• బాలీవుడ్ నటి దీపికా పదుకొనె నెథర్లాండ్ లోని రాటర్ డాం లో జరిగిన ఎంటివి యూరోపియాన్ మ్యాజిక్ అవార్డ్స్ కార్యక్రమంలో తళుక్కుమంటూ మెరిసిపోయింది ఇంటెర్నెల్ లెవెల్ లో కండక్ట్ చేసిన ఈ కార్యక్రమానికి తన సహా నటి నీనా డొబ్రోన్ తో కలిసి ఆమె హాజరైంది. రెడ్ కార్పెట్ పైన గ్రీన్ కలర్ డ్రెస్ లో ఎంతో అందంగా కనపడింది దీపికా. ఆమె డ్రెస్సింగ్ స్టయిల్ ను చూసి అభిమానులు సంతోషపడిపోయారు. డిజైనర్ మోనిషా జైనింగ్ డిజైన్ చేసిన గ్రీన్ స్కర్ట్ బ్లాక్ టాప్ ధరించింది దీపికా. చెవులకు ఆకుపచ్చని దారాలతో ఉన్న హ్యాంగింగ్స్ పెట్టుకుంది. ఆ బాల్ మెయిన్ డ్రెస్ ధర పది లక్షలకు పైగానే ఉంటుంది. ఈ మధ్య కాలంలో దీపికా ఎన్నో ఫంక్షన్ల లో ఇలాంటి విభిన్నమైన డ్రెస్ లనే వేసుకుంది.

    రెడ్ కార్పెట్ పై గ్రీన్ డ్రెస్ లో దీపికా

    బాలీవుడ్ నటి దీపికా పదుకొనె  నెథర్లాండ్ లోని రాటర్ డాం లో జరిగిన ఎంటివి యూరోపియాన్ మ్యాజిక్ అవార్డ్స్ కార్యక్రమంలో తళుక్కుమంటూ మెరిసిపోయింది ఇంటెర్నెల్ లెవెల్ లో…

  • అలీసా మాంక్స్ పెయింటింగ్స్ కోసం ఆమె గ్యాలరీ లో వెతకండి. ఎన్ని సోలో ఎగ్జిబిషన్స్ ,ఎన్ని గ్రూప్ ఎగ్జిబిషన్స్ లెక్కలేనన్ని. ఆమె బయోగ్రఫీ చుస్తే లిస్ట్ మొత్తం కనిపిస్తుంది. ఆమె పెయింటింగ్స్ అన్ని ఫొటోల్లా ఉంటాయి. కానీ అవన్నీ అలీసా మాంక్స్ కుంచె తో వేసిన పెయింటింగ్స్ న్యూయార్క్ లో వుండే మాంక్స్ కు అత్యంత సహజమైన చిత్రాలు వేసే పెయింటర్ గా ఎంతో పేరుంది. మేని ఛాయా ను కంటి మెరుపును కూడా అత్యంత సహజంగా చిత్రించగలిగారమే. నీళ్లలో ఓ అందమైన అమ్మాయి స్నానం చేస్తున్న పెయింటింగ్ అనుకోండి నీళ్లు సహజమైన రంగులోనే స్నానం చేసే అమ్మాయి సహజంగానే. మొహం నిండా నీటి బిందువులున్నాయి. ఒక అందమైన అమ్మాయి చిత్రంలో అవి నిజంగానే నీళ్లు రాలుతున్నట్లే వున్నాయి. ఇంకెన్నో చిత్రాలు మాంక్స్ గొప్పతనం చాటేందుకు !!

    అద్భుతమైన పెయింటింగ్స్ అలీసా మాంక్స్

    అలీసా మాంక్స్ పెయింటింగ్స్ కోసం ఆమె గ్యాలరీ లో వెతకండి. ఎన్ని సోలో ఎగ్జిబిషన్స్ ,ఎన్ని గ్రూప్ ఎగ్జిబిషన్స్ లెక్కలేనన్ని. ఆమె బయోగ్రఫీ చుస్తే లిస్ట్  మొత్తం…

