• ప్రభుత్వ కార్యాలయాలు, పని ప్రదేశాల్లో మహిళా ఉద్యోగినులపై జరిగే లైంగిక వేధింపుల ఘటనలపై 30 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని కేంద్రప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మహిళా ఉద్యోగినులపై దర్యాప్తు నెలల తరబడిగా సాగుతుందని కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి మనేకా గాంధీ గుర్తించారు. బాధిత మహిళలకు న్యాయం చేసేందుకు వీలుగా 30రోజుల్లోగా దర్యాప్తు పూర్తిచేయాలని ఆదేశించారు. మహిళలపై లైంగిక వేధింపుల కేసుల వివరాలు 8 ప్రభుత్వ శాఖల నుంచి వచ్చాయని, వీటిలో ఆటామిక్ ఎనర్జీ డిపార్టుమెంట్ లో ఎక్కువమంది మహిళలు లైంగికవేధింపులకు గురయ్యారని తేలింది.

    30 రోజుల్లో తెల్చేయండి

    ప్రభుత్వ కార్యాలయాలు, పని ప్రదేశాల్లో మహిళా ఉద్యోగినులపై జరిగే లైంగిక వేధింపుల ఘటనలపై 30 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని కేంద్రప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.…

  • ఇంటి ముందు కాస్తంత చోటున్నా సరే నాలుగు కుండీలు పెట్టి తులసి మొక్కలు నాటండి. దోమల్ని పెరగనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోండి అని చిన్న రిపోర్ట్ వచ్చింది. ఇరుగ్గా వుండే మూలల్లో వుండే సామాన్లు క్లియర్ చేసి నీళ్లు నిలవకుండా చేసి ఆరోగ్యానికి హాని చేయకుండా వుండే దోమల మందు వాడి ముందు అనారోగ్యాలు రాకుండా చూసుకోమంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు. గత ఐదు దశాబ్దాలలో దోమల సంఖ్యా పెరగవలిసిన దానికంటే పదిరెట్లు అధికంగా పెరిగాయట. ఇటీవల అమెరికాలో డెంగ్యూ ఎల్లో ఫీవర్ , చికన్ గున్యా వంటి వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో దోమలు అకస్మాత్తుగా విపరీతంగా పెరగటానికి గల కారణాలు అన్వేషిస్తూ అడవులు నరికేయటంలో ఆకుపచ్చ వనాల్లో తమ జీవన చక్రాన్ని కొనసాగించే అడ్వై దోమలు నగరాలకు వలస వచేస్తున్నాయని తేలింది. దోమలు రానీయకుండా చేసే కొన్ని రకాల మొక్కలుంటాయి. అవన్నీ వెతికి పట్టుకుని ఇంటి చుట్టూ నాటుకోండి అంటున్నారు పరిశోధకులు.

    అడవులు తగ్గటం వల్లే ఈ ప్రమాదం

    ఇంటి ముందు కాస్తంత చోటున్నా సరే నాలుగు కుండీలు పెట్టి తులసి మొక్కలు నాటండి. దోమల్ని పెరగనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోండి అని చిన్న రిపోర్ట్ వచ్చింది. ఇరుగ్గా…

  • ఈ ఏడాది ఐదవ అంతర్జాతీయ కూచిపూడి డాన్స్ కన్వేన్షన్ లో భాగంగా 6117 మంది కుచిపూడి నాట్య కళాకారులు ఒకే సారి 'జయము జయము' గీతానికి నెలకొల్పారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమం అనంతరం గిన్నీస్ రికార్డ్స్ ప్రతి నిధి రిషినాద్ ఏ.పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి గిన్నీస్ రికార్డు అందజేసారు.

    కూచిపూడి నృత్యానికి గిన్నీస్ రికార్డు

    ఈ ఏడాది ఐదవ అంతర్జాతీయ కూచిపూడి డాన్స్ కన్వేన్షన్ లో భాగంగా 6117 మంది కుచిపూడి నాట్య కళాకారులు ఒకే సారి ‘జయము జయము’ గీతానికి నెలకొల్పారు.…

