2023 జాతీయ పురస్కారాల్లో “ఉళ్ళోజుక్కు” (అంతః ప్రవాహం) మలయాళ సినిమాకు ఉత్తమ సహాయ నటి అవార్డు అందుకున్నది నటి ఊర్వశి ఈ సినిమాకు జాతీయ ఉత్తమ చిత్రంగా కూడా పురస్కారం అందింది. ఈ సినిమాలో అత్తగారి పాత్ర లో ఊర్వశి కోడలిగా పార్వతి తిరువోతు నటించారు పెళ్లైన కుమారుడు కొన్నేళ్లకే జబ్బు పడి మరణిస్తాడు అతను దహన సంస్కారాలు జరిపించేందుకు అవకాశం లేకుండా వర్షం ప్రవాహం వరదలు అత్తా కోడలు తమ జీవితాల్లో ఏర్పడిన లోటుతో మానసిక వ్యధ తో సతమతం అవుతారు. చివరికి అత్తగారు కోడలిని తన ప్రియుడితో వెళ్లేందుకు సమ్మతిస్తుంది.ఇందులో ఊర్వశి అద్భుతమైన నటన చూసి తీరాలి.













