• ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ రిబ్బన్ ఐ లైనర్ ఇమేజస్ ను పెడితే మూడు లక్షల మంది చూసారట. కోనల సోయగం అంత బావుంది. ఇవ్వాల్టి ఫ్యాషన్ స్టేట్ మెంట్. కొంత ప్రాక్టిస్ చేస్తే ఈ అలంకరణ చేయవచ్చు. ముందుగా ఐ లైనర్ తో రెప్పల వెంట్రుకల దగ్గర నల్లని చక్కని గీతలను కోనలు దాటి పోయేలా గీయాలి. గతంలో బి సరోజాదేవి వంటి హీరోయిన్, ఈ కళ్ళు దాటిన కాటుక రేఖాలు దిద్దుకుని వాళ్ళే మహానటి సావిత్రి వచ్చిన కళ్ళు చుస్తే రెప్పలు దాటి కోసుగా ఈ గీత, చక్కని కళ్ళ అనడంతో కనిపిస్తుంది. ఇప్పుడైతే ఆ గిసిన గీత చుట్టూ కలర్ లిక్విడ్ ఐలైనర్ తో వంకీలు ఎంతో బావుంటాయి. ఇవ్వాల్టికి ఫ్యాషన్ ట్రెండ్ ఇదే.

    కళ్ళ కోనలకు వంపుల సొంపులు

    ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ రిబ్బన్ ఐ లైనర్ ఇమేజస్ ను పెడితే మూడు లక్షల మంది చూసారట. కోనల సోయగం అంత బావుంది. ఇవ్వాల్టి ఫ్యాషన్…

  • శిరోజాల పరిరక్షణ విషయంలో శ్రద్ధగా ఉంటేనే జుట్టు రాలి పోకుండా పొడిబారకుండా వుంటుంది. ప్రతి రోజు సిరోజాలను కడగటం, మృదువుగా వుంటుందని అతిగా కండీషనర్ అప్లయ్ చెయడం చూస్తుంటారు. తరచూ హెయిర్ చాలా అవసరం లేదు. కుదుళ్ళ వద్ద వుండే కొత్త జుట్టు ఆరోగ్యంగా వుంటుంది కనుక కండీషనర్ వెంట్రుకల టిప్స్ పైనే లక్ష్యం చేసుకోవాలి. హెయిర్ డ్రయ్యర్, స్రెయిట్ నర్లు ఉపయోగిస్తున్నప్పుడు సరైన జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువగా బ్లో డ్రై చేయకూడదు. హెయిర్ డ్రయ్యర్ వాడేటప్పుడు 8 నుంచి 12 అంగుళాలు జుట్టుకు దూరంగా పట్టుకోవాలి. శిరోజాలను వీవ్ఇన్ కండీషనర్ తో లేదా దూరంగా పెట్టుకోవాలి. అలోవీరాజెల్, గుడ్డు సోన, తేనె వాడుతూ హెయిర్ మాస్క్ అప్లై చేయాలి. ప్రోటీన్లు అధికంగా తీసుకోవాలి. జుట్టు ఒక వేళ తెల్లబాడుతుంటే శరీరం మరే కొద్ది తెల్లబడుతుండేతప్పుడు బాహ్య కారణాలు అంతగా ప్రభావితం చేయవని గుర్తుంచుకోవాలి. మానసిక వత్తిడి, జీన్స్ కుడా జుట్టు రంగు మారడంలో కీలక పాత్ర వహిస్తాయి. తెల్లజుట్టు కొట్టోచ్చినట్టు కనిపించ కుండా మృదువైన రూపంలో ఉండేందుకు ఎటువంటి జాగ్రత్తలు అవసరమో తెలుసుకోవాలి.

    ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి

    శిరోజాల పరిరక్షణ విషయంలో శ్రద్ధగా ఉంటేనే జుట్టు రాలి పోకుండా పొడిబారకుండా వుంటుంది. ప్రతి రోజు సిరోజాలను కడగటం, మృదువుగా వుంటుందని అతిగా కండీషనర్ అప్లయ్ చెయడం…

  • ఎండ వేళల్లో మెత్తగా కాటన్ సంఖ్యగా వుంటాయి. కానీ కాస్త వెరైటీగా ఉండాలంటే సీకొ చీరల వైపు చూడొచ్చు. ఎన్నో అందమైన రంగుల్లో, ప్రకృతి సోయగాలు మేళవించిన సీకో కాటన్స్ ఈ ఎండాకాలపు ఆకర్షణ. ఇవి ఏ వయస్సువారికైనా బావుంటాయి. సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తో సీకో కాటన్స్ లో అద్భుతమైన వెరైటీలున్నాయి. పూల మోటిఫ్ ల తో వెడల్పాటి మెరిసే అంచులతో వేసవికే చల్లదనం సీకొ ముచ్చటగా వుండే పూల డిజైన్లు జియో మెట్రిక్ మెరుపులు లేలేత వర్ణాలతో ఇవి వేసవి ఫ్యాషన్స్, ప్రత్యేకంగా ఈ కాటన్ సీకోల పైన ప్రక్రుతి లోకి సంబందించిన పువ్వులు, పక్షులు, పచ్చని రంగులే వుంటాయి. చిన్ని జరీతోనూ, జరీ లేకుండా పుల్ డిజైన్ తోనూ, ఈ తేలికైన వస్త్ర శ్రేణి వెరైటీల సీకొ కాటన్స్ కోసం ఆన్ లైన్ లో చూడండి.

