• గర్భిణీగా ఉన్నప్పుడు పిల్లలకు పాలిచ్చే సమయంలో చేపలు తినడం వల్ల పిల్లల్లో ఆహార సంబంధ అలర్జీలు, ఆస్థమా, ఎగ్జిమాలు ఎక్కువగా వుండవంటున్నారు పరిశోధకులు. పిల్లలు విషయంలో జరిగిన మరో పరిశోధనలో 11 నెలల వయసు లోపే ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా వుండే చేపలు, గుడ్లు తినిపించడం వల్ల అలర్జీలు నియంత్రించవచ్చని తేలింది. గర్భిణీగా ఉన్నప్పుడు పిల్లలకు పాలిచ్చే సమయంలోనూ స్త్రీలు చేపలు తింటే పిల్లలకు ఫ్యాటీ యాసిడ్ అందుతుందని పరిశోధకులు గుర్తించారు. పిల్లల ఆరోగ్యాన్నీ మెరుగు పరిచేందుకు గానూ పిల్లలకు పాలిస్తున్నంత కాలం తల్లులను చేపల్ని తినమనే సలహా ఇస్తున్నారు పరిశోధకులు.

    తల్లులు చేపలు తింటే పిల్లలకు మేలు

    గర్భిణీగా ఉన్నప్పుడు పిల్లలకు పాలిచ్చే సమయంలో చేపలు తినడం వల్ల పిల్లల్లో ఆహార సంబంధ అలర్జీలు, ఆస్థమా, ఎగ్జిమాలు ఎక్కువగా వుండవంటున్నారు పరిశోధకులు. పిల్లలు విషయంలో జరిగిన…

  • స్పా ట్రీట్ మెంట్ చాలా ఖరీదుగానే ఉంటాయి. ఎక్సోటిక్ ప్రోమో గ్రేనేడ్ ట్రీట్ మెంట్ తో దానిమ్మ రసం ,నిమ్మ రసం ,అల్లం , బ్రౌన్ షుగర్ తో సంప్రదాయ నూనెలతో మస్సాజ్ ఉంటుంది. అలాగే ప్రోమో గ్రేనేడ్ షుగర్ స్క్రబ్ అంటే దానిమ్మ గింజలు పంచదార తో చర్మం పైన మృతకణాలు తొలగించటం మురడ్ ప్రోమో గ్రేనేడ్ అంతే దానిమ్మ గింజలు మురాడ్ క్రీమ్ తో చేసే స్పా. ఇక మల్టీ విటమిన్ పేస్ ప్యాక్ అంటే పాల నుంచి తీసిన లాక్టిక్ యాసిడ్ ,దానిమ్మ రసం కలిపి పేస్ ప్యాక్ వేస్తారు. ఇక దానిమ్మతో పాలిష్ అంటే దానిమ్మ బొప్పాయి నూనెలు కలిపి చేసే మస్సాజ్. ఇన్నింటిలోను ఉన్నది మన రోజూ బోర్ కొడుతుందని గింజలు వేయరు వలుస్తారులే అని బద్దకించి దానిమ్మ పండు. ఇంత అందాన్నిచ్ఛే పండు రోజు కడుపులోకి పోతే ఇంకెంత అందం ఆలోచించండి. ఇంత చిన్న దానిమ్మ గింజల్లో ఎంత శక్తి వుందో.

    సౌందర్య ఫలమిది

    స్పా ట్రీట్ మెంట్ చాలా  ఖరీదుగానే ఉంటాయి. ఎక్సోటిక్ ప్రోమో గ్రేనేడ్ ట్రీట్ మెంట్ తో దానిమ్మ రసం ,నిమ్మ రసం ,అల్లం , బ్రౌన్ షుగర్ …

