• సెల్ ఫోన్ తో సెల్ఫీస్ తీసుకోవడం ఇప్పటి ట్రెండ్ కదా. అప్పుడు మనం మనకి మనమే అందంగా ఫోటోలు దిగడం కష్టమే. ఈ బాధ లేకుండా సెల్ఫీ ఎన్ హాన్సింగ్ లైవ్ ఫీడ్ ఇమేజ్ ఇంజిన్ (సెల్ఫీ అన్నమాట) అనిపించే ఒక అద్దం వచ్చేసింది. ఈ అద్దం ముందు నిలబడి ఓ నవ్వు నవ్వితే అద్దమే ఫోటో తీసి దాన్ని ట్విట్టర్ లో అప్లోడ్ చేస్తుంది. ఈ అద్దానికి కెమేరా తో పాటు మన ముఖాన్ని గుర్తించే సెన్సార్లు కూడా వుంటాయి కాబట్టి మనం అద్దం ముందు నిలబడి నవ్వగానే దాని పైన వుండే ఎల్ ఇ డి లైట్లు ఫోటో తీయడానికి సిద్ధంగా వునట్లు వెలుగుతాయి. మనకు కావాల్సిన ఫోజు పెడితే అద్దం ఫోటో తీసి ట్విట్టర్ అకౌంట్ కి అప్లోడ్ చేసేస్తుంది. ఈ మయాదర్పణాన్ని కావాలంటే ఆర్డర్ చేసి కొనుక్కో వచ్చు.

    ఇది ఫోటో గ్రాఫర్ అద్దం

    సెల్ ఫోన్ తో సెల్ఫీస్ తీసుకోవడం ఇప్పటి ట్రెండ్ కదా. అప్పుడు మనం మనకి మనమే అందంగా ఫోటోలు దిగడం కష్టమే. ఈ బాధ లేకుండా సెల్ఫీ…

  • ఇటు ఇంటి పనులు, అటు ఉద్యోగ బాధ్యతలతో క్షణం క్షణం తీరిక లేకుండా పని చేస్తుంటారు మహిళలు. ఈ యాంత్రికత పెరిగే కొద్దీ ఒత్తిడి తప్పదు. ఇందుకోసం పది నిముషాలు కేటాయించుకొండి, ఆ సమయంలో ఇలా చేయండి అంటున్నారు నిపుణులు. హాయిగా నవ్వుకోవడం, ఓ పాట పడుకోవడం లేదా ఒక్క పది నిమిషాలు విశ్రాంతిగా నిద్రపోవడం అయినా పర్లేదు. ఈ నిద్రని కూడా పవర్ న్యాప్ అంటారట. ఇలా చేస్తే కూడా ఒత్తిడి మాయమై జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది అంటున్నారు. జర్మనీ అధ్యయిన కారులు లేదా తోట పని మనస్సు ప్రశాంతత కోసం ధ్యానం అన్నింటికంటే బెస్ట్ పుస్తకం చదివే అలవాటు డెవలప్ చేసుకుంటే అన్ని రకాల వటత్తిడిలు మాయమైపోతాయంటున్నారు. తప్పని సరిగా సాహిత్యపు ఉద్యానవనం లోకి తలుపులు తెరవండి, సుఖంగా వుంటారు.

    పది నిమిషాలు కేటాయించినా చాలు

    ఇటు ఇంటి పనులు, అటు ఉద్యోగ బాధ్యతలతో క్షణం క్షణం తీరిక లేకుండా పని చేస్తుంటారు మహిళలు. ఈ యాంత్రికత  పెరిగే కొద్దీ ఒత్తిడి తప్పదు. ఇందుకోసం…

