• రోజుకు పది వేల అడుగులు నడిస్తే ఆరోగ్యం అని పరిశోధనలు ఏ నాడో చెప్పాయి. ఇప్పటికి ఎందరో ఆచరణ లో పెట్టారు కూడా. కానీ కొత్త పరిశోధనలు ఇన్ని వేల అడుగుల నడక వల్ల కాలోరిలు కర్చుఅవ్వుతాయి కానీ ప్రయోజనం ఇకేముంటుంది అంటున్నారు. వుబకయం వుంటే కాస్త తగ్గుతారు, బరువు పెరగ కుండా వుంటారు. కానీ మరి సాధారణ బరువు ఆరోగ్యం వున్నవాళ్ళ కి ఇంత కష్టమైన ఎక్స్ సైజులు వద్దంటున్నారు. రెండు నుంచి మూడు వేల అడుగులు చాలు అది సాధారణమైన మన్యుషులకు కరెక్ట్ వ్యాయామం. అంటే కానీ నడక తో అంతంత సేపు శరీరాన్ని కష్ట పెడితే కిళ్ళ నొప్పులు తప్పవంతున్నారు. 50 ఏళ్ళు దాటితే, ఇంక ఆ వయస్సులో కిళ్ళ నొప్పుల తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. తీసుకునే ఆహారం చాలా తక్కువైపోతుంది. ఆరోగ్య స్పృహ వల్ల ఒక్క పూటే అన్నం, చపాతీలు, ఇంకా కొన్ని పళ్ళు తిని సారి పెట్టుకుంటారు. లేదా వృద్దాప్య దశ లో అంత కంటే ఎక్కువ అరగదు కనుక ఆ తినే ఆహారానికి సరిపడా నడకే ఎంచుకోమంటున్నారు. ఇంకా ఎక్కువ నడవాలంటే వైద్యుల సలహా పైన మాత్రమే అంటున్నారు.

    అంత నడక వద్దే వద్దు

    రోజుకు పది వేల అడుగులు నడిస్తే ఆరోగ్యం అని పరిశోధనలు ఏ నాడో చెప్పాయి. ఇప్పటికి ఎందరో ఆచరణ లో పెట్టారు కూడా. కానీ కొత్త పరిశోధనలు…

  • ఈ ప్రపంచం లో ఎవరెక్కడ వున్నా కొన్ని మంచి అలవాట్లు మనం అదుపు చేసుకోవచ్చు. ఇప్పటికి మనం ప్రపంచం మొత్తం తినే రకరకాల ఆహారాలు తలుసుకుని మరీ తిని సంతోషిస్తున్నాం. ఇప్పుడు జపనీయుల ఆహారపు అలవాట్ల వల్లనే వాల్లు నాజుకుగా ఉంటారని తలుస్తుంది. అన్ని వెరైటీలు వుంది తినేందుకు రుచిగా వుంటుంది వాళ్ళ ఆహారం. ఒక కప్పు అన్నం , మీసా సూప్ , మూడు సైడ్ డిష్లు, ఆ మూడింటి లో ఒక చేప, మాంసం, టోపు తో చేసిన వంటకం వుంటాయి. లేదా కూరగాయలు, ఆకు కూరలతో చేసిన వంటకాలు. వుంటాయి. రకరకాల ఫాస్ట్ ఫుడ్లు ఈ ఆహార పదార్ధాల తోనే చేస్తారు. చిన్ని ప్లేట్ లో తక్కువ పదార్ధాలు తింటారు. వాళ్ళకి వ్యక్తి గత వాహన వినియోగం తక్కువ. పబ్లిక్ ట్రాస్పోర్ట్, నడక, సైకిలింగ్ ఇవే దైనందన జీవితం లో ఉండేవి. ఇదే వ్యాయామం వాళ్ళకి. ముడి బియ్యం, నూనె తక్కువగా చేసే ఆహారం అన్ని రకాల పోషకాలు వుండేలా ఏర్పాటు చేసుకున్న ఆహారపు అలవాట్లు. వీటి గురుంచి అలోచించి ఆహారపు అలవాట్లు కొన్ని మార్చుకో గలమేమో?

