• వేసవిలోకూడా పెదవులు పగులుతుంటాయి. బాగా బీటలు వారి రక్తం కూడా వస్తూ వుంటుంది. ఇందుకు డీహైడ్రేషన్ కారణం కావచ్చు. పెదవులు పగిలినప్పుడు లిప్ స్టిక్, లిప్ బామ్ ల జోలికి పోకుండానే వుండాలి. వాటిలోని రసాయినాలతో పెదవుల పగుళ్ళు ఎక్కువ కావొచ్చు. తేనె ఆలివ్ ఆయిల్ కలిపి రాయడం వల్ల పెదవులకు తేమ అందుతుంది. రాత్రి వేళ కేవళం ఆలివ్ ఆయిల్ మాత్రమే రాయాలి. పెదవుల మంట తగ్గిపోతుంది. ఏ.సి ల్లో ఎక్కువ సమయం గడిపిన పెదవులు పగలోచ్చు. వీలైనంత వరకు సహజమైన గాలి తగిలేలా చూసుకోవాలి లేకపోతె పెదవులు మరింత పొడిబారి పోతాయి. పెదవులు పగిలి రక్తం వస్తూవుంటే ఐస్ ముక్కల తో అద్దడం వల్ల కూడా ఫలితం కనబడుతుంది. మెత్తని బట్టలో ఐస్ ముక్కలు వేసి పెదవులకు అద్దినా తేమ అంది రక్తం రావడం తగ్గిపోతుంది. నాలుకతో పగుళ్ళను తడిచేస్తూ వుంటారు ఇలా చేయడం వల్ల సమస్య ఇంకా పెరుగుతుంది.

    లిప్ స్టిక్ లు లిప్ బామ్ లు వద్దు

    వేసవిలోకూడా పెదవులు పగులుతుంటాయి. బాగా బీటలు వారి రక్తం కూడా వస్తూ వుంటుంది. ఇందుకు డీహైడ్రేషన్ కారణం కావచ్చు. పెదవులు పగిలినప్పుడు లిప్ స్టిక్, లిప్ బామ్…

  • ప్రపంచంలో ప్రతివాళ్ళు ఉదయాన్నే చేసే పని బ్రష్ చేసుకోవడం ఆ పని ఎంతో యాంత్రికంగా చేస్తారు. నిజానికి బ్రష్ చేసుకోవడం అతి ముఖ్యమైన అవసరమైన పనుల్లో ఒకటి. సరిగ్గా బ్రష్ చేయక పొతే, అస్సలు చేయక పొతే పళ్ళకు, చిగుళ్ళకు కలిగే హానే కలుగుతుంది. చాలా మంది బ్రషింగ్ చేయరు. ఆరేల్లకు ఒక్క పదయినా దంత వైద్యుడిని కలపకు టూత్ బ్రష్ ను పెన్సిల్ లా పట్టుకుని కనీసం రెండు నిముషాలు తోముకోవాలి. పళ్ళు, పంటి జంక్షన్, చిగుళ్ళపై మృదువుగా బ్రష్ చేయాలి. ఫ్యాన్సీ యాంగిల్స్, బ్రష్ తో అవసరం లేదు. . సిద్దంగా మృదువైన పళ్ళు వున్న బ్రష్ ని బ్రసిల్స్ బ్రష్ కంటే సాఫ్ట్ బ్రసిల్స్ బ్రష్ ల వల్లే బాగా క్లీన్ అవుతుంది. హార్డ్ బ్రసిల్స్ బ్రష్ ల వల్లె బాగా క్లీన్ అవుతుంది. హార్డ్ బ్రిస్టిల్స్ బ్రష్ ల వల్ల టూత్ స్రక్చర్ కు హాని జరుగుతుంది.

    ఇలా బ్రష్ చేయాలి

    ప్రపంచంలో ప్రతివాళ్ళు ఉదయాన్నే చేసే పని బ్రష్ చేసుకోవడం ఆ పని ఎంతో యాంత్రికంగా చేస్తారు. నిజానికి బ్రష్ చేసుకోవడం అతి ముఖ్యమైన అవసరమైన పనుల్లో ఒకటి.…

  • మండే ఎండల్లో నీరసం, అలసటా భాదిస్తూ వుంటాయి. భోజనం చేసినా ఉత్సాహంగా వుండదు. అలాంటప్పుడు మంసాకృతులు అధికంగా లభించే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఓట్స్, పాలు, బాదాం పప్పు, వాటిలో అధికంగా వుంటాయి కనుక వీటిని ఒక మోతాదులో ఆహారంలో చేర్చుకోవాలి. ప్రతి మూడుగంటలకొసారి ఎదో ఒక్కటి తినాలి. పండ్లు, కూరగాయలు, మొలకలు ఇలా ఎదో ఒక్కటి తినాలి. రాత్రి ఎనిమిది గంటల లోపునే ఈ ఆహారం పూర్తి చేయాలి. ఇలా చేస్తే జీవక్రియల రేటు బావుంటుంది. మసాలా పదార్దాలు, బయటి ఫుడ్ కి అవకాసం ఇవ్వకూడదు. శరీరంలోని వ్యర్ధాలు బయటకు పంపే పానీయాలు తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీళ్ళు తాగడం వల్లనే వ్యర్ధాలు బయటకు పోతాయి. సాధ్యమైనంత నిల్వపచ్చళ్ళు, అప్పడాలు, నూనె లో వేయించిన చిరు తిళ్ళు తినకపోతేనే మంచిది.

