• జీవితంలో మన పాత్ర ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. ఆఫీస్ లో ఇంట్లో పార్టీల్లో పెళ్లిళ్లలో మొత్తం లుక్ మార్చేసేలా ఉంటాం. ఒక బరువైన మెరిసే పట్టుచీర కట్టుకుని ఆఫీస్ కు వెళ్ళం కదా. అలాంటప్పుడు సమావేశాల పార్టీలు సర్కసులు ఏదైనా సందర్భంలో కొన్నిసార్లు సూట్ వేసుకోవాల్సి వస్తుంది. లేదా ఏ సాయంత్రం పార్టీకో అందమైన చీరలో వెళ్ళాలి. మోడ్రన్ డ్రెస్ లు వేసుకోవాలి.ఏ డ్రెస్ లో ఎలా ఉంటామో తెలుసుకునే మార్గం వుంది. ఉమెన్స్ ఫోటో షూట్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో కనపడుతున్న ప్రతి డ్రెస్ లో మన మొహం విజువల్ గా కనపడేలా చేయచ్చు. అప్పుడిక ఏ డ్రెస్ లో ఏ రంగులో ఏ కాంబినేషన్ లో ఎలా ఉంటామో తెలిసిపోతుంది. వుమెన్ శారీ ఫోటో షూట్ యాప్ లో వెరైటీ శారీస్ అన్నీ ఉంటాయి. మనకే చీరనప్పుతుందో చూసుకుని ఆర్డర్ ఇవ్వచ్చు. సల్వార్ సూట్ యాప్ విజువల్ గా ఎటాచ్ చేసి చూసుకోవచ్చు. ఆన్ లైన్లో ఆర్దారివ్వాలనుకుంటే ఇలా చేస్తే బెటర్.

    మనమెలా ఉన్నామో చూసుకుని మరీ …..

    జీవితంలో మన పాత్ర ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. ఆఫీస్ లో ఇంట్లో పార్టీల్లో పెళ్లిళ్లలో మొత్తం లుక్ మార్చేసేలా ఉంటాం. ఒక బరువైన మెరిసే పట్టుచీర…

  • బట్టలు చెప్పులు లాంటివి అమ్మే షోరూం లలో తమ దగ్గరుండే అన్నిరకాల వస్తువులు షోకేస్ లో ప్రదర్శనకు పెడుతూవుంటారు. వినియోగదారులను ఆకర్షించేందుకు ఇప్పటికీ అదే పద్దతి. మనవాళ్ళు కూడా విండో షాపింగ్ చేస్తూ వుంటారు . అలాగే హోటల్లో దొరికే అన్ని రకాల పదార్ధాలను ప్రదర్శనకు పెడితే బావుంటుందననుకున్నాడు జపాన్ కు చెందిన రెస్టారెంట్ యజమాని. రంగులద్దిన మైనంతో ఎన్నో రకాల ఆహార పదార్ధాలను నోరూరించేలా దృష్టిని ఆకర్షించేలా తయారుచేయించాడు. అప్పటినుంచి రెస్టారెంట్ లో పదార్ధాల ప్రదర్శన మొదలైంది . ప్లాస్టిక్ తో రకరకాల ఆహార పదార్ధాల నమూనాలు తయారుచేసే కంపెనీలు వెలిసాయి. ఇప్పుడది కోట్ల విలువ చేసే మార్కెట్. జపాన్ ,కొరియా ,చైనా రెస్టారెంట్లలో కొత్తకొత్త రకం పదార్ధాల నమూనాలు పెడితే మెనూ పైన చదివి కాకుండా ఇలా కళ్ళతో చూసి ఆర్దరించేందుకు కస్టమర్లు ఇష్టపడుతున్నారట. అచ్చమైన వంటకాలకంటే ఇంకా నిండైన రూపంలో ప్లాస్టిక్కో ,మైనంమో ఏదైనా కనిపించే ముందు నోరూరటం ఖాయం. పోనీ తినేద్దామనుకోవటం కస్టమర్స్ బలహీనతే కదా.

