• రొటీన్ కి భిన్నంగా చేసే ఏదైనా ఎక్సర్ సైజ్ చేయాలనుకుంటే magenetic dumb bell ట్రై చేయొచ్చు. చేతి కండరాళ్ళు ధృడంగా వుండేందుకు బరువైన డంబెల్స్ వాడతారు కదా. అవి బరువుగా వుంటాయి పైగా వాటిని మోస్తూ వుండాలి. ఈ మాగ్నెటిక్ డంబెల్స్ చూసేందుకు గాజుల్లా వున్నాయి. వాటిని బుజానికి ఒకటి మణికట్టు దాటి మరొకటి తగిలించుకుంటే చాలు. ఎంత బరువు ఎత్తాలనుకుంటున్నారు సెట్ చేసుకుంటే చాలు. వాటిల్లోని అయిస్కాంత శక్తి కారణంగా ఒక దాన్ని ఒకటి ఆకర్షించుకుంటాయి. మాములుగా వీటిని పట్టుకున్నా చతికి తోడుకున్నా తెలికగ్గా వున్న చేతుల్ని ముందుకు వెనక్కు చాచడం మాత్రం చాలా కష్టం. డంబెల్స్ ఎత్తేటప్పుడు ఎంత శక్తిని వినియోగించాలో ఇక్కడ కూడా అంతే శక్తిని వినియోగించాలో ఇక్కడ కూడా అంతే శక్తిని ఉపయోగించాలి. వీటిని ఊరు వెళ్ళేటప్పుడు కూడా బాగ్ లో పడేసుకుని తీసుకు పోవొచ్చు.

    గాజుల్లా తొడుక్కునే డంబెల్స్

    రొటీన్ కి భిన్నంగా చేసే ఏదైనా ఎక్సర్ సైజ్ చేయాలనుకుంటే magenetic dumb bell ట్రై చేయొచ్చు. చేతి కండరాళ్ళు ధృడంగా వుండేందుకు బరువైన డంబెల్స్ వాడతారు…

  • ' FIND YOUR BEAUTI FUL' పేరుతో రాధికా ఆప్టే రూపొందించిన ఒక వీడియో కు సోషల్ మీడియా లో చక్కని స్పందన వచ్చింది. అందులో రాధికా ఆప్టే తన కాలేజీ రోజులనాటి ఫోటోలు ఇంకా చిన్నప్పటి ఫోటోలు చూస్తూ అప్పుడు తాను అందంగా లేననుకునేదాన్ని అంటూ కబుర్లు మొదలుపెడుతుంది. కళ్ళు బాలేవు పళ్ళు బాలేవు లావుగా ఉన్నారనే మరీ సన్నగా ఉన్నారనే చిన్న జుట్టు అనో రంగు తక్కువ అనో ఇలా అందంగా లేరని చెప్పేందుకు ఎన్నో కారణాలు చెపుతూ వుంటారు. అసలు అందమంటే పదిమందికీ నచ్చేందుకు కాదు మనకి మనం బావుండటం అని చెప్తూ ఆడపిల్లలో ఆత్మ విశ్వాసం నింపే ప్రయత్నం చేసింది రాధికా ఆప్టే. అసలు ఆడవాళ్ళందరూ తమ సంతోషానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పే ఎన్నో స్టిల్స్ చాలా బావున్నాయి ఈ వీడియోలో. ఇంతక ముందు శృతి హాసన్ రూపొందించిన 'ది బిచ్' స్టార్ ఫిల్మ్ కు ఎంతో మంచి స్పందన వచ్చింది. అందరి దృష్టిని ఆకర్షించగలిగిన హీరోయిన్లు ఇలా సామజిక అంశాల పైన స్పందిస్తే చాలా మందిని మార్చగలుగుతారేమో.

    మన సంతోషమే మనకు ముఖ్యం

    ‘ FIND YOUR  BEAUTI FUL’ పేరుతో రాధికా ఆప్టే రూపొందించిన ఒక వీడియో కు సోషల్ మీడియా లో చక్కని స్పందన వచ్చింది. అందులో రాధికా…

  • ఎదిగే వయసు పిల్లల్ని డీల్ చేయటం అంత ఈజీ టాస్క్ కానే కాదు. అప్పటిదాకా అల్లరిగా ముందుగా గోల చేస్తూ అమ్మని నాన్నని గారాబంగా అడుగులు ఏడ్చే పిల్లలు 16 ఏళ్ళు వచ్చేసరికి కామ్ గా అయిపోతారు. వాళ్ళు పర్సనల్ గా ఉండాలనుకుంటారు ఇక తమ నుంచి ఎదో దాస్తున్నారని భావన కొంత మంది తల్లితండ్రుల్లో కలుగుతుంది. ఏమడిగినా సరిగా సమాధానం లేకుండా దాటేస్తూ వెళ్ళటం ఇందుకు కారణం. అస్తమానం పిల్లల్ని కనిపెట్టుకుంటూ ప్రతి విషయాన్నీ నిశితంగా గమనించే వాళ్లలో ఇలాంటి భయాందోళనలు చోటు చేసుకుంటాయి. కానీ పిల్లలో తమపైన ప్రాధాన్యతలు అభిరుచులు ఇష్టాలు ఏర్పడుతున్నాయని గ్రహించలేకపోతారు. ఒక రకంగా ఎదిగే పిల్లలో ఇది సహజమే. పిలల్లు కోరుకునే స్వేచ్ఛ తల్లితండ్రుల నియంత్రణ ఘర్షణ కు దారి తీస్తూవుంటాయి. స్వేచ్ఛ కోరే పిల్లలు ఏది పడితే దాన్ని కోరుకోవచ్చు. అని నిర్ణయించటమూ అది నిరంతరం తప్పని పెద్దవాళ్ళు ఖండించటం రెండూ తప్పే. పిలల్లకు ఏది మేలు చేతుందో దాన్ని అనుభవంతో చెపుతున్నారని పెద్దవాళ్ళు పిల్లలతో అర్ధమయ్యేలా మాట్లాడగలిగినప్పుడే సమస్యలు పోతాయి. అలాగే పిల్లలు తమ పరిమితులు తెలుసుకుని ప్రవర్తించాలి కూడా ఇద్దరి మధ్య సమన్వయం కుదిరేలా ఒక మంచి వాతావరణం కల్పించే బాధ్యత ఖచ్చితంగా పెద్దలదే.