    ప్రతి మూడు గంటలకొ సారి తినాలి

    మండే ఎండల్లో నీరసం, అలసటా భాదిస్తూ వుంటాయి. భోజనం చేసినా ఉత్సాహంగా వుండదు. అలాంటప్పుడు మంసాకృతులు అధికంగా లభించే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఓట్స్, పాలు, బాదాం…

  • నువ్వుల నూనెలో అనేక ఔషద గుణాలున్నాయి. ఆహార పదార్ధాల తయారీలో నువ్వుల నూనె వాడకం వల్ల రక్తంలో చక్కర స్థాయి, రక్తపోటు నియంత్రణలో వుంటాయి. వేరుసెనగల నుంచి, నువ్వుల లో నుంచి తీసిన నూనెలే గతంలో వాడేవారు. లో ఫ్యాట్ పేరుతో ఇప్పుడు రకరకాల నూనెలోచ్చాయి. శరీరానికి పట్టిన నీటిని తొలగించే శక్తి నువ్వుల నూనెకుంది. బాక్టీరియా నసిమ్పజేస్తుంది. కిళ్ళనొప్పులకు మంచి ఔషదం రక్తంలోని హానికర పదార్ధాలను నశింపజేసే యాంటీ బాడీస్ లభిస్తాయి. ఇది మంచి సౌందర్య కరకం. గోరు వెచ్చని నూనె నెత్తికి పట్టించి మసాజ్ చేస్తే రక్త ప్రసరణ మెరుగవ్వుతుంది. చర్మానికి రాయడం వల్ల చర్మం మృదువుగా వుంటుంది.

    సౌందర్యం కోసం నువ్వుల నూనె

    నువ్వుల నూనెలో అనేక ఔషద గుణాలున్నాయి. ఆహార పదార్ధాల తయారీలో నువ్వుల నూనె వాడకం వల్ల రక్తంలో చక్కర స్థాయి, రక్తపోటు నియంత్రణలో వుంటాయి. వేరుసెనగల నుంచి,…

  • మనిషికి ఈ మాత్రం మనసుండాలి

    నీహారికా, నీకో మంచి వ్యక్తిని పరిచయం చేయాలి అనుకున్నాను. చాలా మంది చాలా మంచి పనులు చేస్తేనే ఈ ప్రపంచలో కొందరైనా సుఖంగా వున్నారు. ఇతని పేరు…

  • నేడే రాముని కళ్యాణం

    ఈ నేల పైన ఎక్కడ చూసినా శ్రీరాముడు అడుగు పెట్టని నేల, సీతమ్మ చీరలు ఆరేయని చొటు కనిపించదు. భాషలో కుడా రాముడికి అగ్ని పీటమె వుంది.…

  • కప్తాన్ టాప్స్ చూడగానే వేసవి స్పెషల్స్ అనిపించేస్తాయి. సీతాకోక చిలుక రెక్కలు అలా అలార్చినట్లు, పూల రెక్కల పిట్ట అలా గాల్లో ఎగిరినట్లు అనిపించడం ఈ కప్తాన్ టాప్స్ ప్రత్యేకత. అయితే ఇందులో ఎంపిక ముఖ్యం టాప్స్ చాలా లూజ్ గా చేతుల పై నుంచి జారినట్లు వుంటాయి. వీటి కాంబినేషన్ గా చక్కని టైట్ ఫిట్ ప్యాంట్ ఏదైనా బావుంటుంది. ఒక వేల ఇంట్లో కుట్టాలన్నా భారీగా కత్తిరింపులు లేకుండా ఎంపిక చేసుకున్న క్లాత్ ని డ్రాఫ్టింగ్ సిద్దం చేసుకుని కుట్టేస్తే సరి. సింపుల్ గా స్టైలిష్ గా వుంటుంది. వట్టి సదా క్లాత్ తోనూ, జిగేల్ మనే రంగుల డిజైన్ల తోనూ ఇవి ఫ్యాషన్ ఐకాన్ లు. రాజుల కాలంలో పై నుంచి పాదాల వరకు ఓవర్ కోట్ లాగా వుండే వస్త్రాన్ని కప్తాన్ అనే వాల్లు దీన్ని ఊలు, కాశ్మీర్ సిల్క్, కాటన్ క్లాత్ లతో కుట్టించే వాళ్ళు. దీన్ని ఊలు, రాజ ప్రసాదాలలోని వస్త్రధారణ తరహా కాస్త ఇప్పుడో అమ్మాయిల వార్డ్ రోబ్ లో చక్కగా చూటు చేసుకుంది. దీన్ని ఇంకాస్త లూజ్ లెంగ్త్ తగ్గించి లూజ్ ఫిట్టింగ్ గార్మెంట్ గా కుర్తీ పేరు తో అమ్మాయిల ఇష్టసఖి అయిపోయింది.

    అచ్చు సీతాకోక చిలుకల్లే…..!