    ప్రకృతి వర్ణాలతో సైకో కాటన్స్

    ఎండ వేళల్లో మెత్తగా కాటన్ సంఖ్యగా వుంటాయి. కానీ కాస్త వెరైటీగా ఉండాలంటే సీకొ చీరల వైపు చూడొచ్చు. ఎన్నో అందమైన రంగుల్లో, ప్రకృతి సోయగాలు మేళవించిన…

  • చేతులు అందంగా కనిపిస్తాయి కానీ ఎటొచ్చి చిక్కంతా మోచేతుల విషయంలోనే. నల్లగా, మొరటుగా వుండి ఇచ్చిందిగా వుంటుంది. ఈ నలుపు దూరం చేయాలంటే హోమ్ మేడ్ టిప్స్ ఉపయోగం. ప్రతి రోజు రాత్రి వేళ వేడి చేసిన కోబరి నూనె తో మోచేతుల్ని మర్దనా చేయాలి. ఇందులో వుండే నలుపు తగ్గి నునుపుగా వస్తాయి. సెనగ పిండిలో నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి మోచేతులకు రాసుకున్నా ప్రయోజనమే. అరగంట పోయాక చల్లని నీళ్ళతో కడిగేస్తే బావుంటుంది. బంగాళదుంపకూడా చెక్కని ప్యాక్. లాగా పని చేస్తుంది. దుంపని గుండ్రంగా తరిగి మోచేతుల పైన రుద్దాలి. పావు గంట అయ్యాక గోరు వెచ్చని నీళ్ళతో కడిగేస్తే నలుపు తగ్గుతుంది. ఆ ప్రాంతంలో చర్మం మరీ పొడి బారినట్లు అనిపిస్తే బంగాళదుంప రసంలో తేనె కలిపి మోచేతులపై మర్దనా చేస్తే ఫలితం వుంటుంది. స్నానం చేసిన వెంటనే మాయిశ్చురైజర్ అప్లయ్ చేయాలి. కలబంద గుజ్జులో పసుపు కలిపి మోచేతుల దగ్గర మర్ధనా చేస్తే గుజ్జు చేర్మాన్ని తేమగా మారుస్తుంది. నలుపు రంగు పోగొడుతుంది.

    ఇలా చేస్తే మోచేతులు మెరిసిపోతాయి

    చేతులు అందంగా కనిపిస్తాయి కానీ ఎటొచ్చి చిక్కంతా మోచేతుల విషయంలోనే. నల్లగా, మొరటుగా వుండి ఇచ్చిందిగా వుంటుంది. ఈ నలుపు దూరం చేయాలంటే హోమ్ మేడ్ టిప్స్…

  • ఇది స్వచ్చమైన మాయిశ్చరైజర్

    సాధరణంగా ఏ సీజనయినా మాయిశ్చరైజర్లు తప్పనిసరి. అయితే ఇందుకోసం ఖరీదైన క్రీములు, లోషన్లే అవసరం లేదు. కొబ్బరినూనె, ఆప్రికోట్ ఆయిల్స్ సైతం అత్యంత ప్రభావంతంగా పనిచేస్తాయి. షియా…

  • పండగొస్తే పరికిణీలు ఒణిలు గుర్తొస్తాయి పట్టు పరికిణీలకు ఎంబ్రాయిడరీ పనితనం జోడించే గద్వాల్, పోచంపల్లి, నారాయణ్ పేట్ జార్జెట్ ఓణిలు పండగ వాతావరణం తెస్తాయి. రాసిల్క్ పైన థ్రెడ్ వర్క్ చేసిన లంగాలు. పువ్వుల ప్రింట్లున్న ఓణిలు మంచి కాంబినేషన్, పండుగ సందర్బాలలో వేసుకునేవి సింపుల్ గా అక్కర్లేదు. బంగారు, పసుపు,గులబీ, సముద్ర నీలం, పుపు పచ్చ వంటివి కొత్త రంగుల్లో సాదా పరికిణీలు తీసుకుని పట్టు బ్యుటిలున్న ఒణిలు బావుంటాయి. ప్లయిన్ రాసిల్క్ జార్జెట్, బెనారస్ వంటి వస్త్రాలతో మంచి అంచులు, వాటి పైన అద్దాల పనితనం తోనూ లేదా డబల్ లేయర్డ్ తరహాలో లేహంగా లాగా, ఇటు పరికిణీ లాగా కుట్టించుకుని ఓణి సింపుల్ గా చిన్న బోర్డర్ తో వున్నా బావుంటుంది. బొట్ నెక్ , రౌండ్ నెక్, క్లోజడ్ నెక్, బ్లౌవుజు లుంటే ఇంక అడ్రస్ అందానికి తిరుగు లేకుండా వుంటుంది. ఏ తరహావి, ఏ డిజైన్ లో ఎంచుకోన్నపరికిణీ ఓణిల్లో అమ్మాయిలు అచ్చం పండగొచ్చినట్లే ఉంటారనడంలో సందేహం లేదు.