    పిల్లలు స్వేచ్ఛ కోరటం చాలా సహజం

    ఎదిగే వయసు పిల్లల్ని డీల్ చేయటం అంత ఈజీ టాస్క్ కానే కాదు. అప్పటిదాకా అల్లరిగా ముందుగా గోల చేస్తూ అమ్మని నాన్నని గారాబంగా అడుగులు ఏడ్చే…

  • అవనీ సింగ్ కు ఎప్పుడు దారిద్ర రేఖకి దిగువన వున్న మహిళలకు ఆర్ధికంగా నిలదొక్కుకునే సాయం చేయలి అని కోరిక. 17 సంవత్సరాల వయస్సులోనే ummed ke rickshaw రిక్షా ఆఫ్ గాప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇ-రిక్షాల గురించి పేపర్ లో చదివింది అవని. సోలార్ పవర్ తో నడుస్తూ సులభంగా తొక్కేలా వుండే ఈ రిక్షాతో మురికి వాడలల్లో మహిళలు ఉపాది పొందోచ్చని భావించిదీ అమ్మాయి. ఈ ఆశయం మెచ్చుకుని గ్రీన్ వీల్స్ అనే సంస్థ ఎలక్ట్రిక్ రిక్షా స్పాన్సర్ చేసింది. జామియా ప్రాంతంలోని కోహినూర్ అనే ౩౩ సంవత్సరాల మహిళ రిక్షా నడిపేందుకు ముందుకు వచ్చింది. ఈ కుటుంబం ఆర్ధికంగా స్థిర పడే సరికి ఎంతోమంది ఆసక్తి చూపించారు. వాళ్ళందరికీ డ్రైవింగ్ నేర్పించి ఈ- రిక్షా, టాక్సీ డ్రైవర్లుగా తీర్చిదిద్దుతుంది అవని. ఉపాధి లేని మహిళలు ఈ దారిన నడించేందుకు సిద్ధం అవుతున్నారు. అవనీ సింగ్ శ్రమ ఫలించింది.

    వాళ్ళు కు ఆర్ధికంగా నిలబడాలి అనుకుంది అవని

    అవనీ సింగ్ కు ఎప్పుడు దారిద్ర రేఖకి దిగువన వున్న మహిళలకు ఆర్ధికంగా నిలదొక్కుకునే సాయం చేయలి అని కోరిక. 17 సంవత్సరాల వయస్సులోనే ummed ke…

  • హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా కధ లాంటి సమాచారం ఒకటి వచ్చింది. బ్రెయిన్ చిప్స్ తయారవుతున్నాయి. ఇక వీటి వినియోగంలో మతి మరుపు వాళ్ళు మేధావులైపోతారన్నమాట. ఇప్పటివరకు ఎలుకలు కోతులపైన ఈ మెమొరీ చిప్స్ ఉపయోగించి ప్రయోగాలు చేసారు. వాటి జ్ఞాపక శక్తి పెరిగిపోయి చాల తెలివిగా వున్నాయట. ఇక మనుషుల కోసం బ్రెయిన్ చిప్స్ తయారవుతున్నాయట. కాలిఫోర్నియా లోని బయో మెడికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ Dr. థయోడోర్ బెర్గర్ ఈ బ్రెయిన్ చిప్ డిజైనింగ్ చేస్తున్నాడు. మెదడు లో మెమొరీ ని పెంచే వివిధ రకాల డిజైన్లతో కృత్రిమ పరికరాలు తయారుచేస్తున్నారు. ఇవి మనుషుల్లో వుండే షార్ట్ టర్మ్ మెమొరీ పవర్ ని లాంగ్ టర్మ్ మెమోరీ గా మారిపోతుంది. ఈ చిప్ మెదడు లో ఇన్స్టాల్ చేస్తే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని ప్రసారం చేసి లింకులు కలుపుతూ మెమొరీ ని వృద్ధి చేస్తాయన్నమాట. మనుషుల పరిస్థితులు బ్లడ్ గ్రూపులు కామన్ జీన్స్ వారీగా ఈ చిప్స్ ఇన్స్టాల్ చేస్తారన్నమాట. మెదడు బదులు మిషనే ఆలోచించి పెట్టేస్తుంది.

