ఈ నీరా మంచి తాటి బెల్లం…

  • మొసమత్ జాస్మిన్, బంగ్లాదేశ్ కు చెందిన ఏకైక మహిళా రిక్షా పుల్లర్. మొసమత్ ఆక్సర్ ఫాతిమా, వయస్సు 45. ఐదేళ్ళుగా రిక్షాలాగుతుంది. భర్త వదిలేసి పొతే కుటుంబాన్ని గాలికి వదిలేసాయి లేక జీవనాధారం కోసం ఎంచుకున్న వృత్తి ఇది. ముగ్గుకు పిల్లలు సంప్రాదాయాలకు మరుపేరుగా వున్న బంగ్లాదేశ్ లో ఒక ఆడమనిషి రిక్షా లాగడం మాములు విషయం కాదు. అల్లా రెండు చేతులు, కళ్ళు ఇచ్చింది పని చేసుకుని బ్రతికేందుకే నా బిడ్డలను చదివించుకోవాలి. నేనెంచుకున్న మార్గంలో నడుస్తున్నా. అందరకీ మాటలు పట్టించుకొంటె నాకు గడిచేదెట్లా అంటారామె. మనమైనా ఏమంటాం. ఎలాగోలా పిల్లన్ని పోషించుకుని సంతోషంగా వుండు అంటాం.

    తోలి రిక్షా పుల్లర్ జాస్మిన్

    మొసమత్ జాస్మిన్, బంగ్లాదేశ్ కు చెందిన ఏకైక మహిళా రిక్షా పుల్లర్. మొసమత్ ఆక్సర్ ఫాతిమా, వయస్సు 45. ఐదేళ్ళుగా రిక్షాలాగుతుంది. భర్త వదిలేసి పొతే కుటుంబాన్ని…

  • ప్రతికా యాశ్ని: దేశ వ్యాప్తంగా ఈ పేరొక సంచలనం. కారణం దేశంలోనే తోలి ట్రాన్స్ జెండర్ ఎస్.ఐ ఆమె హిజ్రాలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వెనకడుతున్న విషయంపై న్యాయపోరాటానికి దిగి తన తో పాటు మరో 21 మంది హిజ్రాలకు పోలీస్ జాబ్స్ వచ్చేలా చేసింది. ఈ వారంలో శిక్షణ పూర్తి చేసుకొన్న ప్రీతికా త్వరలోనే ఎస్.ఐ గా బాధ్యతలు స్వీకరించనున్నది. తమిళనాడుకు చెందిన ప్రీతికా అబ్బాయిగా పుట్టి లింగ మార్పిడితో ఆడపిల్లగా మారింది. కంప్యుటర్ అప్లికేషన్స్ గ్రాడ్యుయేట్ అయిన ప్రీతికా ఎడతెరగని పోరాటం చేసి మరీ తనకు ఇష్టమైన పోలాన్ ఉద్యోగం సంపాదించింది. ఇక తన లక్ష్యం ఐ.పి.ఎస్ అధికారి కావడమేనని చెపుతుంది.

    ఎ.పి.ఎస్. నాలక్ష్యం

    ప్రతికా యాశ్ని: దేశ వ్యాప్తంగా ఈ పేరొక సంచలనం. కారణం దేశంలోనే తోలి ట్రాన్స్ జెండర్ ఎస్.ఐ ఆమె హిజ్రాలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వెనకడుతున్న విషయంపై న్యాయపోరాటానికి…

  • నీహారికా, కొంచెం బద్ధకంతో ఇవ్వాల ఈ పని పోస్ట్ పోన్ చేసానన్నమాట నీ నోటి వెంట తరచూ వినబడుతుంది. నీకు తెలుసా ఎన్ని మంచి లక్ష్యాలున్నా విజయం సాధించాలి అని ఎంత బలమైన కోరిక వున్నా వాయిదా వేసే తత్వం వుంటే చాలు అవన్నీ నిష్ప్రయోజనం అవుతాయి. ఎప్పటి పని అప్పుడు పూర్తి చేస్తేనే ప్రయోజనం వుంటుంది. అలా కాకుండా చేద్దాంలే, చూద్దాంలే అని వాయిదా తత్వం వల్ల ఎలాంటి మంచి పని ఉపయోగ పాడేది, అవసరమైన పని అయినా సరే చివరి క్షణంలో హడావిడిగా ముగించేయవలసి వస్తుంది. అనుకున్న పనులేవీ కావు. న్యాయంగా ఒక పని వెంటనే పూర్తి చేయ గలిగితే ఆ ఏర్పడే సంతృప్తి తాయారు సంతోషం వల్ల మనసంతా తేలికగా అయిపోతుంది. అలా కాకుండా వాయిదాలతో మూల పడిన పని వల్ల మనదికమైన నిరాశ, చేతులారా పక్కన పదేసామనే అసంతృప్తి తెలియని అసహానానికి గురిచేస్తుంది. కనుక ఎప్పటి పని అప్పుడు వాయిదాలో లేకుండా, రేపు చూద్దాంలే అనుకోకుండా వెంటనే పూర్తి చేయాలిఇది జీవితంలో మొదటి ప్రయారిటి కావాలి. వాయిదాలు వేయోద్దు.