    పండక్కి పరికిణీ, ఓణిలు బావుంటాయ్

    పండగొస్తే పరికిణీలు ఒణిలు గుర్తొస్తాయి పట్టు పరికిణీలకు ఎంబ్రాయిడరీ పనితనం జోడించే గద్వాల్, పోచంపల్లి, నారాయణ్ పేట్ జార్జెట్ ఓణిలు పండగ వాతావరణం తెస్తాయి. రాసిల్క్ పైన…

  • చక్కెర తింటే మంచిది కాదంటారు కానీ చర్మ రక్షణకు, అందాన్ని ఇవ్వడంలో అంతులేని ఫలితాలు ఇస్తుoదంటున్నారు. షుగర్ స్క్రబ్ ద్వారా చర్మం ప్రకాశవంతంగా ఆరోగ్యంగా వుంటుంది. నిమ్మరసం, తేనే మిశ్రమంలో చక్కర కలిపి ముఖానికి పట్టించి ఆరాక కడిగేస్తే చర్మం కాంతిగా కనిపిస్తుంది. ఇది అద్భుతమైన ఫేస్ మాస్క్. వేడి నీళ్ళలో నిమ్మరసం, చక్కర కలిపి ముఖానికి పట్టించి చల్లని నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. బ్రౌన్ షుగర్ లో కొంచెం ఆలివ్ ఆయిల్ కలిపి ఆ మిశ్రమం చర్మం పైన అప్లయ్ చేస్తే మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా షుగర్ తో స్క్రబ్ చేసుకొంటే వృద్ధాప్య ఛాయలు రానివ్వదు. చక్కెరలోని గైకోనిక్ ఆసిడ్ చర్మం ద్వారా వెళ్లి దుమ్ము వల్ల ఏర్పడే మొటిమలు, మచ్చలు రాకుండా శుభ్రం చేస్తుంది. పెదవులకు లిప్ గ్లాన్ లాగా ఉపయోగపడుతుంది. ఆలివ్ ఆయిల్ లో కాస్ట్రో షుగర్ వేసి పెదవులపైన సున్నితంగా మర్ధన చేస్తే పెదవులు పొడిబారటం వుండదు. కప్పు వేడి నీళ్ళలో స్పూన్ ఆలివ్ ఆయిల్, స్పూన్ పంచదార కలిపి జుట్టుపైన స్ప్రే చేసి కాసేపాగి స్నానం చేస్తే మెత్తగా నిగనిగలాడుతుంది.

    చక్కెరతో చక్కదనం

    చక్కెర తింటే మంచిది కాదంటారు కానీ చర్మ రక్షణకు, అందాన్ని ఇవ్వడంలో అంతులేని ఫలితాలు ఇస్తుoదంటున్నారు. షుగర్ స్క్రబ్ ద్వారా చర్మం ప్రకాశవంతంగా ఆరోగ్యంగా వుంటుంది. నిమ్మరసం,…

  • ఒక్కో సారి చూస్తుంటే వంటిల్లు మించిన 'బ్యూటీషియన్' ఇంకెవరు లేరనిపిస్తుంది. ఆయుర్వడంలో చర్మం సహజ సిద్దమైన మెరుపు పోకుండా వుండాలి అంటే వంటింటి వస్తువులనే ప్రస్తావించాలి. అల్లంలో యాంటిఆక్సిడెంట్లు ఎక్కువగా వుంటుంది. మొహం పైన మచ్చలు, చారలు పోతాయి స్కిన్ టాన్ పోగొడుతుంది. ట్యాన్ తీసేస్తుంది. ఒక్క స్పూన్ చప్పున అల్లంరసం, నిమ్మ రసం, రోజ్ వాటర్ కలిపి ముఖ చర్మాన్ని ఈ మిశ్రమంతో నెమ్మదిగా రుద్దేసి, చెక్కని నీళ్ళతో కడుక్కోవాలి. అలాగే మిరియాలు పిగ్మెంటేషన్ పోగొడతాయి. మిరియాల పొడిలో పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని మొహానికి రాసుకోని ఐదు నిమిషాల్లోపె కడిగేయాలి. ఒక స్పూన్ జాజి కాయ పొడిలో హోల్ మిల్క్ కలిపి పేస్టు లా చేసి కాసేపయ్యాక గోరు వెచ్చని నీళ్ళతో కడిగేయాలి. అలాగే దాల్చిన చెక్క కూడా మొటిమల సమస్య పరిష్కరిస్తుంది. దాల్చిన చెక్క పొడిలో తేనె, మెంతుల పొడి కలిపి మొహానికి రాసి ఐదు నిమిషాల తర్వాత కడిగేయాలి. దాల్చిన చెక్క పొడి, ఓట్స్, పాలు కలిపి ఫేస్ స్క్రబ్ లాగా చేసి వాడుకుంటే మొహం మెరుపు తో వుంటుంది.

