• చర్మ సౌందర్యం విషయంలో ఎదో ఒక రోజు శ్రద్ధ తీసుకుని ఒక రోజు ఫేషియల్ చేయించేసుకుంటే సరిపోదు. శ్రద్ధ జీవిత కాలం వుండాలి. సహజమైన, రసాయినాలు లేని పదార్ధాల వాడకంతో చర్మం ఎప్పుడు తాజాగా కాంతి వంతంగా వుంటుంది. పిండి, తేనె, పెరుగు వంటి మిశ్రమం వంటికి పట్టించి నలుగు పెట్టుకుంటే చాలు చర్మం ఎప్పుడూ బాగుంటుంది. అలాగే జుట్టు నిర్జీవంగా అనిపిస్తే కోడి గుడ్డు తెల్ల సోన, పుల్లటి పెరుగు, మందారకుల గుజ్జు కలిపి తలకు పట్టించి తల స్నానం చేస్తే జుట్టు పట్టు కుచ్చులా అయిపోతుంది. అలాగే చేతులు కాళ్ళు మెత్తగా మెరిసిపోవాలంటే ముందుగా ఆర బకేట్ నీళ్ళల్లో రెండు చెంచాల షాంపూ వేసి పదాలు అందులో వుంచాలి. ఆ తర్వాత ఫ్యుమిక్ రాయి తో రుద్దాలి. ఇలా చేస్తే మృతకణాలు పోతాయి. అదయ్యాక చెక్కర, సెనగ పిండి, పాలు, తేనె మిశ్రమాన్ని పాదాలకు పట్టించి ఆరాక కడిగేస్తే పదాలు మృదువుగా మెరిసిపోతూ కనిపిస్తాయి. చేతులకు కూడా ఇదే పూత పుయచ్చు.

    జీవిత కాలపు శ్రద్ధ కావాలి

    చర్మ సౌందర్యం విషయంలో ఎదో ఒక రోజు శ్రద్ధ తీసుకుని ఒక రోజు ఫేషియల్ చేయించేసుకుంటే సరిపోదు. శ్రద్ధ జీవిత కాలం వుండాలి. సహజమైన, రసాయినాలు లేని…

  • అందంగా కనిపించటం కోసం కొన్నింటిని తినాలి. కొన్నింటిని స్వతహాగా ఉపయోగించాలి. ఆ కోవా లోకే వస్తుంది విటమిన్ ఇ. దీన్ని ఆహారంగానూ తీసుకోవాలి. చర్మానికి రాసుకోవాలి. ఏ ఋతువులోనైనా చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. ఇలాంటివారు విటమిన్ ఇ అండ్ పదార్ధాలు రోజూ తీసుకోవాలి. అప్పుడే అందులోని పోషకాలు చర్మానికి అంది ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఇది మాత్రలు రూపంలోనూ దొరుకుతుంది. ఏ విటమిన్ తో చర్మంలో సాగే గుణం పెరిగి ఆరోగ్యంగా ఉంటుంది. రోజు ఉదయాన్నే కాస్త విటమిన్ ఇ నూనె వంటివి పెటిట్ఞ్చి మర్దనా చేయాలి. ఇలా కనీసం వారానికి రెండు సార్లు చేస్తుంటే చర్మం పొడిబారే సమస్య తగ్గి మృదువుగా మారుతుంది. ముఖ్యంగా కళ్ళ అడుగున మడతలు నలుపుదనం కూడా తగ్గుతుంది. మొటిమలు తగ్గినా వాటితాలూకు మచ్చలు మిగిలుంటే విటమిన్ ఇ నూనె చక్కగా పనిచేస్తుంది. రాత్రిళ్ళు పడుకునేముందర ఆ నూనె రాసుకుని మర్నాడు కడిగేస్తే మురికిపోయి మొహం చక్కగా ఉంటుంది. ఎండ ప్రభావం పడకుండా ఉండేందుకు కూడా ఈ నూనె బాగా పనిచేస్తుంది.

