నిరమై హెల్త్ అనలిటిక్స్ స్టార్టప్ తో విజయపథంలో ఉన్నారు. బెంగళూరుకు చెందిన గీతా మంజునాథ్ వైద్య సాంకేతిక రంగంలో నిరామై ప్రత్యేక గుర్తింపు సాధించింది. అతి తక్కువ ఖర్చుతో క్యాన్సర్ ను గుర్తించే కొత్త స్క్రీనింగ్ సాఫ్ట్ వేర్ థర్మాలిటిక్స్ రూపొందించింది నిరమై. ఈ క్లౌడ్ బెస్ట్ టెక్నాలజీని ఇతర వ్యాధులు గుర్తించటంలో కూడా ఉపయోగించవచ్చు. ఆసియా తో పాటు యూరప్ దేశాల్లో ఈ ప్రోడక్ట్ విక్రయాలకు అనుమతి ఉన్నది.2021లో డాక్టర్ గీత మంజునాథ్ ఇన్నోవేటర్ ఆఫ్ ది ఇయర్ విభాగంలో అవార్డు గ్రహీత లలో ఒకరుగా ఎంపికయ్యారు.