    వంట ఇంటి సుగంధాలతో అందం

    ఒక్కో సారి చూస్తుంటే వంటిల్లు మించిన ‘బ్యూటీషియన్’ ఇంకెవరు లేరనిపిస్తుంది. ఆయుర్వడంలో చర్మం సహజ సిద్దమైన మెరుపు పోకుండా వుండాలి అంటే వంటింటి వస్తువులనే ప్రస్తావించాలి. అల్లంలో…

  • జుట్టుకు మంచి ఉపయోగ పడే మందార పువ్వును రక్త పోటును తగ్గించడానికి సహాయ పడుతుంది అని ఇటీవల పరిశోధనలు రుజువు చేసాయి. మందార పువ్వులతో దాచిన టీ తాగితే తోలి దశలో వున్న రక్త పోటును తగ్గించుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు. ఈ పూవుల్లో అద్భుతమైన ఔశాదాలున్నాయి. ఎరుపు, తెలుపు, పసుపు రంగుల్లో దొరికే ఈ మందుల షాపుల్లో ఎరుపు రంగు పువ్వుకు ఆయుర్వేదం మందుల్లో ఉపయోగిస్తారు. మందార నూనె తలవెంట్రుకలు రావడమే కాకుండా చర్మ రక్షణకు కూడా ఉపయోగ పడుతుంది. వయస్సు పైబడే లక్షణాలనునిలువరించే శక్తి వంతమైన మొక్క మందారం. అందుకే దీన్ని బొటాక్స్ ప్లాంట్ అని కూడా అంటారు. మందార పూలు ఎండ బెట్టి పొడిగా చేసి వాటిని నీళ్ళల్లో వేసి మరిగించి ఆ నీటిలో మొహం కడుక్కొంటే అలసి చర్మం తేటగా అయిపోతుంది. మందార పూల పొడి, తేనె, పాలు కలిపి పేస్టులా చేసి ముఖానికి మర్దనా చేస్తే మ్రుతకనాలు పోయి చర్మం మృదువుగా అయిపోతుంది. మందారంలోని యాంటీ బక్టిరియల్ గుణాలు మొటిమల్ని, గాయాల తాలూకుమచ్చలు పోగొడతాయి.

    మందార పువ్వులతో ముఖ సౌందర్యం

    జుట్టుకు మంచి ఉపయోగ పడే మందార పువ్వును రక్త పోటును తగ్గించడానికి సహాయ పడుతుంది అని ఇటీవల పరిశోధనలు రుజువు చేసాయి. మందార పువ్వులతో దాచిన టీ…

  • క్యాలరీలు పుష్కలంగా వుంటే కమలాపండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే ఆరోగ్య నిపుణులు యాన్ అరించవిడే అని అంటుంటారు. వీటిల్లో 170 కి పైగా పైటో కెమికల్స్, 60కి పైగా ఫ్లావనాయిడ్లు వున్నాయి. వీటిల్లో చాలా వరకు యాంటి ఆక్సిడెంట్లుగా పనిచేస్తూ ఇన్ ఫ్లమేషన్ రాకుండా చూస్తాయి. ఇవి గుండె జబ్బులు రానివ్వవు అధికంగా వుండే సి-విటమిన్ ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కమలాల్లోని కోలిన్ నిద్రా కండరాల కదలికకి, అధ్యయిన శక్తికి జ్ఞాపక శక్తికి తోడ్పడితే జియాక్సాంధిన్, కెరోటినాయిడ్ల క్యాన్సుర్ నిరోధకంగా పని చేస్తాయి. కమలా రసం తీసుకుంటూ వుంటే ముత్రపిండాల వ్యాధులు రాకుండా ముఖ్యంగా రాళ్ళూ ఏర్పడకుండా వుంటాయి. వీటిల్లోని పీచు, కోలెస్ట్రోల్ తగ్గిస్తుంది. కమలాల్లో పోటాషియం శాతం ఎక్కువే ఇవి బీ.పీ రోగులకి, హృదయ రోగులకి మంచివే. కమలాల్లో కెరోటినాయిడ్లు సమృద్ధిగావుండటం తో వృద్దాప్యంలో వచ్చే కంటి, కండరాల్ల బలహీనతను అడ్డుకుంటాయి. ఇందులోని బీటా కెరోటిన్, చర్మ రక్షణ కు నిగారింపుకు తోడ్పడుతుంది.

    వీటి తో చర్మ రక్షణ నిగారింపు

    క్యాలరీలు పుష్కలంగా వుంటే కమలాపండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే ఆరోగ్య నిపుణులు యాన్ అరించవిడే అని అంటుంటారు. వీటిల్లో 170 కి పైగా పైటో కెమికల్స్,…

