గర్భిణీగా ఉన్నప్పుడు పిల్లలకు పాలిచ్చే సమయంలో చేపలు తినడం వల్ల పిల్లల్లో ఆహార సంబంధ అలర్జీలు, ఆస్థమా, ఎగ్జిమాలు ఎక్కువగా వుండవంటున్నారు పరిశోధకులు. పిల్లలు విషయంలో జరిగిన మరో పరిశోధనలో 11 నెలల వయసు లోపే ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా వుండే చేపలు, గుడ్లు తినిపించడం వల్ల అలర్జీలు నియంత్రించవచ్చని తేలింది. గర్భిణీగా ఉన్నప్పుడు పిల్లలకు పాలిచ్చే సమయంలోనూ స్త్రీలు చేపలు తింటే పిల్లలకు ఫ్యాటీ యాసిడ్ అందుతుందని పరిశోధకులు గుర్తించారు. పిల్లల ఆరోగ్యాన్నీ మెరుగు పరిచేందుకు గానూ పిల్లలకు పాలిస్తున్నంత కాలం తల్లులను చేపల్ని తినమనే సలహా ఇస్తున్నారు పరిశోధకులు.