    ఇందుకే జపాన్ వాళ్ళు చాలా స్లిమ్

    ఈ ప్రపంచం లో ఎవరెక్కడ వున్నా కొన్ని మంచి అలవాట్లు మనం అదుపు చేసుకోవచ్చు. ఇప్పటికి మనం ప్రపంచం మొత్తం తినే రకరకాల ఆహారాలు తలుసుకుని మరీ…

  • పండగలకి, పార్టీలకీ, పుట్టిన రోజులకి అన్నింటికీ అలంకరణ లో కొత్త ధీమ్స్ వస్తున్నాయి.. అన్నింటిలోనూ కాస్త తక్కువ కర్చుతో పోయేది బెలూన్ల థీమే. రంగు రంగుల బెలూన్ల తో ఎన్నో డిజైన్ల తో చేయడం, దాంతో ఫంక్షన్ కు మంచి అట్రాక్షన్ రావడం చూస్తూనే వున్నాం. అంత వరకు పర్లేదు పార్టీ అయ్యాక వాటిని పిన్నుల తో గుచ్చి పగుల గొట్టడం ఇంకో సరదా. కానీ వాటి నుంచి వచ్చే శబ్దం షాట్ గన్ పేలుల్ల కన్నా ఎక్కువని, ఇది వినికిడి సమాధ్యాన్ని దెబ్బ తీస్తుందని పరిశోధనలు చెపుతున్నాయి. పిన్ను తో గుచ్చడం, పగిలే వరకు వుదటం, గట్టిగా నొక్కడం ఇలా మూడు రకాలుగా బెలూన్లు పగలుగొట్టినప్పుడు 168 డెసిబల్స్ శబ్దం వేలువాడుతుందని, ఇది 12 గాజ్ షాట్ గన్ శబ్దం కన్నా ఎక్కువని వాళ్ళు చెపుతున్నారు. సాధారణం గా 140 డెసిబల్స్ దాటిన ఏ శబ్ధమైనా చెవికి ప్రమాదమే కాబట్టి వాటికి దూరంగా ఉండటమే మంచిది.

    బెలూన్ లు పగలగోడితే చెవికి ముప్పు

    పండగలకి, పార్టీలకీ, పుట్టిన రోజులకి అన్నింటికీ అలంకరణ లో కొత్త ధీమ్స్ వస్తున్నాయి.. అన్నింటిలోనూ కాస్త తక్కువ కర్చుతో పోయేది బెలూన్ల థీమే. రంగు రంగుల బెలూన్ల…

  • ఎండా కాలం వచ్చేసింది. బయటకి పొతే చాలు గొంతు తడి పోతుంది. ఎదో ఒకటి చల్లగా తగేయాలనిపిస్తుంది. అప్పుడు ఎదో ఒక్క కూల్ డ్రింక్ వైపు మనస్సు లగేస్తుంది. కానీ ఈ కూల్ డ్రింక్స్ వల్ల రొమ్ము కాన్సర్ వచ్చే అవకాశాలు మెండుగా వున్నాయి అంటున్నాయి అధ్యాయినాలు. చల్లగా తాగే కూల్ డ్రింక్స్ అప్పటికప్పుడు దాహం తీరుస్తాయి కానీ ముందు ముందు ప్రమాదాలు తప్పవు. వీటిలో అధికంగా వుండే చెక్కర, ప్రిజర్వేటివ్ లు ఇతర రసాయినాలు బరువును పెంచడం తో పాటు ఇతరాత్రా రోగాలకు దారి తీస్తాయని కాలిఫోర్నియా విశ్వ విద్యాలయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. యుక్త వయస్సులో మహిళలు దీర్ఘకాలం కడుపు మంట, అల్సర్ల తో బాధపడితే రొమ్ము కాన్సర్ తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్లనే ఆహారపు అలవాట్లలో శ్రద్దగా వుండాలని సహజంగా దొరికే ఏ కొబ్బరి నీల్లో, లేదా మంచి నీల్ల తో తీరే దాహం సీతాల పానీయాల వరకు వెళ్ళనివ్వోదని హెచ్చరిస్తున్నారు.