  • విటమిన్ ఇ నూనె గొప్ప సౌందర్య పోషకం. చాలా మందికి చిన్న వయస్సులో ముఖం పై ముదతాలు వచ్చి చర్మం సాగినట్లు అనిపిస్తుంది. అలంటి వారు విటమిన్-ఇ నూనె తో చర్మం మసాజ్ చేసుకోవాలి. ఇలా రెండు మూడు సార్లు చేస్తేనే ముఖం పై ముడతలు వృద్ధాప్య ఛాయలు మాయం అవ్వుతాయి. పొడి చర్మం కలవారు రాత్రి పడుకునే ముందు మోయిశ్చురైజర్ లో ఈ విటమిన్-ఇ నూనె కలిపి రాసుకుంటే చర్మానికి తేమ అందుతుంది. మేకప్ తుడిచేందుకు లేక, బయట ఎండ లోకి వెళ్లి వచ్చినప్పుడు ఈ నూనె లో దూది ముంచి ముఖం తుడుచుకోవాలి.మురికీ, ఇతర వ్యర్ధాలు బయటకు వచ్చేస్తాయి. ఇది మంచి లిప్ బామ్. సౌందర్య ఉత్పత్తులు వాడటం ఇష్టం లేకపోతె పగిలిన పెదవులకు ఈ నూనె పూత లా వేసుకుంటే పెదవులకు తేమ అందుతుంది సమస్య పోతుంది. ఎండ లోకి వెళితే చర్మం నల్లగా అయిపోతుంది. ఈ నూనె మొహానికి మర్దనా చేసుకుంటూ వుంటే, ఎండ వల్ల అతి నీలలోహిత కిరణాల వల్ల దెబ్బ తిన్న చర్మం తేటగా అయిపోతుంది. ఇది యాంటి ఆక్సిడెంట్ గా పని చేసి చర్మానికి మేలు చేస్తుంది.

    చర్మానికి ఎంతో మేలు చేసే ఈ విటమిన్

    విటమిన్ ఇ నూనె గొప్ప సౌందర్య పోషకం. చాలా మందికి చిన్న వయస్సులో ముఖం పై ముదతాలు వచ్చి చర్మం సాగినట్లు అనిపిస్తుంది. అలంటి వారు విటమిన్-ఇ…

  • చల్లగా ఏదైనా తగెందుకే ఐస్ముక్కల ఉపయోగంఅనుకుంటాం కానీ అవి సౌందర్య పోషణకు కూడా చాలా బాగా ఉపయోగ పడతాయి. ముఖం పై మొటిమలు వేడి వాతావరణానికి చిరాకు పెడతాయి. తక్షణ ఉపసమనం కోసం ఒక మెత్తని గుడ్డలో ఐస్ ముక్కల్ని వుంచి మంట పెడుతున్న భాగంలో అద్దాలి. ఓ పది నిముషాలుఇలా చేస్తే మొటిమలు తగ్గుతాయి. తరచూ దూర ప్రయాణాలు చేస్తున్న ముఖం అలసటగా వుంటుంది. తాజాగా అనిపించాలి అంటే ఐస్ క్యుబ్ తో ముఖం పై రుద్దుకుంటే అలసట పోతుంది. ఐబ్రోస్ చేయించుకుంటే ఆ ప్రాంతంలో నొప్పి అనిపిస్తుంది. అలాంటప్పుడు ఐబ్రోస్ చేయించుకునే ముందర కనుబొమ్మలు ఐస్ ముక్కతో రుద్దితే నొప్పి అనిపించదు, చర్మం కందిపోదు. కొందరికి కళ్ళ కింద నిద్ర ఎక్కువ అయిపోయినా కళ్ళు ఉబ్బిపోయి ముడతలు కనిపిస్తాయి. ఆ ప్రాంతంలో ఐస్ ముక్కలతో కాపడం పెడితే రక్తప్రసరణ సక్రమంగా అంది చర్మం నిగారింపు తో చెక్కగా వుంటుంది. ఐస్ ముక్కాలా తో ఫేషియల్ చేసినట్టు మొహం పైన రుద్దితే మొహం ఫ్రెష్ గా వుంటుంది.

    అందం కోసం ఐస్

    చల్లగా ఏదైనా తగెందుకే ఐస్ముక్కల ఉపయోగంఅనుకుంటాం కానీ అవి సౌందర్య పోషణకు కూడా చాలా బాగా ఉపయోగ పడతాయి. ముఖం పై మొటిమలు వేడి వాతావరణానికి చిరాకు…

  • అందమైన జుట్టు కావాలంటే మంచి షాంపూలు, ఆయిల్స్ తో నే సరిపోదు. చెక్కని జుట్టు కోసం ఆహారంలో కూడా కొన్నింటిని చేర్చాలి. కోడిగుడ్డులో ప్రోటీన్ల తో పాటుగా బయోటెక్ అనే పదార్ధం కూడా వుంటుంది. జుట్టు బలంగా పెరగాలి అంటే ఇది చాలా అవసరం. జుట్టు మెరిసేలా చేసేందుకు చిగుల్లు చిట్లి పోకుండా ఒమేగా-3 ఫ్యాట్స్, జింక్, విటమిన్-ఇ మొదలైనవి కావాలి. అవన్నీ బాదాం పప్పులో దొరుకుతాయి. ఉసిరిలో విటమిన్-సి వుంటుంది. ఇది జుట్టుకు మెత్తదనం ఇస్తుంది. చిలకడ దుంపలో బీటా కెరోటిన్, విటమిన్-ఎలు వుంటాయి. ఇవి జుట్టు మోదళ్ళను బలంగా ఉంచుతాయి. పచ్చి బటానీ లో విటమిన్-సి వుంటుంది. జుట్టు రాలడం తగ్గిస్తుంది. వాల్నట్స్ లో వుండే విటమిన్-ఇ, బయోటెన్ లు జుట్టును ఆరోగ్య వంతంగా ఉంచుతాయి. ప్రతి రోజు నాలుగు వాల్ నట్స్ తింటే చాలా మంచిది. గుమ్మడి గింజల్లో కాపర్, జింక్, విటమిన్-ఇ, విటమిన్-బి. మెగ్నీషియం వంటివి వున్నాయి. వీటిని రొజూ తింటే జుట్టు ధృడంగా వుంటుంది.