  • భూమి గుండ్రంగా వుంది. ఇది మార్చలేని విషయం అలాగే ప్రపంచమంతా చాలా మంది మగవాళ్ళు ఆడవాళ్ళ పట్ల చులకనగా వుండే అభిప్రాయముతోనే ఉన్నారు. ఎందుకు పనికి రాని ఆవారా అవచ్చు అర్జెంటీనా రాజధాని బ్యూనోస్ ఎయిర్స్ మాజీ మేయర్ మరిషియా మెక్రీ కావచ్చు. ఆయన ఇప్పటి ఆదేశ అధ్యక్షుడు కావచ్చు. అభిప్రాయం మాత్రం సేమ్ ఆయనో వ్యాఖ్య వినిపించాడు. అబ్బాయిలు చేసిన వ్యాఖ్యలు ఎంత అసభ్యంగా ఉన్నా సరే వాటిని ఇష్టపడని అబ్బాయిలంటూ ఉండరు . వాళ్లకవి నచ్చవంటే నేను నమ్మలేను. అనేసారు. ఆయనే ఇంత ఆలోచనారహితంగా మాట్లాడితే అమ్మాయిల రక్షణ ఏకంగా ఆ నగర పరిస్థితిని మేయర్ వ్యాఖ్యలకి ఎలా ఊహించాలి. అడుగడుగునా వేధింపులే. వెంబడించటాలు. చివరికి మేయర్ వ్యాఖ్యలకి ప్రాయశ్చిత్తం చేసుకుంటూ నగరం ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. అమ్మాయిల పై వేధింపులే కాదు. వాళ్లకి నచ్చని మాట విసిరినా చాలు 3600 రూపాయల జరిమానా. వాళ్ళ భాషలో వెయ్యి పెసోలు. ఇందుకు కారణం అక్కడ మొదలైన ఒక ఉద్యమం IVI UIVA MENOS అంటే ఇంకొక్కరికి ఇలా కాకూడదు అని ఉద్యమ ఫలితమే ఇప్పటి చట్టం.

    చిన్నమాటన్నా సరే జరిమానా

    భూమి గుండ్రంగా వుంది. ఇది మార్చలేని విషయం అలాగే ప్రపంచమంతా చాలా మంది మగవాళ్ళు ఆడవాళ్ళ పట్ల చులకనగా వుండే అభిప్రాయముతోనే ఉన్నారు. ఎందుకు పనికి రాని…

  • దేశంలోని సినిమా హాళ్లలో తప్పనిసరిగా జాతీయ గీతాన్ని వినిపించాలని ఇటీవల సుప్రీం కోర్టు ఉత్పాదులు జారీ చేసింది. ఈ గీతాన్ని రచించిన రవీంద్ర నాథ్ ఠాగూర్ మన దేశాన్ని ఎంతో ప్రేమించారు. భారత భాగ్య విధాత అనే శీర్షిక 1911 లో రాసిన ఈ గీతం దేశ భవిష్యత్తును ఒక రధసారధి లా ఎలా ముందుకు నడిపించాలో చెపుతుంది. జనగణమన ఇక నుంచి మన కొత్త గణ తంత్ర రాజ్యానికి జాతీయగీతమని దాన్ని అందరూ గౌరవించాలని 1950 జనవరి 29 న రాజ్యాంగ సభ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఓ ప్రకటన చేసారు. ఆ ప్రకటనే ఒక శాసనంగా ఇప్పటివరకు అమలు జరుగుతూ వుంది. జాతీయ గీతం జాతీయ పతాకం వల్ల గౌరవం ప్రేమాభిమానాలు ప్రదర్శించటం అంటే మాతృ భూమిని గౌరవించుకోవటమే. దీన్ని గౌరవించి ఆదరించటం ప్రజల్లో సహజ సిద్ధంగా రావాలని సుప్రీమ్ కోర్టు తన ఉత్పాదుల్లో వ్యాఖ్యానించింది. ఇప్పుడు సినిమా హాళ్లలో వేస్తున్నారు. తప్పనిసరిగా లేచినిలబడి గౌరవించండి.

    లేచి నిలబడి గౌరవించండి

    దేశంలోని సినిమా హాళ్లలో తప్పనిసరిగా జాతీయ గీతాన్ని వినిపించాలని ఇటీవల సుప్రీం కోర్టు ఉత్పాదులు జారీ చేసింది. ఈ గీతాన్ని రచించిన రవీంద్ర నాథ్ ఠాగూర్ మన…

  • ఈది తప్పనుసరిగా అందరు తెలుసుకోవల్సిన వార్తా. ఒక మంచి రిపోర్ట్ కుడా.రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా 2011 జనాభా లెక్కల ప్రకారం ఒక విశ్లేషణ చేశారు. మొదటి సంతానం అమ్మయి ఐతే తర్వాత అబ్బాయి కావలనుకుంటారు. కాని అధి కుడా అమ్మాయి ఐతే నిర్ధక్షాణ్యంగా వద్దనుకుంటారు. దినిని ఉపాధి కొణం నుంచి విశ్లేషించారు. వ్యవసాయ రంగంలో పని చెసే మహిళలు ,ఉద్యోగినులు,గృహిణులు ఇలా మూడు కోణాలలో విశ్లేషిస్తే వ్యవసాయ రంగంలో మహిళలకు ఇద్దరు ఆడపిల్లలుంటే ముడో సంతానం అబ్బాయి కావలనుకుంటారు. గృహిణులైతే మొదటి సంతానం అమ్మయి ఐతే రెండవ సంతానం అమ్మాయి వద్దనుకుంటారు.ఉద్యోగినులు మాత్రం ఇద్దరు అమ్మయిలు ఐనా ఎలాంటి భారం లేకుండా కనిపెంచుకుంటున్నారు. చదువు,విషయపరిజ్నానం ఉంటాయి కనుక ఆడపిల్లలైన మగ పిల్లలైన పర్లేదు  అనుకుంటారు. గృహినులు మాత్రం రెండో సంతానం కుడా ఆడపిల్ల ఐతే మాత్రం వద్దనుకుంటారు. ఈ కారణం తోనే ఈ వర్గంలో ఆడపిల్లల కోరత ఏర్పడింది. ఎదో ఒక రంగంలో ఉపాధి లొ ఉన్న మిగిలిన్ వర్గాలలో ఈ పరిస్థితి లేదు.

