• ఈ 19 సంవత్సరాల కౌధియా డియోపిస్ సెనెగల్స్ కి చెందిన మోడల్. ఈమె అందానికి సరికొత్త నిర్వచనం కారు నలుపు శరీర ఛాయ తెల్లని పళ్ళు ఒతైనా నల్లని రింగుల జుట్టు తో ఈమె సోషల్ మీడియా లో సంచలనం. శరీరం తో నలుపు వర్ణానికి కారణం మెలనిన్. ఈ నలటమ్మాయి తనను తానూ మెలనిన్ గాడెస్ గా చెప్పుకుంటుంది. ఈ అందమైన నల్లని రంగువల్లనే ప్రపంచమంతా ఫేమస్. పారిస్ ,న్యూయార్క్ లో మోడల్ గా పనిచేస్తున్న ఈమె శరీర వర్ణానికి సంబంధించిన ఓ క్యాంపైన్ ద్వారా మీడియా కంటబడింది. ఈమె ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో పెడితే రెండు లక్షల మంది ఫాలోవర్లు అవటంతో ఈమె ఇన్స్టాగ్రామ్ స్టార్ అయింది. తెల్లని తెలుపు సన్నని శరీరం మాత్రమే అందం అని పేర్చుకున్న గోడల్ని ఈ మెలనిన్ గాడెస్ లు చాలా మంది వస్తే బాగుండు.

    ప్రపంచమంతా ఫేమస్ ఈ శ్యామ సుందరి

    ఈ 19 సంవత్సరాల కౌధియా  డియోపిస్ సెనెగల్స్ కి చెందిన మోడల్. ఈమె అందానికి సరికొత్త నిర్వచనం కారు నలుపు శరీర ఛాయ  తెల్లని పళ్ళు ఒతైనా …

  • ఏ పెళ్లి కయినా వెళితే భోజనాలు అయినాక కిళ్ళీలు లేదా మౌత్ ఫ్రెషనర్ల మిశ్రమం కనిపిస్తుంది. సోంపు గింజలతో పాటు కొబ్బరి తురుమూ దోస గింజలు ,సౌర పప్పు ,మెత్తటి వక్క పలుకు ,కుంకుమ పువ్వు ఇంకా ఎన్నో సుగంధ ద్రవ్యాలు కలిపి ఇచ్చే ఆ మిశ్రమంలో ప్రధాన పాత్ర సోంపు గింజలకే. జీలకర్ర లాగే వుండే ఈ సోంపును డెజర్ట్లు ,స్వీట్లతో వాడతారు. బెంగాలీలయితే వాళ్ల కూరల్లో బేకరీ ఉత్పత్తులు సోంపు గింజల్ని వేస్తారు. ఇది మంచి ఔషధమే కాదు అద్భుతమైన పోషకాలు కూడా ఉన్నాయిట. కాపర్ ,ఐరన్ , కాల్షియం వంటి ఖనిజాలు A ,B,C,E విటమిన్లు సోంపు గింజల్లో పుష్కలంగా దొరుకుతాయి. సోంపు గింజల్ని నమిలితే లాలాజలంతో నైట్రేట్ల శాతం పెరిగి బీ.పీ నియంత్రణలో వుంటుంది. ఇందులో ఎక్కువగా వుండే పొటాషియం బీ.పీ కి గుండె ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. నోటి సువాసన కోసం కాకుండా సోంపు అలవాటుగా రోజూ తిన్నా మంచిదే.

    మంచి వాసనే కాదు ఆరోగ్యం కూడా

    https://scamquestra.com/21-finansovye-afery-questra-world-i-atlantic-global-asset-management-agam-questraworldes-atlanticgames-31.html

  • ఇండియా లో మొట్టమొదటి మహిళా ట్రక్ మెకానిక్ శాంతి దేవి శారీరిక మైన కష్టంతో కూడిన ఈ వృత్తిలో భర్త తో పాటు పాలుపంచు కుంటే శాంతి దేవిని ఎంతో ఆశ్చర్యంగా చూసారు. ఢిల్లీ లో ఉన్న సంజయ్ గాంధీ ట్రాన్స్ పోర్ట్ నగర్ లో టైర్లకు పంచ్ కు వేస్తూ కనిపిస్తుంది. 75 ఎకరాల్లో ఉన్న ఈ ట్రాన్స్ పోర్ట్ నగర్ లో సుమారు 70,000 ట్రక్కులు పార్క్ చేయచ్చు. 20,000 ట్రక్కులు తిరుగుతుంటాయి. టైర్లకు పంచర్లు వేసేందుకు స్థిరపడిన శాంతి దేవి అన్ని వాహనాల టైర్లకు పంచర్లు వేయగలరు. చాలా మంది మగవాళ్ల కంటే నేను బెటర్ మెకానిక్ ని కాకపోతే నేనా పనిచేస్తుంటే ఆశ్చర్యంగా చూస్తారు. అంటుందామె. ఆటో మొబైల్ రంగంలోకి ముఖ్యంగా ఇప్పటివరకు స్త్రీలు అడుగుపెట్టని రంగంలోకి ఆడవాళ్ళూ ప్రవేశించి ఆ హద్దులు చెరిపేయాలి. ఇదిగో కళ్ళ ముందే స్ఫూర్తి దాత శాంతి దేవి.