    ఇవన్నీ జుట్టుకు పోషకాలు

    అందమైన జుట్టు కావాలంటే మంచి షాంపూలు, ఆయిల్స్ తో నే సరిపోదు. చెక్కని జుట్టు కోసం ఆహారంలో కూడా కొన్నింటిని చేర్చాలి. కోడిగుడ్డులో ప్రోటీన్ల తో పాటుగా…

  • బ్లీచింగ్ చేస్తే మొహం పైన మరకలు, మురికి పోతుంది కానీ అసలు బ్లీచింగ్ ప్రాబ్లం మొహం పొడిబరుతుంది. మరి కళ్ళ కింద నల్లని వలయాలు ఎలా పోవాలి అంటే ఇంట్లో వుండే వస్తువుల తో తేలిక అని చెప్ప వచ్చు. టొమాటో లో బ్లీచింగ్ గుణం వుంది. ఒకటిన్నర టీ స్పూన్ నిమ్మరసంలో ఒక టీ స్పూన్ టొమాటో రసాన్ని కలిపి కాళ్ళకింద నల్లని వలయాల పైన రాయాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీళ్ళతో కడిగేసుకోవాలి. బంగాళ దుంప తరిగి జ్యూస్ పిండి కాటన్ ప్యాడ్స్ తో ముంచి కళ్ళ పైన పెట్టుకుంటే కళ్ళకింద చరల తో పాటు కళ్ళ వాపు కూడా పోతుంది. రోజ్ వాటర్ లో కాటన్ ప్యాడ్స్ నాన నిచ్చి, వాటిని కనురెప్పల పైన 15 నిమిషాలుంచితే కళ్ళ కింద వలయాలు పోతాయి. ఇలా రోజు రెండు మూడు వారాల పాటు చేస్తే కళ్ళ కింద చారలు కళ్ళ అలసట మాయం అవ్వుతాయి.

    నల్లని వలయాలు మాయం

    బ్లీచింగ్ చేస్తే మొహం పైన మరకలు, మురికి పోతుంది కానీ అసలు బ్లీచింగ్ ప్రాబ్లం మొహం పొడిబరుతుంది. మరి కళ్ళ కింద నల్లని వలయాలు ఎలా పోవాలి…

  • ఫేషియల్ చేయించుకొంటేనే ముఖం మెరుస్తుంది అనుకోవచ్చు. ముల్తానీ మట్టి వాడినా మొహం మెరవడమే కాదు, కొన్ని రకాల చర్మ సమస్యలు పోతాయి. రెండు చెంచాల గులాబీ నీళ్ళు కలిపి మెత్తగా చేయాలి. దాన్ని ముఖానికి రాసి పావు గంట తర్వాత కడిగేయాలి. ఈ పూత మొహం పై జిడ్డును తొలగించుతుంది. రెండు మూడు బాదాం గింజలు నానబెట్టి మెత్తగా చేసి అందులో పాలు కలిపి దీన్ని ముల్తానీ మట్టిలో మెత్తగా పేస్టులాగా అయ్యేలాగా కలిపేసి ఫేస్ ప్యాక్ వేసుకొంటే చర్మం మృదువుగా మారుతుంది. టొమాటో గుజ్జు, ముల్తనీ మట్టి, గంధం,పసుపు సమపాళల్లో తీసుకుని ముఖానికి పట్టించి గోరువెచ్చని వేడి నీళ్ళతో కడిగేయాలి. రెండు రోజులకోసారి ఈ ప్యాక్ వేస్తె ముఖం పైన మచ్చలు, మరకలు అన్నీ పోతాయి. అలాగే ముల్తాని మట్,టి పుదినా పొడి, పెరుగు మిశ్రమం కూడా ముఖం మెరిసేలాగా చేస్తుంది. ఇవన్నీ సహజమైనవి. ఏ రసాయినాలు కలవవని ముఖానికి మంచి రంగు, కళ తెచ్చి పెడతాయి.

    చర్మం తేటగా మృదువుగా మెరవాలంటే

    ఫేషియల్ చేయించుకొంటేనే ముఖం మెరుస్తుంది అనుకోవచ్చు. ముల్తానీ మట్టి వాడినా మొహం మెరవడమే కాదు, కొన్ని రకాల చర్మ సమస్యలు పోతాయి. రెండు చెంచాల గులాబీ నీళ్ళు…