    ఆర్ధిక పరిస్థితులే ఈ సమస్యలకు కారణం

    ఈది తప్పనుసరిగా అందరు తెలుసుకోవల్సిన వార్తా. ఒక మంచి రిపోర్ట్ కుడా.రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా 2011 జనాభా లెక్కల ప్రకారం ఒక విశ్లేషణ చేశారు. మొదటి…

  • ఈ మధ్య అందరూ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులతో కొత్త నోట్ల కోసం బ్యాంకుల ఎటిఎం లకు వెళుతున్నారు. కార్డుల వినియోగంలో ఎటిఎం ల వాడకంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. ఎటిఎం లకు వెళ్తుంటే మురికిపట్టి ఎన్నడూ వాడనట్లు అనిపిస్తున్న జోలికి వెళ్ళకూడదు. అవి బహుశా పనిచేయని ఎటిఎం లు కావచ్చు. లావాదేవీలు పూర్తీ కావాలంటే పిన్ నెంబర్ రెండు సార్లు ఎంటర్ చేయమని అడుగుతున్నా తేడా ఎదో ఉందని గమనించండి. సొంత బ్యాంక్ ఎటిఎం లు వాడటం మంచిది. మన అకౌంట్ ఉన్న బ్యాంకులైతే మోసాలకు తావుండదు. ఇక ఇ -షాపింగ్ కోసం సెక్యూర్ సాకెట్స్ లేయర్ S.S.L సర్టిఫైడ్ సైట్లనే వాడాలి. స్మార్ట్ ఫోన్ లో యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దీని వల్ల మాల్వేర్ అరికట్టటం ఈజీ అవుతుంది. పబ్లిక్ వైఫై నెటవర్క్ లైన్ డబ్బు లావాదేవీలు జరిపినా నష్టమే. పాస్వర్డ్ ఎప్పటికప్పుడు మార్చితే ఐడెంటిటీ థెఫ్ట్ కు అవకాశం పోతుంది.

    కార్డులో వాడుతుంటే జాగ్రత్త

    ఈ మధ్య అందరూ  క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులతో కొత్త నోట్ల కోసం బ్యాంకుల ఎటిఎం లకు వెళుతున్నారు. కార్డుల వినియోగంలో ఎటిఎం ల వాడకంలో కొన్ని…

  • ఈ సర్వే ఎప్పుడూ తారలు మరీనా మారని మహిళల జీవిత చిత్రంలా కనిపిస్తూవుంటాయి. నాలుగు దేశాల్లో చేసిన ఒక సర్వే లో మహిళలు 19 సంవత్సరాలలోపు నుంచే ఎన్నో రకాల వేధింపులకు లోనవుతున్నారని తేలింది. మన దేశంలో పదిమంది ఆడవాళ్ళలో నలుగురు ఇలాంటి హింసలకు గురవుతున్నారు. గత నెలలో 73 శాతం మంది మహిళలు ఎదో ఒక రూపంలో హింస లేదా వేధింపులు ఎదుర్కొన్నారు. గత నెలలో శరీరం పై తగలరాని చోట తమను తడిమారని ప్రతి నలుగురు మహిళల్లో ఒకరు చెప్పారు మన దేశంలో ఆరు శాతం మంది ఆడపిల్లలు పది సంవత్సరాలు నిండకుండా వేధింపులు హింసకు లోనవుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎదుర్కుంటున్న పదేళ్ల లోపు ఆడపిల్లలు బ్రెజిల్ లో 16 శాతం బ్రిటన్ లో 12 శాతం థాయిలాండ్ లో ఎనిమిది శాతంగా ఉన్నారు. వేధింపులకు గురికాకుండా తగిన రక్షణ చర్యలు అనుసరిస్తున్నట్లు ఇండియా లోని 82 శాతం స్త్రీలు చెప్పారు. 35 శాతం పార్కులు లైట్లు లేని చోట్లకు వెళ్ళటం తగ్గించారు. 36 శాతం నిత్యం తాము ప్రయాణించే రూట్ మార్చారు. రేప్ అలారం మిరియాల పొడి లాంటివి రక్షణగా వాడుతున్నారు.

