• కార్తీక మాసం సందర్భంగా భక్తి టీవి నిర్వహిస్తున్న కోటి దీపోత్సవాల వేడుక కన్నుల పండుగ గా జరుగుతుంది. నవంబర్ 5వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరగనున్న ఈ వేడుకల్లో నిత్యం వివిధ ప్రత్యేక పూజలతో దైవాన్ని ఆరాదిస్తూ కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని వేడుకలా నిర్వహిస్తున్నారు. బుధవారం జరిగిన ప్రత్యేక పూజలు, కార్తీక దీపారాధనలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు దంపతులు పాల్గొన్నారు.

    కోటి దీపోత్సవంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు దంపతులు

    కార్తీక మాసం సందర్భంగా భక్తి టీవి నిర్వహిస్తున్న కోటి దీపోత్సవాల వేడుక కన్నుల పండుగ గా జరుగుతుంది. నవంబర్ 5వ తేదీ నుంచి 21వ తేదీ వరకు…

  • కోన్ ఐస్ క్రీమ్ తినేసాక చివరగా కోన్ కూడా బిస్కెట్ ఫ్లేవర్ తో తినేందుకు అనువుగా ఉంటుంది. ఇప్పుడు అచ్ఛంగా అలంటి వడ్డించే గిన్నెలొస్తున్నాయి. సూప్ లు, పాలు, పాయసం, తాగాక కప్పుల్ని కూడా అలాగే తినేయచ్చు. చివరికి కేక్ ముక్కని కూడా నేరుగా గిన్నెతో కలిపి తినేయచ్చు. అదెలాగంటే కుల్ఫీలు ,చాక్లేట్లు ,గోధుమ ,జొన్న ,రాగి , చీజ్ , మాంసం , కూడా గిన్నెల్లాగా చేసే మిషన్లోచ్చాయి. వాఫిల్ బౌల్ మేకర్ దానిపేరు. మనక్కావలిసిన రకం పిండి నాన్ వెజ్ ,స్వీట్ ,ఏదైనా టేస్టీ గా కలిపేసి ఇందులో ఆ పిండి పెట్టేసి మూత వేసేసి స్విచ్ నొక్కితే వెంటనే కాస్త పిండి పెడితే ఆ పిండి కాస్తా గిన్నె ఆకారం లోకో కోన్ ఆకారం లోకో కూడా మనం ఆర్డర్ ఇచ్చి తెచ్చుకున్న రకం రూపంలోకో మారిపోయి వచ్చేస్తాయి. ఇక చాక్లేట్ గిన్నెలకున్న పాపులారిటీ ఇంకా వేటికీ లేదుట. కరిగిన చాక్లేట్ ని వేరే అచ్చుల్లో పూసి కూడా ఈ గిన్నెల్ని తయారు చేయచ్చు. కూరలు ,సలాడ్లు, సూప్ లు , కోసం రకరకాల పిండి మాంసం కలిపి గిన్నెలను చేసేయచ్చు. రకరకాల ప్యాకింగులతో పర్యావరణనికి సమస్యలు లేకుండా చేసే ఇలాంటి వస్తువుల వల్ల చాలా ప్రయోజనం.

    తినేసే గిన్నెలొచ్చాయి

    కోన్ ఐస్ క్రీమ్  తినేసాక చివరగా కోన్  కూడా బిస్కెట్ ఫ్లేవర్ తో తినేందుకు అనువుగా ఉంటుంది. ఇప్పుడు అచ్ఛంగా అలంటి వడ్డించే గిన్నెలొస్తున్నాయి. సూప్ లు,…

  • వ్యాయామం అలవాటై పోయిన ఒక్క పూట మానేసినా ఎదో వెలితిగా ఉంటుంది. మరి వణికించే ఈ చలి రోజుల్లో వర్కవుట్స్ చేయటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. చలికి నొప్పులొస్తాయి. చలిగాలులకు శరీరం ప్రభావితం కాకుండా నిండుగా చెమట పట్టే దళసరి వస్త్రాలు ధరించాలి. నేరుగా చలిలోకి పరుగు తీయకుండా ఇంట్లో వార్మ్ అప్ చేయాలి. అప్పుడు శరీరం వ్యాయామం కోసం సిద్ధం అవుతుంది.ఎండ తీవ్రత లేకపోయినా సన్ స్క్రీన్ రాసుకుని తీరాలి. లేకపోతే చర్మం చలికి పగిలి పాడవుతుంది. ఉదయాన్నే కాకపోతే సాయంత్రం కాస్త ఎండా వుండగానే వ్యాయామం పూర్తి చేసినా మేలే. ఎంతయినా చల్లని ఆహ్లాదకరమైన వాతావరణం కొన్ని జాగ్రత్తలు తీసుకుని జాగింగ్ మానక పోవటమే హాయి.