  • ప్రాచీన సంప్రదాయ పద్ధతులు పాటిస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందనే నమ్మకం. ఈ మధ్య ఎక్కువవుతోంది. తేనె ,దాల్చిన చెక్క అలోవెరా తృణ ధాన్యాలు మొలకలు పుదీనా రసం ఇలాంటి ఔషధ గుణాలున్న అనేక పదార్ధాలు మూలికా ద్రవ్యాలు ఎక్కువగా వాడుతున్నారు. ఆ క్రమంలో ఆపిల్ సైడర్ వెనిగర్ ముందు నిలబడింది. మేలు జాతి సైడర్ ఆపిల్స్ రసాన్ని పులిసేలా చేసి ఆపిల్ సైడర్ వెనిగర్ తయారు చేస్తారు. ఈ వెనిగర్ లో బీటా కెరోటిన్ ,విటమిన్స్ , మినరల్ ఎంజైమ్స్ కావలిసినన్ని పోషకాలు దొరుకుతాయి. దీన్ని అనేక కాంబినేషన్స్ లో తీసుకోవచ్చు. తేనె నిమ్మరసం ,వెల్లులిరసం , అల్లం రసం ,సలాడ్స్ ,కూరలు ,ఫ్రైలు ,మాంసాహార వంటకాల్లో వాడుతుంటారు. ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ సర్వరోగ నివారిణి అంటుంటారు. ఎన్నో ఔషధ విలువలున్న ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ వెనిగర్ గురించి మీ డాక్టర్ గారితో మాట్లాడండి. ఎందుకంటే బరువు తగ్గేందుకు ఈ వెనిగర్ బ్రహ్మాండంగా పని చేస్తుందని ఇటీవల పరిశోధనలు చెప్తున్నాయి.

    బరువు తగ్గించే దివ్యౌషధం

    ప్రాచీన సంప్రదాయ పద్ధతులు పాటిస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందనే నమ్మకం. ఈ మధ్య ఎక్కువవుతోంది. తేనె ,దాల్చిన చెక్క అలోవెరా తృణ ధాన్యాలు మొలకలు పుదీనా రసం…

  • దక్షిణ కొరియన్ల మొట్ట మొదటి మహారాణి హర్ వాంగ్ ఓక్ . ఈమెను సురిరత్న అంటారు. ఆవిడ పుట్టినవూరు అయోధ్యట. అందుకే ఏటా వందల కొద్దీ దక్షిణ కొరియన్లు మన దేశానికి వచ్చి ఉత్తర ప్రదేశ్ లో వున్న అయోధ్యను దర్శించి వెళుతుంటారు. ఈ మహారాణి అయోధ్యలో పుట్టి ఇక్కనుంచి క్రీ. శ 48 లో పడవ ద్వారా దక్షిణ కొరియా వెళ్లి దేవుడు చెప్పిన ప్రకారం అక్కడున్న సురో ని పెళ్లాడిందట. పది మంది పిలల్లకు జన్మ ఇచ్చింది. అక్కడ గామ్ వాన్ గయ అనే రాజ్యాన్ని స్థాపించిందట. ఈమె ద్వారానే కరర్ తెగ అయోధ్యలో తన సంస్కృతి ఉట్టిపడేలా తమ రాణీ గుర్తుగా ఒక ఆలయం నిర్మించామని అడిగారట. ఇప్పుడు అయోధ్యలో రాణీ గుడి వస్తుందన్నమాట.

    కొరియన్ల రాణి పుట్టిల్లు అయోధ్యట

    దక్షిణ కొరియన్ల మొట్ట మొదటి మహారాణి హర్ వాంగ్ ఓక్ . ఈమెను సురిరత్న అంటారు. ఆవిడ పుట్టినవూరు అయోధ్యట. అందుకే ఏటా వందల కొద్దీ దక్షిణ…

  • ప్రసవ సమయంలో ఎదురయ్యే అనేక సమస్యలకు వయసు ప్రధాన కారణమని చెన్నయ్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ ఒబెస్ట్ట్రిస్ట్ ,కస్తూర్బా గాంధీ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన ఒక అధ్యయనం రిపోర్ట్ వెల్లడించింది. కస్తూర్భా గాంధీ హాస్పిటల్ వైద్యం కోసం వచ్చిన 3480 మంది గర్భిణీల్లో 35 దాటిన 250 మంది హై రిస్క్ మెటర్నల్ మెడిసన్ తీసుకున్నట్లు గుర్తించారు. పట్టణ ప్రాంతాల్లో 30 నుంచి 35 ఏళ్ల మధ్యనే మహిళలు తొలిసారిగా గర్భం దాల్చుతున్నారని జీవితంలో స్థిరపడటం కోసం పిల్లలు కనటాన్ని వాయిదా వేసుకుంటున్నారని రిపోర్ట్ చెప్తోంది. అయితే 35 దాటినా తర్వాత గర్భం వచ్చే అవకాశాలు తగ్గుతాయని అంతేగాకుండా జీవన శైలి పై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.