    19 ఏళ్లకే వేధింపులు

    ఈ సర్వే  ఎప్పుడూ తారలు మరీనా మారని మహిళల జీవిత చిత్రంలా కనిపిస్తూవుంటాయి. నాలుగు దేశాల్లో చేసిన ఒక సర్వే లో మహిళలు 19 సంవత్సరాలలోపు నుంచే…

  • ప్రపంచం మారిపోయిందని అప్పుడప్పుడు చాలా భ్రమ కలుగుతూవుంటుంది. కళ్ళు మిరిమిట్లు గొలిపే వెలుగు కనపడుతుంది. నింగిన మెరిసిన తరల్లాంటి కొందరు విజేతలను చూసి ముచ్చట పడేంత లోపే ఎక్కడో అంధకారపు ఒక ఆర్తనాదం కాళ్ళు నెలకు ఆనేలా చేస్తుంది. రుతుస్రావం పై అపోహలు అపవిత్రత ముద్రలు కొత్తవి కావు. మన దేశంలో ఆ మూడు రోజులు ప్రత్యేకమైన గది కేటాయించే పద్దతి వుంది. పొరుగు దేశం నేపాల్ లో చౌపది అనే పేరుతో ఊరికి దూరంగా గుడిసెలు కడతారు. అమ్మాయిలు అక్కడే ఉండాలి. అక్కడి ప్రభుత్వం 2005 లో చట్టం తెచ్చినా ప్రయోజనం లేదు. ఈ దురాచారానికి వ్యతిరేకంగా నేషనల్ పబ్లిక్ రేడియో ప్రచారం చేస్తుంది. ఈ గుడిసెల్లో గ్రామం బయట ఉండటం వల్ల కూడా జంతువుల భయం ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఇరవై ఆరేళ్ళ అమ్మాయి గుండె పోటుతో అరుపులు ఊరివారు వినక నిస్సహాయంగా చనిపోయిందని రేడియో చెపుతోంది. గత తొమ్మిదేళ్లలో మహిళలు పురుగు పుట్రా కుట్టి చనిపోయారట.

    ఇంకా ఈ దురాచారం పోలేదు

    ప్రపంచం మారిపోయిందని అప్పుడప్పుడు చాలా భ్రమ కలుగుతూవుంటుంది. కళ్ళు మిరిమిట్లు గొలిపే వెలుగు కనపడుతుంది. నింగిన మెరిసిన తరల్లాంటి కొందరు విజేతలను చూసి ముచ్చట పడేంత లోపే…

  • బంగారం అరవై తులాలకు మించి ఉంటే ప్రభుత్వం లాగేసుకుంటుందా అనే సందేహం చాలా మందిని వేధిస్తోంది. ప్రభుత్వం అలా ఏమీ లాక్కోదు. పరిమితికి మించిన బంగారం ఎలా సమకూర్చుకోగలిగారో వివరణ ఇవ్వగలగాలి. వారసత్వంగా వచ్చిందనుకోండి. విల్లు ప్రకారం వచ్చిన బంగారం పైన ఇద్దరు సాక్షి సంతకాలు ఉంటే చాలు. బహుమతిగా వచ్చిన బంగారాన్ని అమ్మాలంటే ఆనాటి ధర ఇప్పటి ధరల మధ్య వ్యత్యాసం పై పన్ను కట్టాలి. కేంద్ర ప్రభుత్వం గోల్డ్ డిపాజిట్ స్కీం 1999 ప్రకారం 2000-01 నుంచి గోల్డ్ డిపాజిట్ బ్రాండ్లను జ్యూవెలరీ కేంద్రం పరిగణించకుండా సెక్షన్-2 కి సవరణ ఇచ్చింది. గోల్డ్ డిపాజిట్ బ్రాండ్లు ఆస్తులుగా పరిగణించారు. వ్యయసాయ ఆధారిత కుటుంబాలైతే వ్యవసాయ ఆదాయం పై పన్ను లేనట్లే వ్యవసాయ ఆదాయం తో కొనుగోలు చేసిన బంగారం పై ఎలాంటి పన్ను ఉండదు. పుట్టింటి నుంచో బహుమతిగానో మరేవిధంగానో వచ్చిన బంగారానికి ఆధార పత్రం ఉండేలా చూసుకుంటే చాలు. ఒక చిన్న మధ్య తరగతి కుటుంబంలో 60 తులాల కంటే ఎక్కువ బంగారం వుండే అవకాశం వుంటుందా చెప్పండి. ఆదాయానికి మించిన అక్రమార్జన ఉంటేనే లెక్కలు బయటకి వస్తాయి.

    బంగారం గురించి కంగారొద్దు

    బంగారం అరవై తులాలకు మించి ఉంటే ప్రభుత్వం లాగేసుకుంటుందా అనే సందేహం చాలా  మందిని వేధిస్తోంది. ప్రభుత్వం అలా  ఏమీ లాక్కోదు. పరిమితికి మించిన బంగారం ఎలా…