    సీతల పానీయాల తో కేన్సర్

    ఎండా కాలం వచ్చేసింది. బయటకి పొతే చాలు గొంతు తడి పోతుంది. ఎదో ఒకటి చల్లగా తగేయాలనిపిస్తుంది. అప్పుడు ఎదో ఒక్క కూల్ డ్రింక్ వైపు మనస్సు…

  • ఉడికిస్తే పోషకాలు పోతాయని గ్రిల్ చేస్తే నూనె నెయ్యివాడకం తగ్గుతుందని నిపుణులు చెపితే విన్నాం, కానీ కొత్త పరిశోధనలు ఆహార పదార్ధాలు వుదికించడమే మేలని, వాటిలో కాలరీలు వుడికిస్తేనే శరీరానికి అందుతాయని అంటున్నారు. భారతీయ ఆహార విధానంలో ఆరోగ్య పద్దతి ఉందంటున్నాయి. భారతీయ ఆహార విధానంలో ఆరోగ్య పద్దతి ఉంటుందన్నాయి పరిశోధనలు. నిప్పుల పైన వండటం, వుడికించడం ఇవన్నీ మంచివే. మాంసాహారం కానీ శాఖాహారం గానీ గోల్డ్ పద్దతి తో వుడికించినందు వల్ల గొప్ప ప్రయోజనం లేదు. కొన్ని రకాల ఆహార పద్దతుల్లో షుగర్ నిల్వల తో పాటు ఫ్యాటీ ప్రోటీన్ AGE నిల్వలు మరీ ఎక్కువవుతాయి సన్నని సెగ పైన వివిధ రకాలుగా ఇటు కాస్త పచ్చిగా కొంత మరీ ఉడికించి మాములు వంటకం మాదిరిగా చూస్తేనే లాభం అంటున్నాయి. అలాగే తినే భోజనంలో ముందుగా కూర, పులుసు, పచ్చడి, పెరుగు ఇలా ఒక ఆరోగ్యవంతమైన వరుసలోనే ఆహారం తింటే మేలని, భారతీయ వంటలు, భోజన పద్దతులు అన్ని ఆరోగ్యాన్ని ద్రుష్టిలో పెట్టుకునే రూపొందించారని అధ్యాయినాలు చెప్పుతున్నాయి.

    భారతీయ ఆహార విధానం బెస్ట్

    ఉడికిస్తే పోషకాలు పోతాయని గ్రిల్ చేస్తే నూనె నెయ్యివాడకం తగ్గుతుందని నిపుణులు చెపితే విన్నాం, కానీ కొత్త పరిశోధనలు ఆహార పదార్ధాలు వుదికించడమే మేలని, వాటిలో కాలరీలు…

  • సైకాలజిస్టలకు ఎవరినైనా వప్పించటం చాలా సులభం. ఈ ట్రిక్స్ ని అమ్మలు కూడా ఉపయోగించి పిల్లలకు ఎలా చెప్పినా వింటారు. ఏది చెయ్యమన్నా చేస్తారని చెపుతున్నారు . పిల్లల్ని వప్పించాలి. కోప్పడతారు . ఉదాహరణకు చేతులు కడుక్కోండి. శుభ్రంగా ఉండమని అరచి గీ పెట్టినా వినరు. సరదాగా కొన్ని రూల్స్ పెట్టాలి. చేతులు కడుక్కోవాలి అంటే ఎ మొదలుపెట్టి z వచెట్లుగా అంకెలు పెద్దగా చదువుతూ కడుక్కురమ్మని అలాగైతే తాను అక్షరాలు ఎంత బాగా చెపుతున్నారో వినాలనుకుంటున్నానని చెప్పాలి. అలాగే కొన్ని స్టిక్కర్స్ తెచ్చి పెట్టుకుని ప్రతి మంచి పనికి ఒక స్టిక్కర్ ఇస్తానని చెప్పాలి. ముందుగా ఆ స్టిక్కర్లు లేదా గిఫ్ట్ లు ఎదో చెప్పకూడదు. గిఫ్ట్ స్టిక్కర్ కావచ్చు. చాక్లేట్ కావచ్చు . అమ్మకే తెలియాలి . పిల్లలు కన్విన్స్ అవుతారు. జస్ట్ ఇలాంటివి ఒకటి రెండు ఉదాహరణకు మనసులో పెట్టుకుఇ పిల్లల్ని మంచి అలవాట్ల వైపు మళ్లించేందుకు తల్లులు సైకాలజిస్టులు అవతారం ఎత్తాలని చెపుతున్నారు.

