పాలకూర వంటి ఆకుల తో, చూసేందుకు ముల్లంగి లా ఉండే బీట్ షుగర్ చెరుకు లాగా చాలా తీయనిది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, పోలాండ్, జపాన్ వంటి 50 దేశాల్లో దీన్ని ప్రధాన పంటగా పండిస్తున్నారు. నాలుగు నెలల్లో చేతికి వచ్చే ఈ బీట్ షుగర్ దుంపలు 75 శాతం నీరు ఉంటుంది. ఫార్మా, కాస్మెటిక్ రంగాల్లో దుంప చక్కెర వినియోగం పెరుగుతోంది. హైదరాబాద్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, సంగారెడ్డి లోని బసంత పూర్ వ్యవసాయ పరిశోధనా క్షేత్రం లోనూ ఈ పంట ప్రయోగాత్మకంగా వేశారు. ఇది చక్కెరకు ప్రత్యాన్మయం అవుతోంది .