    కళ్లకింపుగా ప్లాస్టిక్ ఆహారం

    బట్టలు చెప్పులు లాంటివి అమ్మే షోరూం లలో తమ దగ్గరుండే అన్నిరకాల వస్తువులు షోకేస్ లో ప్రదర్శనకు పెడుతూవుంటారు. వినియోగదారులను ఆకర్షించేందుకు ఇప్పటికీ అదే పద్దతి. మనవాళ్ళు…

  • పలక్ ముచ్చల్ అన్న యువతీ ఒక చిన్న పాపని ఎత్తుకుని సామజిక మాధ్యమంలో ఒక పోస్ట్ పెట్టింది . నేను కాపాడిన వెయ్యో ప్రాణం ఇది. ఈ పనికి నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు అంటూ మేసాజ్ చేసింది. ఇండోర్లో పుట్టి పెరిగిన పలక్ శాస్త్రీయ గీతం నేర్చుకుంది. ఏడేళ్ళ వయసు నుంచి సంగీత విభావరుల్లో వేదికల్లో పాటలు పాడి సేకరించిన డబ్బులు చిన్నపిల్లల గుండె ఆపరేషన్లు చేయిస్తుంది. ఎన్నో సినిమాల్లో చక్కని పాటలు పాడింది పలక్ . ప్రతి కార్యక్రమంలో ఆమె నలభై పాటలు పాడుతుంది. తెలుగు ,కన్నడ , గుజరాతీ ఒరియా ఇలా దాదాపు పదిహేడు బాషలలో పాడగలదు . పలక్ ముచ్చల్ హార్ట్ ఫౌండేషన్ ప్రారంభించింది. బెంగుళూరు ,ఇండోర్ , ముంబై , ప్రముఖ హృద్రోగ ఆస్పత్రుల్లో వైద్యులు రాయితీ తో పిల్లలకు చికిత్సలు అందిస్తారు. ఆపరేషన్ థియేటర్ లోకి పలక్ ను రానిస్తారు. అక్కడ ఓ పక్కన నిలబడి భగవద్గీత చదువుతుంది. పలక్. తను సంపాదించిన కోట్ల రూపాయల డబ్బు పిల్లల ఆరోగ్యం కోసం ఖర్చుపెట్టిందామె. ప్రభుత్వ పురస్కారాలే కాదు. లిమ్కా, గిన్నీస్ బుక్స్ లో కూడా ఆమెకు స్థానం లభించింది. 24 ఏళ్ల వయసులో వెయ్యిమందికి ప్రాణం పోసిన పలక్ ముచ్చల్ కు శుభాకాంక్షలు.

    వెయ్యి మంది చిన్నారులకు ప్రాణం పోసింది

    పలక్ ముచ్చల్  అన్న యువతీ ఒక  చిన్న పాపని ఎత్తుకుని సామజిక మాధ్యమంలో ఒక పోస్ట్ పెట్టింది . నేను కాపాడిన వెయ్యో ప్రాణం ఇది. ఈ…

  • లైఫ్ లో ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి. గతాన్ని పదేపదే గుర్తుచేసుకుని చింతించటం వల్ల ఒత్తిడి ఆందోళన పెరుగుతాయే తప్ప పరిష్కారం కనిపించదు. అలాంటప్పుడు ఆ వ్యతిరేక భావనల్ని వదిలించుకునే మార్గం వెతకటం ఉతమం. అంటారు సైకలజిస్ట్లు. మనసులోని భావనను సన్నిహితులతో పంచుకోవాలి. లేదా ఓ కాయితం పైన రాస్తే మనసు తేలికవుతుంది. తిండి పైకి దృష్టి మళ్ళించవచ్చు. మంచి భోజనం చేస్తే కూడా డిప్రెషన్ తగ్గుతుంది. చిక్కుళ్ళు ఆక్రోట్స్ ఓట్ మీల్స్ తీసుకుంటే మూడ్ లో కొంత మార్పు వస్తుంది. చెమట పట్టేలా వ్యాయామం,బరువులు ఎత్తటం చేస్తే ఎండర్ఫిన్లు విడుదలై నూతనమైన శక్తీ వస్తుంది. మూడీ గావుంటే సాధ్యమైనంత సేపు నిద్రాపోయినా సరే విటమిన్ డి కూడా మూడ్ ని నియంత్రిస్తుంది. ఎండలో కాసేపు నడవండి. మనసుని సంతోషంతో నింపేవినవ్వించేవి గుర్తుకుతెచుకోవాలి. మెదడుకి స్వచమైన ఆక్సిజెన్ అందితే అదే మూడ్ లో మార్పు తెస్తుంది. పచ్చని చేట్లుందే చోటుకి ఏ పార్కుకి అయినా వెళ్లి కాసేపు మనుషుల మధ్యలో నడిస్తే ఇంకా బావుంటుంది. అంతేగాని ఆ నేగిటివ్ మూడ్ ని మోస్తూ లేనిపోని బాధ గుండెపై పెట్టద్దు .

