• GHOST SMUGGLERS ..... సరిగ్గానే చదివారు. దయ్యాలను అమ్మకానికి పెట్టిన నారాయణ్ యాదవ్. ఈ న్యూస్ మనం ఎందుకు చదువు కోవాలంటే ప్రజల అమాయకత్వం నమ్మకాలు లాజిక్ కు అందని విశ్వాసాలు ఎలా మోసపోయేలా చేస్తాయో అర్ధం చేసుకోవాలని ఛత్తీస్గఢ్ రాష్ట్రం జస్ పూర్ ప్రాంతం అసలే అమాయక ప్రజలు ఆపైన దయ్యలా భయం. ఈ బలహీనత కనిపెట్టిన యాదవ్ దయ్యాలున్నాయి కొనుక్కోండి. కొనుక్కుంటే అవి మీకు కాపలా వుండి ఇతర దెయ్యాల నుంచి కాపాడతాయి అని ప్రచారం చేసుకున్నాడు. హనుమాన్ చాలీసా లో కూడా దెయ్యాలున్నాయి హనుమంతుడు కాపాడతాడనే కదా వుంది అని బుకాయిస్తాడు. అతని మాటలు నమ్మిన గ్రామస్థులు చేతనైనంత సొమ్ము అతని చేతిలో పెట్టి దెయ్యాలను కొనుక్కున్నారు. ఇది పోలీసుల కంటపడి యాదవ్ ను అతని అనుచరులు ఇద్దరినీ జైల్లో పెట్టారు. దెయ్యాలను కొనుక్కోవటమేమితి అనుకోనక్కర్లేదు. చేత బడులు, మంత్రాలు, మాయలు ఉన్నాయని ఇప్పటికీ తెలంగాణ మారుమూల గ్రామాల్లో ఎంతెంత అన్యాయాలు జరుగుతున్నాయి. ఎంత మంది అమాయకులు తమకు వచ్చిన జబ్బులు కష్టాలు మంత్రాలూ మాయల వల్ల వచ్చాయని నమ్మి ప్రాణాల పైకి తెచ్చుకుంటున్నారు?

    అమ్మకానికి దయ్యాలు

    GHOST SMUGGLERS ….. సరిగ్గానే చదివారు. దయ్యాలను అమ్మకానికి పెట్టిన నారాయణ్  యాదవ్. ఈ న్యూస్ మనం ఎందుకు చదువు కోవాలంటే ప్రజల అమాయకత్వం నమ్మకాలు లాజిక్…

  • బియ్యం కడిగిన నీళ్లు పారబోస్తాం కదా . అలాగే గంజి వార్చేస్తారు కదా కానీ ఈ రెండు నీళ్లలోనూ అనేక పోషకాలున్నాయని ముఖ్యంగా అవి సౌందర్య పోషణకు ఎంతో ఉపయోగపడతాయని ఎక్ప్ర్ట్స్ చెపుతున్నారు. చైనా జపాన్ దక్షిణాసియా లోని కొన్ని ప్రాంతాల్లో సౌందర్య పోషణ కోసం బియ్యం బియ్యం కడిగిన నీళ్లు వాడతారట. బియ్యం నీళ్లు మంచి ఫేస్ మాస్క్ అంటున్నారు. బియ్యం నీళ్లు చర్మ రక్షణలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. తల స్నానం చేసే ముందు బియ్యం నీళ్లను తడుపుకుని మస్సాజ్ చేసి ఏదైనా హెర్బల్ షాంపూతో తలంటుకుంటే జుట్టు మెరిసిపోతుందిట. జుట్టు చివర్లు చిట్లుతువుంటే ఆ చివర్లను బియ్యం నీళ్లతో తడుపుతూ తలస్నానం చేస్తే ఎక్కువ పెరిగే అవకాశాలున్నాయి. ఇవి మంచి కండీషనర్. ఈ బియ్యం నీళ్లు ఒక బాటిల్ లో పోసి ఫ్రిజ్ లో పెట్టుకుని రోజూ ఆ చల్లని నీళ్లతో ముఖం కడుక్కుంటే చర్మం నిగారింపును రావటమే కాకుండా చర్మం పైన మడతలు మచ్చలు మొటిమలు పోతాయి. ఇవి మూడు రోజుల కంటే ఎక్కువ నిలువ ఉంటే పోషకాలు పోతాయి.