    కప్తాన్ టాప్స్ చూడగానే వేసవి స్పెషల్స్ అనిపించేస్తాయి. సీతాకోక చిలుక రెక్కలు అలా అలార్చినట్లు, పూల రెక్కల పిట్ట అలా గాల్లో ఎగిరినట్లు అనిపించడం ఈ కప్తాన్…

  • మసాజ్ కోసం శాండల్ వుడ్ ఆయిల్ ని మించిన ఆయిల్ ఇంకొకటి లేదు. సౌందర్యాన్ని పెంచడమే కాదు ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది. నూనె వార్ధక్యం కారణంగా వచ్చే ముడతలు డెలివరీ తర్వాత పొట్ట మీద వచ్చే స్ట్రెచ్ మార్క్స్ పోవటానికి ఎండకు కమిలి పోయి నల్లబడిన చర్మం యధాస్థితికి రావడానికి సాండల్ వుడ్ ఆయిల్ ఎంతగానో సాయపడుతుంది. ఈ ఆయిల్ ను నేరుగా కానీ మరేదైనా ఆయిల్ తో కానీ కలిపి మర్దనా చేయొచ్చు. ఏ రాకమైన ఆయిల్ తో నైనా, మసాజ్ అన్నది చర్మాన్ని బిగుతుగా ఉంచేందు చెక్కగా సయం చేస్తుంది. పనితో, వత్తిడితో అలసిపోయిన కండరాళ్ళు యధాస్తితి కి వచ్చేందుకు మసాజ్ ఒక్కటే మంచి మార్గం. అలాగే ఆర్దరైటిస్ కారణంగా వచ్చే నొప్పులకు కూడా మసాజ్ ఉపయోగం. ఇది ప్రాచీన వైద్య విధానం అయినప్పటికీ, ఇందులో వున్న శక్తి గ్రహింపు కొచ్చాక మసాజ్, మర్ధనాలు ఆదరణ పొందుతున్నాయి. చివరికి జుట్టు పల్చబడిన, వుదిపోతున్న హెయిర్ మసాజ్ ల వల్లనే అధిక ఫలితం ఉంటోంది.

    మసాజ్ కు సాండెల్ వుడ్ ఆయిల్ బెస్ట్

    మసాజ్ కోసం శాండల్ వుడ్ ఆయిల్ ని మించిన ఆయిల్ ఇంకొకటి లేదు. సౌందర్యాన్ని పెంచడమే కాదు ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది. నూనె వార్ధక్యం కారణంగా…

  • ఏదయినా ఒక పరిమితిలో ఉంటేనే బావుంటుంది. అతిగా వున్న దాన్ని వదిలేయమనే చెపుతారు పండింతులు. ఇదిగో ఈ అతి వల్ల మేలు కంటే కీడే అధికం అంటారు. కొందరు చురుగ్గా ఆరోగ్యంగా వుండేందుకువ్యాయామం మొదలుపెడతారు. చక్కని ఆకృతి కావాలనుకుంటారు. అది కాస్త మోతాదుమించితే చాలా నష్టం. బరువులెత్తే వ్యాయామం చేశాక కొంత విశ్రాంతి కావాలి. ఎందుకంటే వ్యాయామాలతో కండరాళ్ళ వత్తిడి కి ఎదుర్కొంటాయి. ఒక్క సారి లోలోపల చిన్న పాటి గాయాలు కూడా అవుతాయి. అవి తిరిగి కోలుకోవాలంటే విశ్రాంతి కావాలి. అలా విశ్రాంతి లేని వ్యాయామం తో కండరాల్లు బలపడటానికి బదులు బలహీనమైపోతాయి. సాధారణంగా వ్యాయామంతో జీవక్రియలు చురుకుగా మారి కేలరీలు కరుగుతాయి కానీ అతిగా చేసే వ్యాయామం తో జీవక్రియతో మందగించి బరువు పెరుగుతారు. మోతాదుకు మించిన వ్యాయామం చేస్తే హార్మోన్ల హెచ్చు తగ్గులు పెరిగి నెలసరులు ఆగిపోయే ప్రమాదం కూడా వుంది. అలాగే అవాంచిత రోమాలు వంటి అనర్ధాలు ఉంటాయి. ఈ అధికమైన వ్యాయామం, శరీర శ్రమ వల్ల అతి నిద్ర లేదా అస్సలు నిద్ర పట్టక పోవడం ఉంటాయి. అందుకే ఏదైనా మితంగా ఉంటేనే మేలు.

    ఏదైనా మితంగానే వుండాలి

    ఏదయినా ఒక పరిమితిలో ఉంటేనే బావుంటుంది. అతిగా వున్న దాన్ని వదిలేయమనే చెపుతారు పండింతులు. ఇదిగో ఈ అతి వల్ల మేలు కంటే కీడే అధికం అంటారు.…

  • మండే ఎండల్లో బయట తిరిగే ఉద్యోగాల్లో ఉంచి ముందుగా పట్టించుకోవలసింది వేసుకోనే దుస్తుల గురించి అందంగా వుండటం తో పాటు సౌకర్యంగా ఉండేవి ఎంచుకోవాలి. కాటన్, లెనిన్, కోటా రకాలను ఎంచుకుంటే సౌకర్యంగా వుంటుంది. అలాగే మరి వంటికి అతుక్కుపోకుండా కాస్త వదులుగా ఉండేవి తీసుకోవాలి. బొట్ నెక్, కాలర్ నెక్, క్లోజ్డ్ నెక్ లాంటి డిజైన్ లో బావుంటాయి. అలాగే మాక్సిలు, పలాజోలు, వదులుగా వుండే కుర్తీలు, స్కర్టులు బావుంటాయి. ఇప్పుడు అన్ని దుస్తుల మీదకి వాడే ప్యాడెడ్ బ్రాల బదులుగా స్కార్ఫ్ లు ఉపయోగించుకోవచ్చు. ప్యాడెడ్ బ్రాలతో చమట ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. లేసుతో అల్లిన దారం పనితనంతో రూపొందించిన డిజైనర్ దుస్తులుఎంచుకోవాలి. మంచి మాచింగ్ సాక్స్ వేసుకోవడం వల్ల పాదాలు శుబ్రంగా చల్లగా వుంటాయి.వేసవి డ్రెస్సులు ఈ పాటికి మార్కెట్ లో వరసలు తీరే వుంటాయి. సీజన్ లో వేరరే వైపు ఓ సారి దృష్టి సారిస్తే మంచిది.