    సైకాలజీ తో పట్టుకోండి

    సైకాలజిస్టలకు ఎవరినైనా వప్పించటం చాలా సులభం. ఈ ట్రిక్స్ ని అమ్మలు కూడా ఉపయోగించి పిల్లలకు ఎలా చెప్పినా వింటారు. ఏది చెయ్యమన్నా చేస్తారని చెపుతున్నారు .…

  • వంట్లో కలిగే ప్రతిచిన్న అనారోగ్యానికి పరిగెత్తుకుంటూ షాపుకు వెళ్లి ఎదో ఒక ఉపశమనం మాత్రం తెచ్చుకోవద్దు. గృహ వైద్యం చేయండి. మరీ తగ్గకపోతే డాక్టర్ ను చూడండి అంటున్నారు నిపుణులు. మైగ్రేన్ తో బాధపడేవారికి కాఫీ ఒక ఉపశమనం ఒక పెయిన్ కిల్లర్. ముందు వేడిగా కాఫీ తాగి మరీ సమస్య గా ఉంటే ఎలా వుంటారు కదా దాల్చిన చిక్కని మెత్తగా నూరి అందులో తేనె కలిపి నొప్పులున్న చోట రాసి మస్సాజ్ చేస్తే మంచిది. నోటిలో పుండ్లు గొంతు నొప్పికి తేనె చక్కగా పనిచేస్తుంది ఆవాలు వాపును బ్రహ్మాండంగా తగ్గిస్తాయి. శరీరంలో నొప్పులు వాపులకు ఆవ నూనెతో మర్దనా చేసుకోవచ్చు. భోజనం ముందు ఒక గ్లాస్ లో ఆపిల్ సిడార్ వెనిగర్ రెండు మూడు స్పూన్ల వేసుకుని తాగితే ఆర్థరైటిస్ కీళ్ల నొప్పులు కొంచెమైన ఉపశమిస్తాయి. టొమాటో జ్యూస్ లో కండరాలు పట్టుకోవటం నొప్పి పోతాయి. గొంతు ఇన్ఫెక్షన్ వస్తే ఉప్పు నీటిలో పుక్కిటపడితే సమస్య తర్వాత ఖచ్చితంగా తగ్గుతుంది .

    ఇవన్నీ ఉపశమనం కోసమే

    వంట్లో కలిగే ప్రతిచిన్న అనారోగ్యానికి పరిగెత్తుకుంటూ షాపుకు వెళ్లి ఎదో ఒక ఉపశమనం మాత్రం తెచ్చుకోవద్దు. గృహ వైద్యం చేయండి. మరీ తగ్గకపోతే డాక్టర్ ను చూడండి…

  • బెల్ పెప్పెర్స్ స్వీట్ పెప్పెర్స్ గా పిలుస్తారు గానీ మనకు తెలిసిన వాడకంలో ఉన్న పేరు క్యాప్సికం . గంట లాంటి ఆకారంలో ఉంటుంది కదా . అవి ఇలా పిలుస్తారు. ఆకుపచ్చ ఎరుపు పసుపు రంగుల్లో మనకు దొరికే ఇవి పుష్కలమైన పోషకాల నిలయం విటమిన్ ఏ , సి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు విటమిన్ బి6 అధికంగా వుండే పీచు ఇది ఖచ్చితమైన లోఫ్యాట్ పదార్ధం. జీవక్రియ ప్రక్రియను పెంచి కొవ్వు కరిగించే ఈ క్యాప్సికం కండరాల నొప్పికి మంచి ఉపశమనం. అలాగే స్వీట్ పెప్పర్ టేస్ట్ బావుండటంతో పాటు చర్మాన్ని అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడతాయి. ఇది కారంగా ఉండదు. దృఢమైన యాంటీ ఇన్ఫలమేటరీ కారకంగా పనిచేస్తుంది. ఒక కప్పు కాప్సికం ముక్కలు 22 నుంచి 25 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. బరువు తగ్గులను కొనే వాళ్ళకి ఇది మంచి ఆహారం. ఏ పదార్ధం తో కలుపుకున్న రుచితో పాటు పోషకాలు దక్కుతాయి . వయసు రీత్యా వచ్చే దృష్టిలోపం కాటరాక్ట్ కాకుండా అడ్డుకోవటంలో కూడా ఇది సహకరిస్తుంది.