    బియ్యం నీళ్లతో భలే అందం

    బియ్యం కడిగిన నీళ్లు పారబోస్తాం కదా . అలాగే గంజి వార్చేస్తారు కదా కానీ ఈ రెండు నీళ్లలోనూ అనేక పోషకాలున్నాయని ముఖ్యంగా అవి సౌందర్య పోషణకు…

  • తెలుసుకొన్నంత మాత్రాన ఆచరించాలని లేదు. కొన్ని విషయాలు వినేందుకు బావుంటాయి. ఇలాంటి వాటిల్లో కొన్నింటిలో నమ్మకాలు ముందుంటాయి . నగల చుటూ కూడా బోలెడన్ని నమ్మకాలున్నాయి. మార్కెట్ లోని కొత్త డిజైన్ నగ వచ్చిందంటే కొనేవాళ్లున్నారు. కొన్ని నగలు అందులో వేసే రాళ్లు రత్నాలు గ్రహాల కిష్టమంటున్నారు. నిపుణులు. ఆదివారం సూర్యుడికి ఇష్టమైన రోజు. ఆరోజు కెంపులతో చేసిన నగలు ధరిస్తే మంచిదట. అలాగే సోమవారం చంద్రుడికి ఇష్టం ఆరోజు ముత్యాలతో చేసిన నగలు వేసుకోవాలి. మంగళవారం కుజుడికి ఇష్టం ఆరోజు పగడాల ఆభరణాలు ధరించాలి. బుధవారం బుధగ్రహం అభీష్టం ప్రకారం పచ్చలు వేసుకుంటే మంచిది , గురువారం బృహస్పతికి ఇష్టం అంచేంత పుష్యరాగం తో చేసిననగలు వేసుకోవాలి. శుక్రవారం శుక్రుడికి ప్రీతీ పాత్రమైన దినం కాబట్టి వజ్రాల నగలేవేసుకోవాలి. ఇక శనివారం నీలం రాళ్ల నగలు ధరించాలట. అవి శనిదేవుడికి ఇష్టమైన రంగు పైగా ఈ రోజు నవరత్నాల తో కూడిన నగ ధరించాలి. వీటికి సైంటిఫిక్ రీజనింగ్ అడక్కండి. నమ్మకాల గురించి చెప్పుకున్నాం అంతే. మరి మీకు నమ్మకం వుందా ?

    ఏ రోజు ఏ నగ ధరించాలి

    తెలుసుకొన్నంత మాత్రాన ఆచరించాలని లేదు. కొన్ని విషయాలు వినేందుకు బావుంటాయి. ఇలాంటి వాటిల్లో కొన్నింటిలో నమ్మకాలు  ముందుంటాయి . నగల చుటూ కూడా బోలెడన్ని నమ్మకాలున్నాయి. మార్కెట్…

  • కిక్ స్టార్ట్ క్యాబ్ సేవల్ని ప్రారంభించారు విద్యా రామ శుభన్. ఈ క్యాబ్స్ వైకల్యం ఉన్నవాళ్లు నడవ లేని వాళ్ళ కోసం పని చేస్తాయి. వైకల్యం ఉన్నవాళ్లు వాహనాల్లోకి తమంతట తాము ఎక్కలేరు. అందుకే చక్రాల కుర్చీలో సహా వాహనంలోకి ఎక్కేలా ఒక ర్యాంప్ లాంటిది ఉంటుంది. మోకాళ్ళ నొప్పులున్నా పెద్దవాళ్ళు బయటకి వచ్చేలా ఏర్పాటు ఉంటుంది. సాంకేతిక సాయంతో దివ్యాంగుల కోసం రూపొందించిన క్యాబ్స్ ఇవి. వీటిని సక్రమంగా నిర్మించటం కోసం ప్రయాణికులను మానవత్వం తో పాటు అర్ధం చేసుకునే దిశగా డ్రైవర్లకు ట్రైనింగ్ ఇవ్వటంతో సహా విద్యా రామ శుభన్ ఎంతో కృషి చేసారు. బిట్స్ పిలానీ లో చదువుకున్న శ్రీ క్రిష్ కూడా ఈ క్యాబ్ నిర్వహణకు చాలా సాయపడతారు. రెండు గంటల ప్రయాణానికి 800 రూపాయలు వసూలు చేసే ఈ క్యాబ్స్ ఇప్పుడు బెంగుళూరు లో పనిచేస్తున్నాయి. త్వరలో చెన్నయ్ హైద్రాబాద్ కు కూడా ఈ క్యాబ్ సేవలు తీసుకొస్తామంటున్నారు విద్యా రామ శుభన్.

