• మిచిగాన్ యూనివర్సిటీ వాళ్ళు 1982 నుంచి 2015 వరకు గుండెకు, గుడ్డుకు వున్న సంబంధంగురించి పరిశోధన చేశారు. మూడు లక్షల ఎనిమిది వేల మందిని పరీక్షించారు. మొత్తానికి పరిశోధన సారాంశం ఏమిటంటే గుడ్డు తినడం గుండెకు మంచిదే అంటున్నారు పరిశోధకులు. అధిక క్వాలిటీ ప్రోటీన్లున్న గుడ్డు తినడం వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే సమస్య తగ్గుతుందంటున్నారు. ఒక గుడ్డులో ఆరు గ్రాముల ప్రోటీన్లుంటాయి. విటమిన్ A, D, E లతో పాటు యాంటి ఆక్సిడెంట్లు వుంటాయి. వీటిలోని ప్రోటీన్లు బ్లడ్ ప్రెషర్ ను తగ్గిస్తాయి. ముఖ్యంగా ఆడవాళ్ళు అవిశలు, గ్రీన్ టీ, గుడ్డు, పెరుగు, పాలు నిత్యం తీసుకోమంటున్నారు.

    గుండెకు మేలు చేసే గుడ్డు

    మిచిగాన్ యూనివర్సిటీ వాళ్ళు 1982 నుంచి 2015 వరకు గుండెకు, గుడ్డుకు వున్న సంబంధంగురించి పరిశోధన చేశారు. మూడు లక్షల ఎనిమిది వేల మందిని పరీక్షించారు. మొత్తానికి…

  • బిల్, హిల్లరీ క్లింటన్ ల కుమార్తె చెల్సియా రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారు. న్యూయార్క్ లోని 17వ నియోజకవర్గం నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికైన నిటా లోవీ రాజకీయాల నుంచి విరమించాలని భావించడంతో ఆ స్థానం భర్తీ చేయడానికి జరగనున్న ఎన్నికల్లో 36 సంవత్సరాల చెల్సియా పోటీ చేయనున్నారు. 79సంవత్సరాల లోవీ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్ధిగా 30 ఏళ్ల పాటు పనిచేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో చెల్సియా తన తల్లి హిల్లరీకి మద్దతుగా ప్రచారం చేశారు.

    పాలిటిక్స్ లోకి క్లింటన్ కుమార్తె

    బిల్, హిల్లరీ క్లింటన్ ల కుమార్తె చెల్సియా రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారు. న్యూయార్క్ లోని 17వ నియోజకవర్గం నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికైన నిటా లోవీ రాజకీయాల నుంచి…

  • రోజుకి 5 గ్రాముల ఉప్పుకు మించి తీసుకోవడం ఆరోగ్యరీత్యా ప్రమాదమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలు చెబుతున్నాయి. అయితే తాజాగా చేపట్టిన సర్వేలో దానికి రెట్టింపుగా ఒక్కొక్కరు 10 గ్రాములు తీసుకొంటున్నారని తేలింది. ఇలా ఉప్పు పైన నియంత్రణ లేకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. భారతీయ వంటకాల్లో ఎన్నో దినుసులు, పులుపులు, కారాలు ఎక్కువే. వండే కూరల్లో, పులుసుల్లో టమాటాలు, చింతపండు, ఉల్లిపాయలు వీటికి తోడుగా ఉప్పు వాడటం తప్పదు. నిపుణులు ఏం చెబుతున్నారంటే ఆహారం వండే సమయంలో ఉప్పు వేయకండి. సహజంగా అన్నీ ఉడికాక రుచి చూసుకొని కావలసినంత ఉప్పు జోడించమంటున్నారు. సహజంగా కూరగాయల్లో వుండే ఉప్పు సరిపోతుందంటారు. ఉడికించకుండా, ఆవిరిపైన ఉడకబెట్టి గ్రిల్లింగ్, మైక్రోవేవ్ చేయటం బెస్ట్ అంటారు. రోజుకి ఐదు గ్రాములకు మించి ఉప్పు వాడద్దని WHO హెచ్చరిస్తుంది.