    మూడీ గా వుండే మూడ్ లోకి రావాలి

    లైఫ్ లో ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి. గతాన్ని పదేపదే గుర్తుచేసుకుని చింతించటం వల్ల ఒత్తిడి  ఆందోళన పెరుగుతాయే తప్ప పరిష్కారం కనిపించదు. అలాంటప్పుడు ఆ వ్యతిరేక…

  • నమో వెంకటేశాయ లో అనుష్క నాలుగు భిన్నమైన గెటప్స్ లో కనిపిస్తుందని ఆమెది చిత్రంలో వెంకటేశ్వర స్వామిని భర్తగా భావించే భక్తురాలి పాత్ర అని ఆమె టీజర్ విడుదల చేసారు. ఫ్యాషన్ డిజైనర్ ప్రశాంతి త్రిపుర దేవి ఆమె డ్రెస్ లు డిజైన్ చేసారు గోదా దేవి తరహాగెటప్ లో ఉన్న అనుష్క కోసం డిజైన్ చేసిన శారీ బ్లౌజ్ సెట్ 24కు మీటర్ల వస్త్రం వచ్చిందట. నిలబడ్డ అనుష్క కుచ్చుళ్ళు అర్ధచంద్రాకారంలో భూమిని తాకేలా చూపాలట ఆ కాస్ట్యూమ్స్ లో . ఇలాగే చెవులకు పెట్టుకునే ఆభరణం కూడా ప్రత్యేకంగా బరువుగా ఉండేలా డిజైన్ చేసారు. సైజ్ జీరోలో లావుగా కనిపించిన అనుష్క బాహుబలి నమోవెంకటేశాయ టీజర్ లలో మామూలుగానే కనిపిస్తోంది. ప్రతి సినిమాకు సరికొత్తగా కనిపించేందుకు కానూ హీరో హీరోయిన్స్ కోసం దుస్తులు జ్యూవెలరీ మేకప్ హెయిర్ డ్రెస్ సినిమా పాత్రలో ఆమె గాని అతను గానీ ఎలా కనిపించాబోతున్నారనేది టీజర్ విడుదల చేసే ముందు ఎంతో వర్క్ జరుగుతుంది. చాలా ఎక్స్పరిమెంట్స్ చేస్తారు. ఫస్ట్ లుక్ అంటే తర్వాత సినిమాలో ఎలా కనిపించబోతున్నారు ముందే డిజైన్ చేసి చూపించటం. ఇలా తీర్చిదిద్దిన అనుష్క ఫస్ట్ లుక్ నమో వెంకటేశాయ సినిమాలో ఎలా వుందో చూడండి. దేవుడిని ప్రేమించే భక్తురాలి పాత్రలో అనుష్క చాలాఅందంగా వుంది.

    ఈ రూపం వెనుక ఎంతో కష్టం ఉంటుంది

    నమో వెంకటేశాయ లో అనుష్క నాలుగు భిన్నమైన గెటప్స్ లో కనిపిస్తుందని ఆమెది  చిత్రంలో వెంకటేశ్వర స్వామిని భర్తగా భావించే భక్తురాలి పాత్ర అని ఆమె టీజర్ …

  • మంచి జుట్టంటే ఏ స్టైల్ అయినా ఫాలో అవొచ్చు. పుట్టుకతో కాస్తో కూస్తో మంచి జుట్టే వుంటుంది. ఈ కాలుష్యానికి, టెన్షన్లకు వున్న జుట్టు రాలిపోయి అదే ముఖ్యమైన సమస్య అవుతుంది యూత్ లో నల్లగా వత్తుగా కేశాలుంటే ఇష్టపడని వాళ్ళెవ్వరు. కొన్ని సాంప్రదాయ టిప్స్. ఒక వంతు నిమ్మరసం, రెండు వంతుల కొబ్బరి నూనె కలిపి కుదుళ్ళలో మృదువుగా మస్సాజ్ చేస్తే జుట్టు తెగిపోవడం ఆగుతుంది. మెంతులు నానబెట్టి రుబ్బి జుట్టు కుదుళ్ళకు పట్టిస్తే చుండ్రు, దురద సమస్యలు పోయి జుట్టు ఆరోగ్యంగా వుంటుంది. గుడ్డు తెల్ల సోనలో తగినంత పెరుగు వేసి ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తే అది చెక్కని హెయిర్ కండిషనర్ లా పని చేస్తుంది. వేప నూనె ను కుదుళ్ళకు పట్టించాలి. అలాగే వేపాకులు వేసి కాచిన నీళ్ళతో తలంటు స్నానం చేయాలి. ఉల్లిపాయ రసం కుదుళ్ళకు పట్టించి రెండు గంటల పాటు ఆగి స్నానం చేసేయాలి. వారంలో మూడు రోజులైనా కొబ్బరి, ఉసిరి, ఆలివ్ నూనెలతో తలకు మసాజ్ చేసుకుంటే చెక్కని జుట్టు సొంతమవుతుంది.