    విటమిన్ ఇ తో యవ్వనవంతమైన చర్మం

    అందంగా కనిపించటం కోసం కొన్నింటిని తినాలి. కొన్నింటిని స్వతహాగా ఉపయోగించాలి. ఆ కోవా లోకే  వస్తుంది విటమిన్ ఇ. దీన్ని  ఆహారంగానూ  తీసుకోవాలి. చర్మానికి రాసుకోవాలి. ఏ…

  • బ్యూటీ పార్లర్ కి వెళ్లాలన్నా సమయం ఉండదు. ఏ ఫేస్ క్రీమ్ వాడినా ఇంట్లో ఏదైనా చిట్కాలు ఉపయోగించినా పార్లర్ కు వెళ్లినంత చక్కగానే చర్మం మెరుస్తుంది . సహజమైన ఏ రసాయనాలు కలపని కొన్ని వస్తువుల్లో బ్లీచ్ కంటే మొహాన్ని తేటగా చేసే మంచి గుణాలుంటాయి. రెండు స్పూన్ల బియ్యం పిండి లో కొద్దిగా తేనె పెరుగు కలిపి ఈ మిశ్రమాన్ని మొహానికి మెడకీ మర్దనా చేసుకోవాలి. పావుగంటయ్యాక కడిగేసుకుంటే మురికి పోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. స్పున్ బియ్యంపిండి లో నాలుగైదు చుక్కల ఆముదం కలిపి కళ్ళ కింద పూతలా వేసి కడిగేసుకుంటే వలయాలు మడతలు క్రమంగా మాయం అవుతాయి. పాలు లేదా పాల మీగడలో కొద్దిగా బియ్యంపిండి కలిపి ఫెస్ ప్యాక్ వేసుకోవాలి. పది నిముషాల తర్వాత కడిగేస్తే మురికిపోయి చర్మం శుభ్రపడుతుంది. బియ్యం పిండిలో తేనె ఆలివ్ ఆయిల్ కలిపి స్నానానికి ముందు మర్దన చేస్తే మృతకణాలు పోయి ముఖం కళగా ఉంటుంది. బియ్యం పిండి మినపప్పు పిండి కలిపితే మంచి ఫేస్ ప్యాక్ అవుతుంది. ఇది తప్పకుండా ట్రై చేయచ్చు.

    ఇది అద్భుతమైన ఫేస్ ప్యాక్

    బ్యూటీ పార్లర్ కి వెళ్లాలన్నా సమయం ఉండదు. ఏ ఫేస్ క్రీమ్  వాడినా ఇంట్లో ఏదైనా చిట్కాలు ఉపయోగించినా పార్లర్ కు వెళ్లినంత చక్కగానే చర్మం మెరుస్తుంది…

  • నూనెతో మర్దనా చేస్తే సహజమైన మెరుపు

    ముఖ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. వాతావరణం లో వచ్చే ప్రతి మార్పుకు ప్రభావితం అయ్యేది ముఖ చర్మమే. చర్మానికి ఎప్పుడు సహజమైన నూనెలు అవసరం. కొబ్బరి…

  • వయం నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూసుకుంటే ఉబ్బినట్లు కనిపించి ముఖం చాలా డల్ గా అనిపించిందనుకోండి. ఈ వేసవిలో శరీరంలో తగినంత నీరు లేని కారణంగా డీహైడ్రేషన్ వల్ల రక్త నాళాలు వ్యాకోచం చెంది నీరు చేరుతుంది. నీరు బాగా తాగకపోతే మొహం ఉబ్బరిస్తుంది. అలాగే శరీరంలో అధిక శాతం ఉప్పుచేరినా ముఖం వస్తుంది. కార్బోనేటేడ్ కూల్ డ్రింక్స్ తాగినా ప్యాకేజీ ఫుడ్స్ తో సోడియం శరీరంలో చేరినా ఈ ప్రాబ్లమ్ కావచ్చు . ఇలా ముఖం ఉబ్బరించుకోకుండా ఉండాలంటే డైట్ లో ఎక్కువ పీచు పదార్ధాలు ఉండేలా చూసుకోవాలి . బొప్పాయిపండు తింటే పొట్ట చిన్న ప్రేవుల ఆరోగ్యం సరిగా ఉంటుంది . ముఖంలో ఉబ్బరింపు ఉండదు విటమిన్ సి బీటాకెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న పండ్లు తినాలి. ఇవి చర్మం లో నీళ్లు నిలిచిపోకుండా సహాయపడతాయి. చర్మం మెరిసిపోతుంది. మొహం తేజోవంతంగా ఉంటుంది.