  • నోరు కట్టేసుకుని తిండి మానేసి వయామం చేస్తే తప్పని సరిగా బరువు తగ్గిపోతారు. ఇందులో షార్ట్ కార్ట్స్ ఏమి వుండవు. కనీసం అరగంట పాటు వ్యాయామం చేస్తూ పది రోజులకో సారి బరువు చూసుకుంటే ఎంత తగ్గుతున్నారో తెలుతుంది. ఆ తగ్గిన బరువు ఇంక పెరగనీయ వద్దు. వండుకునే విధానంలో మార్పు రావాలి. వేపుళ్ళు మానేసి గ్రిల్, బేక్, ఆవిరి మీద ఉడికించిన పదార్దాలే ఎంచుకోవాలి. ఇంట్లో వాళ్ళతో స్నేహితులతో బయటకు వెళ్ళినా నూనె, వెన్నా, నెయ్యి, క్రీమ్ లాంటివి, మైదా తో వండినవి ఎప్పుడూ ముట్టుకోవద్దు. సరదాగా కాలక్షేపం చేస్తూ కూడా సలాడ్లు, పళ్ళ రసం ఓ గ్లాసుతో సరిపెట్టుకోవాలి. మొత్తానికి బరువు తగ్గాలంటే తిండి పైన ఓ కన్నేసి వుంచాలి, అంతే.

    తగ్గాక మళ్ళి బరువు పెరగ వద్దు

    నోరు కట్టేసుకుని తిండి మానేసి వయామం చేస్తే తప్పని సరిగా బరువు తగ్గిపోతారు. ఇందులో షార్ట్ కార్ట్స్ ఏమి వుండవు. కనీసం అరగంట పాటు వ్యాయామం చేస్తూ…

  • త్రెడ్ మిల్ చేసినప్పుడు బరువైన షూలు వేసుకుంటే తొందరగా అలసిపోతారని చెప్పుతున్నారు అధ్య యినకారులు. తేలికైన షూలలో తొందరగా పరుగెత్త గలరు, ఎక్కువ ఎనర్జీ పెట్టగలరు అలాగే పరుగెత్తే వేగం కూడా పెరుగుతుందిట. బరువైన రకాల షూలలో కొంతమందితో చేసిన అధ్యయినంలో షూల బరువుతో ఎనర్జీ లెవెల్స్ బాగా తగ్గుతాయట. షూల బరువుతో రన్నర్స్ పరుగు వేగం తగ్గింది. అందుకే ఇంట్లో పారుగెత్తినా బయట విశాలమైన మైదానంలో పరుగు తీసినా అస్సలు పరుగు పెట్టడం మాత్రం ముఖ్యం అని మైండ్ లో ఉంచుకోండి. ఫిట్ నెస్ కోసం ఈ పరుగు ఈ మంత్రం మరచిపోవద్దు.

    తేలికైన షూలో పరుగు ఈజీ

    త్రెడ్ మిల్ చేసినప్పుడు బరువైన షూలు వేసుకుంటే తొందరగా అలసిపోతారని చెప్పుతున్నారు అధ్య యినకారులు. తేలికైన షూలలో తొందరగా పరుగెత్త గలరు, ఎక్కువ ఎనర్జీ పెట్టగలరు అలాగే…

  • గర్భస్థ శిశువు ఆరోగ్యం తల్లి తీసుకునే ఆహారం పైనే ఆధారపడి ఉంటుందన్న సంగతి తలిసిందే. అయితే గర్భవతిగా ఉన్నస్త్రీ రోజు 150 మిల్లీ లీటర్ల పాలు తాగినట్లయితే పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండటంతో పాటు మంచి హైటు కూడా వుంటాడని ఇటీవల నిర్వహించిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. సుమారు 800 మంది పిల్లల పైన 20 సంవత్సరాల పాటు సాగిన ఈ అధ్యాయినం ఈ రిపోర్ట్ వెల్లడించింది. ప్రతి రోజు పాలు తాగిన వారి పిల్లల్లో ఆరోగ్యం, ఎత్తుతో పాటు ఐక్యు కూడా మెరుగ్గా వుండటాన్ని గుర్తించారు. సో గర్భవతిగా వున్న వాళ్ళు పాలు తాగడం మంచిది.