    చల్లగా వున్నా సరే మానకండి

    వ్యాయామం అలవాటై పోయిన ఒక్క పూట  మానేసినా  ఎదో వెలితిగా ఉంటుంది. మరి వణికించే ఈ చలి రోజుల్లో వర్కవుట్స్ చేయటం వల్ల  లాభం కంటే నష్టమే …

  • పిల్లల్ని బాగా పెంచటం అంటే ఖరీదైన వస్తువులు దుస్తులు ఖరీదైన పెంపకపు పోకడలు కాదు. చిన్న పిల్లలకు ఈ ప్రపంచంలో వస్తువుల ఖరీదు తెలియదు. వాళ్ళ దృష్టిలో జామపండు పిజ్జా రెండు ఒకటే. ఏది ఇష్టమో దాన్ని కోరుకుంటారు. ఖరీదు బట్టి కాదు. వాళ్ళ తల్లి తండ్రుల ఆసరా స్నేహం వాళ్లతో కలిసి గడిచే సమయం కావాలి. ఎదిగే వయసులో వాళ్ళకి ప్రోత్సాహం కావాలి. రెండు మార్కులు తక్కవొస్తే పర్లేదు ఈ సారి వస్తాయి లెద్దూ అనే ప్రేమ కావాలి. పెళ్లిళ్లు పేరంటాలకు పిల్లల్ని తీసుకుపోయినట్లే స్నేహితులు బంధువుల ఇళ్లలో జరిగే విషాదాలు కూడా వాళ్ళకి తెలియాలి. పుట్టిన రోజుకి ఫ్రెండ్స్ కిజిఫ్టు ఇమ్మని చెప్పటం కాకుండా ఎవరైనా అనారోగ్యాల తో వుండే దగ్గరుండి తీసుకుపోయి స్నేహితుల బాధను పంచుకునే అలవాటు చేయాలి. మనం దేన్నీ ఇస్తే దాన్నే అమూల్యమనుకుంటారు.

    కష్టం , సుఖం , తెలుసుకోనివ్వండి

    పిల్లల్ని బాగా పెంచటం అంటే ఖరీదైన వస్తువులు దుస్తులు ఖరీదైన పెంపకపు పోకడలు కాదు. చిన్న పిల్లలకు ఈ ప్రపంచంలో వస్తువుల ఖరీదు తెలియదు. వాళ్ళ దృష్టిలో…

  • పదహారేళ్ళ అమ్మాయి లంగా ఓణీలో కనపడితేనే అందం. పైగా మంచి మంచి డిజైనర్ లంగాలు ఓణీలు, బోలెడన్ని వెరైటీస్ వస్తున్నాయి. ప్లైన్ పరికిణీలు, హైలీ డిజైన్ బ్లవుజు, చిన్న అంచున్న ఓణి అందమే అందం. అలాగే పరికిణీ బ్లౌవుజ్ లు చాలా హెవీ వర్క్ తో వుండి వాటి పైన చెక్కని సారీ ఓణీ ఇంకా అందం అలాగే డిజైనర్ బ్లౌవుజులు, మోచేతి వరకు వస్తున్నాయి లేదా స్లీవ్ లెస్లూ వున్నాయి. ప్రేత్యేకమైన వేడుకల కోసం మంచి వర్క్ డిజైనర్ లు, లంగా ఓణీ కలిపి కుట్టేసి ఇంకెన్నో ఫ్యాషన్ ప్రపంచంలోకి పాతబడి పోకుండా కొత్తగా అడుగు పెడుతున్నాయి.