    ముఖ కాంతి తగ్గినట్లుంటే

    ఉదయం నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూసుకుంటే ఉబ్బినట్లు కనిపించి ముఖం చాలా డల్ గా అనిపించిందనుకోండి. ఈ వేసవిలో శరీరంలో తగినంత నీరు లేని కారణంగా…

  • అలంకరణ కోసం వాడే ఫెస్ క్రీము రసాయనాలున్న ఇతర ఫౌండేషన్లు క్రీములు వాతావరణ కాలుష్యం కారణంగానూ చర్మ రంధ్రాల్లోకి జిడ్డు మురికి చేరిపోతాయి. దానితో చర్మ గ్రంధులు మూసుకుపోతాయి. మొటిమలు వైట్ హెడ్స్ మచ్చలు మొదలవుతాయి. వాటిని నివారించాలంటే ఆవిరి పట్టటం తప్పనిసరి. దీనివల్ల చర్మం గ్రంధులు తెరుచుకుంటాయి. మురికి జిడ్డు మృతకణాలు పోతాయి. వేడి నేతిలో ముంచి పిండిన మెత్తని నూలు గుడ్డతో ముఖం తుడిచేసినా ఫలితం ఉంటుంది. చెంచా దాల్చిన చెక్క పొడి ఓట్స్ పిండి తీసుకుని గోరువెచ్చని నీళ్లతో ముద్దగా చేయాలి. దాన్ని ముఖానికి రాసి కొద్దిసేపు మర్దనా చేసి పావుగంట తర్వాత నీళ్లతో కడిగేయాలి. మొటిమలు వాటి తా తాలూకు మచ్చలు పోతాయి. రెండు చెంచాల సెనగ పిండి లో సరిపోయేంత పెరుగు వేసి ముద్దగా చేసి ముఖానికి రాయాలి. పది నిముషాలు అయ్యాక కడిగేస్తే సరిపోతుంది. ఇందులో పసుపు కలిపితే ఏ సమస్యలు తగ్గటం తో పాటు ముఖం కళగా మారిపోతుంది. అలాగే నిమ్మరసం లోనే ఆల్ఫా హైడ్రాక్స్ ఆమ్లాలు చర్మాన్ని శుభ్రం చేస్తాయి. నిమ్మరసంలో దూది ముంచి మొహం పైన రాసి పావుగంట తర్వాత చల్లని నీళ్లతో కడిగేస్తే సరిపోతుంది.

    మొటిమలు మచ్చలు నివారణ కోసం

    అలంకరణ కోసం వాడే ఫెస్ క్రీము రసాయనాలున్న ఇతర ఫౌండేషన్లు క్రీములు వాతావరణ కాలుష్యం కారణంగానూ చర్మ రంధ్రాల్లోకి జిడ్డు మురికి చేరిపోతాయి. దానితో చర్మ గ్రంధులు…

