ఇరవై సంవత్సరాల మంగళూరు స్టూడెంట్ రెమోనా ఎవెట్ పెరీరా ఏకధాటిగా 170 గంటల పాటు భరతనాట్యం ప్రదర్శన ఇచ్చి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించింది. బి ఏ ఫైనల్ చదువుతున్న రెమోనా చిన్నతనం నుంచే భరతనాట్యం నేర్చుకుంది.ఫైటింగ్ ఇతర భారత నాట్య రీతులు కూడా సాధన చేసింది. ఆమె నాట్య ప్రయాణంలో తల్లి ఎంతో తోడుగా నిలిచింది ట్రాన్స్ జెండర్ పిల్లలకు భరతనాట్యం నేర్పే రెమోనా కు భరతనాట్యంలో పి హెచ్ డి చేయాలని కోరిక. ఈ కళారూపాన్ని పూర్తిగా అధ్యయనం చేస్తానని చెప్పే రెమోనా గతంలో నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాష్ట్రీయ బాల పురస్కార్ ను అందుకున్నది.