    మెమొరీ బ్రెయిన్ చిప్స్ వస్తున్నాయి

    హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా కధ లాంటి సమాచారం ఒకటి వచ్చింది. బ్రెయిన్ చిప్స్ తయారవుతున్నాయి. ఇక వీటి వినియోగంలో మతి మరుపు వాళ్ళు మేధావులైపోతారన్నమాట. ఇప్పటివరకు…

  • ఇంటా బయటా ద్విపాత్రాభినయం తో కలిగే వత్తిడి కారణంగా మహిళల మానసిక ఆరోగ్యం ప్రస్నార్ధకమైంది. నిత్యం అనేకమైన పనులు ఇంటి చాకిరీ వృత్తి పరమైన బాధ్యతల వల్ల ఎక్కువ వత్తిడికి గురవుతున్నది మహిళలే అని అనేక పరిశోధనలు వెల్లడించాయి. ఈ వత్తిడి వల్ల హార్మోన్ల పనితీరు దెబ్బతింటోంది. ఫలితంగా సంతాన లేమి అధిక బరువు మధుమేహం గుండె సంబంధిత సమస్యలు స్త్రీలలో తలెత్తుతున్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ధ్యానం ఒకటే మార్గం అంటున్నారు మానసిక వైద్య నిపుణులు. అసలు ధ్యానమంటే ఏమిటి? శారీరిక మానసిక భావోద్వేగాల సమతుల్యతలకు మేలైన సాధనం. ధ్యానం అసలెలా చేయాలి. ప్రశాంతమైన మనసుతో కళ్ళు మూసుకుని ఆలోచనను శ్వాస పైన కేంద్రీకరించాలి. ఒక వస్తువు పై దృష్టి కేంద్రీకరించి మిగతా ఆలోచనల్ని పక్కన పెడితే మనసు నెమ్మదిగా ఆ వస్తువు పైన లగ్నం అవుతుంది. ఇలా ఏకాగ్రత అలవాటై సహజ సిద్ధంగా అభివృద్ధి అవుతుంది. మనసును ఏకాగ్రత చేయగలిగితే నిర్మాణాత్మకమైన ఆలోచనలు కలుగుతాయి. ప్రతికూలమైన ఆలోచనల నుంచి అంటే కోపం వేదన పని వత్తిడి ఇవన్నీ మనసులోంచి మాయం చేసి కాసేపు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని మంచి జరుగుతుందేమో ప్రయత్నిస్తే తప్పేముంది.

    ధ్యానాన్ని అలవర్చుకుంటే శాంతి

    ఇంటా బయటా ద్విపాత్రాభినయం తో కలిగే వత్తిడి కారణంగా మహిళల మానసిక ఆరోగ్యం ప్రస్నార్ధకమైంది. నిత్యం అనేకమైన పనులు ఇంటి చాకిరీ వృత్తి పరమైన బాధ్యతల వల్ల …

  • మహిళలు ఉద్యోగ వ్యాపార వాణిజ్య రంగాల్లోనే కాదు సామజిక బాధ్యత విషయంలో కూడా ఒక్కడుగు ముందే ఉన్నారు. టామ్ గిల్ట్ అనే స్వచ్చంద సంస్థ స్థాపించింది మీరా శర్మ. కేన్సర్ బాధిత మహిళల కోసం విగ్గులు తయారు చేసి ఇవ్వాలనుకుంది. చెన్నయ్ కు చెందిన మీరా శర్మ క్రిస్టియన్ కాలేజీ లోని రొటో రాక్ క్లబ్ చైర్ పర్సన్. క్లబ్ తరఫున సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కేన్సర్ వచ్చిన మహిళలు వాడుతున్న సింథటిక్ విగ్గులు చూసింది. అవి ఒక్కోటి 30 వేల ఖరీదు చేస్తాయి. పైగా వాటివల్ల అలర్జీలు కూడా వస్తాయి. వాళ్ళ కోసం అసలైన శిరోజాలతో విగ్గులు తయారు చేసి ఇస్తే బావుందనుకుంది. ముందుగా తన జుట్టే ఒక విగ్గు కోసం కత్తిరించి ఇచ్చింది. ఆమె స్నేహితురాళ్ళు క్లబ్ సభ్యులు ముందుకొచ్చారు. ఒక విగ్గులు తయారుచేసే కంపెనీ తో కలిసి 4500 రూపాయలకే విగ్గు తయారీ చేసి ఇచేలా మాట్లాడుకున్నారు. వీటిని కేన్సర్ ఇన్స్టిట్యూట్ లో చికిత్స పొందుతున్న మహిళలకు ఉచితంగా ఇస్తూ వస్తున్నారు. దాతల నుంచి విరాళాలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ టామ్ గిల్ట్ ను విస్తరించి కేన్సర్ బాధితులకు విగ్గులు ఇవ్వాలనేది మీరా శర్మ ఆశయం.

    కేన్సర్ బాధితుల కోసం విగ్గులిస్తున్న మీరా శర్మ

    మహిళలు ఉద్యోగ వ్యాపార వాణిజ్య రంగాల్లోనే కాదు సామజిక బాధ్యత విషయంలో కూడా ఒక్కడుగు ముందే ఉన్నారు. టామ్ గిల్ట్  అనే స్వచ్చంద సంస్థ స్థాపించింది మీరా…