    బెస్ట్ ఫుడ్ బెల్ పెప్పెర్స్

    బెల్ పెప్పెర్స్ స్వీట్ పెప్పెర్స్ గా పిలుస్తారు గానీ మనకు తెలిసిన  వాడకంలో ఉన్న పేరు క్యాప్సికం . గంట లాంటి ఆకారంలో ఉంటుంది కదా  .…

  • ఆహరం విషయంలో ఎన్నెన్నో అపోహలుంటాయి. ఉదాహరణకు నెయ్యి తింటే కొవ్వు పెరుగు తుందని బరువు పెరుగుతామని అనుకుంటారు . నిజానికి నెయ్యి అలంటి అపకారాలు ఏవీ చేయదు. గుండెకు మేలు చేస్తుంది. దీనిలో ఉండే కాంజుగేటిడ్ లినోసిక్ యాసిడ్ అనే ప్రత్యేక ఫ్యాటీ యాసిడ్ డయాబెటిక్ నుంచి రక్షణ ఇస్తుంది. ధీమనులకు ప్రయోజనకారి. ఈ విధంగా పరోక్షంగా గుండె జబ్బులు రానీయదు. ఉదరంలో వచ్చే ఇబ్బందుల నివారణకు ఇంచి మించి మందు కూడా. ఇది ఔషధంగా పనిచేస్తూ జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. నేతి లోని ఫ్యాటీ యాసిడ్ పేగుల్లోని కణాలకు తగిన పోషకాలు అందించి త్వరగా జీర్ణక్రియ సమస్యలను తొలగిస్తుంది. కడుపునొప్పి మంట తగ్గిస్తుంది. ఆహారానికి అద్భుతమైన రుచి ఇస్తుంది, ముఖంగా శీతాకాలంలో నెయ్యిని తగుమాత్రంగా ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలుంటాయి.

    కొవ్వు పెంచుతుందన్న అపోహ

    ఆహరం విషయంలో ఎన్నెన్నో  అపోహలుంటాయి. ఉదాహరణకు నెయ్యి తింటే కొవ్వు పెరుగు తుందని బరువు పెరుగుతామని అనుకుంటారు . నిజానికి నెయ్యి అలంటి అపకారాలు ఏవీ చేయదు.…

  • చాలా మంది జీవితాల్లో అనుభవించే విషయమే అయినా అదొక రిపోర్ట్ రూపంలో కనపడేసరికి ఎంతో కష్టం అనిపిస్తోంది. ఇంట్లో ఎవరికైనా అంటే డెమెన్షియా అంటే మతిమరుపు రావటం వంటి లేదా దీర్ఘ కాలం మంచంలో ఉండే జబ్బులొస్తే వాళ్ళ బాధ్యత సాధారణంగా ఇంట్లో భార్య పైనే పడుతుంది. భర్తకు డెమెన్షియా వస్తే ఐంన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత భార్యదే నని బంధువులు మిత్రులు భావిస్తారు. భర్త పైన ఎంతో జాలి చూపెడతారు. అసలు రోగికన్నా రోగికి సహాయంగా ఉండేవాళ్ళకే ఎక్కువ బాధ్యత అప్పగిస్తారు వైద్యులు. వాళ్ళతో ప్రేమగా ఉండాలని మందులు జాగ్రత్తగా ఇవ్వాలని వాళ్ళతో వారించవద్దనీ ఓర్పు సహనంతో ఉండమనీ భార్యకు చెపుతారు . ఇది వారికీ మానసికంగా తీవ్ర వత్తిడికి గురిచేసి అనారోగ్యంకు బారిన ఖచ్చితంగా పడతారని రిపోర్ట్. ఒకవేళ అది డెమెన్షియా నే అయితే ఆ జబ్బు అంటువ్యాధి కాకపోయినా భార్యకు వచ్చి తీరుతుందిట. జబ్బుతో వున్న వాళ్ళని భరించీ భరించీ వాళ్ళు ఆ వ్యాధిన పడతారట. పెద్ద సర్వే చేయక పోయినా ఇది కరక్టే ననిపిస్తోంది. ఈ సేవ చేయటం శ్రద్ధ తీసుకోవటం ఆడవాళ్ళ పాలిట జీవితకాల శిక్షలాగా ఉంటుందనటంలో ఆశ్చర్యం ఏదీ లేదు.