  • సెలబ్రెటీటీలు ఖరీదైన దుస్తులతో కార్లలో తిరుగుతూ అద్భుతమైన నగలతో కళ్ళు చెదిరేలా కనిపిస్తారు. కానీ ఇబ్బందులు కష్టాలు కూడా ఎక్కువే. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో చేదు అనుభవాలు అనేకం శృతి హాసన్ అనుభవం కూడా ఇదే. కర్ణాటక కు చెందిన ఒక డాక్టర్ అదేపనిగా ట్విట్టర్ లో శృతి ఎంతో ఘోరమైన మాటలతో అవమానించటం తో ఆమె ఎంతో ఆవేదన పడిందట. కానీ డాక్టర్ కాస్త నిన్ను చంపేస్తాన్నంత దూరం వచ్చాక ఇక ఆమెకు పోలీసులను ఆశ్రయించక తప్పలేదు. చెన్నయ్ సైబర్ క్రైమ్ కు శృతి తరఫున వ్యక్తులు వచ్చి ఆ డాక్టర్ వేధిస్తున్న ఆధారాలు చూపెట్టి అతని మెయిల్ ఐడి ఫోన్ నంబర్ పోలీసులకు ఇచ్చారట. శృతి హాసన్ ఇచ్చిన పిర్యాదు తో పోలీసులు డాక్టరు గురించి విచారించే పనిలో వున్నారు. ఎవరి పనివాళ్లని చేసుకోనిస్తే ప్రాబ్లమే ఉండదు.

    శృతికి ట్విట్టర్ బెదిరింపులు

    సెలబ్రెటీటీలు ఖరీదైన దుస్తులతో కార్లలో తిరుగుతూ అద్భుతమైన నగలతో కళ్ళు చెదిరేలా కనిపిస్తారు. కానీ ఇబ్బందులు కష్టాలు కూడా ఎక్కువే. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో చేదు అనుభవాలు…

  • టమాటో అండ్ కో కేరాఫ్ కృత్తికా పర్వాల్. ఈ కేరాఫ్ అనిపించుకోవటం వెనకొకరుంది. రాజస్థాన్ రాజధాని జైపూర్ లో పుట్టి పెరిగిన కృతిక అమెరికా లో ఎంబీఏ చేస్తూ సెమిస్టర్ లో భాగంగా కాగితంలో కాయగూరల విత్తనాలు ఇమిచ్చి ఆ పేపర్ వాడేశాక దాన్ని నేలలో నాటితే అందులోంచి విత్తనాలు మొలకెత్తించేలా చేస్తే ఆడో మంచి వ్యాపారం అవుతుంది కాయితం వేస్ట్ కాకుండా వుంటుందీ అనుకొందిట. ఈ ఐడియా కి ప్రొఫసర్స్ అభినందనలు తెలిపారు. ఇండియాకి తిరిగివచ్చి ఈ పేపర్ విత్తనాల ఐడియా ను మార్కెట్ చేస్తే కిసాన్ సంస్థ వాళ్ళు తోలి ఆర్డర్ ఇచ్చారు. కెచప్ లో వాడే టమాటో విత్తనాలతో పేపర్ తయారు చేసి ప్రచారం కోసం పంచితతే బ్రహ్మాండమైన స్పందన ప్లస్ పబ్లిసిటీ వచ్చాయి. ఇదిగో ఇలా మొదలైంది టమాటో అండ్ కో. ఇప్పుడిదో పెద్ద బిజినెస్. ఎన్నో సంస్థల ఆర్దార్లున్నాయి కృతిక పర్వాల్ కు.

    మొలకెత్తే కాయితాలు

    టమాటో అండ్ కో కేరాఫ్ కృత్తికా పర్వాల్. ఈ కేరాఫ్ అనిపించుకోవటం వెనకొకరుంది. రాజస్థాన్ రాజధాని జైపూర్ లో పుట్టి పెరిగిన కృతిక అమెరికా లో ఎంబీఏ…