  • సిగ్నల్స్ దగ్గర బిక్షాటన చేసే ఎంతో మంచి చిన్నారుల కోసం 18 సంవత్సరాల వయసులోనే లక్ష్యం అనే స్వచ్చంద సంస్థను స్థాపించింది రాశీ ఆనంద్. ఢిల్లీ లో వుండే రాశి చదువుకునే వయసులో శ్రమ దోపిడీ కి గురవుతున్న పిల్లలకు టాయ్ లైబ్రరీ నిర్వహిస్తున్న చదువుకు సంబంధించిన బొమ్మలు బొమ్మల పుస్తకాల ఇస్తోంది. సంపన్న వర్గాల పిల్లలు చదివే స్కూళ్ల నుంచి బొమ్మలు పుస్తకాలు సేకరించి ఢిల్లీ తో సహా జార్ఖండ్ ఉత్తరాఖండ్ తమిళనాడు కర్ణాటక లాంటి నగరాల వీధుల్లోని 2 లక్షల మంది పిల్లలకు పుస్తకాలు పంచింది రాశి. వీధి బాలల కోసం సాక్ష్యం అనే పేరుతో స్కూలు ప్రారంభించింది. ఫ్లై ఓవర్ల కింద రైల్వే స్టేషన్లు రెడ్ వైట్ ఏరియాల పిల్లలకు చదువు చెప్పటంతో పాటు వారికి సత్ప్రవర్తన బోధిస్తూ మాదక ద్రవ్యాల సేవనం పిక్ పాకెటింగ్ లాంటి నేరాల పై అవగాహన పెంచుతూ వాటికి దూరంగా ఉండాలని ప్రచారం చేస్తోంది రాశి. రెండు చేతులా పనిచేసినా ఇంకెంతో చేయాల్సిన అవసరం ఉన్నచోట రాశి లాంటి యువతులు మేమున్నామంటూ ముందుకురావటం ఆనందించదగిన విషయం.

    2 లక్షల మందికి పుస్తకాల పంచింది రాశి

    సిగ్నల్స్ దగ్గర బిక్షాటన చేసే ఎంతో మంచి చిన్నారుల కోసం 18 సంవత్సరాల వయసులోనే లక్ష్యం అనే స్వచ్చంద సంస్థను స్థాపించింది రాశీ ఆనంద్. ఢిల్లీ లో…

  • రెండు చేతులా ఏదైనా ఎవరికైనా ఏదీ ఆశించాకుండా పంచే రోజు ఇది. ఈ ప్రపంచంలో ఎంతో మంది ఈ స్వచ్చంధ సేవలో తరించారు. అతి సామాన్యులు కూడా తోటి వాళ్ళ కష్టానికి చాలించరు. సాయి పడ్డారు. వాళ్ళందరికీ, సాటి మనుష్యులను అందుకోవాలనే సత్సంకల్పం వున్న వాళ్ళందరికీ, సాటి మన్యుషులను ఆదుకోవాలనే సత్సంకల్పం వున్న వాళ్ళందరికీ అంజలి షుటిస్తూ ఈ రోజు మదర్ ధెరిసాను గుర్తుకు తెచ్చుకుందాం. మిషనరీస్ ఆఫ్ చారిటీ స్వచ్చంధ సేవా సంఘంలో మదర్ నెలకొల్పిన తిరుగులేని మెయిలు రాయి. అల్టేనియాలో పుట్టి డార్జిలింగ్ లో కొన్నాళ్ళు పిల్లలకు పాఠాలు చెప్పారు మదర్. తర్వాత నన్ గా మారారు. ఆకాలంలో బెంగాల్ కరువు, మతకల్లోలాలు కలకత్తాను కుదిపేసాయి. ప్రజలు రోగాలతో దుర్భర దరిద్రయంతో అల్లాడారు. ధెరీసా ఆ పనులకు అనాధలకు తల్లయ్యారు. ఆమె నిస్వార్ధమైన సేవకు గుర్తింపుగా నోబెల్ శాంతి బహుమతి తో పాటు మరణానంతరం సెయింట్ హుడ్ కూడా లబించింది. సేవకు ఎన్నో మర్పులున్నాయి. అటుగా నడవటం, అలా నడవమని మన పిల్లలకు బోధించడం మన ధర్మం, కర్తవ్యం.

    సేవా సంకల్పం మనిషిలోని అద్భుత సౌందర్యం

    రెండు చేతులా ఏదైనా ఎవరికైనా ఏదీ ఆశించాకుండా పంచే రోజు ఇది. ఈ ప్రపంచంలో ఎంతో మంది ఈ స్వచ్చంధ సేవలో తరించారు. అతి సామాన్యులు కూడా…

  • ఇవాళ్టి తరం అమ్మాయిలకు కెరీర్ పైన ఉన్న శ్రద్ధ సమాజం పైన కూడా వుంది. అందుకు నిదర్శనం న్యూయార్క్ లో వుండే అంజలీ చంద్రశేఖర్. ఈమె సామజిక సేవకు భారత ప్రభుత్వం నేషనల్ యూత్ అవార్డు ఇచ్చింది. అంజలి స్వస్థలం చెన్నయ్. మంచి ఆర్టిస్ట్ చిన్నపటినుంచి బొమ్మలు గీస్తోంది. తన చిత్రాల ద్వారా బాల కార్మికులు ప్రక్రుతి వైపరీత్యాలు పునరావాస బాధితుల సహాయార్ధం విరాళాలు సేకరిస్తోంది. భారత దేశంలో మధుమేహం తో బాధపడే పసివాళ్ల కోసం ఇన్సులిన్ ఇతర మందులు కొనేందుకు తన చిత్రాల ద్వారా ఇంటెర్నేషనల్ డయాబెటిస్ చారిటీ కి మూడు లక్షల విరాళం ఇచ్చింది. అంజలి చిత్రానికి యునైటెడ్ నేషన్స్ పోస్టర్ ఫర్ పీస్ కాంటెస్ట్ లో మూడో బహుమతి వచ్చింది. పిక్చర్ ఇట్ అన్న ప్రాజెక్ట్ ద్వారా విరాళాలు సేకరిస్తోంది అంజలి. ఈమె గీసిన బొమ్మలు యూనిసెఫ్ యూనిస్కో లాంటి సంస్థలు కొనుగోలు చేసాయి. 22 ఏళ్ల వయసులో అంజలి చాలా సమయం సేవా కార్యక్రమాలకే వినియోగిస్తోంది.