  • అందమైన దుస్తులకు అందమైన చెప్పులు కూడా తోడైతేనే బాగుంటుంది. ఎలాగంటే స్టెలెట్టన్ ఎంచుకుంటే, అవి అన్ని రకాల చెప్పుల కంటే చాలా ఎత్తుగా వుంటాయి కనుక నడుస్తున్నప్పుడు దుస్తులకు అడ్డం పడితే కష్టం. ముఖ్యంగా చీరలో అయితే జాగ్రత్తగా వుండాలి కూడా. ఇక పంల్స్ ఫార్మల్ దుస్తులతో హుందాగా కనిపిస్తాయి. అన్ని రకాల మిడిలు, మినిలు, అనార్కలిలు ఏవి ధరించినా సరే ఎత్తుగా, సొగసుగా కనిపించాలి అంటే వెడ్జ్ హీల్స్ ధరించాలి. జీన్స్ క్రాప్ టాప్స్, స్కర్ట్ లు ఇలా పాశ్చాత్య శైలి లో కనిపించాలి అనుకుంటే కిటెన్ హీల్స్ బావుంటాయి. వీటిలో పాయింట్ హీల్స్, సదా రకాలు దొరుకుతాయి. ఇక రోజువారీ డ్రెస్సులో ఆఫీసులకు, కాలేజీలకు వెళ్ళేతప్పుడు ఫ్లిఫ్ ప్లాప్స్ బాగుంటాయి. సాంప్రదాయ పద్దతిగా కాజువల్ గా వేసుకునే డ్రెస్సులకు సరిగ్గా మ్యాచ్ అవ్వుతాయి. ఫ్యాషన్ అంటే వట్టి డ్రెస్సులే కాదు, జుట్టు అలంకరణ, మేకప్, హ్యాండ్ బాగ్, చెప్పులు అన్ని కలిసి సరిగ్గా మ్యాచ్ అయితేనే చూసేందుకు బాగుంటారు.

    ఫ్యా షన్ లో చెప్పులు కూడా ఒక భాగం

    అందమైన దుస్తులకు అందమైన చెప్పులు కూడా తోడైతేనే బాగుంటుంది. ఎలాగంటే స్టెలెట్టన్ ఎంచుకుంటే, అవి అన్ని రకాల చెప్పుల కంటే చాలా ఎత్తుగా వుంటాయి కనుక నడుస్తున్నప్పుడు…

  • ఎండ, గాలి, దుమ్ము ముఖచర్మం పైన ఎంతో ప్రభావం చూపెడతాయి. ఈ కాలంలో మురికి దుమ్ము ధూళి చర్మం పైన పేరుకు పోతాయి. అవి వెంటనే క్లీన్ చేయక పొతే చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. బొప్పాయిలో వుండే ఎంజైమ్స్ ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. రెండు చెంచాల గుజ్జు లో కొద్దిగా ఆలివ్ నూనె, చెక్కర కలిపి ఫేస్ ప్యాక్ లా వేసుకోని కడిగేస్తే ముఖం పై పేరుకున్న మురికి పోతాయి చెక్కని మెరుపు వస్తుంది. కొబ్బరి నూనెలో కొంచ చెక్కర , అర చెంచా ఆలివ్ నూనె కలిపి ముఖానికి, మెడకి మర్దనా చేసుకోవాలి. తర్వాత గోరు వెచ్చని నీళ్ళతో కడిగేస్తే చర్మం మెరిసిపోతుంది. పావు కప్పు ఓట్స్ పొడిలో పెరుగు, పసుపు, గులాబీ నీళ్ళు కలిపి ఈ మిశ్రమంతో మొహం మర్దనా చేస్తే మృత కణాలు పోతాయి. రెండు చెంచాల కాఫీ పొడి లో బాదాం నూనె, కొబ్బరి నూనె కలిపి పూతలా వెయ్యాలి. తడి చేతుల్లో మర్దనా చేస్తే చల్లని నీళ్ళతో మొహం కడిగేసుకోవాలి. కాఫీ పొడి నిర్జీవంగా మారిన చర్మానికి జీవం ఇస్తే బాదాం నూనె తెమ అందిస్తుంది. బియ్యం పిండి, తేనె కలిపిన మిశ్రమంతో మాస్క్ వేసుకుని కడిగేసాక, మాయిశ్చురైజర్ రాస్తే చర్మం చాలా మృదువుగా కనిపిస్తుంది.

    ఇవన్నీ మంచి ఫేస్ ప్యాక్ లు

    ఎండ, గాలి, దుమ్ము ముఖచర్మం పైన ఎంతో ప్రభావం చూపెడతాయి. ఈ కాలంలో మురికి దుమ్ము ధూళి చర్మం పైన పేరుకు పోతాయి. అవి వెంటనే క్లీన్…

  • ఎప్పుడూ పెద్దవాల్లకు ఫ్యాషన్ గురించే చర్చ వస్తుంది. కానీ చిన్న పిల్లల ఫ్యాషన్ మార్కెట్ అంత ఎత్తున వుంది. పెద్ద వాళ్ళ కోసం రూపొందించే స్కర్టులు, లేహంగా, అనార్కలి దుస్తులు అన్నీ పిల్లల కోసం డిజైన్ చేస్తున్నారు. గౌను తరహా లో, మంచి ఎంబ్రాయిడరీ, బ్రోకేడ్ మెరుపులతో తయ్యారయ్యె డ్రెస్ విలువ దాదాపు అమ్మాయిల డ్రెస్ ల ఖరీదు లోనే వుంది. లేహంగా, దుపట్టాలు కూడా అంతే. మెడ చుట్టూ నగలు అవసరం లేని లేస్ మెరుపుల ఎంబ్రాయిడరీ, సిల్క్, పట్టు, వస్త్ర శ్రేణుల తో లేహంగా, దుపట్టా మాచింగ్ ఇస్తున్నారు. పూర్తి ఎంబ్రాయిడరీతో ఫ్యాన్సీ సిల్క్ అనార్కలి డ్రెస్ అయితే పిల్లలకు కేవలం గౌన్లు, పట్టు లంగాల రోజులు ఇప్పుడో పోయాయి. ఇప్పుడు అన్ని రకాల ఫ్యాషన్స్ పిల్లల కోసం కూడా అందుబాటులో వున్నాయి.