    మహిళా మెకానిక్ శాంతి దేవి ఒక్కరే

    ఇండియా లో మొట్టమొదటి మహిళా ట్రక్ మెకానిక్ శాంతి దేవి శారీరిక మైన కష్టంతో కూడిన ఈ వృత్తిలో భర్త తో పాటు పాలుపంచు కుంటే శాంతి…

  • బాల నటిగానే వెండి తెరకొచ్చిన రెజీనా కసాండ్రా కృష్ణ వంశీ నక్షత్రంలో ప్రస్తుతం నటిస్తోంది. చిన్నప్పుడు సైకాలజీ చదవాలి అనుకునేదట. చెన్నయ్ లోని విమెన్స్ క్రిస్టియన్ కాలేజీలో బి. ఏ సైకాలజీ తీసుకొందిట. కానీ ఇటు సినిమాల్లో బిజీ అయిపోయింది. కానీ ఎప్పుడు ఎదుటివాళ్ళ కష్టాలు పంచుకోవాలనే అనుకుంటుందిట. ఇప్పటికీ రెజీనా మూడు స్వచ్చంద సంస్థలతో కలిసి పనిచేస్తోందిట. హైద్రాబాద్ లోని పాఠశాలల్లో పిల్లలకు క్రీడా నైపుణ్యాలు నేర్పే లైఫ్ ఈజ్ ఎ బాల్ సంస్థ పాఠశాలల్లో పిల్లలకు ఇంగ్లీషు విలువలతో కూడిన విద్య నేర్పించే లైఫ్ ఫర్ ఎ చేంజ్ సంస్థ మూడోది ఆదిత్య మెహతా ఫౌండేషన్ కోరుకున్న దాని కోసం ఎంతైనా కష్టపడతానని చెప్పే రెజీనా తన బిజీ షెడ్యూల్స్ తో కూడిన జీవితాన్ని చాలా చక్కగా ప్లాన్ చేసుకుని సమయం మిగుల్చుకుని ఈ సేవ సంస్థలతో కలిసి పనిచేస్తానని చెపుతోంది. ఇప్పుడు తెలుగు చక్కగా నేర్చేసుకుందిట కూడా.

    సేవా సంస్థలతో కలిసి పనిచేస్తున్న రెజీనా

    బాల నటిగానే వెండి తెరకొచ్చిన రెజీనా కసాండ్రా  కృష్ణ వంశీ నక్షత్రంలో ప్రస్తుతం నటిస్తోంది. చిన్నప్పుడు సైకాలజీ చదవాలి అనుకునేదట. చెన్నయ్ లోని విమెన్స్ క్రిస్టియన్ కాలేజీలో…

  • వేలకు వేలు కర్చు పెట్టి కార్పోరేట్ కాలేజీలోచదివిస్తున్న ఉన్నత విద్య కోసం సీటు తెచ్చుకోలేని విద్యార్ధుల కోసంశివాంగి స్టొరీ. కాన్పూర్కి అరవై కిలో మీటర్ల దూరంలోని దేహా గ్రామంలో పుట్టిన శివాంగి తండ్రి తో పాటు దిన పత్రికలు, మాగజైన్లు అమ్ముతుండేది. ఆనంద కుమార్ నడుపుతున్న సూపర్ ౩౦ విద్యా కార్యక్రమం గురించి తలుసుకుని ఆయన్ను కలిసింది. పేద కుటుంబాల పిల్లల్ని ఐఐటి ఇంజనీర్లుగా తీర్చి దిద్దే కార్యక్రమం అది. శివాంగి ఆ కార్యక్రమానికి ఎంపికైనది. కోచింగ్ పూర్తి చేసుకుని ఐఐటి లో సీటు సంపాదించింది. మంచి కార్పోరేట్ ఉద్యోగం సంపదిన్చేసింది కూడా. ఈ అమ్మాయి విజయగాధను ఆనంద్ కుమార్ ఆమె ఫోటోలు, ఆమె ఇంట్లో వాళ్ళ ఆనందోత్సాహాలు పోస్ట్ చేస్తే వేలకొద్ది లైక్లు షేర్లు వచ్చాయి.