    వేసవి కోసం సౌకర్యం ప్రధానం

    మండే ఎండల్లో బయట తిరిగే ఉద్యోగాల్లో ఉంచి ముందుగా పట్టించుకోవలసింది వేసుకోనే దుస్తుల గురించి అందంగా వుండటం తో పాటు సౌకర్యంగా ఉండేవి ఎంచుకోవాలి. కాటన్, లెనిన్,…

  • అందమైన నవ్వుకు రంగులద్దే పద్దతి ఈనాటిది కాదు. ఏనాటి నుంచో పెదవుల వర్ణ రంజితం చేసుకునేందుకు తాంబూలం వేసుకోవడం తో మొదలైంది. మొదటి సారిగా లిప్స్ టిక్ వాడిన ఘనత మెసపొటేనియన్ మహిళలదే ఇక 16 వ శతాబ్దంలో మొదటి ఎలిజిబెత్ రాణి తేనె తుట్టిలోని మైనం నుంచి సేకరించిన ఎర్రని ద్రవం తో తయారైన లిప్స్ టిక్ వాడేవారు. ఏనాటి కధలో ఇలా ఉంచేసి ఇప్పటి లిప్స్ టిక్ లు ఎంచుకోవడం లో మాత్రం కాస్త శ్రద్ధ చూపించాలి. లిప్స్ టిక్ని అరచేతిపై రాసి సరైన కలర్ ని ఎంపిక చేసుకోవాలి. అరచేయి తెల్లగా వుంటుంది కనుక లిప్స్ టిక్ చాయ తలిసిపోతుంది. శరీరపు రంగుని బట్టి ఎంపిక వుండాలి. మరీ తెల్లగా వుంటే ఎర్రని రంగు బావుండదు బదులుగా ఎరుపులోనే లేత రంగులు బావుంటాయి. కొంచం రంగు తకువైతే ముదురు రంగుల్లో, ఎరుపు, రాణి రంగు దేన్నెయినా ప్రయత్నించ వచ్చు. రంగు బాగా తక్కువగా వుంటే శరీరపు చాయ నలుపుకు దగ్గరగా వుంటే ఉదా రంగు,ముదురు గోధుమ రంగులు బావుంటాయి. మరీ కొట్టొచ్చినట్టుగా , మరీ కనిపించ పోయినా రెండూ బావుండవు.

    సుందర హాసానికి తోడయ్యే రంగులు

    అందమైన నవ్వుకు రంగులద్దే పద్దతి ఈనాటిది కాదు. ఏనాటి నుంచో పెదవుల వర్ణ రంజితం చేసుకునేందుకు తాంబూలం వేసుకోవడం తో మొదలైంది. మొదటి సారిగా లిప్స్ టిక్…

  • సినిమాలు తీర్చి దిద్దిన అందమైన శిల్పాన్ని అంటోంది తమన్నా. చాలా ఫ్రాంక్ గా మాట్లాడుతుంది కూడా కెరీర్ లో ఊహించని పరిణామాలున్నాయా అని అడిగితే, కొన్ని పాత్రలు పోషించడం మినహా ఇతరత్రా అద్భుతాలు జరగలేదు. ఎవరికైనా ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది అంటే అందుకు ప్రత్యేకమైన కారణం వుండేవుంటుంది. నేను అందుకొనే పారితోషకం వెనక నాకు వచ్చిన గుర్తింపు వెనుక ఎదో ఒక కారణం వుండే వుంటుంది. పని చేసి మెప్పించగలసమర్ధురాలిని గనుక మంచి ఆవకాశాలు వచ్చాయంది తమన్నా. మీ వ్యక్తిగత జీవితంలో మర్పులున్నాయా అంటే, నాదో చిన్న ప్రపంచం, నాకుటుంబం, పరిమిత సంఖ్యా స్నేహితులు. కానీ సినిమా రంగంలోకి వచ్చాక నా ప్రపంచం చాలా పెద్దది అయ్యింది. నాకుతక్కువ మంది తెలుసు కానీ నేనెంతో మందికి తెలుసు అంచేత వాళ్ళంతా నాకుటుంబమే వ్యక్తి గత జీవితంలో సాహసాలు చేయను గానీ సినిమాలో మాత్రం సాహసం నా ఊపిరి అన్నట్లు వుంటుంది. కొత్త పాత్ర వస్తే చాలు చేసి చుస్తే పోలేదా అని కష్టపడతాను అంటోంది తమన్నా.