    వయసు దాటితే రిస్క్ ఎక్కువే

    ప్రసవ సమయంలో ఎదురయ్యే అనేక సమస్యలకు వయసు ప్రధాన కారణమని చెన్నయ్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ ఒబెస్ట్ట్రిస్ట్ ,కస్తూర్బా గాంధీ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన ఒక…

  • కాదేదీ కవిత కనర్వం. అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ........... అంటూ శ్రీ శ్రీ, కవితా వస్తువు ఏదైనా పర్లేదన్నాడు. ఆ శ్రీశ్రీ బాటలోనే ఈ అభినవ శ్రీశ్రీ ఎడ్గార్ ఆర్టిస్ట్. తినే పళ్ళు, వాటి తొక్కలు, కూరలు, ఆకు కూరలు, పక్షులు ఈ కలతో ఒకటేమిటి కనిపించే ప్రతిదాన్ని వాడేసి కొత్త కొత్త డ్రెస్ డిజైన్స్ తాయారు చేస్తున్నాడు. సగం బొమ్మ గిస్తాడు ఆ బొమ్మకు డ్రెస్ డిజైన్ వివిధ వస్తువులతో చేసేస్తాడు. ఎడ్గార్ అమెరికన్ ఫ్యాషన్ చిత్రకారుడు, తను తాయారు చేసిన డిజైన్లను సోషల్మీడియా లో షేర్ చేస్తే వేలాది అభిమానులు ఎడ్గార్ డిజైన్ స్టైల్ చూసి ఫాన్స్ అయ్యారు.

    తొక్కలో పూల రెక్కలతో

    కాదేదీ కవిత కనర్వం. అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ……….. అంటూ శ్రీ శ్రీ, కవితా వస్తువు ఏదైనా పర్లేదన్నాడు. ఆ శ్రీశ్రీ బాటలోనే ఈ అభినవ శ్రీశ్రీ ఎడ్గార్…

  • రాగులుని ఎదో ఒక రూపంలో తీసుకోమంటున్నారు వైద్యులు. ఈ చిన్ని గింజల్లో కాల్షియం ఐరెన్, ప్రోటీన్, ఇతర అనేక ఖనిజాలు లభిస్తాయి. కొవ్వు పదార్ధాలు వుండవు కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి మంచి ఆహారం. రాగుల లోని ఫాలి ఫెనాల్స్, ఫైబర్ డయాబెటీస్ ను నియంత్రణలో ఉంచుతాయి. పిచు జీర్ణ వ్యవస్థకు దోహద పడుతుంది. రాగుల్లో వుండే ఐరన్ రక్తహీనతను తగ్గించి హీమోగ్లోబిన్ పెంచుతుంది. ఐరన్ టాబ్లెట్స్ వాడేవాళ్ళు వాటికి బదులు రాగుల మొలకల వాల్ల సి-విటమిన్ కూడా శరీరానికి అందుతుంది.రాగుల్లో ప్రోటీన్లు పోషకాలు పుష్కలంగా వుంటాయి. ఈ రాగుల్ని జావలాగా కానీ దోసెల్లో కానీ ఏ రూపంలో తీసుకొన్నా ప్రయోజనకరమే!

    రాగులు ఎంతో మంచి ఆహారం

    రాగులుని ఎదో ఒక రూపంలో తీసుకోమంటున్నారు వైద్యులు. ఈ చిన్ని గింజల్లో కాల్షియం ఐరెన్, ప్రోటీన్, ఇతర అనేక ఖనిజాలు లభిస్తాయి. కొవ్వు పదార్ధాలు వుండవు కాబట్టి…

  • ఇప్పుడు అందరి ఇళ్ళల్లో వంట కాస్త తినటానికి విలుగానే వుంటుంది. యుట్యూబ్ ఓపెన్ చేస్తే అన్న కుకరీ ప్రోగ్రాంలే. చూసి చూసి అందరికి వంట వచ్చేసిందనుకుంటా. ఎలాగో ఇళ్ళల్లో వండుకుంటాం ఇక పిల్లల పుట్టిన రోజులు, పెళ్ళి రోజు, కొత్త సంవత్సరం లాంటి ప్రత్యేక దినాలోస్తే హాయిగా ఇంట్లోనే నిమిషాల్లో బేక్ చేసుకోండి అంటూ కేక్ మౌల్డ్స్ కూడా వచ్చాయి. అచ్చం బేకరీల్లో వివిధ రూపాల్లో పిల్లలకి ఇష్టమైన కేక్స్ ఉన్నట్లే. కేక్ మౌల్డ్స్ లో అల్యూమినియం నాన్స్టిక్ కేక్ ప్యాన్లు, సిలికాన్ అచ్చులు కూడా వచ్చాయి. ఈ అచ్చుల్లో నెయ్యి కానీ బేకింగ్ స్ప్రే కానీ పూసి కేక్ మిక్స్ ని ఇందులో పోసి ఓవెన్ లో బేక్ చేసి ప్లేట్లో వంచేస్తే చాలు మనం ఏ ఆకారంలో కేక్ మిక్స్ ని పోసామో, అలా కార్లు, సీతాకోకచిలుకలు, ఇళ్ళు అచ్చు గుద్దినట్టు ప్లేట్లో కనిపిస్తాయి. ఇక మనకి నచ్చేలా క్రీమ్ తో ఐసింగ్ చేస్తే చాలు. చక్కని కేక్ రెడీ........... ఏ ఫుడ్ కలర్ వాడకుండా శుభ్రంగా మన ఇంట్లోనే!!!!!!!!!!!