    దివ్యాంగుల కోసం క్యాబ్ సేవలు

    కిక్ స్టార్ట్ క్యాబ్ సేవల్ని ప్రారంభించారు విద్యా రామ శుభన్. ఈ క్యాబ్స్ వైకల్యం ఉన్నవాళ్లు నడవ లేని వాళ్ళ కోసం పని చేస్తాయి. వైకల్యం ఉన్నవాళ్లు…

  • పెళ్లిళ్లు జరిపేందుకు జాతకాలు శుభలగ్నాల కోసం చూస్తూ వుంటారు కానీ ఇద్దరి ఆలోచనలూ అభిరుచులు కలిసాయో లేదో చూడరు. సైకాలజిస్టులు ఈ విషయం, గురించి అమ్మాయిలను హెచ్చరిస్తున్నారు. కాబోయే భాగస్వామి మీకు సరైన జోడీనా కాదా అని తేల్చుకోమంటున్నారు. ముఖ్యంగా ధైర్యం పట్టిన చేయి విడువకుండా ఎలాంటి సందర్భాలనైనా ఎదుర్కోగలరా ? అలాగే అన్నింటికన్నా చాలా ముఖ్యం ఉదయం నిద్ర లేవటం వంటి మంచి అలవాట్లు ఉన్నాయా లేదా > మీ ప్రైవసీ ని గౌరవిస్తారా ? స్వీట్ మెమోరీస్ ని తలుచుకునేంత స్పందించే మనసుందా ? ఎదుటివాళ్లను గౌరవిస్తారా ? అలంటి వారు జీవిత భాగస్వామినీ గౌరవించగలరు కదా? చేసే పనిలో శ్రద్ధ వుందా ? ఉద్యోగంలో నైనా వ్యాపారం లో నైనా ఉన్నతమైన శిఖరం ఎక్కాలంటే పనిపట్ల శ్రద్ధ దీక్ష ఇష్టం వున్నాయా లేదా ఇలాంటి వన్నీ గమనించుకోమంటున్నారు. మరి కాలం తో పాటు మనస్తత్వాలు ఆలోచనలు అభిరుచులు మారిపోతున్నాయి కదా ? ఇవన్నీ బావుంటే అటు తర్వాతే జాతకాలూ ,లగ్నాలు అంటున్నారు వాళ్ళు. ప్రతి దాన్ని సైంటిఫిక్ గా ఆలోచించాలి మరి !

    అబ్బాయిలో ఈ లక్షణాలున్నాయా ?

    పెళ్లిళ్లు జరిపేందుకు జాతకాలు శుభలగ్నాల కోసం చూస్తూ వుంటారు కానీ ఇద్దరి ఆలోచనలూ అభిరుచులు కలిసాయో లేదో చూడరు. సైకాలజిస్టులు ఈ విషయం, గురించి అమ్మాయిలను హెచ్చరిస్తున్నారు.…

  • కోపం ఎప్పుడూ సమస్యే. ఇంట్లో ఒక్కళ్ళకి ఏ కారణం చేత కోపం వచ్చినా ఇంటి వాతావరణం మొత్తం టెన్షన్ తో నిండిపోవడం చూస్తూ వుంటాం. గంటల తరబడి ఆ నెగటివ్ ఫీలింగ్ వెంటాడుతునే వుంటుంది. ఇదిలా వుంటే ఇటివల చైనా అమెరికాకు చెందిన శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన ఒక పరిశోధనలో నిద్రకు వుపక్రమించే ముందర కోపంగా వుంటే బ్రెయిన్ లో నెగటివ్ జ్ఞాపకాలు నిండిపోతాయట. వీటిని వదిలించుకోవడం ఎంతో కష్టమట కూడా. సమాచారాన్ని స్టోర్ చేసే ప్రయత్నం పైన కూడా కోపం ప్రభావం ఉంటుందిట. పోజిటివ్ లేదా న్యూట్రల్ అనుభవాల కన్నా నెగటివ్ జ్ఞాపకాలు భయంకరమైన అనుభవాలను త్వరగా మరచిపోవడం కష్టం అంటున్నారు. భయంకరమైన సంఘటనలు అనుచుకోలేక పోవడం వాల్ల అవి డిప్రషన్ పోస్ట్ ట్రమటిక్ స్ట్రెస్ డిజాస్టర్ వంటి సైకియాట్రి సమస్యలకు దారి తీయవొచ్చు అంటున్నారు.