    సినిమాలతో నే నా ప్రపంచం విశాలం

    సినిమాలు తీర్చి దిద్దిన అందమైన శిల్పాన్ని అంటోంది తమన్నా. చాలా ఫ్రాంక్ గా మాట్లాడుతుంది కూడా కెరీర్ లో ఊహించని పరిణామాలున్నాయా అని అడిగితే, కొన్ని పాత్రలు…

  • ఎంత హీల్స్ కాన్షస్ ఉన్నా చాలా మందికి వైద్యుల వద్దకు వెళ్ళాలనే ఆలోచన చాలా మందికి రాదు. ఎప్పుడూ ఎదో చిరాకు పెట్టే నొప్పుల్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఎదో ఒక రుగ్మత వచ్చేదాకా డాక్టర్లని కలవాలనుకోరు. రోజంతా ఎన్నో పనుల్ని సునాయాసంగా చేసే మహిళల జాబితాలో డాక్టర్ విజిట్ అనేది ఎప్పుడూ వుండదు. కానీ సమస్య వున్నా లేకపోయినా గైనకాలజిస్ట్ లను ఫ్రిండ్లిగా కలుస్తూనే వుండాలి. పిల్లలు వద్దనుకున్నా, కావాలనుకున్న ముందుగా వైధ్యురాలి సలహా వుండాలి. పిల్లలు వద్దనుకున్నా, కావాలనుకున్నాముందుగా వైద్యశాల సలహా వుండాలి. సలహాలు సూచనలు, సందేహాల నివృత్తి అన్ని డాక్టర్ ద్వారానే కావాలి. ఒక ఏడాది పాటు గైనికాలజిస్ట్ ను కాలువక పోవడం సరైన నిర్ణయం కాదు. పి.ఎ.విస్మియిర్, బ్రెస్ట్ పరీక్షలు వంటి వార్షిక పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. మెనోపాజ్ దశలో వున్న మహిళలు తప్పనిసరిగా వైద్యురాలి చెకప్స్ అస్సలు మిస్ అవ్వకూడదు. ఏడాదికి రెండు సార్లు అయినా వధ్య పరీక్షకు వెళితేనే డయాబెటిస్, కాన్సర్లు వంటి రుగ్మతులు ఏమైనా వుంటే వాటిని తోలి దశల్లో గుర్తించే అవకాశం వస్తుంది. ఎంత హీల్స్ కాన్షస్ ఉన్నా చాలా మందికి వైద్యుల వద్దకు వెళ్ళాలనే ఆలోచన చాలా మందికి రాదు. ఎప్పుడూ ఎదో చిరాకు పెట్టే నొప్పుల్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఎదో ఒక రుగ్మత వచ్చేదాకా డాక్టర్లని కలవాలనుకోరు. రోజంతా ఎన్నో పనుల్ని సునాయాసంగా చేసే మహిళల జాబితాలో డాక్టర్ విజిట్ అనేది ఎప్పుడూ వుండదు. కానీ సమస్య వున్నా లేకపోయినా గైనకాలజిస్ట్ లను ఫ్రిండ్లిగా కలుస్తూనే వుండాలి. పిల్లలు వద్దనుకున్నా, కావాలనుకున్న ముందుగా వైధ్యురాలి సలహా వుండాలి. పిల్లలు వద్దనుకున్నా, కావాలనుకున్నాముందుగా వైద్యశాల సలహా వుండాలి. సలహాలు సూచనలు, సందేహాల నివృత్తి అన్ని డాక్టర్ ద్వారానే కావాలి. ఒక ఏడాది పాటు గైనికాలజిస్ట్ ను కాలువక పోవడం సరైన నిర్ణయం కాదు. పి.ఎ.విస్మియిర్, బ్రెస్ట్ పరీక్షలు వంటి వార్షిక పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. మెనోపాజ్ దశలో వున్న మహిళలు తప్పనిసరిగా వైద్యురాలి చెకప్స్ అస్సలు మిస్ అవ్వకూడదు. ఏడాదికి రెండు సార్లు అయినా వధ్య పరీక్షకు వెళితేనే డయాబెటిస్, కాన్సర్లు వంటి రుగ్మతులు ఏమైనా వుంటే వాటిని తోలి దశల్లో గుర్తించే అవకాశం వస్తుంది.

    డాక్టర్ విజిట్ చాలా అవసరం

    ఎంత హీల్స్ కాన్షస్ ఉన్నా చాలా మందికి వైద్యుల వద్దకు వెళ్ళాలనే ఆలోచన చాలా మందికి రాదు. ఎప్పుడూ ఎదో చిరాకు పెట్టే నొప్పుల్ని నిర్లక్ష్యం చేస్తుంటారు.…

  • ప్రపంచంలోనే అత్యంత అందమైన ౩౦ మంది మహిళల్లో భరతీయ నటి ప్రియాంకచోప్రాకు స్థానం లభించింది. పాప్ గాయిని బియన్స్ కు మొదటి స్థానంలో నిలిచారు. ప్రియాంకాకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతుంది. ఆ మధ్య అంతర్జాతీయ వేదిక పై పలు పురస్కారాలు, గౌరవాలు అందుకుంది. ఇప్పుడు తాజాగా ఎందరో అందమైన వాళ్ళను దాటుకుని ప్రపంచ అందగత్తెల జాబితాలో రెండో స్థానం లో నిలబడింది ప్రియాంక. లాస్ ఏంజెల్స్ కు చెందిన సోషల్ మీడియా సంస్థ బజ్ నెట్ నిర్వహించిన ఈ సర్వే లో పాప్ గాయిని బియాన్సే మొదటి స్థానంలో నిలబడింది. బియాన్సే తర్వాత ప్రియాంకా కు ఈ పాప్యూలారిటీ వచ్చింది. ఆమె దాటుకు వచ్చిన వాళ్ళలో ఎంజలీనాజోలి, ఎమ్మివాట్సన్, లాంటి స్టార్ మహిళలు వున్నారు. ప్రముఖ నటి ఎంజలీనా జోలి ఎనిమిదవ స్థానంలో వున్నారు.