    ఆ శివాంగి ఇప్పుడు ఐఐటి గ్రాడ్యుయేట్

    వేలకు వేలు కర్చు పెట్టి కార్పోరేట్ కాలేజీలోచదివిస్తున్న ఉన్నత విద్య కోసం సీటు తెచ్చుకోలేని విద్యార్ధుల కోసంశివాంగి స్టొరీ. కాన్పూర్కి అరవై కిలో మీటర్ల దూరంలోని దేహా…

  • జీవితం లో తగిలిన ఒక్కో గాయం స్వర్ణలతకు బలమే ఇచ్చాయి. ప్రతి నైపుణ్యాన్ని ఒడిగ పెట్టింది. నాట్యం, పాట, ఈత లాంటి ఎన్నో కళాకారులతో పాటు పన్నెండు భాషలు నేర్చుకుంది. ఇంత నేర్చిన స్వర్ణలత ముల్టిపుల్ స్కిర్లోసిన్ బాధితురాలు. చక్రాల కుర్చికే పరిమితం మైన స్వర్ణలత జేవితం మాత్రం విశాలం. వికలాంగుల కోసం స్వర్ణ ఫౌండేషన్ స్థాపించింది. కాలం కూడ పట్టుకోలేని పక్షవాత బాధితులు బెంగుళూరు, పూణే, చెన్నై లోని విద్యార్ధులు కార్పోరేట్ సంస్థల ఉద్యోగుల కోసం వందల ప్రసంగాలు చేసింది. ఇద్దరు పిల్లల తల్లి స్వర్ణలత దివ్వాంగుల కోసం సారధి క్యాబ్ డిజైన్ చేసింది. తాగునీరు, మరుగుదొడ్డి వసతులున్న క్యాబ్లు ఇవి. దివ్వంగులకు వైద్యం, చదువు కోసం, ప్రభుత్వ ప్రేవైట్ సంస్థల్లో ప్రత్యేక వసతుల కోసం పోరాటం చేస్తూనే వుంది స్వర్ణలత.

    ఎంత విశాలం ఈమె జీవితం

    జీవితం లో తగిలిన ఒక్కో గాయం స్వర్ణలతకు బలమే ఇచ్చాయి. ప్రతి నైపుణ్యాన్ని ఒడిగ పెట్టింది. నాట్యం, పాట, ఈత లాంటి ఎన్నో కళాకారులతో పాటు పన్నెండు…

  • మిరపకాయ కొరికి చూస్తే కారం మండుతుంది. కానీ ఈ బుల్లి బఠానీ లాంటి మిరపకాయలు తింటే కంటే కొంటె దిమ్మ తిరిగిపోతుంది. అజిచరపితా గా పిలిచే ఈ బుల్లి మిరపకాయలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి. ఎంత అంటే కిలో 17 లక్షల నుంచి 23 లక్షల వరకు ధర పలుకుతాయి. ఉత్తర పేరు అడవుల్లో దొరికే వీటిని ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియా రైతులు వ్యాపార పంటగా పండించడం మొదలు పెట్టారు. తింటే తట్టుకోలేనంత కరంగా వుంటాయి కానీ వంటలకు గొప్ప రుచి ఇస్తాయట. కాస్త చల్లగా వుండే వాతావరణం మాత్రమే వీటిని సాగుచేసేందుకు అనుకూలంగా ఉంటుందిట.

    ఈ మిరపకాయ ఖరీదు కేజి 17 లక్షల పైనే

    మిరపకాయ కొరికి చూస్తే కారం మండుతుంది. కానీ ఈ బుల్లి బఠానీ లాంటి మిరపకాయలు తింటే కంటే కొంటె దిమ్మ తిరిగిపోతుంది. అజిచరపితా గా పిలిచే ఈ…