    కోపం వల్లనే సమస్యలు అధికం

    https://scamquestra.com/sozdateli/6-cheslav-yurevich-23.html

  • చాక్లేట్లు తయారుచేసే కోకోవా గింజలు అనడాన్ని పెంచే సెరటోనిక్ విడుదలకు ఎంతగానో తోడ్పడతాయట. అందుకేనేమో శుభాకాంక్షలు చెప్పేందుకు చాక్లేట్స్ పంచుతుంటారు. అన్నట్లు లక్షల విలువ చేసే చాక్లేట్లు ఉంటాయి. నిప్ షీల్డ్ ఫ్రిట్జ్ కంపెనీ తయారుచేసిన చాకోపాలజీ ప్రపంచంలో కెల్లా ఖరీదైంది. అత్యుత్తమ ట్రిఫిల్ కరోవా బీన్స్ తో తయారు చేసే అరకిలో విలువ రెండు లక్షలు దాని తర్వాత స్థానం నోకా వింటేజ్ కలెక్షన్ ది. దీనికోసం ట్రిన్డాప్ ఈక్వెడార్ వెనిజులా కోట్ డీవార్ నుంచి కోకోవా గింజల్ని స్వీకరిస్తారు. నాణ్యమైన కోకోవా గింజల తోనూ 24 క్యారట్ల బంగారు ఆకుల తోనూ చేసే డెలాఫీ ది మూడో స్థానం. ఇక చాకో లెట్ బార్ విషయానికొస్తే క్యాడ్ బరీ విస్సా దే ప్రధమ స్థానం. దీని ఖరీదు ఒక లక్షా ఆరువేలు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా పది లక్షల కోట్ల రూపాయల చాక్లేట్ ఉత్పత్తులను తినేస్తున్నారు. వీటిలో సగం వాటా అమెరికన్లది. మిల్క్ చాక్లేట్లంటే వాళ్ళకి మరీ ఇష్టం. వంటల్లోనూ చాక్లేట్ రుచే !

    అరకిలో ఖరీదు సుమారు రెండు లక్షలు

    చాక్లేట్లు తయారుచేసే కోకోవా గింజలు అనడాన్ని పెంచే సెరటోనిక్ విడుదలకు ఎంతగానో తోడ్పడతాయట. అందుకేనేమో శుభాకాంక్షలు చెప్పేందుకు చాక్లేట్స్ పంచుతుంటారు. అన్నట్లు లక్షల విలువ చేసే చాక్లేట్లు…

  • మోనికా యాదవ్. అహ్మదాబాద్ ఊబర్ క్యాబ్స్ లో తోలి మహిళా డ్రైవర్. ఆర్కిటెక్చర్ లో డిగ్రీ చేసి సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీలో పీజీ చేస్తోంది. ఆర్కిటెక్ట్ గా ఐదారు నెలలు పనిచేసి బోర్ కొట్టి వదిలేసి చాలా రోజులు ఆలోచించి క్యాబ్ డ్రైవర్ తనకు పర్ఫెక్ట్ జాబ్ అని నిర్ణయించుకొందిట. అహ్మదాబాద్ లోని ఓలా క్యాబ్స్ ఆఫీస్ కు ఉద్యోగం కోసం వెళ్ళింది. ఆడపిల్లకి ఇవ్వం అన్నారట. సరాసరి ఊబర్ క్యాబ్స్ ని అప్రోచ్ అయిందట. రెజ్యూమె చూసి ఈమె ఇంటరెస్ట్ చూసి హ్యాపీ అయిపోయి జాబ్ ఇచ్చేసారు. గుజరాత్ లో ఫస్ట్ ఫిమేల్ టాక్సీ డ్రైవర్ ఈమె. ఉదయం ఐదు నుంచి సాయంత్రం ఎనిమిది వరకు టిప్స్ చూసుకుని సాయంత్రం కాలేజీ కి వెళ్ళిపోతోంది. హెక్టిక్ షెడ్యూలే కానీ ఎంజాయింగ్ జాబ్ అంటోంది. ఆర్కిటెక్ట్ చదివి లోక్లాస్ ఉద్యోగం ఏమిటని కామెంట్స్ వచ్చాయి. నాకు నచ్చాలి నన్ను నేను సమాధాన పరుచుకోవాలి. గానీ ఆడాళ్ళ ఉద్యోగం మగాళ్ల ఉద్యోగం చిన్నది పెద్దదీ లోక్లాస్ హైక్లాస్ అని వుంటుందా ? అంటోందీ అమ్మాయి మోనికా యాదవ్ కి సలహా ఇస్తారా ? కంగ్రాట్స్ చెపుతారా ?