  • మెరిసే చర్మం కోసం మంచి డైట్ ని సూచిస్తున్నారు నిపుణులు . అయితే ఈ డైట్ లో రాత్రికి మార్పులురావు . చర్మం పైన మార్పురావాలంటే కనీసం ఆరు వారాల వ్యవధి కావాలి. మనం తినే ఆరోగ్యాన్ని బట్టే చర్మం ఆరోగ్యాంగా కాంతులీనుతూ ఉంటుంది. బ్రొకోలి , జామ , కివి పండ్లు ఆరెంజ్ బొప్పాయి స్ట్రా బెర్రీలు చిలకడ దుంప నేరేడు కొలెజాన్ ఉత్పత్తికి సహకరిస్తాయి . ఒమేగా 3 ఒమేగా 6 ఈ రెండు అత్యవసర ఫ్యాటీ యాసిడ్లు. ఆయిలీ ఫిష్ అవిసె నూనెలు ఒమేగా 3 లభిస్తుంది. సన్ ఫ్లవర్ కార్న్ ఆయిల్ లో ఒమేగా 6 దొరుకుతుంది. ఉల్లి వెల్లుల్లి లోదొరికే సల్ఫర్ చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. లివర్ గుడ్లు పాలు ఆయిలీ ఫిష్ గింజ ధాన్యాలు విటమిన్ ఏ కు మంచి ఆధారం కొత్త చర్మం ఎదగటానికి ఇవి సహకరిస్తాయి. డ్రై ఆప్రికాట్స్ నువ్వుల్లో ఐరన్ బాగా దొరికి స్కిన్ టోన్ మెరుగవుతుంది. చర్మం మెరిసేందుకు విటమిన్ బి 2 చీజ్ గుడ్లు లివర్ లో అధికంగా దొరుకుతాయి. ఇవన్నీ సరైన మోతాదులో వుండేలా హెల్త్ చార్ట్ లో చూసుకోవాలి.

    మెరిసే చర్మం కోసం మంచి ఆహారం

    మెరిసే చర్మం కోసం మంచి డైట్ ని సూచిస్తున్నారు నిపుణులు . అయితే ఈ డైట్ లో రాత్రికి మార్పులురావు . చర్మం పైన మార్పురావాలంటే కనీసం…

  • శరీరానికి విటమిన్లు అందితేనే ఆరోగ్యంగా చర్మానిగారింపు తో ఉంటుంది. ఆ విటమిన్లు లభించే ఆహారం కోసం వెతికిపట్టుకోవటం మంచిది. చిలకడదుంపలు బ్రొకోలీ క్యారెట్ లివర్ ఫిష్ ఆయిల్ ఆప్రికాట్స్ లో ఫ్యాట్ మిల్క్ విటమిన్ ఎ కు మంచి ఆధారం. ఇవి చర్మ కణాల పునరుత్తేజానికి ఉపకరిస్తాయి. బి కాంప్లెక్ విటమిన్లు స్కిన్ ఫుడ్స్ ఈ విటమిన్ లోపిస్తే పెదవుల చివరలు మిగిలిపోతాయి. బి .కె లోపిస్తే చర్మం కమిలిపోతుంది. బి 6 లోపిస్తే చర్మం పైన ర్యాష్ వస్తుంది. రైస్ పాలు గుడ్లు పెరుగు లో బి 6 పుష్కలం. విటమిన్ C తో చర్మ మృదువుగా ఉంటుంది. బ్రోకలీ కొత్తిమీర మొలకలు కాలీఫ్లవర్ నిమ్మరసం కమలా ద్రాక్ష పైనాపిల్ అన్నింటిలో సి విటమిన్ దొరుకుతుంది. విటమిన్ ఇ బాదం పొద్దు తిరుగుడు గింజలు గుమ్మడి గింజలు పాలకూర ఆలివ్స్ ఆలివ్ ఆయిల్ బొప్పాయిలో లభిస్తుంది. విటమిన్ కె కళ్లకింద వలయాల తో పోరాడుతుంది. పాలకూర తోట కూర ద్రాక్ష కివి పండ్లు ఈ విటమిన్ లభిస్తుంది.

    విటమిన్స్ మంచి ఫ్రెండ్

    శరీరానికి విటమిన్లు అందితేనే ఆరోగ్యంగా చర్మానిగారింపు తో ఉంటుంది. ఆ విటమిన్లు లభించే ఆహారం  కోసం వెతికిపట్టుకోవటం మంచిది. చిలకడదుంపలు బ్రొకోలీ క్యారెట్ లివర్ ఫిష్ ఆయిల్…

  • ఆరోగ్య రక్షణకు ద్రాక్ష

    https://scamquestra.com/21-finansovye-afery-questra-world-i-atlantic-global-asset-management-agam-questraworldes-atlanticgames-5.html