  • పురుషుల ఆలోచనలు మెదడులోంచి వస్తే మహిళల ఆలోచనలు మనసులోంచి వస్తాయంటున్నారు అధ్యయన కారులు. వాళ్ళ నిర్ణయాలు ఎప్పుడూ లాజిక్ కు అందవు. మహిళల నాయకత్వంలో రుణ రహిత కంపెనీలు ఎక్కువని ఓ అంతర్జాతీయ అధ్యయనం చెప్తోంది. అహ్మదాబాద్ కు చెందిన పారు జయకృష్ణ అన్న యువతి అసాహిసాంగ్ వన్ పేరుతొ ఒక ఎగుమతి సంస్థని ప్రారంభించిందట. నానాటికి ఆమెకు ఎగుమతి దిగుమతి చట్టాల పైనా వ్యాపారం పైనా అవగాహన ఏవీ లేదు. పెట్టుబడి తక్కువ ఒకటే కారణం. అలాగే ఢిల్లీలో ఒక బహుళ జాతి కంపెనీ ఉద్యోగాన్ని వదులుకుని నీతి అన్న అమ్మాయి 36 రంగ్ పేరుతో గిరిజన కళాకృతులు అంతర్జాతీయ మార్కెట్ కు పరిచయం చేసే బిజినెస్ పెట్టింది. ఢిల్లీ వదిలి నీతి సొంతూరు ఛత్తీస్గఢ్ లోని సొంతూరు వచ్చేస్తే అందరూ ఆశ్చర్యపోయారు. దీపా సోమన్ ఒక మార్కెట్ రీసెర్చ్ కంపెనీ పెట్టి ఇందులో మహిళలకే ప్రాధాన్యత అంటూ పైగా ఖచ్చితమైన పనివేళలు కూడా వుండవు. వాళ్ళు ఇంట్లోంచి కూడా పని చేయచ్చు నని చెప్పి చేసి చూపెట్టింది. వ్యాపారంతో పాటు సామజిక సేవ కలగలిపి వుంటోంది మహిళలు ఏ ఉపాధి చెప్పటినా షి ఆల్వేస్ థింక్స్ బిగ్. దీర్ఘ కలయిక దృష్టి మహిళకు స్వయంగా అబ్బిన లక్షణం.

    వాళ్ళ ఆలోచనా తీరే వేరు

    పురుషుల ఆలోచనలు మెదడులోంచి వస్తే మహిళల ఆలోచనలు మనసులోంచి వస్తాయంటున్నారు అధ్యయన కారులు. వాళ్ళ నిర్ణయాలు ఎప్పుడూ లాజిక్ కు అందవు. మహిళల నాయకత్వంలో రుణ రహిత…

  • GHOST SMUGGLERS ..... సరిగ్గానే చదివారు. దయ్యాలను అమ్మకానికి పెట్టిన నారాయణ్ యాదవ్. ఈ న్యూస్ మనం ఎందుకు చదువు కోవాలంటే ప్రజల అమాయకత్వం నమ్మకాలు లాజిక్ కు అందని విశ్వాసాలు ఎలా మోసపోయేలా చేస్తాయో అర్ధం చేసుకోవాలని ఛత్తీస్గఢ్ రాష్ట్రం జస్ పూర్ ప్రాంతం అసలే అమాయక ప్రజలు ఆపైన దయ్యలా భయం. ఈ బలహీనత కనిపెట్టిన యాదవ్ దయ్యాలున్నాయి కొనుక్కోండి. కొనుక్కుంటే అవి మీకు కాపలా వుండి ఇతర దెయ్యాల నుంచి కాపాడతాయి అని ప్రచారం చేసుకున్నాడు. హనుమాన్ చాలీసా లో కూడా దెయ్యాలున్నాయి హనుమంతుడు కాపాడతాడనే కదా వుంది అని బుకాయిస్తాడు. అతని మాటలు నమ్మిన గ్రామస్థులు చేతనైనంత సొమ్ము అతని చేతిలో పెట్టి దెయ్యాలను కొనుక్కున్నారు. ఇది పోలీసుల కంటపడి యాదవ్ ను అతని అనుచరులు ఇద్దరినీ జైల్లో పెట్టారు. దెయ్యాలను కొనుక్కోవటమేమితి అనుకోనక్కర్లేదు. చేత బడులు, మంత్రాలు, మాయలు ఉన్నాయని ఇప్పటికీ తెలంగాణ మారుమూల గ్రామాల్లో ఎంతెంత అన్యాయాలు జరుగుతున్నాయి. ఎంత మంది అమాయకులు తమకు వచ్చిన జబ్బులు కష్టాలు మంత్రాలూ మాయల వల్ల వచ్చాయని నమ్మి ప్రాణాల పైకి తెచ్చుకుంటున్నారు?

    అమ్మకానికి దయ్యాలు

    GHOST SMUGGLERS ….. సరిగ్గానే చదివారు. దయ్యాలను అమ్మకానికి పెట్టిన నారాయణ్  యాదవ్. ఈ న్యూస్ మనం ఎందుకు చదువు కోవాలంటే ప్రజల అమాయకత్వం నమ్మకాలు లాజిక్…

  • హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా కధ లాంటి సమాచారం ఒకటి వచ్చింది. బ్రెయిన్ చిప్స్ తయారవుతున్నాయి. ఇక వీటి వినియోగంలో మతి మరుపు వాళ్ళు మేధావులైపోతారన్నమాట. ఇప్పటివరకు ఎలుకలు కోతులపైన ఈ మెమొరీ చిప్స్ ఉపయోగించి ప్రయోగాలు చేసారు. వాటి జ్ఞాపక శక్తి పెరిగిపోయి చాల తెలివిగా వున్నాయట. ఇక మనుషుల కోసం బ్రెయిన్ చిప్స్ తయారవుతున్నాయట. కాలిఫోర్నియా లోని బయో మెడికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ Dr. థయోడోర్ బెర్గర్ ఈ బ్రెయిన్ చిప్ డిజైనింగ్ చేస్తున్నాడు. మెదడు లో మెమొరీ ని పెంచే వివిధ రకాల డిజైన్లతో కృత్రిమ పరికరాలు తయారుచేస్తున్నారు. ఇవి మనుషుల్లో వుండే షార్ట్ టర్మ్ మెమొరీ పవర్ ని లాంగ్ టర్మ్ మెమోరీ గా మారిపోతుంది. ఈ చిప్ మెదడు లో ఇన్స్టాల్ చేస్తే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని ప్రసారం చేసి లింకులు కలుపుతూ మెమొరీ ని వృద్ధి చేస్తాయన్నమాట. మనుషుల పరిస్థితులు బ్లడ్ గ్రూపులు కామన్ జీన్స్ వారీగా ఈ చిప్స్ ఇన్స్టాల్ చేస్తారన్నమాట. మెదడు బదులు మిషనే ఆలోచించి పెట్టేస్తుంది.

    మెమొరీ బ్రెయిన్ చిప్స్ వస్తున్నాయి

    హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా కధ లాంటి సమాచారం ఒకటి వచ్చింది. బ్రెయిన్ చిప్స్ తయారవుతున్నాయి. ఇక వీటి వినియోగంలో మతి మరుపు వాళ్ళు మేధావులైపోతారన్నమాట. ఇప్పటివరకు…

  • పిల్లలు పోతపాలు తాగిన, తల్లిపాలు తాగిన ఐక్యూ లెవల్స్ లో ఎలాంటోఇ తేడా ఉండదని చెబుతుంది ఒక అధ్యాయనం. తల్లి పాలు పోతపాలు తాగిన పిల్లలను రెండు గ్రూపులుగా చేసి మొత్తం 11 వేల మంది పై చేసిన సరికొత్త అధ్యాయనంలో రకరకాల వయసు పిల్లలు రెండేళ్ళ వయసు పిళ్ళల నుంచి 16 ఏళ్ళ వయసు పిల్లల పై వాళ్ళ ఇంటిలిజెన్స్ లెవల్స్ తీసుకుంటే తల్లి పాలఉ తాగిన పిల్లల ఐక్యూ హెచ్చు స్థాయిలో లేదని తేలింది. తల్లి పాలకు పిల్లల జీవితంలో ప్రదర్శించే తెలివితతేటలకు సంబందం లేదని లండన్ కు ఛేందిన గోల్డ్ స్మీత్ యూనివర్సీటి శాస్త్రవేత్తలు వెల్లడించారు. పోతపాలు తాగిన పిల్లల్లు 18 నెలల వయసు వారు 16 సంవత్సరాల వయసు వచ్చే వరకు ధీర్ఘకాలం పాటు ఈ అధ్యాయనం కోనసాగించామంటున్నారు. మొత్తం 11 వేల మంది పిల్లల విషయంలో అధ్యయనం సాగింది. పిల్లల ఎదుగుదలలో వారి అధికస్థితిగతులు సామాజిక కుటుంబ నేపథ్యం తల్లిదండ్రుల విధ్యర్హతలు ముఖ్యపాత్ర పోషిస్తాయని పోతపాలు పట్టిన తల్లులు ఏ మాత్రం విచారించాల్సిన అవసరం లేదని అధ్యాయనం రిపోర్టులు చెప్పాయి.

    ఏ పాలు తాగిన ఒకటే

    పిల్లలు పోతపాలు తాగిన, తల్లిపాలు తాగిన ఐక్యూ లెవల్స్ లో ఎలాంటోఇ తేడా ఉండదని చెబుతుంది ఒక అధ్యాయనం. తల్లి పాలు పోతపాలు తాగిన పిల్లలను రెండు…