    ఎప్పటికీ మారని అందం లంగా ఓణీ

    పదహారేళ్ళ అమ్మాయి లంగా ఓణీలో కనపడితేనే అందం. పైగా మంచి మంచి డిజైనర్ లంగాలు ఓణీలు, బోలెడన్ని వెరైటీస్ వస్తున్నాయి. ప్లైన్ పరికిణీలు, హైలీ డిజైన్ బ్లవుజు,…

  • ఇప్పటి దాకా అచస్ట్రక్టివ్ స్లీప్ అప్లియా అంటే గురక పెట్టడం, పగటి వేల నిద్ర, నిద్ర లేమి పురుషులకే వుంటాయి అనుకుంటున్నారు. 20 నుంచి 70 సంవత్సరాల వయస్సున్న మహిళలపై చేసిన ఒక అధ్యయినంలో మహిళల్లో 70 శాతం మందికి ఈ ప్రాబ్లం ఉన్నట్లు తేలింది. ఇది పగటి నిద్ర వల్ల కాదని ఈ నిద్ర లేమి స్థూలకాయం, హైపర్ టెన్షన్ ల తో సంబంధం కలిగి వుందని పరిశోధనలు తేల్చాయి. స్థూలకాయం ఉన్న మహిళల్లో 31 శతం మంది సరైన నిద్ర పట్టకపోవడం, గురక, నిద్ర మధ్యలో మెలకువ వంటి సమస్యలు వున్నాయిని అధ్యయినం తేల్చింది. అన్నింటికీ కారణమైన శరీరపు బరువుని ఎలాగైనా తగ్గించుకోమని రేపోర్ట్లు స్పష్టం చేస్తున్నాయి.

    స్త్రీలకి ఈ సమస్య సహజమే

    ఇప్పటి దాకా అచస్ట్రక్టివ్ స్లీప్ అప్లియా అంటే గురక పెట్టడం, పగటి వేల నిద్ర, నిద్ర లేమి పురుషులకే వుంటాయి అనుకుంటున్నారు. 20 నుంచి 70 సంవత్సరాల…

  • సంగీతానికి రుగ్మతల్ని దూరం చేసే శక్తి ఉందని ఇప్పటిదాకా ఎంతో మంది అధ్యయన కారులు చెప్పారు. ఇప్పుడు తాజాగా డిప్రెషన్ కు కారణం అయ్యే అనేక మానసిక సమస్యలు నృత్యం ద్వారా దూరమవైతాయంటున్నారు. క్లినికల్ డిప్రెషన్ చికిత్సలు సాధారణ థెరపీ తో నృత్యం ప్రత్యామ్నాయ చికిత్స అంటున్నాం. డాన్స్ కారణంగా డిప్రెషన్ నుంచి బయట పడటమే కాదు శారీరికంగా ఫిట్నెస్ తో ఉంటారంటున్నారు. డిప్రెషన్ బాధితులే కాదు సాధారణ ఆరోగ్యంతో ఉండేవారు కూడా డాన్స్ ప్రాక్టీస్ చేస్తే ఆహ్లాదంగా విశ్రాంతిగా ఉంటుందని ఎన్నో వత్తిడులకు సంగీతం ,నృత్యం ఒక థెరపీ లాంటిదంటున్నారు. నడక ఏరోబిక్స్ యోగ వంటివి చేసేందుకు విసుగైతే డాన్స్ నేర్చుకోండి లేదా టీవీ ల్లో చూసయినా నాలుగు అడుగులు వేయనాదంటున్నారు నిపుణులు.

    డిప్రెషన్ తగ్గించే డాన్స్

    సంగీతానికి రుగ్మతల్ని దూరం చేసే శక్తి ఉందని ఇప్పటిదాకా ఎంతో మంది అధ్యయన కారులు చెప్పారు. ఇప్పుడు తాజాగా డిప్రెషన్ కు కారణం అయ్యే అనేక మానసిక…