    పిల్లలు ఆరోగ్యంగా జన్మించాలంటే

    గర్భస్థ శిశువు ఆరోగ్యం తల్లి తీసుకునే ఆహారం పైనే ఆధారపడి ఉంటుందన్న సంగతి తలిసిందే. అయితే గర్భవతిగా ఉన్నస్త్రీ రోజు 150 మిల్లీ లీటర్ల పాలు తాగినట్లయితే…

  • ఎన్నో వింతలూ విశేషాలు చూస్తుంటే పిల్లలకీ పెద్దలకీ స్ఫూర్తిగా వుంటాయేమో అనిపిస్తుంది. ఇదిగో ఈ కనిపించే మీనియేచర్ మట్టి బొమ్మలు కూడా అలాంటివే. అమెరికాకు చెందిన కళాకారులు కిమ్ చేతిలో రూపం పోసుకున్న ఈ రకరకాల ఆహార పదార్ధాల రంగుల చాక్ పాన్టేల్స్ అతి సహజంగా అనిపించేలా తీర్చి దిద్దాడు. ఇంత బిన్నంగా అచ్చంగా నిజంగా ఆహారం అనిపించేలా చేయడం గొప్పే కదా. మనింట్లో పిల్లలతో, లేదా తీరికగా వుండే ఇళ్ళల్లో ఇలాంటివి ప్రాక్టీసు చేస్తే ఎంతో బాగుంటుంది.

    అవి మట్టిబొమ్మలు తినేవి కావు

    ఎన్నో వింతలూ విశేషాలు చూస్తుంటే పిల్లలకీ పెద్దలకీ స్ఫూర్తిగా వుంటాయేమో అనిపిస్తుంది. ఇదిగో ఈ కనిపించే మీనియేచర్ మట్టి బొమ్మలు కూడా అలాంటివే. అమెరికాకు చెందిన కళాకారులు…

  • ఇప్పుడు ఇరవై ఎళ్ళే కదా ఇప్పుడెం వ్యయామం ఇంకో ఐదేళ్ళు పోయాక చూద్దాం అనుకుంటే ప్రాబ్లం అంటున్నారు ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్స్. ముప్పై దాటాక బరువు పెరిగి అప్పుడు తీరైన శరీరం కోసం కష్టపడిన ప్రయోజనం ఉండదు. పెద్దగా బాద్యతలు బరువులు లేని ఇరవయ్యేళ్ళ వయస్సులో చేసె వ్యయామానికి శరీరం చక్కగా సహకరించడమే కాకుండా వ్యయామం జీవితాంతం జీవన శైలిలో భాగంగా ఉంటుంది. ఈ వయసులో ఏ రకమైన వ్యయామం అయిన చేయవచ్చు. ఈ వయసులో వ్యయామం వల్ల కండరాలు చక్కగా వృద్ది చెందుతాయి. కోవ్వు దరి చేరకుండా ఉంటుంది. నడకతో పాటు పుష్ అప్స్,చిన్ అప్స్ ,స్క్వాట్స్ మంచి వ్యయామం అంటున్నారు ఫిట్ నెస్ ట్రైనర్స్.

    ఇరవైల్లొనే వ్యయామం బెస్ట్

    ఇప్పుడు ఇరవై  ఎళ్ళే కదా ఇప్పుడెం వ్యయామం ఇంకో ఐదేళ్ళు పోయాక చూద్దాం అనుకుంటే ప్రాబ్లం అంటున్నారు ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్స్. ముప్పై దాటాక బరువు…

  • కరాచీలో జరిగిన ఫ్యాషన్ వీక్ లో 44 సంవత్సరాల ముక్తార్ మాయీ పాల్గొన్నాది. ఆమె సెలెబ్రెటీలకే సెలబ్రెటీ. 14 సంవత్సరాల క్రితం ఆమె గ్యాంగ్ రేప్ కు గురైంది. 2002 సంవత్సరంలో మాయీ సోదరుడు తన ప్రత్యర్థి కుటుంబాన్ని అవమానించాడు. దానికి బదులు గ్రామా గిరిజన పెద్దలు ముక్తార్ మాయీ పై సామూహిక అత్యాచారం జరపాలని ఆమెను బహిరంగంగా నగ్నంగా వీధుల్లో తిప్పాలని కఠిన శిక్ష విధించారు. శిక్ష అనుభవించిన ముక్తార్ తనకు జరిగిన అన్యాయం పై న్యాయ పోరాటం చేసింది. సుప్రీమ్ కోర్టు కు ఎక్కింది. తన అనుభవాలతో ముక్తార్ మహిళల హక్కుల కోసం ఉద్యమించింది. తాను మీర్ వారా గ్రామంలో ఒక ఆడపిల్లల స్కూల్ అనాధ మహిళల కోసం కేంద్రాన్ని స్థాపించింది. ఈ సెలబ్రెటీ రాంప్ వాక్ లో అందరు ఆమెను అభినందించారు.