  • ఆలు మగలు మధ్య బంధం గట్టిగా ఉండాలంటే ఇద్దరికీ కలిసి సెంటిమెంట్ సినిమాలు చూడమంటున్నారు పరిశోధకులు . విడాకుల కోసం వచ్చిన దంపతులకు మానవ సంబంధాలకు గురించిన కౌన్సిలింగ్ ఇస్తే వారిలో విడిపోవాలన్న కోరిక తగ్గటానికి రెండు మూడేళ్లు పడుతోందిట. దీనికంటే సినిమాలు చూపిస్తే బెస్ట్ కదా అంటున్నారు న్యూయార్క్ లోని బింగ్ టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త మాధ్యు జాన్సన్. సాధారణంగా మనుషులు సినిమాల్లోని పాత్రలతో తమను పోల్చుకుని చూస్తుంటారు కనుకే చాలా సినిమాలు హిట్ అవుతుంటాయంటారు. జీవితంలో కలతలను సెంటిమెంట్ సినిమాల్లో సంఘటనలకు అవ్యయించుకుని వాటని తుడిచేసుకునే అవకాశం ఉందంటున్నారు. అసలు కలతలు రావటానికి ముఖ్యకారణం భార్య భర్తా ఎవరైనా సరే వారికి కొన్ని సొంత ఆలోచనలు ఆశయాలు కోరికలు అభిప్రాయాలు ఉంటాయి. ఈ విషయం లో పరిధిదాటి అవతలివాళ్ళను నొప్పిస్తేనే బంధాలు బలహీనపడతాయి. అలాగే ఇద్దరిమధ్య దాపరికాలు కూడా విభేదాలకు కారణం దాపరికాలు ఉండటం. అందుకే భార్యాభర్తలు స్నేహితులు ప్రేమికులు ఎవరైనా సరే బంధంలో వీలైనంత స్వచ్ఛత పారదర్శకత ఉండటం చాలా అవసరం.

    సెంటిమెంట్ సినిమాలు చూపించండి

    ఆలు మగలు మధ్య బంధం గట్టిగా  ఉండాలంటే ఇద్దరికీ కలిసి సెంటిమెంట్ సినిమాలు చూడమంటున్నారు పరిశోధకులు . విడాకుల కోసం వచ్చిన దంపతులకు మానవ సంబంధాలకు గురించిన…

  • తల్లీ బిడ్డల ప్రాణాలు కాపాడే నిమిత్తం అత్యంత క్లిష్ట సమయంలోనే శస్త్ర చికిత్సకు వెళ్లాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెపుతుంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం శస్త్ర చికిత్స ద్వారా ప్రపంచంలోకి వస్తున్న పిల్ల సంఖ్య అత్యధికంగా వుంది. ఈ అంశంలో తెలంగాణా తోలి స్థానంలో వుంటే ఆంధ్రప్రదేశ్ నాలుగోవ స్థానంలో వుంది. తెలంగాణా తోలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో 40.6 శాతం ప్రైవేట్ ఆసుపత్రుల్లో 74.9 శాతం తల్లులకు శస్త్ర చికిత్స ద్వారానే కాన్పులు జరుగుతున్నాయి. ఇక ఆంధ్రాలో ప్రభుత్వ ఆసుపత్రులలో 25.5 శాతం ఆసుపత్రుల్లో 57 శాతం బిడ్డలు కడుపు కొత ద్వారానే బయట పడుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో త్రిపుర పశ్చిమ బెంగాల్లో మాత్రం తెలంగాణా లో పోటీ పడుతున్నాయి. శస్త్ర చికిత్సలు ఈ స్థాయి లో పెరిగిన మాతృ శిశు మరణాలు మాత్రం తగ్గడం లేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

    అమ్మాకెప్పుడూ కష్టమే!

    తల్లీ బిడ్డల ప్రాణాలు కాపాడే నిమిత్తం అత్యంత క్లిష్ట సమయంలోనే శస్త్ర చికిత్సకు వెళ్లాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెపుతుంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం  శస్త్ర చికిత్స…

  • వయోతారతమ్యాలు ,చదువు సంధ్యలు సామాజిక హోదాలు ఆర్థిక స్తితిగతులతో సంబంధం లేకుండా మహిళలంతా ఎదో రకమైన హింసకు గురవుతున్నారని కాకపోతే హింసకు వ్యతిరేకంగా 119 దేశాల్లో చట్టాలు అమలుచేస్తున్నాయి. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా 125 దేశాల చట్టాలు అమలు చేస్తున్నాయి. కానీ ఈ చట్టాలు మహిళలలకు సత్వర న్యాయం కల్పిస్తున్నాయనే దాఖలాలు మాత్రం ఏవీ లేవు. చట్టాలున్నా బాధ్యత మహిళలు ఫిర్యాదు చేసేందుకుఅనుకూలమైన పరిస్థితులు లేవు. మూడేళ్ళలో గృహ హింసకు సంబంధించి దేశవ్యాప్తంగా 3. లక్షల కేసులు నమోదయ్యాయి. కాలం గడుస్తుంటే హింస రూపం మార్చుకుంటుంది. ఇప్పుడైతే ఇల్లు, బడి, గుడి, ఆఫీస్ ,బస్స్టాండ్ ,సినిమా హాల్ ,షాపింగ్ మాల్ , జన నమ్మకం ఉన్న ప్రదేశాలు ఏవీ మహిళలలకు వంద శాతం సురక్షితమైన ప్రదేశాలు కానేకావు. రేపు నవంబర్ 25వ తేదీన ఇంటర్నేషనల్ డే ఆన్ వయొలెన్స్ ఎగైనెస్ట్ ఉమెన్. కానీ హింసధ్వని అసలు ఎప్పటికైనా ఆగుతుందా?

    ఈ హింసధ్వని అసలు ఆగుతుందా ?