    తన ప్రతిభ తోనే ఇతరులకు చేయూత

    ఇవాళ్టి తరం అమ్మాయిలకు కెరీర్ పైన ఉన్న శ్రద్ధ  సమాజం పైన కూడా వుంది. అందుకు నిదర్శనం న్యూయార్క్ లో వుండే అంజలీ చంద్రశేఖర్. ఈమె సామజిక…

  • కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తూనే వుంటాయి. రల్ స్కెబ్ ల దగ్గర నుంచి ప్రోట్రెయిట్ ఆయిల్ పెయింటింగ్స్ ఎంతో మంది గొప్ప చిత్రకారులు వస్తే ముగ్ధులైపోయి వుంటాం. ఇప్పుడిది తక్కువ కాదు. సీసాల్లో రంగుల ఇసుక పోస్తే గొప్ప గొప్ప పెయింటింగ్స్ సృష్టించడం మాములు సంగతి జోర్బాన్ లోని పెట్రులో రకరకాల రంగుల్లో వున్న ఇసుక పర్వతాలున్నాయి. పర్వతాలను ఇసుక పొరలుగా సీసాల్లో పోసి అమ్మేవారు స్థానికులు. నెమ్మదిగా ఈ ఇసుక పొరల్లో ఎడారి ఒంటెను సృష్టించారు ఆర్టిస్ట్ లు. ఇక ఆ బాటిల్ సాండ్ ఆర్ట్ సోషల్ మీడియా ద్వారా విదేశాలకు వారి సృజనకారుల చేతుల్లో పడి అందమైన పెయింటింగ్స్ సీసాలో ప్రత్యక్షమై గృహాలంకరణ లో భాగమయింది. ఇసుక రంగులు ముగ్గు కలిపి ఏనాటి నుంచి మన ఆడపిల్లలు నెలపైన వెన్నెల ముగ్గులు తీర్చిదిద్దేస్తారు. ఇది నేర్చుకోవడం కష్టమా ఒక సారి ఈ బాటిల్ శాండ్ ఆర్ట్ గొప్పదనం చూడండి. ఎన్నో ఇమగెస్ వున్నాయి.

    ఇసుక సీసా ఉద్యానవనాలు

    కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తూనే వుంటాయి. రల్ స్కెబ్ ల దగ్గర నుంచి ప్రోట్రెయిట్ ఆయిల్ పెయింటింగ్స్ ఎంతో మంది గొప్ప చిత్రకారులు వస్తే ముగ్ధులైపోయి వుంటాం.…

  • నేతి బీరకాయల్లో నెయ్యి ఎంత ఉంటుందో ఎనర్జీ డ్రింకుల్లో అంత శక్తి ఉంటుందంటున్నారు కెనడా పరిశోధకులు. మినరల్ వాటర్ ఎనర్జీ డ్రింక్ లు తాగటం వలన శరీరానికి ఎంత మేలు చేస్తాయని యువత పైన పరిశోధనలు నిర్వహించారు. ఎనర్జీ విటమిన్ పానీయాల్లో ఎలాంటి శక్తి లేదనీ వాటివల్ల శారీరిక మానసిక ఆరోగ్యం మెరుగుపడదనీ పరిశోధనల్లో వెల్లడైంది. ఎనర్జీ డ్రింక్ లు తాగి మిగతా పౌష్టికాహారం ఏమీ తీసుకోకుండా ఒక నెలరోజులపాటు ఉన్నా ఆరోగ్యంలో గణనీయమైన మార్పు వచ్చిందన్నారు. ఎంతో బరువు తగ్గిపోయి శరీరం శక్తిహీనమై పోవటం గమనించమన్నారు. కొద్ది రోజుల పాటు రెగ్యులర్ గా తినే ఆహారం తినకపోతేనే తేడా తెలిసిందన్నారు. వాస్తవానికి మనం తినే ఆహారంలో విటమిన్లు పోషకాలు వుంటాయని కొద్ది పాటి మార్పులు చేర్పుల వల్ల శరీరానికి ఎంతో శక్తి సమకూరుతుందని ఈ ఎనర్జీ డ్రింక్స్ వల్ల ఒక్క అణువంత కూడా లాభం లేదని తేల్చారు. విటమిన్లు మినీరల్సు నేరుగా లేదా ద్రవంగా తీసుకున్న పెద్దగా ఒరిగేదేమీలేదని వెల్లడైంది.

    ఎనర్జీ డ్రింక్స్ పరమ వేస్ట్

    నేతి బీరకాయల్లో నెయ్యి ఎంత ఉంటుందో ఎనర్జీ డ్రింకుల్లో అంత శక్తి ఉంటుందంటున్నారు కెనడా పరిశోధకులు. మినరల్ వాటర్ ఎనర్జీ డ్రింక్ లు తాగటం వలన శరీరానికి…