    అందగత్తెల్లో ప్రియాంకకు రెండో స్థానం

    ప్రపంచంలోనే అత్యంత అందమైన ౩౦ మంది మహిళల్లో భరతీయ నటి ప్రియాంకచోప్రాకు స్థానం లభించింది. పాప్ గాయిని బియన్స్ కు మొదటి స్థానంలో నిలిచారు. ప్రియాంకాకు ప్రపంచ…

  • నీహారికా, ప్రతి నిమిషం విలువైనదే అంటారు, దాన్ని అపురూపంగా అనుభవించాలి అంటారు. ఎలా అన్నావు. సంతోషంగా ఆనందంగా అనాలి. అదెలాగా అంటావు. మనం ఎక్కువ సంతోషాన్ని పొందుతామో దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అంతగా ఆనందం ఇవ్వని విషయాలకు చివరి ప్రాధాన్య ఇవ్వాలి. అంటే ప్రాధాన్యత ప్రాముఖ్యలను పాటిస్తే ఎప్పుడుసంతోషంగా వుండటం కష్టం కాదు. సంతృప్తి అన్నది సంతోషంలో సగం ఎప్పుడూ అసంతృప్తి తో వుంటే దేనిలోనూ సంతోషం అనుభవించ లేము. మన పైన మనం ఇష్టాన్ని పెంచుకోవడం ఒక పద్దతి. ఇది మాన పట్ల మనకి వున్న నమ్మకం ఎక్కువ చేస్తుంది. ప్రతి నిమిషం సంతోషంగా వుండటం లో ఇది చాలా ముఖ్యం. మనల్ని మనం సంతోష పెట్టుకునేందుకు ప్రతి క్షణం ప్రయత్నిస్తాం. ఏది సంతోషం ఇవ్వగలదో కనిపెడదం. ఇతరుల తో ప్రేమగా వుండటం లో సంతోషం దొరికితే ప్రేమిస్తాం. కొత్త విషయాలు తెలుసుకోవడం బావుంటే తలుసుకుంటాం. ఆటలు ఇష్టమైతే ఆడతాం. బలహీనతలు వదులుకోవడం ఇష్టమైతే వైలేస్తాం. ఏదైనా చేస్తున్నాము అంటే ప్రతి నిమిషం ఆనందంగా గడపడం కోసం అవన్నీ చేస్తామని చేయగలమని తెలుసుకోవాలి. అంటే కానీ ప్రతి నిమిషం విలువైనది ఎలా సంతోషిస్తాం అంటే ఇలాగే చేసే పనుల్లో మన చర్యల్లో, మన భావాల్లో, ఆలోచనల్లో మార్పులు తెచ్చుకుంటూ ప్రతి నిమిషాన్ని ఆస్వాదించే దిశగా నడుస్తాం. ప్రతి నిమిషం విలువైనదే మరి దాన్ని అపురూపంగా అనుభవించాల్సిందే కదా!!

    నిమిషం విలువని తలుసుకుంటే అనుభవిస్తాం

    నీహారికా, ప్రతి నిమిషం విలువైనదే అంటారు, దాన్ని అపురూపంగా అనుభవించాలి అంటారు. ఎలా అన్నావు. సంతోషంగా ఆనందంగా అనాలి. అదెలాగా అంటావు. మనం ఎక్కువ సంతోషాన్ని పొందుతామో…

  • నటిగా సామంత ఎక్కవలసిన మెట్లన్నీ ఎక్కేసినట్లే. ఈ ప్రస్తానంలో ఆమె పొందిన అనుభవాలకి కొదవ లేదు. అందుకే ఏదీ సులువుగా రాదు, వచ్చినా ఎంతో కాలం మనతో వుండదు. వున్న దానికి మనం విలువ ఇవ్వాలేం, కష్ట పది సంపాదించిన ఒక్క రూపాయి అయినా సరే ఎప్పుడు అపురుపంగానే వుంటుంది అంటుంది సామంత. కొత్త సినిమాల పై సంతకాలు చేస్తుంది.అస్త విలువ నాకు బాగా తెలుసు కనుకనే అందులో ఎంత సుఖం వుంటుందో తెలుసుకోగలను. ఎవరైనా స్టార్ అయ్యారంటే అదేం మాములు విషయం కాదు. ఆ స్థాయికి వచ్చేందుకు వాళ్ళు ఎంతో కష్ట పడి వుంటారు. పరీక్షల్లో 90 మార్కులు తెచుకున్న వాళ్ళని ఇంకా బాగా చదవండి అని చెప్పడం సులువే కానీ ఆ 90 తెచ్చుకునేందుకు వాళ్ళు ఎంత కష్ట పడి వుంటారు? ప్రతి సక్సెస్ చాలా గొప్పది. దాన్ని పండగలా చేసుకోవాలి. నేను అంతే నా సినిమాలు, నా నట జీవితం ఇదంతా గొప్ప సెలబ్రేషన్. ప్రతి క్షణాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను అంటోంది సామంత. నిజమే ఒక చిన్న పాటి విజయాన్ని అయినా సరె ఆ విజయం సాధించుకున్నందుకు మనల్ని మనం మెచ్చుకుని తీరాలి. నటిగా సామంత ఎక్కవలసిన మెట్లన్నీ ఎక్కేసినట్లే. ఈ ప్రస్తానంలో ఆమె పొందిన అనుభవాలకి కొదవ లేదు. అందుకే ఏదీ సులువుగా రాదు, వచ్చినా ఎంతో కాలం మనతో వుండదు. వున్న దానికి మనం విలువ ఇవ్వాలేం, కష్ట పది సంపాదించిన ఒక్క రూపాయి అయినా సరే ఎప్పుడు అపురుపంగానే వుంటుంది అంటుంది సామంత. కొత్త సినిమాల పై సంతకాలు చేస్తుంది.అస్త విలువ నాకు బాగా తెలుసు కనుకనే అందులో ఎంత సుఖం వుంటుందో తెలుసుకోగలను. ఎవరైనా స్టార్ అయ్యారంటే అదేం మాములు విషయం కాదు. ఆ స్థాయికి వచ్చేందుకు వాళ్ళు ఎంతో కష్ట పడి వుంటారు. పరీక్షల్లో 90 మార్కులు తెచుకున్న వాళ్ళని ఇంకా బాగా చదవండి అని చెప్పడం సులువే కానీ ఆ 90 తెచ్చుకునేందుకు వాళ్ళు ఎంత కష్ట పడి వుంటారు? ప్రతి సక్సెస్ చాలా గొప్పది. దాన్ని పండగలా చేసుకోవాలి. నేను అంతే నా సినిమాలు, నా నట జీవితం ఇదంతా గొప్ప సెలబ్రేషన్. ప్రతి క్షణాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను అంటోంది సామంత. నిజమే ఒక చిన్న పాటి విజయాన్ని అయినా సరె ఆ విజయం సాధించుకున్నందుకు మనల్ని మనం మెచ్చుకుని తీరాలి.