    ఉప్పు వాడటం తగ్గిస్తే బెటర్

    రోజుకి 5 గ్రాముల ఉప్పుకు మించి తీసుకోవడం ఆరోగ్యరీత్యా ప్రమాదమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలు చెబుతున్నాయి. అయితే తాజాగా చేపట్టిన సర్వేలో దానికి రెట్టింపుగా ఒక్కొక్కరు…

  • గర్భిణీగా ఉన్నప్పుడు పిల్లలకు పాలిచ్చే సమయంలో చేపలు తినడం వల్ల పిల్లల్లో ఆహార సంబంధ అలర్జీలు, ఆస్థమా, ఎగ్జిమాలు ఎక్కువగా వుండవంటున్నారు పరిశోధకులు. పిల్లలు విషయంలో జరిగిన మరో పరిశోధనలో 11 నెలల వయసు లోపే ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా వుండే చేపలు, గుడ్లు తినిపించడం వల్ల అలర్జీలు నియంత్రించవచ్చని తేలింది. గర్భిణీగా ఉన్నప్పుడు పిల్లలకు పాలిచ్చే సమయంలోనూ స్త్రీలు చేపలు తింటే పిల్లలకు ఫ్యాటీ యాసిడ్ అందుతుందని పరిశోధకులు గుర్తించారు. పిల్లల ఆరోగ్యాన్నీ మెరుగు పరిచేందుకు గానూ పిల్లలకు పాలిస్తున్నంత కాలం తల్లులను చేపల్ని తినమనే సలహా ఇస్తున్నారు పరిశోధకులు.

    తల్లులు చేపలు తింటే పిల్లలకు మేలు

    గర్భిణీగా ఉన్నప్పుడు పిల్లలకు పాలిచ్చే సమయంలో చేపలు తినడం వల్ల పిల్లల్లో ఆహార సంబంధ అలర్జీలు, ఆస్థమా, ఎగ్జిమాలు ఎక్కువగా వుండవంటున్నారు పరిశోధకులు. పిల్లలు విషయంలో జరిగిన…

  • స్పా ట్రీట్ మెంట్ చాలా ఖరీదుగానే ఉంటాయి. ఎక్సోటిక్ ప్రోమో గ్రేనేడ్ ట్రీట్ మెంట్ తో దానిమ్మ రసం ,నిమ్మ రసం ,అల్లం , బ్రౌన్ షుగర్ తో సంప్రదాయ నూనెలతో మస్సాజ్ ఉంటుంది. అలాగే ప్రోమో గ్రేనేడ్ షుగర్ స్క్రబ్ అంటే దానిమ్మ గింజలు పంచదార తో చర్మం పైన మృతకణాలు తొలగించటం మురడ్ ప్రోమో గ్రేనేడ్ అంతే దానిమ్మ గింజలు మురాడ్ క్రీమ్ తో చేసే స్పా. ఇక మల్టీ విటమిన్ పేస్ ప్యాక్ అంటే పాల నుంచి తీసిన లాక్టిక్ యాసిడ్ ,దానిమ్మ రసం కలిపి పేస్ ప్యాక్ వేస్తారు. ఇక దానిమ్మతో పాలిష్ అంటే దానిమ్మ బొప్పాయి నూనెలు కలిపి చేసే మస్సాజ్. ఇన్నింటిలోను ఉన్నది మన రోజూ బోర్ కొడుతుందని గింజలు వేయరు వలుస్తారులే అని బద్దకించి దానిమ్మ పండు. ఇంత అందాన్నిచ్ఛే పండు రోజు కడుపులోకి పోతే ఇంకెంత అందం ఆలోచించండి. ఇంత చిన్న దానిమ్మ గింజల్లో ఎంత శక్తి వుందో.

    సౌందర్య ఫలమిది

    స్పా ట్రీట్ మెంట్ చాలా  ఖరీదుగానే ఉంటాయి. ఎక్సోటిక్ ప్రోమో గ్రేనేడ్ ట్రీట్ మెంట్ తో దానిమ్మ రసం ,నిమ్మ రసం ,అల్లం , బ్రౌన్ షుగర్ …

  • సెలబ్రెటీటీలు ఖరీదైన దుస్తులతో కార్లలో తిరుగుతూ అద్భుతమైన నగలతో కళ్ళు చెదిరేలా కనిపిస్తారు. కానీ ఇబ్బందులు కష్టాలు కూడా ఎక్కువే. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో చేదు అనుభవాలు అనేకం శృతి హాసన్ అనుభవం కూడా ఇదే. కర్ణాటక కు చెందిన ఒక డాక్టర్ అదేపనిగా ట్విట్టర్ లో శృతి ఎంతో ఘోరమైన మాటలతో అవమానించటం తో ఆమె ఎంతో ఆవేదన పడిందట. కానీ డాక్టర్ కాస్త నిన్ను చంపేస్తాన్నంత దూరం వచ్చాక ఇక ఆమెకు పోలీసులను ఆశ్రయించక తప్పలేదు. చెన్నయ్ సైబర్ క్రైమ్ కు శృతి తరఫున వ్యక్తులు వచ్చి ఆ డాక్టర్ వేధిస్తున్న ఆధారాలు చూపెట్టి అతని మెయిల్ ఐడి ఫోన్ నంబర్ పోలీసులకు ఇచ్చారట. శృతి హాసన్ ఇచ్చిన పిర్యాదు తో పోలీసులు డాక్టరు గురించి విచారించే పనిలో వున్నారు. ఎవరి పనివాళ్లని చేసుకోనిస్తే ప్రాబ్లమే ఉండదు.

