ఈ సంవత్సరం హరూన్ ఇండియా ఆర్ట్ లిస్ట్ 2025 జాబితాలో మహిళా శక్తి కి మకుటం లాగా నిలిచారు 85 సంవత్సరాల కళాకారిణి పద్మశ్రీ అవార్డు గ్రహీత అంజోలీ ఎలా మీనన్.గడచిన సంవత్సరంలో ఏకంగా 8.7 కోట్ల టర్నోవర్ తో ఈ జాబితాలోని మహిళల్లో అగ్రస్థానంలో ఉన్నారు. ఆమె గీసిన 32 కళాఖండాలు అమ్ముడుపోగా అందులో ఒక చిత్రం 14 కోట్లు కు అమ్ముడైంది. ఆమె చిత్రాలు చండీగఢ్ మ్యూజియం పీబోడీ ఎసెక్స్ మ్యూజియం తో సహా అనేక ప్రధాన ప్రదర్శనలలో ఉన్నాయి. కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో లోని ఏషియన్ ఆర్ట్ మ్యూజియం ఆమె గీసిన ‘యాత్ర’ చిత్రం కొన్నది. ఆమె సుప్రసిద్ధ కుడ్య చిత్రకారిణి.2000 లో ఆమెకు పద్మశ్రీ వచ్చింది.