  • ఇల్లులాగే ఆఫీస్ కూడా మనల్ని ఎంతో ఆనందపెడుతోంది. ఆఫీస్ బయటి ప్రపంచంలో మన ఉనికి. మనం చేసే పనికి ఒక విలువ. ఒక మంచి జీవిత విధానం. మరి ఇలాంటి ఆఫీస్ పనిని చైతన్యవంతంగా మొదలు పెట్టమంటున్నారు ఎక్సపర్ట్స్. ఆఫీస్ కు రాగానే మొట్టమొదట సవాల్ గా వుండే పనినే మొదలుపెట్టాలి. ఉదయాన్నే పనిచేయగలిగే శక్తి సామర్ధ్యాలు ఏకాగ్రత ఎక్కువగా ఉంటాయి. కష్టమైనా పనిని వ్యక్తిచేస్తే తర్వాత తేలికైన పనులకు మిగిలిన సామర్ధ్యం వినియోగం అవుతుంది. ముందుగా ఆఫీస్ లో అడుగుపెట్టగానే తోటి ఉద్యోగులను నవ్వుతూ పలకరించడం అలవాటుగా ఉంచుకోవాలి. ఆపలకరింపు అందరిమధ్య ఒక సద్భావన ను తీసుకొస్తుంది. ఎప్పుడూ ఆలస్యంగా రాకూడదు. ఇది చిన్న విషయం కాదు. ముందు మనకే మనసులో ఒక గిల్టీ ఫీలింగ్ మొదలై మన సామర్ధాన్ని దెబ్బ తీయటం కాకుండా మానసిక వత్తిడి పెంచుతోంది. ఆఫీసంటే మన కెరీర్ మన భవిష్యత్తు.

    ఆఫీస్ అంటే మన కెరీర్ మన భవిష్యత్తు

    ఇల్లులాగే ఆఫీస్ కూడా మనల్ని ఎంతో ఆనందపెడుతోంది. ఆఫీస్ బయటి ప్రపంచంలో మన ఉనికి. మనం చేసే పనికి ఒక విలువ. ఒక మంచి జీవిత విధానం.…

  • కలలు కనండి కానీ నిజం చేసుకునే కలలే కనండి అన్నారు కలాం. కానీ డాక్టర్లు ఇప్పుడు పగటి కలలు కనండి పర్లేదు అంటున్నారు. జీవితంలో ఎన్నో వత్తిడి సందర్భలోస్తాయి. మనసు గందరగోళంగా ఉంటుంది. మానసిక వత్తడి అనేకానేక సమస్యలకు మూలం. సరిగ్గా ఇందుకే ఆ వత్తడిని అధిగమించేందుకు చక్కగా పగటికలలు కనండి. ఓ పెద్ద ఇల్లు కొన్నామనో ఆడి కార్లో ప్రయాణం చేస్తూ అమెరికా వెళ్లే ప్లైట్ పట్టుకోబోతున్నామనో ఏకంగా ట్రంప్ పర్సనల్ సెక్రటరీగా జాబ్ వచ్చిందినో ఎదో ఒకటి మనసుకు స్వాంతన ఇచ్చే కల. అబద్దమైన మన మనసులో చింతను దూరం చేసే కల కనమంటున్నారు. ఈ ఊహలు నిజంగా మనల్ని ఒక తీవ్రమైన బాధ నుంచి విముక్తులను చేస్తే అదే అబద్దపు కల యూయూహ అయితేనేం ఊహా శక్తి వుండాలే కానీ ఎన్నెన్ని పగటి కలలు రావు....... ఏమంటారు?

    పగటి కలలు కంటే మంచిదే

    కలలు  కనండి కానీ  నిజం చేసుకునే కలలే కనండి అన్నారు కలాం. కానీ డాక్టర్లు ఇప్పుడు పగటి కలలు  కనండి పర్లేదు అంటున్నారు. జీవితంలో ఎన్నో వత్తిడి…