  • ఊరికే భయాపడిపోవడం మానేసి చేయాల్సిన పని చేసాక అమ్మయిలు కర్ణాటక రాష్ట్రంలో చెలగాలి జిల్లాలోని రాషి వారా గ్రామంలో 14, 15 వయస్సు ఆడ పిల్లలు తమను ఎడిపిస్తున్న పోకిరిలను వదిలించుకునేందుకు లాథిలు పట్టుకున్నారు. ఆడ పిల్లలల ను మోటార్ సైకిళ్ళ పై వచ్చి వేధించడంవాళ్ళని తాకి వేగంగా పారిపోవడం చేస్తుంటే గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. లాభం లేకపోయింది. దాని తో ఆడపిల్లల తల్లి దండ్రులు ఆడపిల్లలను స్కూల్ వద్దు ఇంట్లోనే కూర్చోమన్నారు. అలా అయితే తమ భవిష్యత్తు నాశనం అవుతుందని భాలికలు లాతీలు పట్టుకుని గుంపులుగా స్చూలుకు పోవడం మొదలు పెట్టారు. చేతిలో కర్రలతో ధైర్యంగా స్చూల్కు బయలు దేరుతున్న అమ్మాయిలను చూసి పోకిరీలు ఫరార్!

    కర్ణాటకలో బదులు చెప్పిన అమ్మాయిలు

    ఊరికే భయాపడిపోవడం మానేసి చేయాల్సిన పని చేసాక అమ్మయిలు కర్ణాటక రాష్ట్రంలో చెలగాలి జిల్లాలోని రాషి వారా గ్రామంలో 14, 15 వయస్సు ఆడ పిల్లలు తమను…

  • బంగాళా దుంప పైన ఆకుపచ్చ రంగు మొలక రావటం చూస్తూ ఉంటాం. ఇలా ఆకుపచ్చ రంగుతో కనపడే చుక్కల్ని గ్లైకొల్కలాయిడ్స్ జి. ఏ అంటారు. చీడపీడలు, పురుగుల నుంచి తనను తానూ రక్షించు కునేందుకు మొక్క వీటిని సమకూర్చుకుంటుంది. ఈ జి.ఏ లో దుంపల చర్మం అడుగుదాకా ఉంటాయి. కాన్స్ లోతుగా కట్ చేసి ఆకుపచ్చదనం తీసేయాలి. రెస్టారెంట్ లో బంగాళా దుంప కూర తినేటప్పుడు ఈ విషయం గుర్తుతెచ్చుకొండంటున్నారు నిపుణులు. ఇంట్లో వాడుకునేట్టపుడు ఒకటీ అరా ఆకుపచ్చ మచ్చలు కనిపిస్తే అంతవరకు తీసేసి లేదా దుంపలో ఎక్కువచోట్ల కనిపిస్తే నిక్షేపంలా దాన్ని పారేయండి. అవి విషతుల్యం అంటున్నారు.

    ఆకుపచ్చ రంగొస్తే పారేయండి

    బంగాళా దుంప పైన ఆకుపచ్చ రంగు మొలక రావటం చూస్తూ ఉంటాం. ఇలా ఆకుపచ్చ రంగుతో కనపడే చుక్కల్ని గ్లైకొల్కలాయిడ్స్  జి. ఏ అంటారు. చీడపీడలు, పురుగుల…

  • అనేక భారతీయ వంటకాల్లో సిల్వర్ ఫాయిల్ అలంకరించిన మిఠాయిలు కనిపిస్తారు. ఈ వంటకాల సిల్వర్ ఫాయిల్స్ కోసం మన దేశంలో ప్రతి ఏటా రెండు లక్షల 75 కిలోల స్వచ్ఛమైన వెండి వాడతారట. కాజు, డిజార్ట్స్, సుగుంధ ద్రవయాలు డ్రై ఫ్రూట్స్ , తమలపాకులు, మౌత్ ఫ్రెషనర్లు, ఈ సిల్వర్ ఫాయిల్ లంకారణలో కనిపిస్థాయి. కెన్నీ మేఘాలయ వంటకాల్లో కూడా వీటిని ఉపయోగిస్తూ వుంటారు. ఇవి మంచివా కాదా అంటే చెప్పటం కష్టం. కమర్షియల్ గా వాడే ఫాయిల్ చెప్పటం కష్టమే. ఇంట్లో చేసుకునే మిఠాయిలు పైన ఈ ఫాయిల్ వాడుదలుచుకుంటే దీన్ని వేళ్ళ మధ్య నలిపితే సవచమైన దైతే మెరుపులుఅతుక్కుని కనిపిస్తుంది. కల్తీ అయితే చేతులకు అతుక్కుపోతుంది. బూడిద లాగా రాలుతుంది.