    వయోతారతమ్యాలు ,చదువు సంధ్యలు సామాజిక హోదాలు ఆర్థిక స్తితిగతులతో సంబంధం లేకుండా మహిళలంతా ఎదో రకమైన హింసకు గురవుతున్నారని కాకపోతే హింసకు వ్యతిరేకంగా 119 దేశాల్లో చట్టాలు…

  • ఈ ఎనిమిదేళ్ల పాప కాశ్మీర్ లోని మారుమూల ప్రాంతం బందీ పోదకు చెందిన తజముల్ వరల్డ్ కిక్ బాక్సింగ్ అండర్ -8 టైటిల్ గెలుచుకుంది. ఏ రంగంలో అడుగుపెట్టిన మొదటి కాశ్మీర్ అమ్మాయిగానే ఈ టైటిల్ గెల్చుకున్న మొదటి భారతీయ చిన్నారిగా కూడా తజముల్ తన గొప్ప తనాన్ని చాటుకుంది. ఇటలీలో జరిగిన ఈ పోటారీ చైనా అమెరికా కెనడా దేశాలకు చెందిన పిలల్లు పాల్గొన్నారు. తజముల్ తండ్రి టాక్సీ డ్రైవర్. సరైన మీఅదనం కూడా లేని స్కూల్లో చదివే తజముల్ ఆమె కోచ్ ఫైజల్ అలా కష్టపడి ట్రైనింగ్ ఇస్తున్నాడు. సరైన శిక్షణ దొరికితే ఒలింపిక్ గోల్డ్ మెడల్ కూడా సాధించే శక్తి వుంది తజముల్ కు.

    కిక్ బాక్సింగ్ ఛాంపియన్ ఈ పాపాయి

    ఈ ఎనిమిదేళ్ల పాప కాశ్మీర్ లోని మారుమూల ప్రాంతం బందీ పోదకు చెందిన తజముల్  వరల్డ్ కిక్ బాక్సింగ్ అండర్ -8 టైటిల్ గెలుచుకుంది. ఏ రంగంలో…

  • ఇంటి దగ్గరుండే మైదానాల్లోనో మామూలు వీధుల్లోనో పరుగు పందెం కోసం సాధన చేసే క్రీడాకారిణులకు ఆకతాయిల వేధింపులు ఎన్నో ఎదురవుతూ వుంటాయని ప్రపంచ వ్యాప్తంగా మహిళా అథ్లెట్ల పరిస్థితి ఇలాగే ఉంటుందని రన్నర్స్ వరల్డ్ అనే పత్రిక నిర్వహించిన అధ్యయనంలో తేలింది. 2533 మంది అథ్లెట్ల తో ఈ అధ్యయనం చేశారట. ఈ వేధింపులకు భయపడి మన క్రీడా కలల్ని తుంచేసుకొనవసరం లేదు. ఆటలో దూకుడు ప్రదర్శించి పతకాలు గెల్చుకోవాలి అని చెప్తోంది. అమెరికన్ క్రీడా కారిణి కారా గౌచర్. ఇప్పటికే రెండు ఒలంపిక్స్ లో పాల్గొన్నారామె. అథ్లెట్లు ఒలంపిక్ విజేతలు అన్న తారతమ్యం లేకుండా అందరూ వేధింపులకు గురైనవారేనని తేలింది కదా ఇంకా మీరేవళ్ళు ఆకతాయిల అల్లరికి భయపడకండి హాయిగా మీ పనులు చేసుకోండి అని ఆడ పిల్లలకు హితవు చెపుతున్నారు ఈ అధ్యయనకారులు.

    వాళ్ళకే తప్పు లేదు మీకెందుకు భయం

    ఇంటి దగ్గరుండే మైదానాల్లోనో మామూలు వీధుల్లోనో పరుగు పందెం కోసం సాధన చేసే క్రీడాకారిణులకు  ఆకతాయిల వేధింపులు ఎన్నో ఎదురవుతూ వుంటాయని ప్రపంచ వ్యాప్తంగా మహిళా అథ్లెట్ల…

  • కార్తీక మాసం సందర్భంగా భక్తి టీవి నిర్వహిస్తున్న కోటి దీపోత్సవాల వేడుక కన్నుల పండుగ గా జరుగుతుంది. నవంబర్ 5వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరగనున్న ఈ వేడుకల్లో నిత్యం వివిధ ప్రత్యేక పూజలతో దైవాన్ని ఆరాదిస్తూ కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని వేడుకలా నిర్వహిస్తున్నారు. బుధవారం జరిగిన ప్రత్యేక పూజలు, కార్తీక దీపారాధనలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు దంపతులు పాల్గొన్నారు.

    కోటి దీపోత్సవంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు దంపతులు

    కార్తీక మాసం సందర్భంగా భక్తి టీవి నిర్వహిస్తున్న కోటి దీపోత్సవాల వేడుక కన్నుల పండుగ గా జరుగుతుంది. నవంబర్ 5వ తేదీ నుంచి 21వ తేదీ వరకు…