  • రత్నాల సబ్బులు వాడేరా ? వీటినే జెమ్ స్టోన్ రాక్ సోప్స్ లేదా రాక్ సోప్స్ అంటారు. ఇవి అచ్ఛంగా ఎదో ఒక రత్నం లాగానో రాయి లాగానో ఉంటాయి. సాధారణ సబ్బులకన్నా గాఢత తక్కువగా ఉంది నురగ కూడా తక్కువగా ఉంటుంది. ఈ రకం సబ్బులను మట్టి సారంతో పాటు కలబంద క్యామోమైల్ ,లావెండర్ విటమిన్ ఇ ,బాదాం నూనె ,జొజోబా నూనె వనమూలికల సారం కొన్ని రకాల పరిమళాలు కలిపి చేస్తారు. ఈ రాక్ సోప్స్ వజ్రాలు మొదలుకుని పుష్పరాగం ,గోమేధికం ,పగడం ,పచ్చ, కెంపు,నీలం లాంటి సాంప్రదాయ రత్నాలు టర్కోయిస్ క్వాటీ ఐ లాంటి ఫ్యాషన్ బుల్ ఉపరత్నాల దాకా అన్ని రకాల రాళ్లుగా కనిపించేలా వీటిని తయారు చేస్తారు. సాండ్ స్టోన్ మార్బుల్ లాంటి ఇతర తరహా రాళ్ళూ లాంటి సోంపులూ ,గ్లిజరిన్ లో తయారై వివిధ రంగుల్లో పారదర్శకంగా వుండే ఇవి నీటిలో తడిసినప్పుడు మెరుస్తూ చూసేందుకు చాలా బావుంటాయి.సాధారణ సబ్బుల్లా ఒక ప్రత్యేకమైన ఆకారంలో కాకుండా అచ్ఛం వజ్రాలు రాళ్లను కత్తి రించినట్లే ఉంటాయి. మంచి సువాసన వచ్చే ఈ సోప్స్ ఖరీదు పెద్ద ఆకాశం అంటేలా ఏం లేవు. ఇష్టమైతే మనం కూడా ఆన్ లైన్లో ఆర్డరిచ్చి తెపించుకోవచ్చు.

    రాళ్ళూ రత్నాలు వజ్రాల సబ్బులు

    రత్నాల సబ్బులు వాడేరా ? వీటినే జెమ్ స్టోన్ రాక్ సోప్స్  లేదా రాక్ సోప్స్  అంటారు. ఇవి అచ్ఛంగా ఎదో ఒక రత్నం లాగానో రాయి…

  • ఫ్యాషన్ అంటే ఏదైనా ఫ్యాషన్ గానే ఉండాలి. చివరకు చెప్పులైనా ఏ డిజైన్ అయినా చూపులను కట్టిపడేసేలా ఉండాలి. ఫంకీగా ఉండాలి. చెప్పులు సౌకర్యం కోసం కాకుండా ఫ్యాషన్ సిగ్మెంట్స్ లా వస్తున్నాయి. మడమ నొప్పి లాగేస్తున్న హై హీల్స్ కే ప్రాధాన్యత ఇచ్చే యువతరం ఇప్పుడు ఫ్లాట్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడా ఫ్లాట్స్ లో ఎన్నెనో వెరైటీ డిజైన్లున్నాయి. అచ్ఛం పువ్వులే పాదాల పైకి తీర్చి దిద్దినట్లు ఫ్లవర్ డిజైన్లు పాదం ముందు భాగం నుంచి మడమ కు చుట్టేస్తూ యాంకిల్ స్ట్రాప్స్ పైన పువ్వుల డిజైన్లు మెరిసే రాళ్లు ,రంగుల ఈకలు మెరుపులున్న అందమైన బట్టలు అమర్చినవి గ్లాడియేటర్ తరహా లో పాదాల అలంకరణ లతో ఆభరణాలు ఉన్నట్లు ఎన్నో వెరైటీస్. ఈ ఫ్లాట్ సాండల్స్ వచ్చాయి. ఇది చుడీదార్లు ,చీరలు, వేటి మీదకైనా బావుంటాయి. ఇంత హంగామా వద్దనుకుంటే ఫ్లాట్ సాండల్స్ తో కేవలం స్ట్రాప్స్ టోన్ చక్కగా డిజైన్లున్నాయి. ఒకవైపు ఫ్యాషన్ సౌకర్యం ఉన్న ఈ ఫ్లాట్ సాండల్స్ ఇప్పుడు హాట్ ఫ్యాషన్