    స్వీట్ సిల్వర్ ఫాయిల్

    అనేక భారతీయ వంటకాల్లో సిల్వర్ ఫాయిల్ అలంకరించిన మిఠాయిలు కనిపిస్తారు. ఈ వంటకాల సిల్వర్ ఫాయిల్స్ కోసం మన దేశంలో ప్రతి ఏటా  రెండు లక్షల 75…

  • గౌరీ చౌదరి యాక్షన్ ఇండియా సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ సంస్థ దశాబ్దాల క్రితం ఢిల్లీ లో మహిళా పంచాయతీ వ్యవస్థకు ప్రాణం పోసింది. ఈ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ఆరు పంచాయతీలు సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నాయి. గడచిన ఆరేళ్ళ కాలంలో యాక్షన్ ఇండియా సంస్థ పన్నెండు వేలకుపైగా గృహహింస కేసుల్ని పరిష్కరం చేసింది. చాలా కొద్దిమంది కార్యకర్తలలతో ప్రారంభమైన ఉద్యోగం ఢిల్లీ మొత్తం విస్తరించింది. పట్టణ మహిళలు తన హక్కుల కోసం పోరాడేలా ప్రోత్సహిస్తుందీ సంస్థ. మురికి వాడల్లోని బాలికల భవిష్యత్తు కోసం కూడా కృషి చేస్తుందీ సంస్థ. మురికి వాడల మహిళలకు కోర్టులకెళ్ళే స్థోమత ఉండదు. గృహ హింసను భరిస్తారు. ఈ మహిళా పంచాయతీలు ఈ విన్స్ స్త్రీలకు అండగా నిలబడతాయి.

    మహిళలు విముక్తి దిశగా

    గౌరీ చౌదరి యాక్షన్ ఇండియా సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ సంస్థ దశాబ్దాల క్రితం ఢిల్లీ లో మహిళా పంచాయతీ వ్యవస్థకు ప్రాణం పోసింది. ఈ…

  • మురికివాడల్లో ఉన్న కుటుంబాల్లో మానసిక వైకల్యంతో పుట్టిన పిల్లల సంరక్షణ కోసం ఉర్మీ ఫౌండేషన్ ప్రారంభించింది సోనాలీ శ్యామ్ సుందర్. ఆటిజం, సెలిబ్రిటీ సార్స్, ఓన్ సిండ్రోమ్ ఉన్న పిల్లల కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్లీ హాండీక్యాప్డ్ నిర్దేశించిన పద్ధతుల్లో పాఠ్య పుస్తకాలు, ఇతర బోధనా విధానాలు రూపొందించి ఒక బడి పెట్టారు సోనాలీ. ముంబయ్ లోని ధారావి లోని ఈ స్కూల్లో ప్రత్యేక ఉపాధ్యాయులు, స్పీచ్ థెరపిస్టులు పిల్లలకు బోధిస్తారు. ఈ సంస్థ కోసం క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సేకరిస్తుంది సోనాలీ శ్యామ్ సుందర్. ఒక మంచి పనికి అందరూ సాయం చేస్తారు.

    మురికివాడల్లో ఆమె సేవ

    మురికివాడల్లో ఉన్న కుటుంబాల్లో మానసిక వైకల్యంతో పుట్టిన పిల్లల సంరక్షణ కోసం ఉర్మీ ఫౌండేషన్ ప్రారంభించింది సోనాలీ శ్యామ్ సుందర్. ఆటిజం, సెలిబ్రిటీ సార్స్, ఓన్ సిండ్రోమ్…

  • ప్రకృతి చాలా విచిత్రాలు సృష్టిస్తోంది. అచ్ఛం గులాబీల్లా లేదా ఇంకాస్త అందంగా కనిపించే పులున్నాయి. వీటిని మన పెరట్లో పెంచుకోవచ్చు. కానీ అవన్నీ ఓ తేయాకు మొక్కకి పూసే పువ్వులు. పట్టు రేకు లని తీర్చిదిద్దినట్లు కనిపించే పువ్వు కెమీలియా జపోనికా రకం. ఇక తేయాకు మొక్కగా కంటే పూల మొక్కగానే అభిమానిస్తారు. అలాగే రోజెస్ ఆఫ్ వింటర్. ఇదే తెలుపు ఎరుపు పసుపు వంగ పూవు రంగుల్లో వుండే తేయాకు మొక్క జపోనికా రకమే. ఇంత అందమైన పూల చెట్టు పూలను వంటల్లో వాడతారు. గింజలతో చేసే నూనె సౌందర్య సాధనాల తయారీలో వాడతారు. ఆకుల నుంచి ఎంతో రుచికరమైన టీ పొడి తయారవుతోంది. భారత అమెరికా ఆస్ట్రేలియా దేశాల్లో దీన్ని వ్యాపార పంటగా భావిస్తారు. ఇంత అందమైన పూల చెట్టును ఆన్ లైన్లో ఆర్డరిచ్చి తెప్పించుకోవచ్చు.