    వాయిదా తత్వంలో అంతా నిరాశే

    నీహారికా, కొంచెం బద్ధకంతో ఇవ్వాల ఈ పని పోస్ట్ పోన్ చేసానన్నమాట నీ నోటి వెంట తరచూ వినబడుతుంది. నీకు తెలుసా ఎన్ని మంచి లక్ష్యాలున్నా విజయం…

  • ఎండల్లో పిల్లల్ని బయటకు తీసుకు పోయే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు ఉదయం పది నుంచి సాయంత్రం ఏడు వరకు వేళ్ళనే వద్దు. అధిక ఉష్ణోగ్రతలో ఆరు మాసాలలోపు పిల్లలు త్వరగా డిహైడ్రేట్ అయ్యే ప్రమాదం వుంది. కాటన్ డైపర్ క్లాత్ లే వేయాలి. ఆహారం తీసుకునే పెద్ద పిల్లలకు లస్సీ, మిల్క్ షేక్, ఫ్రెష్ ఫ్రూట్స్ జ్యూస్, కొబ్బరి నీళ్ళు ఇవ్వాలి. వీటిలోని పోషకాలు పిల్లలకు నీరసం రానీయవు. బయట దొరికే పండ్ల రాసాలు తాగించకూడదు. అందులో కలిపే ఐస్ కోసం వాడే నీళ్ళు శుభ్రంగా లేకపోవొచ్చు. పిల్లలను బయటకి తీసుకు పొతే ఇంట్లో వండిన ఆహారం తీసుకుపోవాలి. నూనెతో మసాజ్ లు మానేయాలి వేడికి చర్మం కంది పోతుంది. వేసవి కదా అని దోమతెరలు పక్కన పెట్టొద్దు, దోమల వల్ల వచ్చే జ్వరాల నుంచి పిల్లలకు రక్షణ వుండదు. రెగ్యులర్ గా ఇంట్లో వాటర్ కూలర్లు వాడుతుంటే వారానికొక సారైనా ట్యాంక్ క్లీన్ చేయాలి.

    కూల్ డ్రింకుల్లో కలిపే ఐస్ తో సమస్యే

    ఎండల్లో పిల్లల్ని బయటకు తీసుకు పోయే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు ఉదయం పది నుంచి సాయంత్రం ఏడు వరకు వేళ్ళనే వద్దు. అధిక…

  • తేదీ దాటిపోయిన మందుల్ని తీసి చెత్తబుట్టలో పారేస్తూ వుంటాం. అవి కాస్త చెత్తకుప్పల పైకి వెళ్ళి పోతాయి. అవులో, మేకలో వాటిని అమాంతం నమిలేస్తూ వుంటాయి. అందుకే అందుకే మందులను పాక్ చేసినవి చేసినట్లే ఎక్స్ పైరీ డేట్ అయిపొతే అలా విసిరేయకండి అంటున్నారు. పర్యావరణ వేత్తలు. ఒక వేల మన ఇంటిలో పిల్లలు, పెంపుడు జంతువులూ కుడా పొరపాటున ఆ మందుల్ని కొరికి తినే అవకాసం వుంది. లేబుల్ పైన ప్రత్యేక సూచనలు ఇచ్చారేమో చూడాలి. అలా సూచనలు వుంటే ఆ మందులు విషపూరితం అవ్వుతాయి అనే హెచ్చరిక కనిపిస్తే ఆ మందులను ఓపెన్ చేసి పొడి చేసి నెలలో కలిపేయాలి. వాటిని చెత్త లో పడేయడం అంటే ఇంకో ప్రాణికి అపకారం చేయడమే. చాలా మంది తెలిసో తలియకో ఇలాగే పారేస్తారు. వాటిని ఉంచిన ప్లాస్టిక్ కవర్ల వల్ల అవి మట్టిలో కలిసిపోకుండా అపకారం చేస్తాయి.