    ఫ్లాట్ సాండల్స్ హాట్ ఫ్యాషన్

    ఫ్యాషన్ అంటే ఏదైనా ఫ్యాషన్ గానే ఉండాలి. చివరకు చెప్పులైనా ఏ డిజైన్ అయినా చూపులను కట్టిపడేసేలా ఉండాలి. ఫంకీగా ఉండాలి. చెప్పులు సౌకర్యం కోసం కాకుండా…

  • చలి, ఎండలో ఈ రెండు సీజన్లకు కాటన్ లనే ఎంచుకుంటారు. అందులో సుతి మెత్తగా వంటికి హాయిగా చక్కని రంగులతో స్టయిల్ గా వుండే లినెన్ చీరలు ఎంతో హుందాగా ఉంటాయి కూడా. నాజూగ్గా ,ఫ్యాషన్ గా ఉంటే లినెన్ చీరలు దాదాపు సాదా గానే ఉంటాయి. ఇలాంటి సింపుల్ సారీస్ కట్టుకునప్పుడు లేదా లినెన్ కాటన్ డ్రస్ లు వేసుకున్నప్పుడు వీటిమీదకి సాంప్రదాయ బంగారు నగలు ఏమాత్రం బావుండవు. టెర్రకోట ,పూసలు, థ్రెడ్ తో చేసిన హ్యాండ్ మేడ్ ఆభరణాలు లినెన్ చేరాలకు సరిగ్గా సరిపోతాయి. బ్యాగ్ ,చెప్పులు కూడా లెథర్ లేదా హ్యాండ్ మేడ్ వి అయితేనే అలంకరణ డిఫరెంట్ గా ఉంటుంది. లినెన్ వస్త్ర శ్రేణి పైకి అసలు ఏ ఆభరణాలు లేకపోయినా అన్ని తరాలు వారికీ ఆకట్టుకునేలాగా కనిపిస్తాయి. అసలా చెరలోనే ఉంటుంది అందం అంతా.

    ఎట్ట్రాక్టివ్ లుక్ తో లినెన్ కాటన్ సారీస్

    చలి, ఎండలో ఈ రెండు సీజన్లకు కాటన్ లనే ఎంచుకుంటారు. అందులో సుతి మెత్తగా వంటికి హాయిగా చక్కని రంగులతో స్టయిల్ గా  వుండే లినెన్ చీరలు…

  • ఒక్కోసారి ప్రపంచం మరీ ముందుకు పరుగు తిస్తుందేమో. మనమే వెనకబడి ఉన్నాము అనిపిస్తుంది కొన్ని ప్రకటనలు, లేదా కొన్ని వస్తువులు చూస్తుంటే. మనుషుల జీవన వేగాన్ని బట్టి కొత్త డిజైనర్ వస్తువులు వస్తున్నాయి. తీరైన ఆకృతి కోసం జిమ్ కు పోవడం బద్ధకం. పోనీ బట్టలు ఉతకడం బద్ధకం. ఈ రెండు బద్దకాలు పోగోట్టేందుకు వచ్చింది 'బివా' అంటే బైక్, వాషింగ్ మిషన్ లో బట్టలు పడేసిఫెడలింగ్ చేస్తే లోపల మీషన్ వాటిని ఉతికేస్తుంది. ఎంత శుభ్రంగా ఉన్నామో తెరపైన కనిపిస్తూ వుంటుంది. పూర్తయ్యాయి ఇక దిగండి అని మిషన్ సంకేతం ఇస్తుంది. ఈలోగా తొక్కి తొక్కి జిమ్ కష్టం కూడా పూర్తయి పోతుంది. ఒకే మీషన్ రెండు లాభాలు.

    ఒక మిషను రెండు లభాలూ

    ఒక్కోసారి ప్రపంచం మరీ ముందుకు పరుగు తిస్తుందేమో. మనమే వెనకబడి ఉన్నాము అనిపిస్తుంది కొన్ని ప్రకటనలు, లేదా కొన్ని వస్తువులు చూస్తుంటే. మనుషుల జీవన వేగాన్ని బట్టి…