    అందమైన టీ పువ్వు

    ప్రకృతి చాలా  విచిత్రాలు సృష్టిస్తోంది. అచ్ఛం  గులాబీల్లా  లేదా ఇంకాస్త అందంగా కనిపించే పులున్నాయి. వీటిని మన పెరట్లో పెంచుకోవచ్చు. కానీ అవన్నీ ఓ తేయాకు మొక్కకి…

  • మన పనులు అవ్వాలంటే పరిగెడుతూనే ఉండాలి. అయినా బయటికి వెళ్ళాలంటే కాస్తయినా అలంకరణ కావల్సిందేగా! తొందరగా తయారయ్యే చిట్కాలివి. నుదుటి భాగంలో జుట్టు ఊడిపోయి పచ్చిగా కనబడుతుంటే పాపిట మార్చి చూడాలి. జుట్టు వత్తుగా అనిపిస్తుంది. మసాజ్ బ్రష్ పైన హెయిర్ స్ప్రే చల్లి కనుబోమ్మల్ని దువ్వుకొంటే అందంగా కనిపిస్తారు. కళ్ళు ఫ్రెష్ గా అనిపించాలి అనుకొంటే చిన్న ఐస్ ముక్కతో కళ్ళ చుట్టూ మసాజ్ చేయాలి. పెదవులు సహజంగా ఎర్రగా కనిపించాలి అనుకొంటే పంచదార, బాదం నూనె కలిపి మృదువుగా రుద్దేస్తే పెదవుల పైన పగుళ్లు మాయమైపోతాయి. చాలా తేలికైన లిప్ స్టిక్ వేసుకొంటే ఇంకా బావుంటుంది.

    ఇలా చేసి చూడండి

    మన పనులు అవ్వాలంటే పరిగెడుతూనే ఉండాలి. అయినా బయటికి వెళ్ళాలంటే కాస్తయినా అలంకరణ కావల్సిందేగా! తొందరగా తయారయ్యే చిట్కాలివి. నుదుటి భాగంలో జుట్టు ఊడిపోయి పచ్చిగా కనబడుతుంటే…

  • ఈ రోజుల్లో అన్నీ డిజైనర్ వెరైటీస్ చివరకు పెళ్ళికి సంబంధించిన ఐటమ్స్ తో సహా నిశ్చితార్ధం నుంచి రెసెప్షన్ వరకు వాడే వస్తువులతో పాటు సారెలు హారతి పళ్ళాలు కొబ్బరిబొండాం ,కళాశాలు ,పీటలు , అన్ని రంగుల రాళ్లతో డిజైన్ చేస్తున్నారు. ఇప్పుడు డిజైనర్ కొబ్బరి బొండాం పట్టుకుని పెళ్లి మాటకొస్తే లేసు దారాలతో అల్లిన వెండి చెంబుతో కాళ్లు కడుగుతారన్నమాట. పూలు, పండ్లు ,మిఠాయిలు, పసుపు ,కుంకుమ నగలు ఉంచిన ట్రేలు కూడా డిజైనర్ వే. హారతి పళ్ళాలు అలివేణి కుందులు కాశీ యాత్రలో కనిపించే కావిళ్ళు, చెంబులు, గొడుగులు , సర్వం సర్వాలంకారాలతో దర్శనం ఇస్తున్నాయి. పెళ్లి జ్యూవెలరీ పెళ్లి సంప్రదాయ వస్తువులు ఈ డిజైనర్ ఐటమ్స్ ఆన్ లైన్లో హాయిగా చూడచ్చు. పోనీ జాగరీ డిజైన్ ఫర్ వెడ్డింగ్ అని కొట్టి చూడండి