    ప్రతి విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి

    నటిగా సామంత ఎక్కవలసిన మెట్లన్నీ ఎక్కేసినట్లే. ఈ ప్రస్తానంలో ఆమె పొందిన అనుభవాలకి కొదవ లేదు. అందుకే ఏదీ సులువుగా రాదు, వచ్చినా ఎంతో కాలం మనతో…

  • నూర్ఒక మహిళా జర్నలిస్టు. ఎంతో బద్ధకం ఇష్టం లేకపోయినా ఎలాగో జాబ్ చేస్తూ వుంటుంది. అనుకోకుండా చేసిన ఒక తప్పు తో జాబ్ పోయిది. దీనితో ఆమె జీవితం మారి పోతుంది. ఈ కధాంశంతో వస్తున్న'నూర్' సినిమాలో ప్రధాన పాత్రలో సోనాక్షి సిన్హా నటిస్తుంది. ఈ చిత్రం లో నా కెరీర్ లో నాకొ మంచి పాత్ర దక్కింది. అంటోంది సోనాక్షి. నూర్ లో ఆమె పాటలు పాడాను, త్వరలో ఇంకా పాడుతాను. ఈ సినిమా తో నన్ను నేను నిరుపించుకుంటాను అని అనగానే మనం ఎవరో తెలియక పాయినా మన నటన నచ్చితే చాలు ప్రేక్షకులు ఇంకే మడగరు అంది ఆమె. నేను స్టార్ కిడ్ ని. కానీ ప్రేక్షకులకు మంచి నటిగానే గుర్తువుండాలి అనుకుంటాను. మా అమ్మానాన్నల తోనే నేను కలిసి వుంటాను. వాళ్ళకు దూరం కావడం అన్న ఆలోచన కూడా భరించలేను కానీ, నా సినిమాలు, నా సంపాదన, నా జీవితం నాకుండాలి. నేను నమ్మిన సిద్దాంతాలపైనే ఎప్పుడు నిలబడతాను. అవసరాలు అవకాశాల కోసం వాటివి ఎప్పుడూ మార్చుకొను అంటుంది సోనాక్షి. 'నూర్' చిత్రం గురించి అందులో తన జర్నలిస్ట్ పాత్ర గురించి మాత్రం ఎంతో సంతోషంగా వుంది సోనాక్షి.

    నూర్ నా కెరీర్ లో నాకొ మంచి పాత్ర

    నూర్ఒక మహిళా జర్నలిస్టు. ఎంతో బద్ధకం ఇష్టం లేకపోయినా ఎలాగో జాబ్ చేస్తూ వుంటుంది. అనుకోకుండా చేసిన ఒక తప్పు తో జాబ్ పోయిది. దీనితో ఆమె…

  • ఇప్పటి వరకు ఆలూచిప్స్, అరటికాయ, కాకరకాయ తో సహా ఇంకెన్నో కురగాయల్ని కలుపుకుని నోరు వురిస్తుంటే ఇప్పుడు పండ్ల రుచులతో తాయారవ్వుతున్నాయి ఫ్రూట్ చిప్స్. మామీడి, పైనాపిల్, కివి, బొప్పాయి, పనస ఇలా అన్ని రకాల పండ్లు ఓవెన్ బేక్డ్, ఆయిల్ ఫ్రైడ్, ఎయిర్ ఫ్రైడ్, వాక్యుం ఫ్రైయ్యర్స్ తో తక్కువ నూనె తో ఈ పండ్ల చిప్స్ రంగు రుచి పోగొట్టుకోకుండా బోలుగా కరకరలాడతాయి. పండ్ల తో పాటు అన్ని రకాల కూరగాయలు చిప్స్ కూడా క్యారెట్, బీట్ రూట్, చమదుంప, కీరదోస, వంకాయ,బెండకాయ, దొండకాయ, ముళంగి, చిలకడదుంపతో సహా అన్ని కూరగాయలు చిప్స్ గా తాయారు అవుతున్నాయి. ఇవన్నీ ఏఫ్లేవర్ జతచేయకుండా ఆన్ లైన్ కాయగురాలు, పండ్లు యధాతదంగా ఫ్రైయర్లు పైన అధిక పిఇదనం తో వేగుతాయి కనుక ముక్కల్లోని నీరు ఆవిరై పోయి బోలుగా బావుంటాయి. ఫలానా కూరంటే, ఫలానా పండంటే నాకొద్దనే పిల్లలు ఈ చిప్స్ ను మాత్రం వద్దనడం లేదట!