    పాపాయిల కోసం ఫ్యాన్సీ డ్రెస్సులు

    ఎప్పుడూ పెద్దవాల్లకు ఫ్యాషన్ గురించే చర్చ వస్తుంది. కానీ చిన్న పిల్లల ఫ్యాషన్ మార్కెట్ అంత ఎత్తున వుంది. పెద్ద వాళ్ళ కోసం రూపొందించే స్కర్టులు, లేహంగా,…

  • పెద్దగా రకరకాల షాపుల్లో వుండే కళ్ళద్దాలు కంటికి రాక్షనే కాదు, స్టయిల్ అంతకుమించి ఫ్యాషన్ కూడా కళ్ళద్దాలు లేకపోతే ఫ్యాషన్ ని ఎలా ప్రొడ్యూస్ చెయ్యాలి అనుకునేంతగా ఇది మహిళల జీవితం లో అంతర్భాగంగా అయిపోతున్నాయి. ఇప్పుడు వేసవిలో కళ్ళకు రక్షణగా నిలిచే కళ్ళద్దాలు శీతాకాలం చిరు ఎండల్లో కూడా కళ్ళకి అందం స్టైల్ ఇస్తాయి. పాత తరం తారలు ఈ ఈ సన్గ్లాస్ అందాలని ప్రజల్లోకి తీసుకువస్తే ఇప్పటి తరం అమ్మాయిలు మచ్చలు కమ్మిన రోజున కూడా కళ్ళ జోళ్ళు తీస్తే ఎలా అని దిగులు పడిపోతారు. ఎందుకంటే ఇవి ఇవ్వాల్టి ఫ్యాషన్ స్టైల్ యాక్ససరీ. స్క్వేర్ ముఖాకృతి వుంటే నలుచదరపు ఫ్రేమ్స్ బాగుంటాయి. పొడవాటి మొహం కలవారికి క్వాట్స్ఐ బాగుంటుంది. మొత్తానికి కళ్ళజోళ్ళు సౌందర్య పోకడలో ఒక ముఖ్యమైన భాగం.

    ఇవి ఎప్పుడూ ఫ్యాషన్ సిగ్నేచర్లే

    పెద్దగా రకరకాల షాపుల్లో వుండే కళ్ళద్దాలు కంటికి రాక్షనే కాదు, స్టయిల్ అంతకుమించి ఫ్యాషన్ కూడా కళ్ళద్దాలు లేకపోతే ఫ్యాషన్ ని ఎలా ప్రొడ్యూస్ చెయ్యాలి అనుకునేంతగా…

  • ఒక్కసారి ఏది నిజమో తలుసుకోలేక పోతాం. కానీ తేల్చుకునే ముందు వినాలి కదా చాలా మంది జుట్టు రాలిపోవడానికి ఎన్నో కారణాలు చెపుతారు. జుట్టు కత్తిరించుకుంటే వెంట్రుకలు పెరుగుతాయంటారు. అదేం కాదు, కత్తిరించినా కొత్తగా జుట్టు ఎక్కువేమీ రాదు. ఉన్నదే పెరుగుతుంది అంటారు ఎక్ష్ పర్ట్స్. అలాగే జుట్టు మసాజ్ చేసినా వేగంగా ఎం పెరగదట. పైగా మాడుకు ఎక్కువ సేపు మస్సాజ్ చేస్తే జుట్టు దెబ్బతింటుందట, చుండ్రు వల్ల జుట్టు ఊడిపోతుంది అంటారు కొందరు. కానీ చుండ్రుకి జుట్టు రాలిపోవడాకి శాస్త్రీయ సంబందం ఏవీ లేదు. ఇది కేవలం షాంపూలు అమ్ముకోవడానికి చేసే మార్కెటింగ్ ప్రచారం అంటున్నారు డాక్టర్లు. మాడు పోడి బారితే మాత్రం వెంట్రుకలు చిట్లి రాలిపోతాయట. తరచూ షాంపూ మార్చినా జుట్టు వూడదు. ఒత్తిడికి జుట్టు రాలడానికి ఏ సంబంధం లేదు. చల్లని నిల్లతో స్నానం చేసినా వుదిపోదు. పైగా రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు బాగా పెరుగుతుందిట కూడా. ఇవి నిపుణుల సలహాలే. అవసరం అయ్యినంత వరకు మనశ్శాంతి కోసం, అమ్మాయి జుట్టు రాలదు అనడం కోసం చదువుకోవాలి అంతే.

    ఇందులో ఎంత నిజాం?

    ఒక్కసారి ఏది నిజమో తలుసుకోలేక పోతాం. కానీ తేల్చుకునే ముందు వినాలి కదా చాలా మంది జుట్టు రాలిపోవడానికి ఎన్నో కారణాలు చెపుతారు. జుట్టు కత్తిరించుకుంటే వెంట్రుకలు…