    శృతికి ట్విట్టర్ బెదిరింపులు

    సెలబ్రెటీటీలు ఖరీదైన దుస్తులతో కార్లలో తిరుగుతూ అద్భుతమైన నగలతో కళ్ళు చెదిరేలా కనిపిస్తారు. కానీ ఇబ్బందులు కష్టాలు కూడా ఎక్కువే. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో చేదు అనుభవాలు…

  • టమాటో అండ్ కో కేరాఫ్ కృత్తికా పర్వాల్. ఈ కేరాఫ్ అనిపించుకోవటం వెనకొకరుంది. రాజస్థాన్ రాజధాని జైపూర్ లో పుట్టి పెరిగిన కృతిక అమెరికా లో ఎంబీఏ చేస్తూ సెమిస్టర్ లో భాగంగా కాగితంలో కాయగూరల విత్తనాలు ఇమిచ్చి ఆ పేపర్ వాడేశాక దాన్ని నేలలో నాటితే అందులోంచి విత్తనాలు మొలకెత్తించేలా చేస్తే ఆడో మంచి వ్యాపారం అవుతుంది కాయితం వేస్ట్ కాకుండా వుంటుందీ అనుకొందిట. ఈ ఐడియా కి ప్రొఫసర్స్ అభినందనలు తెలిపారు. ఇండియాకి తిరిగివచ్చి ఈ పేపర్ విత్తనాల ఐడియా ను మార్కెట్ చేస్తే కిసాన్ సంస్థ వాళ్ళు తోలి ఆర్డర్ ఇచ్చారు. కెచప్ లో వాడే టమాటో విత్తనాలతో పేపర్ తయారు చేసి ప్రచారం కోసం పంచితతే బ్రహ్మాండమైన స్పందన ప్లస్ పబ్లిసిటీ వచ్చాయి. ఇదిగో ఇలా మొదలైంది టమాటో అండ్ కో. ఇప్పుడిదో పెద్ద బిజినెస్. ఎన్నో సంస్థల ఆర్దార్లున్నాయి కృతిక పర్వాల్ కు.

    మొలకెత్తే కాయితాలు

    టమాటో అండ్ కో కేరాఫ్ కృత్తికా పర్వాల్. ఈ కేరాఫ్ అనిపించుకోవటం వెనకొకరుంది. రాజస్థాన్ రాజధాని జైపూర్ లో పుట్టి పెరిగిన కృతిక అమెరికా లో ఎంబీఏ…

  • ఇల్లులాగే ఆఫీస్ కూడా మనల్ని ఎంతో ఆనందపెడుతోంది. ఆఫీస్ బయటి ప్రపంచంలో మన ఉనికి. మనం చేసే పనికి ఒక విలువ. ఒక మంచి జీవిత విధానం. మరి ఇలాంటి ఆఫీస్ పనిని చైతన్యవంతంగా మొదలు పెట్టమంటున్నారు ఎక్సపర్ట్స్. ఆఫీస్ కు రాగానే మొట్టమొదట సవాల్ గా వుండే పనినే మొదలుపెట్టాలి. ఉదయాన్నే పనిచేయగలిగే శక్తి సామర్ధ్యాలు ఏకాగ్రత ఎక్కువగా ఉంటాయి. కష్టమైనా పనిని వ్యక్తిచేస్తే తర్వాత తేలికైన పనులకు మిగిలిన సామర్ధ్యం వినియోగం అవుతుంది. ముందుగా ఆఫీస్ లో అడుగుపెట్టగానే తోటి ఉద్యోగులను నవ్వుతూ పలకరించడం అలవాటుగా ఉంచుకోవాలి. ఆపలకరింపు అందరిమధ్య ఒక సద్భావన ను తీసుకొస్తుంది. ఎప్పుడూ ఆలస్యంగా రాకూడదు. ఇది చిన్న విషయం కాదు. ముందు మనకే మనసులో ఒక గిల్టీ ఫీలింగ్ మొదలై మన సామర్ధాన్ని దెబ్బ తీయటం కాకుండా మానసిక వత్తిడి పెంచుతోంది. ఆఫీసంటే మన కెరీర్ మన భవిష్యత్తు.