    అచ్చులోంచి కేకొస్తుంది

    ఇప్పుడు అందరి ఇళ్ళల్లో వంట కాస్త తినటానికి విలుగానే వుంటుంది. యుట్యూబ్ ఓపెన్ చేస్తే అన్న కుకరీ ప్రోగ్రాంలే. చూసి చూసి అందరికి వంట వచ్చేసిందనుకుంటా. ఎలాగో…

  • వెంటిలేటర్ ఆన్ మరాఠీ సినిమా కోసం ప్రియాంక చోప్రా స్వయంగా పాడిన బాబా సాంగ్ కు రెండు రోజుల్లో ఆరు లక్షల హిట్స్ వచ్చాయి. ఈ సినిమా నిర్మాత ప్రియాంకనే. అయితే ఆమె ఈ సినిమాలో నాటించ లేదు. పాట చాలా బాగుంది. 'నాన్న నీ మనసు లోని బాధను నేనెప్పుడు అర్ధం చేసుకో లేదు. నేనిలా జీవించాలి చెప్పు నేనెటు వైపు వెళ్ళాలి నాకేమి తెలియడం లేదు. నిన్నిలా అడుగుతుంది నీ ప్రియమైన కూతురు. నువ్వు నా జీవితానికి నిజమైన అర్ధం ఇచ్చావు నాన్న....... దయచేసి ఆగు........... వెళ్ళిపోకు. పాట ఇలా సాగుతుంది తండ్రి వెంటిలేటర్ మీద వున్నప్పుడు కూతురు పాట ఇది. 4 నిముషాల 12 సెకెండ్లు వున్న ఈ పాట నెట్లో ఎంతో మంది విని ఇష్టపడ్డారు.

    ప్రియాంక పాటకు ఆరు లక్షల హిట్లు

    వెంటిలేటర్ ఆన్ మరాఠీ సినిమా కోసం ప్రియాంక చోప్రా స్వయంగా పాడిన బాబా సాంగ్ కు రెండు రోజుల్లో ఆరు లక్షల హిట్స్ వచ్చాయి. ఈ సినిమా…

  • ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ కి ఇదీ అంటూ ప్రత్యేకమైన కారణం ఏదీ లేదు. హార్మోన్స్ మార్పులే ఇందుకు కారణం ఒక రకంగా పేర్కొనాలి. ప్రొజెస్టరాన్ , ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరగటం వల్ల యాంగ్జయిటీ మూడ్ స్వింగ్స్ చిరాకు వంటివి వస్తాయి. ఆహారంతో ఈ లక్షణాలని చాల మటుకు అదుపు చేయచ్చు. కాల్షియం ఎక్కువగా వుండే పెరుగు పాలు ఆకుకూరలు చీజ్ పి.ఎమ్ .ఎస్ లక్షణాలని తగ్గిస్తాయి. చక్కెరతో చేసిన పదార్ధాల కెఫైన్ లు తీసుకోకూడదు. రెడ్ మీట్ జంక్ ,గుడ్లు ,లివర్ ,డ్రై ఫ్రూట్స్ తాజా ఆకుకూరలు వంటి జంక్ ఐరన్ అధికంగా వుండే పదార్ధాలు తినాలి. కాల్షియం విటమిన్ డి, సప్లమెంట్స్ కూడా డాక్టర్ సలహాలైతే తీసుకోవచ్చు. స్ట్రెస్ , యంగ్జయిటీ నిద్ర సరిగా ఉండకపోవటం తలనొప్పి నీరసం మూడ్ స్ట్రింగ్స్ ఉండచ్చు. డాక్టర్ ప్రిస్కిప్షన్ రెండు తీసుకుని ఆహరం రెండు అవసరమే.

    పి.ఎం.ఎస్ కు చెక్

    ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ కి ఇదీ అంటూ ప్రత్యేకమైన కారణం ఏదీ లేదు. హార్మోన్స్ మార్పులే ఇందుకు కారణం ఒక రకంగా పేర్కొనాలి. ప్రొజెస్టరాన్ , ఈస్ట్రోజెన్…