ఫ్లయింగ్ ఆఫీసర్ తనుష్క సింగ్ వైమానిక దళం యొక్క ఫైటర్ జెట్ జాగ్వర్ స్క్వాడ్రన్ మొదటి మహిళా పైలట్ భూమిపై ఉన్న టార్గెట్స్ ధ్వంసం చేసేందుకు, యుద్ధభూమిలోకి దూసుకుపోయి శత్రుదేశాల సమాచారాన్ని సేకరించేందుకు ఈ జెట్ విమానాలు ఉపయోగిస్తారు. తనుష్క పుట్టింది ఉత్తర ప్రదేశ్,పెరిగింది చదువుకుంది అంతా మంగళూరు లోనే, తండ్రి, తాత ఇద్దరు మిలటరీ ఆఫీసర్లు. తనుష్క కూడా ఆర్మీ అధికారిణి కావాలని కలలు కన్నారు. బీటెక్ పూర్తి చేశాక వాయి సేవలో మహిళలకు అవకాశాలు ఉన్నాయని తెలుసుకున్నారు తనుష్క. షార్ట్ సర్వీస్ కమిషన్ లో ఉత్తీర్ణులైన దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు.ఎయిర్ క్రాఫ్ట్ నడపడం లో స్పెషలైజేషన్ చేసి జాగ్వార్ పైలెట్ అయ్యారు.