    ఎన్ని నోళ్లతో పొగడాలి ఈమెను

    కరాచీలో జరిగిన ఫ్యాషన్ వీక్ లో 44 సంవత్సరాల ముక్తార్ మాయీ పాల్గొన్నాది. ఆమె సెలెబ్రెటీలకే సెలబ్రెటీ. 14 సంవత్సరాల క్రితం ఆమె గ్యాంగ్ రేప్ కు…

  • గుమ్మడి కాయలతో తియ్యని కూర,పులుసు సూప్ చేస్తుంటాం. ఇది రుచి మాత్రమే కాకుండా ఎన్నో రకాల పోషకాలు ఇస్తుంది. గుమ్మడి గుండె కి ఎంతో మేలు చేస్తుంది. దినిలో పీచు పదార్దాలు,విటమిన్ సి గుండె కు రక్త సరఫరా సవ్యంగా జరిగెలా చూస్తుంది. అధిక రక్తపోటు నివారిస్తుంది. గుమ్మడి కాయలో ఉండే విటమిన్ ఇ,బిటాకెరోటిన్లు కంటికి ఏంతొ మేలు చేస్తుంది. చదువుకునే పిల్లలకు గుమ్మడి తో చేసిన వంటలు తినిపించాలి. ఇందులో ఉండే ఐరన్ సంతాన సాఫల్యత ను పెంచుతుంది. వ్యాది నిరోధక శక్తి పెంచి ఇన్ ఫెక్షన్లను దూరం చేస్తుంది. నిద్ర లేమి తో బాధ పడే వారు గుమ్మడి గిజలు తినవచ్చు.

    గుమ్మడి తో గుండె కెంతో మేలు….

    గుమ్మడి కాయలతో తియ్యని కూర,పులుసు సూప్ చేస్తుంటాం. ఇది రుచి మాత్రమే కాకుండా ఎన్నో రకాల పోషకాలు ఇస్తుంది. గుమ్మడి గుండె కి ఎంతో మేలు చేస్తుంది.…

  • సింక్ ,ఒవేన్ , ఫ్రిజ్ వాటిలో పాటు వంట చేసుకునే సామాను మొత్తం ఇమిడిపోయే చిన్న వంట గది నిర్మించటం సాధ్యమా సరే పోనీ ఆ వంట గదిని అవసరం లేకపోతే అడ్డం అనుకుంటే మొత్తం మూసి పెట్టేసి వెనక్కి జరిపి వేయగలమా ? ఏ ఈప్రశ్నలకు సమాధానం ఒరిజనల్ సర్కిల్ కిచెన్ . 1.8 చదరపు మీటర్ల వైశాల్యంతో స్తంభంలా గుండ్రంగా నిలువుగా వుండే ఈ వంట గది చూసేందుకు చిన్నగా ఉంటుంది కానీ ఇందులో ఎన్నో కబోర్డ్లు మినీ ఫ్రిజ్ మైక్రో వేవ్ ఒవేన్ , సింకులు , అన్నీ వున్నాయి. ఏ ఈమొత్తం భాగాన్ని 180 డిగ్రీల కోణంలో ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు. ఇక కబోర్డ్ జరిపేసి పెట్టేస్తే అవసరం అయినప్పుడు కిచెన్ లా మార్చేయచ్చు. ఆన్ లైన్లో మేరె చూడండి.

    రెడీ మేడ్ వంట గది

    సింక్ ,ఒవేన్ , ఫ్రిజ్ వాటిలో పాటు వంట చేసుకునే సామాను మొత్తం ఇమిడిపోయే చిన్న వంట గది నిర్మించటం సాధ్యమా సరే పోనీ ఆ వంట…