    ఇక పండ్లు, దుంపల చిప్స్

    ఇప్పటి వరకు ఆలూచిప్స్, అరటికాయ, కాకరకాయ తో సహా ఇంకెన్నో కురగాయల్ని కలుపుకుని నోరు వురిస్తుంటే ఇప్పుడు పండ్ల రుచులతో తాయారవ్వుతున్నాయి ఫ్రూట్ చిప్స్. మామీడి, పైనాపిల్,…

  • ఆరోగ్యవంతమైన జీవన శైలి అలవర్చుకుంటే ముందుగా మన శరీరం మన కంట్రోల్ లో వుంటుంది. ప్రతి పని కొత్తగా, ఒక నవ్యతను ఆహ్వానిస్తూ చేయాలి. ఉదాహరణకు ఇంట్లో ట్రేడ్ మిల్ వుంటే ఎదో ఒక సమయంలో మన వ్యాయామం ఇంట్లోనే పూర్తి చేయొచ్చు అనుకుంటాం కానీ ఆరుబయట ప్రకృతిలో పరుగుదీస్తే శరీరం మెదడు రెండూ రీఫ్రెష్ అవుతాయి. పరుగులు పెడితే కండరాళ్ళు దృడంగా వుంటాయి. బరువు అదుపులో వుంటుంది. తొడలు, నడుము కిందభాగంలో పేరుకున్న కొవ్వు పోతుంది. ఉదయం వేళ పరుగులో విటమిన్-డి శరీరానికి దొరికే రోగ నిరోధాక శక్తి పెరుగుతుంది. అధిక మొత్తంలో కెలరీలు ఖర్చు అయ్యి పోతాయి. కొలెస్ట్రోల్ దూరమై గుండె ఆరోగ్యంగా, శరీరం దృడంగా వుంటుంది. మెదడుకి శరీరానికి మధ్య సమయం కుదిరి ఏకాగ్రత పెరుగుతుంది. జ్ఞాపక శక్తి వృద్ది అవ్వుతుందిఇలా ఒక చక్కని జీవన్ శైలి ఒక పరంపర. ఇలా ఒక అవయువానికి ఒక సంబంధం ఉన్నట్లే ఆరోగ్యానికి, శరీరానికి జీవన శైలికి మధ్య సంబంధం పరస్పరాశ్రయం.

    మంచి జీవన శైలితో ఎంతో ఆరోగ్యం

    ఆరోగ్యవంతమైన జీవన శైలి అలవర్చుకుంటే ముందుగా మన శరీరం మన కంట్రోల్ లో వుంటుంది. ప్రతి పని కొత్తగా, ఒక నవ్యతను ఆహ్వానిస్తూ చేయాలి. ఉదాహరణకు ఇంట్లో…

  • కొన్ని చక్కని కాంబినేషన్స్ తో గది గోడలు, కొద్దిపాటి అలంకరణ వస్తువులు, కొన్ని రంగుల కర్టెన్స్ వాడి అతి మాములుగా వున్న ఇంటికి అద్భుతమైన రూపం ఇస్తారు. ఇంటీరియర్ డెకరేటివ్స్. ఇప్పుడు డైనింగ్ రూమ్ కాస్త చిన్నదిగా వుంటే కొన్ని చిట్కాలతో విశాలంగా కనిపించేలా చేయొచ్చు. ముందుగా గోడలకు లేత రంగులు వేసుకోవాలి. గోడలకు షేడింగ్ వచ్చేలా రెండు మూడు కాంబినేషన్లు కలుపుకుంటే గది చిన్నదైపోతుంది. ఒకే రంగు తెలికైనదిగా ఉండేలా వేసుకోవాలి. రంగుల విషయంలో మొదటి జాగ్రత్త తీసుకోవాలి. డైనింగ్ రూమ్ లో పెద్ద కిటికీలు వుండాలి. కిటికీ కింద షెల్ఫులు ఏర్పాటు చేసుకుని క్యాబిన్లు అమర్చుకోవచ్చు. నిలువు గీతలున్న కర్టెన్స్ కూడా లేత రంగుల్లోనే వుండాలి. ఉడెన్ ఫ్లోరింగ్ తో స్థలం విశాలంగా వుంటుంది. తెలుపు రంగు ఫ్లోరింగ్ లో గాదె పెద్దదిగా కనిపిస్తుంది. గదినిండా వస్తువులు కుదరదు. విశాలమైన అద్దం వల్ల కూడా గది విశాలంగా వున్న భావన కలుగుతుంది.

    నిలువు గీతాల కర్టెన్స్ తో మరింత విశాలం

    కొన్ని చక్కని కాంబినేషన్స్ తో గది గోడలు, కొద్దిపాటి అలంకరణ వస్తువులు, కొన్ని రంగుల  కర్టెన్స్ వాడి అతి మాములుగా వున్న ఇంటికి అద్భుతమైన రూపం ఇస్తారు.…