స్టార్టప్ నెమ ఎఐ స్టార్టప్ స్థాపించి సామాజిక శ్రేయస్సు కోసం కృత్రిమ మేధను ఉపయోగించుకోవాలనే తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నది నిధి. మెదడు పనితీరు గుర్తించేందుకు దాని గురించి అవగాహన కలిగించేందుకు, మార్గ నిర్దేశనం చేసేందుకు నెమ ఏఐ ఉపయోగపడుతుంది. గత సంవత్సరం షార్క్ ట్యాంక్ ఇండియా టెలివిజన్ షో పాల్గొన్న తర్వాత ఇన్వెస్టర్ల నుంచి ఆమె స్టార్టప్ కు చక్కని స్పందన వచ్చింది అటిజం,డిస్లెక్సియా అటెన్షన్-డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ వంటి వైకల్యాల గురించి తన స్టార్టప్ ద్వారా అవగాహన పెంచాలనేది నిధి లక్ష్యం.