  • వినీలాకాశంలో తళుక్కున మెరిసే తారల్లాగా వెండితెర పైం అందచందాలతి ఆపుర్వమైన అభినయంతో వెలుగుతారు వీళ్ళు. ఒక హీరోయిన్ ఇండస్ట్రీలో ఉందంటే ఎన్నో గాసిప్స్. వాళ్ళకి ఎందరితోనో సంబంధాలు అంటగడతుంటారు. ఎంతకాలం సహించటం. సహనానికి కుడా ఒక హద్దు ఉంటుంది. అందుకే ఈ కాలం హీరోయిన్లు తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాలలో ఫేస్ బుక్,ట్విట్టర్ లలో షేర్ చేస్తున్నారు. తమ గురించి వచ్చే రూమర్స్ ,ఎఫైర్స్,లవ్ ,సెక్స్, విడిపోవటం దేని గురించి అయిన చాల బోల్డ్ గా మాట్లడేస్తున్నారు. ఎలాంటి సీరియస్ విషయాన్ని అయిన తెలికగా తీసుకుంటున్నారు. తమ జీవితాలలోవచ్చే ప్రేమను సంతోషాన్ని చేబుతున్నారు. మొన్నటికి మొన్న శృతి బిచ్ అంటే తనదైన స్టైల్ లో స్పందించింది. సమంత తన ప్రేమకు సంబందించి ప్రతి విషయాన్ని పోస్ట్ పెడుతుంది. సోనాక్షి ఎవరో లావుగా ఉన్నవంటే నటించటానికి వచ్చా కాని జీరో సైజ్ కోసం రాలేదని ఘాటుగా స్పందించింది. పరిణితి చోప్రా ఎవరో జర్నలిస్ట్ బహిష్టు గురించి ఏదో ప్రశ్నిస్తే మగవాళ్ళు అర్ధం చేసుకోవల్సిన ప్రాసెస్ కాదిది అదోక ఆరోగ్యకరమైన సహజసిద్దం అయిన విషయం అని సిగ్గు పడిపోయింది.

    సందేహించకుండా సమాధానాలిస్తున్నారు

    వినీలాకాశంలో తళుక్కున మెరిసే తారల్లాగా వెండితెర పైం అందచందాలతి ఆపుర్వమైన అభినయంతో వెలుగుతారు వీళ్ళు. ఒక హీరోయిన్ ఇండస్ట్రీలో ఉందంటే ఎన్నో గాసిప్స్. వాళ్ళకి ఎందరితోనో సంబంధాలు…

  • ఏన్నో రకాల అకేషన్స్ వస్తుంటాయి. ఏదైన గిఫ్ట్ పంపితే వెళ్ళాల,కోనాల ఫంక్షన్ కు హజరవ్వాలి. అక్కడ ఇవ్వాలి టైమేది..అక్కర్లేదు మేము ఆపని చేసి పెడతాం అంటున్నారు యువ స్టార్ట్ అప్ అమ్మాయి అను గుప్తా,స్వప్న చౌదరి. వీళ్ళిద్దరు మేక్ మై విషెష్.కమ్ పెట్టారు. అను ఐటీ అయ్యాక ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో పని చేశారు. అను బ్యాంకర్ ఐసిఐసిఐ ,స్టార్టప్ చార్టర్డ్ వంటి ప్రముఖ బ్యాంక్ లలో పని చేశారు. ఇద్దరి అభిరుచి ఒకటే వినియోగదారునుకి పనికొచ్చే చిన్న అవసరాన్ని బిజినెస్ గా మలచాలని ప్రతి వేడుకకు గిఫ్ట్ పంపి శుభాకాంక్షలు చెప్పే ఈనాటి యువతరం ఆలోచనను ఆ సంస్కృతిని పట్టుకుని స్టార్టప్ మొదలు పెట్టారు. వెబ్ సైట్ లో రిజిష్టర్ చేసుకుని గిఫ్ట్ ను ఎంచుకుంటే పంపాల్సిన వాళ్ళకి సమాయానికి డెలివరి చేస్తుంది ఈ సంస్థ.ఈ కోత్త ఐడియా బాగానే వర్కవుట్ అవుతుందంటున్నారు పారిశ్రామిక వేత్తలు.

    బహుమతులు పంపేస్తారు వాళ్ళు

    ఏన్నో రకాల అకేషన్స్ వస్తుంటాయి. ఏదైన గిఫ్ట్ పంపితే వెళ్ళాల,కోనాల ఫంక్షన్ కు హజరవ్వాలి. అక్కడ ఇవ్వాలి టైమేది..అక్కర్లేదు మేము ఆపని చేసి పెడతాం అంటున్నారు యువ…

  • పిల్లలు పోతపాలు తాగిన, తల్లిపాలు తాగిన ఐక్యూ లెవల్స్ లో ఎలాంటోఇ తేడా ఉండదని చెబుతుంది ఒక అధ్యాయనం. తల్లి పాలు పోతపాలు తాగిన పిల్లలను రెండు గ్రూపులుగా చేసి మొత్తం 11 వేల మంది పై చేసిన సరికొత్త అధ్యాయనంలో రకరకాల వయసు పిల్లలు రెండేళ్ళ వయసు పిళ్ళల నుంచి 16 ఏళ్ళ వయసు పిల్లల పై వాళ్ళ ఇంటిలిజెన్స్ లెవల్స్ తీసుకుంటే తల్లి పాలఉ తాగిన పిల్లల ఐక్యూ హెచ్చు స్థాయిలో లేదని తేలింది. తల్లి పాలకు పిల్లల జీవితంలో ప్రదర్శించే తెలివితతేటలకు సంబందం లేదని లండన్ కు ఛేందిన గోల్డ్ స్మీత్ యూనివర్సీటి శాస్త్రవేత్తలు వెల్లడించారు. పోతపాలు తాగిన పిల్లల్లు 18 నెలల వయసు వారు 16 సంవత్సరాల వయసు వచ్చే వరకు ధీర్ఘకాలం పాటు ఈ అధ్యాయనం కోనసాగించామంటున్నారు. మొత్తం 11 వేల మంది పిల్లల విషయంలో అధ్యయనం సాగింది. పిల్లల ఎదుగుదలలో వారి అధికస్థితిగతులు సామాజిక కుటుంబ నేపథ్యం తల్లిదండ్రుల విధ్యర్హతలు ముఖ్యపాత్ర పోషిస్తాయని పోతపాలు పట్టిన తల్లులు ఏ మాత్రం విచారించాల్సిన అవసరం లేదని అధ్యాయనం రిపోర్టులు చెప్పాయి.