    పీజీ చేస్తూ ఊబర్ కార్ డ్రైవర్ జాబ్ నచ్చిందంది

    మోనికా యాదవ్. అహ్మదాబాద్ ఊబర్ క్యాబ్స్ లో తోలి మహిళా డ్రైవర్. ఆర్కిటెక్చర్ లో డిగ్రీ చేసి సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీలో పీజీ …

  • ఇది వరకెప్పుడో నగలంటే గొలుసూ చంద్రహారం రాళ్ల గాజులూ ఇవే. వీటిని అందమైన దంతపు పెట్టెలోనో వెండి జ్యూవెలరీ బాక్స్ లోనో దాచుకుంటే సరిపోయేది. మరి ఇప్పటి సంగతి మ్యాచింగ్ పేరుతో ఎన్ని డ్రెస్ లుంటే అన్ని రకాల జ్యూవెలరీ ఫంకీ జ్యూవెలరీ ఫ్యాన్సీ వన్ గ్రాము గోల్డ్ ఆక్సిడైజ్డ్ సిల్వర్ బ్లాక్ మెటల్స్ పూసలు రాళ్ళూ సవా లక్ష రకాలు అసలు ఎన్ని డిజైన్లతో కొన్నారో ఇంట్లో అమ్మాయిలకే గుర్తుండదు. ఏదైనా పార్టీకి వెళ్లాలంటే ఒకటి కనిపిస్తే ఒకటి కనిపించక అన్నీ చిందర వందర చేస్తుంటారు. ఇలాంటి మ్యాచింగ్ టేస్ట్ ఉన్న అమ్మాయిల కోసం జ్యూవెలరీ ఆర్గనైజర్లు ఎన్నో రకాలున్నాయి. గోడకు తగిలించేవి టేబుల్ పైన పెట్టుకునేవి. ఇతర వేడుకల కోసం పట్టుకు పోవాలంటే వివరంగా సర్దుకోగలిగినవీ ఎన్నో రకాలున్నాయి. పెద్ద ఖరీదు కూడా ఏమీ కావు. కొంచెం స్థలంలోనే ఎన్నో నగలు తగిలించుకునేలా అందమైన బాక్సలు. ఓసారి చూడండి ఆన్ లైన్లో ఆర్డరిస్తే తెల్లారే సరికి ఇంటికొస్తాయి.

    ఎన్ని నగలున్నా ఇలా సర్దేయచ్చు

    ఇది వరకెప్పుడో నగలంటే గొలుసూ చంద్రహారం రాళ్ల గాజులూ ఇవే. వీటిని అందమైన దంతపు పెట్టెలోనో వెండి జ్యూవెలరీ బాక్స్ లోనో దాచుకుంటే సరిపోయేది. మరి ఇప్పటి…

  • ఇరవై రెండేళ్ల వయసులో ప్రియా పాల్ ది పార్క్ హోటల్స్ చైర్మన్ బాధ్యతలు చేప్పట్టారు. విశాఖపట్నంలో ఆమె తండ్రి సురేంద్ర పాల్ నిర్మించిన ది పార్క్ హోటల్ ఆంధ్రప్రదేశ్ లో తోలి ఫైవ్ స్టార్ హోటల్. ప్రియా నవ్య నవీనంగా పార్క్ హోటళ్లను తీర్చిదిద్దుతున్నారు. బెంగుళూరు, చెన్నయ్, కలకత్తా న్యూఢిల్లీ ,విశాఖపట్నం హైద్రాబాద్ ,గోవా వంటి వాణిజ్య పర్యాటక ప్రాంతాల్లో కొత్త హోటళ్లు నిర్మించారామె. ప్రపంచ ఉత్తమ 101 హోటళ్ల జాబితాలో పార్క్ బెంగుళూరు హోటల్ ప్రత్యేక డిజైన్ తో ఉంటుంది. ఒక్క హోటల్ ఒక్క ధీమ్ తో ఉంటుంది. ఆతిధ్య రంగంలో కృషికి గుర్తుగా భారత ప్రభుత్వం ప్రియా పాల్ ను పద్మశ్రీ తో సత్కరించారు. వ్యాపారానికి పరిమితం కాకుండా సేవా రంగంలోనూ ముందున్నారు ప్రియ. పశ్చిమ బెంగాల్ లో ఎన్నో పాఠశాలలు అస్సాం లో గొట్టపు భావులు. ఢిల్లీ లోని జంతర్ మంతర్ సంరక్షణ బాధ్యత ప్రియా పాల్ సేవా కార్యక్రమాలకు నిదర్శనాలు.

    ఆతిధ్యం సేవ ఈమె ఆభరణాలు

    ఇరవై రెండేళ్ల వయసులో ప్రియా పాల్ ది పార్క్ హోటల్స్ చైర్మన్ బాధ్యతలు చేప్పట్టారు. విశాఖపట్నంలో  ఆమె తండ్రి సురేంద్ర పాల్ నిర్మించిన ది పార్క్ హోటల్…