అందాల నవ్వుకో కానుక

అందాల నవ్వుకో కానుక

అందాల నవ్వుకో కానుక

జీవిత బీమా ఎవరైనా చేయించుకుంటారు కానీ కొందరు సెలబ్రెటీలు శరీర భాగాలకు ఇన్సూరెన్స్ చేయించుకుని ప్రసిద్ధికెక్కుతారు. బ్రిటన్ కు చెందిన సింథియా,గ్రామీ ఎమ్మీ,టోనీ వంటి అవార్డులు పొందింది. ఆస్కార్ కు కూడా నామినేట్ అయింది. ఈమె పూర్తి పేరు సింథియా ఎరివో. ముందు పళ్లలో కాస్త గ్యాప్ తో ఆమె నవ్వు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మౌత్ వాష్ కంపెనీ లిస్టెరిన్ నిర్వహించే వాష్ యువర్ కార్యక్రమానికి ఆమె ప్రచార వేత్త.తనకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చిన నవ్వుకు కానుకగా తన నోటిని 16.5 కోట్ల రూపాయలకు  ఇన్సూర్ చేయించింది సింథియా.