    ఏ పాలు తాగిన ఒకటే

    పిల్లలు పోతపాలు తాగిన, తల్లిపాలు తాగిన ఐక్యూ లెవల్స్ లో ఎలాంటోఇ తేడా ఉండదని చెబుతుంది ఒక అధ్యాయనం. తల్లి పాలు పోతపాలు తాగిన పిల్లలను రెండు…

  • అస్సాంలో వుంది పల్ప్ ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ ఆలోచన చేసింది. స్పృహా చొఖాని. ఇక్కడ కుర్తీలు టేబుళ్లు కేవలం పేపర్ గుజ్జు ఉపయోగించి ఎంతో దృఢంగా ఎంతో సృజనాత్మకంగా తయారుచేస్తారు. కలప ఇనుమూ ప్లాస్టిక్ ఉండగా పేపర్ తో ఎందుకూ అంటే గతంలో ఎన్నెనో వస్తువులు పేపర్ గుజ్జుతో తయారుచేసారు. ఇవి కూడా దృఢంగా వుంటాయని నేను పరిశోధించి తెలుసుకున్నారు. ఏదైనా కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తే బావుంటుంది కదా అంటుందామె. వేస్ట్ పేపర్ తో తయారుచేసిన ఏ వస్తువులు విభిన్న ఆకృతులతో 200 కిలోల కంటే ఎక్కువ బరువు మోయగల సామర్ధ్యంతో ఉంటాయి. వీటిని తయారు చేయటం వెనక నాలుగేళ్ళ శ్రమ దాగుంది అంటోంది స్పృహా చొఖాని. ఒక్కసారి అస్సాం పల్ప్ ఫ్యాక్టరీ శోధించండి. మోడరన్ డిజైన్స్ ఎన్నెన్ని వస్తువులున్నాయో అందులో ఎంత కళాత్మకత వుందో ఇంటీరియర్స్ గా అవెంత బావున్నాయో చూడండి.

    కాగితపు కళా ఖండాలు

    అస్సాంలో వుంది పల్ప్ ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ ఆలోచన చేసింది. స్పృహా చొఖాని. ఇక్కడ కుర్చీలు టేబుళ్లు కేవలం పేపర్ గుజ్జు ఉపయోగించి ఎంతో దృఢంగా ఎంతో…

  • ఈ చలికాలంలో కాస్త వేడిగా వుండే వంటకాలు తినాలనిపించటం సహజం. పైగా ఈ మధ్య కాలంలో రాబోయే రోజుల్లో అన్ని పండగలు పర్వ దినాలే. సరే సంప్రదాయ వేడుకలు వచ్చాయి కదా అని ఘాటైన మసాలాలు వేపుళ్ళు వేడి వేడి స్వీట్లు తినేస్తేనే ప్రాబ్లమ్. ఆకలి పొట్టతో వంద వెరైటీలు ముందు నిలబడి నోరు కట్టేసుకోవటం కష్టం అన్యాయం కూడా అందుకే ఎక్కడైన విందుకు హాజరయ్యేప్పుడు చక్కగా ముచ్చటగా తయారైపోయి ఇంట్లోనే సగం పొట్ట నింపేసుకుని వెళ్ళటం ఉత్తమం. ఇక విందు సూపులు రోటీలు పచ్చి ముక్కలు రైతాలు ఎంచుకుంటే గొడవే లేదు. చలికాలం కదా దాహంగా అనిపించదు గని ఎదురుగ కూల్ డ్రింక్స్ ఊరిస్తుంటే మొహం తిప్పుకోలేం కదా . మంచినీళ్లు అవసరం లేకపోయినా తాగాలి. విందులో కొబ్బరినీళ్లు నిమ్మరసాలు కావాలన్నా దొరకవు కనుక నీళ్లతో సరిపెట్టుకుని ఏ డ్రింక్ నయినా పక్కన పెట్టేయటం ప్రాక్టీస్ చేయాలి. అక్కడ కాఫీ టీ లు సప్లయ్ చేస్తున్నా సరే మళ్ళా మనసు నొక్కి పట్టుకుని ఇక్కడ హెర్బల్ టీ వుందా అని అడగండి నో అన్నారనుకోండి మంచి నీళ్ల స్టాల్ వైపు అడుగులేయండి. పదార్ధాల ఎంపికలో తప్పటడుగు వేస్తె పోదున్నే లేచి 10 మైళ్ళు నడవాలని గుర్తు తెచ్చుకోండి.

    పదార్ధాల ఎంపికలో జాగ్రత్త సుమా !