    కాలం చెల్లిన మందుల్ని అలా విసిరేయద్దు

    తేదీ దాటిపోయిన మందుల్ని తీసి చెత్తబుట్టలో పారేస్తూ వుంటాం. అవి కాస్త చెత్తకుప్పల పైకి వెళ్ళి పోతాయి. అవులో, మేకలో వాటిని అమాంతం నమిలేస్తూ వుంటాయి. అందుకే…

  • అల్లం ముక్కలు, జీడి పప్పు, నెయ్యి కలిపి ఉప్మా వందేసి, నిమిషాల పైన అతిధులకు వడ్డించి, ఇలా తిరిగే సరికి అల్లం పొడితో అన్ని రకాల వైద్యులు చేయండి అని లిస్ట్ వేస్తె ఎలా వుంటుంది. వెల్లుల్లి అల్లం దంచి వంకాయ కూర వండాలా? ఎండబెట్టి పొడి చేసి ఆ చరణంతో వంటింటి వైద్యం చేయాలి అంటే ముందు తెలుసుకోవాలి. అల్లం పొడి రోజుకు మూడుగ్రాములు తింటే చెడు కోలెస్ట్రోల్ తగ్గిపోతుంది. బరువు తగ్గేందుకు ఉపయోగ పడుతుంది. ఇందులో జంజిరాల్, బీటాకెరోటిన్, కాపైస్సిన్, కెఫీక్ ఆమ్లం, కురుక్యుమిన్, శాలిసిలేట్, తదితర యాంటి ఇన్ ఫ్లమేటరీ, యాంటి ఆక్సిడెంట్లు అధికంగా వుండటం వల్ల అల్లం కండరాల్ల నొప్పుల్ని తగ్గిస్తుంది. 60 దాటిన మహిళలు రోజు కాస్త అల్లం రసం తీసుకుంటే జ్ఞాపక శక్తి అధికం అవుతుందని జార్జియా నిపుణులు చెపుతున్నారు. చల్లని వాతావరణంలో అల్లం టీ శారీరక ఉష్ణోగ్రతను పెంచుతుంది. అల్లం పొడి వరుసగా మూడు రోజుల పాటు ఇస్తే నొప్పి తగ్గిపోయినట్లు తేలింది. అల్లంలోని జంజిరాల్ వల్ల ఇన్ఫెక్షన్లు త్వరగా రావని తేలుతుంది.

    కాస్త అల్లంపొడి చాలు

    అల్లం ముక్కలు, జీడి పప్పు, నెయ్యి కలిపి ఉప్మా వందేసి, నిమిషాల పైన అతిధులకు వడ్డించి, ఇలా తిరిగే సరికి అల్లం పొడితో అన్ని రకాల వైద్యులు…

  • మంచి కూరలు, సంబార్లు, పులిహోరలు, దేన్లో అయినా ఉప్పు వేయకుండా ఊహించండి. అస్సలు తిండే వద్దు బాబు ఏవో కంద మూలాలు తిని బతికేయచ్చు అనిపిస్తుంది. మరి డాక్టర్లేమో ఉప్పు అనారోగ్యం, బీ.పి పెరుగుతుంది, పక్షవాతం గుండె పోటు వగైరాలు పరుగెత్తుకుంటూ వచ్చేస్తాయి అంటారు కదా. ఒక అద్భుతమైన రిపోర్టు వచ్చింది. ఉప్పు ఎక్కువ తినడం వల్ల రక్తపోటు లో నమోదయ్యే తగ్గుదల చాలా నామ మాత్రం. ఉప్పు వల్ల రక్త పోటు స్వల్పంగా పెరుగుతుందని మాత్రమే శాస్త్రీయమైన ఆధారాలున్నాయి. కనుక డాక్టర్లు బీ.పి ఎక్కువైతే ఉప్పు తగ్గించమంటారు. అంతే కానీ ఉప్పుతో గుండెపోటు పక్షవాతం ఇలాంటి వేమీ వచ్చినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఒక రిపోర్టు తేల్చింది. అంచేత మరీ హడలి పోయి చప్పిడి తిండి తో జిహ్వను చంపేసుకోవలసిన పనిలేదు. హాయిగా రుచిగా ఉప్పేసుకొండి అనేసాయి అధ్యాయినాలు. ఇప్పటికిది బెస్ట్ అధ్యాయినం.