    డిజైనర్ కల్యాణ సామాగ్రి

    ఈ రోజుల్లో అన్నీ డిజైనర్ వెరైటీస్ చివరకు పెళ్ళికి సంబంధించిన ఐటమ్స్ తో సహా నిశ్చితార్ధం నుంచి రెసెప్షన్ వరకు వాడే వస్తువులతో పాటు సారెలు  హారతి…

  • ఎన్టీఆర్ స్టేడియం లో భక్తి టీవి నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. కార్తీక సోమవారం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో సి.ఎం. కె.సి.ఆర్. దంపతులు పాల్గొన్నారు.నిర్వాహకులు కైలాసాన్ని తలపించే ఏర్పాట్లు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఇంద్ర కరణ్ రెడ్డి, సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి ఎల్.వి. రమణ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు, పీఠాధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    కోటి దీపోత్సవంలో కె.సి.ఆర్. దంపతులు

    ఎన్టీఆర్ స్టేడియం లో భక్తి టీవి నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. కార్తీక సోమవారం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో సి.ఎం. కె.సి.ఆర్.…

  • పుట్టుకతోనే గొంతుదాకా మునిగిపోయిన ఊబి లాంటిది దామిని సేన్ జీవితం. పుట్టుక తోనే రెండు చేతులు లేవు. చత్తీస్ ఘడ్ లోని రాయపూర్ కు చెందిన దామిని సేన్ ను అందరూ వింతగా చూస్తే వాళ్ళ అమ్మానాన్న మేమే ఆమె రెండు చేతులూ అన్నారు. ఆమెను గురుకుల పాఠశాలలో చేర్చారు. పదవ తరగతిలో దామిని సేన్ 80 శాతం మార్కులు సాధించింది. చక్కగా బొమ్మలేస్తుంది. కాలి వేళ్ళతో ఒక గంటలో 38 బొమ్మలు గీసి గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించింది. కాలి గోటితోనే ఎన్నెన్నో రికార్డులు సాధించింది. ఇంటి పనుల్లో తల్లికి సాయం చేస్తుంది. అన్ని అవయవాలు చక్కగా ఉన్నా చివరికి బాగా చదివేందుకు కూడా బద్దకించే ఎంతో మంది అమ్మాయిలు 12వ తరగతి చదువుతున్న దామిని సేన్ ను స్పూర్తిగా తీసుకోవాలి.

    కాలి వేళ్ళతో గంటలో 38 బొమ్మలు

    పుట్టుకతోనే గొంతుదాకా మునిగిపోయిన ఊబి లాంటిది దామిని సేన్ జీవితం. పుట్టుక తోనే రెండు చేతులు లేవు. చత్తీస్ ఘడ్ లోని రాయపూర్ కు చెందిన దామిని…

  • చిన్న చిన్న అకేషన్లతో వన్ గ్రామ్ గోల్డ్ వీ ఫంకీ నగలు బహుమతిగా ఇస్తూవుంటాం. అలా సాదాసీదాగా ఒక చిన్న బహుమతే ఇది తెలిసేలా ఇచ్చే పనిలేదు. ఫంకీ నగల్లాగే ఫంకీ జ్యూవెలరీ బాక్స్ లు బోలెడన్ని రకాలున్నాయి. మాములు పెట్టెల్లో బదులు రకరకాల రూపాల్లో వస్తున్నాయి. ఫంకీ డిజైనర్ గిఫ్ట్ బాక్స్ లో పెట్టి ఇస్తే చూసేందుకు బావుంటుంది. ఇవన్నీ షోకేస్ లో పెట్టుకునేంత బావున్నాయి మంచి గులాబీ పువ్వులాగా చక్కని గిటార్ లాగా ముచ్చటగా కనిపించి జంతువుల బొమ్మల్లాగా ఇలా డిజైనర్ బాక్స్ ల్లాగా ఎన్నో వెరైటీస్ వస్తున్నాయి. అంటే పెట్టె లోపలి కానుక కంటే పెట్టే అందంగా ఉంటుందన్నమాట!