    ఈ చలికాలంలో కాస్త వేడిగా వుండే వంటకాలు తినాలనిపించటం  సహజం. పైగా ఈ మధ్య కాలంలో రాబోయే రోజుల్లో అన్ని పండగలు పర్వ దినాలే. సరే సంప్రదాయ …

  • మనం సాధారణంగా కొన్ని విషయాలు మరిచిపోతూవుంటాం. ఆ మరచిపోయిన విషయం గుర్తుకు రావాలంటే కళ్లు మూసుకుని ఆలోచించమంటున్నారు సైకియాట్రిస్టులు. 200 మంది స్త్రీ పురుషులకు ఒక క్రైమ్ హారర్ సినిమా చూపించారట. సినిమా చూసిన వెంటనే అందులో సన్నివేశాల గురించి ప్రశ్నిస్తే వచ్చిన సమాధానాలు రాసుకుని వాళ్ళని కళ్ళు మూసుకుని ఆ సినిమా గురించి ఆలోచించమంటున్నారట. 71 శాతం మంది కళ్ళు మూసుకుని ఆలోచించి కరెక్ట్ సమాధానాలిచ్చారట. సైకియాట్రిస్టులు ఏమంటున్నారంటే మనం ఇంట్లో మరచిపోయే వస్తువుల గురించి ఆలోచించాలంటే కళ్ళు మూసుకున్న తరువాత చుట్టూ విషయాలు మాయమై మనసు ఆ సంభంధితమైన విషయం పైనే లగ్నం అవుతోందని ఆలా ఎక్కడ ఏది మరిచిపోయామో మెదడు రివైండ్ చేసుకోగలదని చెప్పారు. పోలీసులు కూడా ఇంటరాగేషన్ సమయంలో అనుమానితులను ప్రశ్నించే సమయంలో వాళ్ళని కళ్ళు మూసుకుని ఆలోచించమని చెపుతారట.

    కళ్ళు మూసుకుని ఆలోచిస్తే గుర్తొస్తాయి

    మనం సాధారణంగా కొన్ని విషయాలు మరిచిపోతూవుంటాం. ఆ మరచిపోయిన విషయం గుర్తుకు రావాలంటే కళ్లు మూసుకుని ఆలోచించమంటున్నారు సైకియాట్రిస్టులు. 200 మంది స్త్రీ పురుషులకు ఒక క్రైమ్…

  • అది నేత చీర అయినా, సిల్క్ అయినా సరే డిజిటల్ డిజైన్ లో మార్కెట్ లోకి వస్తే ముందు కన్ను చెదిరే రంగులకే కళ్ళు అతుక్కు పోతాయి లెనిన్, క్రేప్ చీరాలపైన డిజిటల్ ప్రింట్స్ చాలా అందంగా వుంటున్నాయి. అసలే అతి నాజూకైన చీరలు, వాటి పైన ఎవరో చేయి తిరిగిన కళాకారులు మనస్సు పెట్టి కాన్వాస్ పైన ఎవరో చేయి తిరిగిన కళాకారులు మనస్సు పెట్టి కాన్వాస్ పైన అందమైన ప్రకృతిని తీర్చిదిద్దినట్లు డిజిటల్ డిజైన్స్ వచ్చాయి అనుకోండి. ఇప్పుడు చీరకి అందం ఎలావుంటుంది.ఈ ప్రింట్స్ ప్రత్యేక సందర్భాలలోనే కాదు, స్టయిల్ గా మోడ్రన్ గా క్యాజువల్ వేరేగా కూడా ఎంతో బాగుంటాయి. క్రీమ్, మాస్టర్ కలర్, ఉదా రంగు, ఎరుపు, నలుపు క్రేప్ సారీల పైన పువ్వుల డిజిటల్ ప్రింట్లు ఎంత బాగుంటాయో ఓ సారి చూడండి.

    నాజూకు చీరల పై డిజిటల్ ప్రింట్స్

    అది నేత చీర అయినా, సిల్క్ అయినా సరే డిజిటల్ డిజైన్ లో మార్కెట్ లోకి వస్తే ముందు కన్ను చెదిరే రంగులకే కళ్ళు అతుక్కు పోతాయి…

  • ఈమె ఎత్తు రెండడుగుల ఆరు అంగుళాలు. బరువు కేవలం ఐదు కిలోలు. ఈ మరగుజ్జు రూపాన్ని అత్యంత పాజిటివ్ గా రిసీవ్ చేసుకుని జ్యోతి ఆడపిల్లల బ్రుణ హత్యల్ని వ్యతిరేకిస్తూ పెద్ద ప్రచారం నిర్వహించింది. ఇప్పుడీమెకు 22 సంవత్సరాలు ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా రికార్డుకెక్కింది. టీవీల్లో కనపడుతూ వుంటుంది. అమెరికన్ హారర్ సిరీస్ లో ముఖ్య పాత్ర నటించింది. బిగ్ బాస్ కార్యక్రమంలో గెస్ట్ గా కనిపించింది. ఫ్యాషన్ అంటే చాలా క్రేజ్ ఎత్తు బరువుకు తగట్టు మందమైన దుస్తులు కుట్టించుకుంటుంది. చక్కగా తయ్యారు అవుతుంది. అంత పొట్టిగా కనిపిస్తే విచిత్రంగా చూస్తుంటే, తాకేందుకు ప్రయత్నిస్తుంటే ఇచ్చిందే కానీ నన్ను తక్కువగా అంచనా వేస్తే నాకు నచ్చదు అంటుంది జ్యోతి. అంత పసి దానిలా కనపడే ఈ యువతి మహిళా శక్తి ప్రధాన్యాత ను ప్రచారం చేయడం అంటే గొప్పే కదా జ్యోతికి కంగ్రాట్స్ చెప్పేద్దాం.

    రెండడుగుల సూపర్ స్టార్

    ఈమె ఎత్తు రెండడుగుల ఆరు అంగుళాలు. బరువు కేవలం ఐదు కిలోలు. ఈ మరగుజ్జు రూపాన్ని అత్యంత పాజిటివ్ గా రిసీవ్ చేసుకుని జ్యోతి ఆడపిల్లల బ్రుణ…