    ఆఫీస్ అంటే మన కెరీర్ మన భవిష్యత్తు

    ఇల్లులాగే ఆఫీస్ కూడా మనల్ని ఎంతో ఆనందపెడుతోంది. ఆఫీస్ బయటి ప్రపంచంలో మన ఉనికి. మనం చేసే పనికి ఒక విలువ. ఒక మంచి జీవిత విధానం.…

  • కలలు కనండి కానీ నిజం చేసుకునే కలలే కనండి అన్నారు కలాం. కానీ డాక్టర్లు ఇప్పుడు పగటి కలలు కనండి పర్లేదు అంటున్నారు. జీవితంలో ఎన్నో వత్తిడి సందర్భలోస్తాయి. మనసు గందరగోళంగా ఉంటుంది. మానసిక వత్తడి అనేకానేక సమస్యలకు మూలం. సరిగ్గా ఇందుకే ఆ వత్తడిని అధిగమించేందుకు చక్కగా పగటికలలు కనండి. ఓ పెద్ద ఇల్లు కొన్నామనో ఆడి కార్లో ప్రయాణం చేస్తూ అమెరికా వెళ్లే ప్లైట్ పట్టుకోబోతున్నామనో ఏకంగా ట్రంప్ పర్సనల్ సెక్రటరీగా జాబ్ వచ్చిందినో ఎదో ఒకటి మనసుకు స్వాంతన ఇచ్చే కల. అబద్దమైన మన మనసులో చింతను దూరం చేసే కల కనమంటున్నారు. ఈ ఊహలు నిజంగా మనల్ని ఒక తీవ్రమైన బాధ నుంచి విముక్తులను చేస్తే అదే అబద్దపు కల యూయూహ అయితేనేం ఊహా శక్తి వుండాలే కానీ ఎన్నెన్ని పగటి కలలు రావు....... ఏమంటారు?

    పగటి కలలు కంటే మంచిదే

    కలలు  కనండి కానీ  నిజం చేసుకునే కలలే కనండి అన్నారు కలాం. కానీ డాక్టర్లు ఇప్పుడు పగటి కలలు  కనండి పర్లేదు అంటున్నారు. జీవితంలో ఎన్నో వత్తిడి…

  • రత్నాల సబ్బులు వాడేరా ? వీటినే జెమ్ స్టోన్ రాక్ సోప్స్ లేదా రాక్ సోప్స్ అంటారు. ఇవి అచ్ఛంగా ఎదో ఒక రత్నం లాగానో రాయి లాగానో ఉంటాయి. సాధారణ సబ్బులకన్నా గాఢత తక్కువగా ఉంది నురగ కూడా తక్కువగా ఉంటుంది. ఈ రకం సబ్బులను మట్టి సారంతో పాటు కలబంద క్యామోమైల్ ,లావెండర్ విటమిన్ ఇ ,బాదాం నూనె ,జొజోబా నూనె వనమూలికల సారం కొన్ని రకాల పరిమళాలు కలిపి చేస్తారు. ఈ రాక్ సోప్స్ వజ్రాలు మొదలుకుని పుష్పరాగం ,గోమేధికం ,పగడం ,పచ్చ, కెంపు,నీలం లాంటి సాంప్రదాయ రత్నాలు టర్కోయిస్ క్వాటీ ఐ లాంటి ఫ్యాషన్ బుల్ ఉపరత్నాల దాకా అన్ని రకాల రాళ్లుగా కనిపించేలా వీటిని తయారు చేస్తారు. సాండ్ స్టోన్ మార్బుల్ లాంటి ఇతర తరహా రాళ్ళూ లాంటి సోంపులూ ,గ్లిజరిన్ లో తయారై వివిధ రంగుల్లో పారదర్శకంగా వుండే ఇవి నీటిలో తడిసినప్పుడు మెరుస్తూ చూసేందుకు చాలా బావుంటాయి.సాధారణ సబ్బుల్లా ఒక ప్రత్యేకమైన ఆకారంలో కాకుండా అచ్ఛం వజ్రాలు రాళ్లను కత్తి రించినట్లే ఉంటాయి. మంచి సువాసన వచ్చే ఈ సోప్స్ ఖరీదు పెద్ద ఆకాశం అంటేలా ఏం లేవు. ఇష్టమైతే మనం కూడా ఆన్ లైన్లో ఆర్డరిచ్చి తెపించుకోవచ్చు.

    రాళ్ళూ రత్నాలు వజ్రాల సబ్బులు

    రత్నాల సబ్బులు వాడేరా ? వీటినే జెమ్ స్టోన్ రాక్ సోప్స్  లేదా రాక్ సోప్స్  అంటారు. ఇవి అచ్ఛంగా ఎదో ఒక రత్నం లాగానో రాయి…