    ఫంకీ నగల పెట్టలున్నాయి

    చిన్న చిన్న అకేషన్లతో వన్ గ్రామ్ గోల్డ్ వీ ఫంకీ నగలు బహుమతిగా ఇస్తూవుంటాం. అలా  సాదాసీదాగా ఒక చిన్న బహుమతే ఇది తెలిసేలా ఇచ్చే పనిలేదు.…

  • ఆరోగ్యం కోసం ఏం తినచ్చో ఏం తాగచ్చో నిరంతరం సలహాలు వింటూనే వుంటాం. కానీ వీటిని ఎప్పుడు పడితే అప్పుడు, ఎలాపడితే అలా తినకూడదు అంటారు డైటీషియన్లు. నట్స్ లో పీచు, ప్రోటీన్లు, ఖనిజాలు ఎక్కువే. కానీ వీటిని తీపి పదార్ధాలతో కలిపి తీసుకోకూడదు. పండ్లతో కలిపి, ఓట్స్ తో కలిపి తినాలి. పండ్లు జీవ క్రియల వేగాన్ని మెరుగుపరుస్తాయి. కానీ వీటిని ఉదయం వేళ అల్పాహారంతోనో, మధ్యాహ్నం భోజనం అయ్యాక తినాలి. భోజనానికి ముందు తినకూడదు. నెయ్యి భోజనానికి రుచి ఇస్తుంది.కానీ నేతితో బ్రెడ్, పరోటాలు కాల్చకూడదు. అప్పుడు దానిలోని పోషక విలువలు పోతాయి. చపాతీలు, పరోటాలు కాల్చాక వాటిపై రాస్తే రుచి, ఆరోగ్యం. సాంబారు, పప్పు తాలింపుగా నెయ్యి వాడితే వాటికి అదనపు రుచి వస్తుంది.

    కొన్నింటిని అన్నింటితో కలపద్దు

    ఆరోగ్యం కోసం ఏం తినచ్చో ఏం తాగచ్చో నిరంతరం సలహాలు వింటూనే వుంటాం. కానీ వీటిని ఎప్పుడు పడితే అప్పుడు, ఎలాపడితే అలా తినకూడదు అంటారు డైటీషియన్లు.…

  • మనం తీసుకొనే ఆహారం ఎప్పుడూ మనం చేసే పనిపైనే బాలన్స్ అవుతూవుంటుంది. స్త్రీల జీవన సరళిలో ఇంటి పని, చేస్తే ఉద్యోగం, పిల్లల్ని కనడం, ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోవడం వంటి అనేక పనులు కలిసి వుంటాయి. అలా తీరిక లేని పనులు చేసే స్త్రీలు వాళ్ళు తీసుకునే ఆహారం, చేయాల్సిన వ్యాయామం పట్ల దృష్టి పెట్టరు. సమయం పాటించని ఆహారపు అలవాట్లు, శరీరానికి తగినంత పోషణ, వ్యాయామం ఇవేవీ వుండని కారణంతోనే వాళ్ళు ఫిట్ నెస్ తో వుండరు. పెళ్ళయి పిల్లలున్న చాలామంది ఆడవాళ్ళు బరువు పెరిగే కనిపిస్తుంటారు. అందుకే డైట్ లో ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. వయసు కనిపించకుండా ఉండాలంటే నిత్యం వ్యాయామాలు కూడా చేయాలి. ఆఫీస్ లో పని మధ్యలో కాసేపు నడవడం, మెట్లు ఎక్కి దిగటం, స్ట్రెచింగ్ ఎక్సర్సైజులు చేయడం చాలా అవసరం. తరచూ స్పా కు వెళ్ళటం, క్రమం తప్పని హెల్త్ చెకప్స్, మంచి పుస్తకం చదువుకోవడం, పచ్చని ప్రకృతిలో కాసేపు నడవటం ఇవన్నీ చేస్తేనే ఫిట్ గా వుంటారు.

    ఫిట్ నెస్ మంత్రాన్ని మర్చిపోతున్నారు

    మనం తీసుకొనే ఆహారం ఎప్పుడూ మనం చేసే పనిపైనే బాలన్స్ అవుతూవుంటుంది. స్త్రీల జీవన సరళిలో ఇంటి పని, చేస్తే ఉద్యోగం, పిల్లల్ని కనడం, ఇంట్లో పెద్దవాళ్ళని…