ఐఏఎస్ అధికారిణి టీనా దాబి తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జల్ సంజయ్ జన్ భగీరది (జన భాగస్వామ్యంతో జల సంరక్షణ) అవార్డ్, రెండు కోట్ల నగదు బహుమతి అందుకొన్నారు రాజస్థాన్ లోని బార్మర్లో జల సంరక్షణకు నడుం కట్టారు. నీళ్ల ట్యాంకులు చెరువులు దిగుడు బావులను పునరుద్దరించారు. గ్రామాల స్వయం సమృద్ధి మహిళ సాధికారతే లక్ష్యంగా పనిచేసే టీనా దాబి భోపాల్ లో పుట్టి పెరిగారు.2015లో సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసి తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్ టాపర్ అయ్యారు. ఆల్ ఇండియా టాపర్ గా ఘనత వహించిన తొలి దళిత మహిళగా రికార్డ్ సృష్టించారు టీనా దాబి.