    నష్టపోయేది అన్నింటా ఆడవాళ్లే

    చాలా మంది జీవితాల్లో అనుభవించే విషయమే అయినా అదొక రిపోర్ట్ రూపంలో కనపడేసరికి ఎంతో కష్టం అనిపిస్తోంది. ఇంట్లో ఎవరికైనా అంటే డెమెన్షియా అంటే మతిమరుపు రావటం…

  • ఉదయం వండిన వంట ను ఫ్రిజ్ లో పెట్టుకోవటం మళ్ళీ వేడి చేసి తినటం అందరికీ అలవాటే. అయితే ఆహార పదార్ధాలు మళ్ళీ మళ్ళీ వేడి చేయటం వల్ల కాలేయం దెబ్బతినే అవకాశాలున్నాయని హెచ్చరిస్తూన్నారు డాక్టర్లు. ముఖ్యంగా జంక్ ఫుడ్ అస్సలు వేడి చేయకూడదని చెపుతున్నారు. చికెన్ బచ్చలి కూర గుడ్డు బంగాళా దుంపలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేడి చేసి తినకూడదు. జంక్ ఫుడ్ విషయంలో ఈ పదార్ధాల్లో మొత్తం మళ్ళీ మళ్ళీ వేడి చేసి ఇస్తూనే ఉంటారు. కట్ లెట్స్ సమోసాలు ఎప్పుడో ఉదయం చేసి పెట్టినవే కష్టమర్స్ అడగ్గానే వేడి చేసే ఇస్తుంటారు. వేడిగా తినేటప్పుడు మిగతా విషయాలు దాదాపు పట్టించుకోము. సాంబారులో వేసే దుంపలు ముక్కలు కూడా వేడి చేయటంలో మొత్తం పోషకాలు పోతాయని అనారోగ్యాలు వస్తాయని చెపుతున్నారు. ఒకసారి వండిన అన్నాన్ని వేడి చేస్తే బాక్టీరియా పునరుత్పత్తి అవుతుందిట. అంటే అన్నాన్ని వండే క్రమంలో నశించిన బాక్టీరియా దాన్ని తరిగి వేడి చేయటంలో జీవం పోసుకుంటుంది . ఇదే క్రమం జంక్ ఫుడ్ విషయంలో కూడా జరుగుతుందని చెపుతున్నారు.

    మళ్ళీ మళ్ళీ వేడి చేస్తే చాలా నష్టం

    ఉదయం వండిన వంట ను ఫ్రిజ్ లో పెట్టుకోవటం మళ్ళీ వేడి చేసి తినటం అందరికీ అలవాటే. అయితే ఆహార పదార్ధాలు మళ్ళీ మళ్ళీ వేడి చేయటం…

  • పాపాయిలు కొంచెం పెరిగి పెద్దయి నడిచే వరకు వాళ్ళతో చాలా కష్టం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇంకా మిగిలిపోయే ఉంటాయి. డాక్టర్లు చెప్పే జాగ్రత్తలు తోడు ఇంట్లో ప్రతి చిన్న విషయం లోనూ వాళ్లకు ఒక ప్రత్యేకమైన వన్నీ ఉండాలి. పిల్లలకు వాడే సబ్బులు ఎవ్వళ్ళనీ వాడనివ్వకూడదు. పిల్లలకు వ్యాధి నిరోధిక శక్తీ చాలా తక్కువ. పెద్దవాళ్లకు ఏ చిన్న సమస్య వచ్చినా అది వెంటనే పిల్లలకు వ్యాపిస్తుంది. పిల్లలకు అస్తమానం డైపర్లు వేస్తుంటారు. అది పెద్దవాళ్లకు సౌకర్యమే. కానీ అదే పనిగా వేయటం వల్ల న్యాపీ రాష్ వస్తుంది. కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు వీలైనంత వరకు వేయకపోవడం ఉత్తమం. ఒక సమయానికి కాలకృత్యాలు తీర్చుకునే అలవాటు చేస్తే పిలల్లు పెద్దవాళ్ళు ఎవ్వళ్లు ఇబ్బంది పడరు.పిల్లలను కాస్సేపైన ఎండలోకి తీసుకుపోవాలి. ఆలా వెళ్లేముందు ఎస్ సి ఎఫ్ 14 ఉన్న సన్ స్క్రీన్ లోషన్ రాయాలి . పిల్లలకు కనీసం పది నిముషాలు ఉదయపు ఎండ తగలాలి. వాళ్లకు తగినంత డి విటమిన్ అందుతుంది. ఫలితంగా ఎముకలు బలంగా పెరుగుతాయి.

    వాళ్లకు ఉదయపు ఎండ చాలా మంచిద

    పాపాయిలు కొంచెం పెరిగి పెద్దయి నడిచే వరకు వాళ్ళతో చాలా కష్టం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇంకా మిగిలిపోయే ఉంటాయి. డాక్టర్లు చెప్పే జాగ్రత్తలు తోడు ఇంట్లో…