  • చాలా సహజంగా చెప్పుకోవలసిన విషయాలు వార్తల్లో చదువుతున్నాం. ఒక అత్తగారు మనుమరాలిని ఇచ్చిన కోడలికి కారు బహుమతిగా ఇచ్చింది. కడుపులో వున్నది ఆడపిల్ల అని తలియగానే చంపేసే సంప్రదాయపు రోజుల్లో వున్నాం కనుక ఇది ఆ అత్తగార్నే అభినందించవలసిన వార్త రాష్ట్ర ఆరోగ్య శాఖలో పదవీ విరమణ చేసిన ప్రేమా దేవి ఉత్తర్ ప్రదేశ్ లోని హామీద్ పూర్ జిల్లా లో వుంటారు. ఆమెకు ఒక్కడే కొడుకు. కోడలు ఖుష్బు చక్కని పాపాయిని కన్నది. ఇక వాళ్ళ ఇంట్లో పండగోచ్చింది. బంధు మిత్రులకు పార్టీ ఇచ్చారు. తన ఇంటికి చక్కని బంగారు తల్లిని తెచ్చిన కోడలికి ప్రేమా దేవి అందమైన కారుని బహుమతిగా ఇచ్చారు. ప్రేమా దేవి గురించి ఈ కధ వింటే ఆడపిల్లను వద్దు అనుకునే కుటుంబాలకు బుద్ది వస్తుందేమో!

    మా మంచి అత్తగారు

    చాలా సహజంగా చెప్పుకోవలసిన విషయాలు వార్తల్లో చదువుతున్నాం. ఒక అత్తగారు మనుమరాలిని ఇచ్చిన కోడలికి కారు బహుమతిగా ఇచ్చింది. కడుపులో వున్నది ఆడపిల్ల అని తలియగానే చంపేసే…

  • బ్రీతింగ్ వ్యయామాలు చేయడం వాల్ల రోజంతా ఉత్సాహంగా వుంటుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. కండరాలు రిలాక్స్ అవుతాయి. ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. శరీరంలో ప్రతి వ్యవస్థ పని తీరు మెరుగు పడుతుంది మానసిక ఏకాగ్రత శరీర పటుత్వం పెరుగుతాయి. రక్తపోటు తగ్గుతుంది. డీప్ బ్రీతింగ్ వ్యయామంతో ఎండార్ఫన్స్ విడుదలై నొప్పుల నుంచి ఉపసమనం కలుగుతుంది. రిలాక్సేషన్ పెరుగుతుంది. లింఫాటిక్ వ్యవస్థ సరిగ్గా పని చేస్తుంది. హాని కారక టాక్సిన్లు విడుదల చేసే ఈ వ్యవస్థ సరిగ్గా పని చేయడం వాల్ల శరీరం శుభ్ర పడుతుంది. తప్పకుండా ఈ ఎక్స్ ర్ సైజులు గురించి శిక్షణ తీసుకుని ప్రతి రోజు ప్రాక్టీస్ చేస్తే ఫలితం వుంటుంది.

    కండరాలల శక్తిని పెంచే వ్యయామం ఇది

    బ్రీతింగ్ వ్యయామాలు చేయడం వాల్ల రోజంతా ఉత్సాహంగా వుంటుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. కండరాలు రిలాక్స్ అవుతాయి. ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. శరీరంలో ప్రతి వ్యవస్థ పని…

  • యే దిల్ హై ముష్కిల్ లో ఐశ్వర్య తో పోటీ పడి నటించింది కదా అనుష్క. ఓ పాటలో ఇరవై కేజీల బరువున్న దుస్తులు, నగలు ధరించిందట ఆమె. “చన్న మేరియో” అనే పాటలో అనుష్క ధరించిన లెహంగా బరువు పదిహేడు కేజీలు. అందుకు సరిపోయే నగల బరువు మూడు కిలోలు. ఈ ప్రత్యేక నగల్ని మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. పాటలో రాణీలా అనుష్క హుందాగా కనిపించేందుకు మల్హోత్రా ఈ లేహంగాను నృరోస్కీ, జర్దోసీ, విలువైన రాళ్ళు, అద్దాలతో అందంగా రూపొందించాడు. పై దుపట్టా కూడా ఖరీదైందీ, బరువైందే. ఈ పాట చిత్రీకరణ నాలుగు రోజులు జరిగింది. అనుష్క రెండంతస్తుల మేడ లోని మొత్తం 30, 40 మెట్లు ఎక్కేదిగా నృత్యం చేసింది. ఇరవై కేజీల బరువుతో సన్నగా, నాజుగ్గా వుండే అనుష్క ఎంత కష్ట పడిందో. అయితేనే పీకే, సుల్తాన్, యే దిల్ హై ముష్కిల్ అన్నీ ఆమెకు పేరు తెచ్చినవే.

    ఇరవై కేజీల బరువైన కాస్ట్యుమ్స్ తో

    యే దిల్ హై ముష్కిల్ లో ఐశ్వర్య తో పోటీ పడి నటించింది కదా అనుష్క. ఓ పాటలో ఇరవై కేజీల బరువున్న దుస్తులు, నగలు ధరించిందట…