    ఉప్పేసుకొండి పర్లేదు

    మంచి కూరలు, సంబార్లు, పులిహోరలు, దేన్లో అయినా ఉప్పు వేయకుండా ఊహించండి. అస్సలు తిండే వద్దు బాబు ఏవో కంద మూలాలు తిని బతికేయచ్చు అనిపిస్తుంది. మరి…

  • ఆఫీస్ కు, అటునుంచి అటు ఏ పార్టీకొ వెళ్ళిపోవాలన్నా సౌకర్యంగా ఫ్యాషన్ గా వుండే జీన్స్ పైకి ఒక అందమైన టాప్ సరిపోతుంది అనుకుంటారు అమ్మాయిలు. ఫ్యాషన్ డిజైనర్లు ఈ డ్రెస్ ఓకే అంటారు కానీ కొన్ని కాంబినేషన్స్ ట్రై చేయండి బావుంటాయి అంటున్నారు. హోల్డర్ టాప్స్ వేసుకుంటే ఉదయం ఆఫీసుకు అటు నుంచి పార్టీకి వెళ్లిపోవచ్చు. దీని పైన కోట్ వేసుకుని ఆఫీస్ కు పొతే, వేడుక్కి వెళ్ళే ముందు ఈ కోట్ తీసేస్తే చాలు డ్రెస్ చాలా బావుంటుంది. అలాగే కఫ్తాన్ కూడా చెక్కని ఎంపిక. జార్జెట్, షిఫాన్, ప్రింట్లు, గానీ సిమెట్రికల్ గా అయినా ఎంపిక చేసుకుంటే దాన్ని మోకాలి వరకు వుండే జీన్స్, మడమ వరకు వుండే యాంకిల్ జీన్స్, స్కిన్నీ జీన్స్ తో పాటు ముచ్చటైన కాంబినేషన్ గా వుంటుంది. అలాగే స్కర్టులు, పరికిణీలు, పలాజో వంటి అన్ని రకాలకూ మ్యాచ్ అయ్యే క్రాప్ టాప్లు కూడా జీన్స్ నప్పుతాయి. చిన్న చిన్న వేడుకల కోసం లేస్ క్రాప్ బ్లవుజు సీక్వెన్స్ వున్న క్రాప్ టాప్ బావుంటుంది. ఇప్పుడు ఒకేలా కాకుండా ఇలా కాంబినేషన్ మారుస్తూ వుంటే న్యూ లుక్ తో చూడ చక్కాగా ఉంటారమ్మాయిలు.ఆఫీస్ కు, అటునుంచి అటు ఏ పార్టీకొ వెళ్ళిపోవాలన్నా సౌకర్యంగా ఫ్యాషన్ గా వుండే జీన్స్ పైకి ఒక అందమైన టాప్ సరిపోతుంది అనుకుంటారు అమ్మాయిలు. ఫ్యాషన్ డిజైనర్లు ఈ డ్రెస్ ఓకే అంటారు కానీ కొన్ని కాంబినేషన్స్ ట్రై చేయండి బావుంటాయి అంటున్నారు. హోల్డర్ టాప్స్ వేసుకుంటే ఉదయం ఆఫీసుకు అటు నుంచి పార్టీకి వెళ్లిపోవచ్చు. దీని పైన కోట్ వేసుకుని ఆఫీస్ కు పొతే, వేడుక్కి వెళ్ళే ముందు ఈ కోట్ తీసేస్తే చాలు డ్రెస్ చాలా బావుంటుంది. అలాగే కఫ్తాన్ కూడా చెక్కని ఎంపిక. జార్జెట్, షిఫాన్, ప్రింట్లు, గానీ సిమెట్రికల్ గా అయినా ఎంపిక చేసుకుంటే దాన్ని మోకాలి వరకు వుండే జీన్స్, మడమ వరకు వుండే యాంకిల్ జీన్స్, స్కిన్నీ జీన్స్ తో పాటు ముచ్చటైన కాంబినేషన్ గా వుంటుంది. అలాగే స్కర్టులు, పరికిణీలు, పలాజో వంటి అన్ని రకాలకూ మ్యాచ్ అయ్యే క్రాప్ టాప్లు కూడా జీన్స్ నప్పుతాయి. చిన్న చిన్న వేడుకల కోసం లేస్ క్రాప్ బ్లవుజు సీక్వెన్స్ వున్న క్రాప్ టాప్ బావుంటుంది. ఇప్పుడు ఒకేలా కాకుండా ఇలా కాంబినేషన్ మారుస్తూ వుంటే న్యూ లుక్ తో చూడ చక్కాగా ఉంటారమ్మాయిలు.

    చిన్ని చిన్ని మార్పులతో మోడ్రన్ లుక్

    ఆఫీస్ కు, అటునుంచి అటు ఏ పార్టీకొ వెళ్ళిపోవాలన్నా సౌకర్యంగా ఫ్యాషన్ గా వుండే జీన్స్ పైకి ఒక అందమైన టాప్ సరిపోతుంది అనుకుంటారు అమ్మాయిలు. ఫ్యాషన్…