    కురుల అందం పెరగాలంటే

    మంచి జుట్టంటే ఏ స్టైల్ అయినా ఫాలో అవొచ్చు. పుట్టుకతో కాస్తో కూస్తో మంచి జుట్టే వుంటుంది. ఈ కాలుష్యానికి, టెన్షన్లకు వున్న జుట్టు రాలిపోయి అదే…

  • ప్రకృతిలో ఎన్నో వస్తువులు రేఖా గణితం డిజైన్లలో ఉంటాయి. నత్త గుల్లలు, శంఖువులు ఆకారంలో, తేనె టీగలు కట్టె తేనె పాట్లు, ఆకాసంలో విశ్వంలో గ్రహాలన్నీ, ఇంకా ఎన్నో ఆకారాల్లో కనిపిస్తాయి. ఈవే మన డిజైనర్లను ఆకర్షించి ఉంటాయి. లతలు, పువ్వుల తర్వాత ఇటు నగలు, చీరల డిజైనర్లను ఆకర్షించింది రేఖా గణితపు ఆకరాలే. తెలుపు పైన నలుపు గీతలు, నలుపు పైన తెల్ల గీతల డిజైన్స్ ఎవర్ గ్రీన్ ఫ్యాషన్. చీరలు పొడవాటి గౌన్లు, కుర్తీలు, లేగ్గింగ్స్ లో కూడా త్రిబుజాలు ఫ్యాషనైపోతున్నాయి. ఇక డిజిటల్ డిజైన్స్ అంటేనే ఒక ఆకారం అంటూ లేని రంగుల వలయాలు గీతల గమ్మత్తులే చీరాల విషయంలో కాటన్, సిల్క్ , పట్టు, అన్న తీరు లేకుండా అన్నీ గీతలు, సున్నాలు, చతురస్రాలు ఏవో కోణంలో రంగుల్లో వదిగిపోయి ఏ సమయంలో అయినా కట్టుకుట్టుకునేందుకు ఫ్యాషన్ డిజైనర్ల కు పేరు తెస్తూనే వున్నాయి.

    రేఖ రేఖకో అందం

    ప్రకృతిలో ఎన్నో వస్తువులు రేఖా గణితం డిజైన్లలో ఉంటాయి. నత్త గుల్లలు, శంఖువులు ఆకారంలో, తేనె టీగలు కట్టె తేనె పాట్లు, ఆకాసంలో విశ్వంలో గ్రహాలన్నీ, ఇంకా…

  • నాజుగ్గా వుండాలని కడుపు మాడ్చుకునే అమ్మాయిల కోసం ఈ న్యూస్ 120 కెజీల బరువున్న 24 సంవత్సరాల ఎస్తే ఫానియా, అర్జెంటినాలోని మెండాజాఫ్రాన్సిస్ లో జరిగిన అందాల పోటీల్లో సహచర పోటీ దారులను ఓడించిన విజేతగా నిలిచారు. ఈ పోటీలో గెలవడం ద్వారా అందాల పోటీ అంటే శరీరాకృతి నాజుకుతనం ఒక్కటే అర్హత కాదని ప్రపంచానికి ఒక సందేశం పంపుతానన్నది విజేత ఎస్తే ఫానియా

    ఈ అందాల సుందరి బరువు 120 కిలోలు

    నాజుగ్గా వుండాలని కడుపు మాడ్చుకునే అమ్మాయిల కోసం ఈ న్యూస్ 120 కెజీల బరువున్న 24 సంవత్సరాల ఎస్తే ఫానియా, అర్జెంటినాలోని మెండాజాఫ్రాన్సిస్ లో జరిగిన అందాల…

  • బంగారం అరవై తులాలకు మించి ఉంటే ప్రభుత్వం లాగేసుకుంటుందా అనే సందేహం చాలా మందిని వేధిస్తోంది. ప్రభుత్వం అలా ఏమీ లాక్కోదు. పరిమితికి మించిన బంగారం ఎలా సమకూర్చుకోగలిగారో వివరణ ఇవ్వగలగాలి. వారసత్వంగా వచ్చిందనుకోండి. విల్లు ప్రకారం వచ్చిన బంగారం పైన ఇద్దరు సాక్షి సంతకాలు ఉంటే చాలు. బహుమతిగా వచ్చిన బంగారాన్ని అమ్మాలంటే ఆనాటి ధర ఇప్పటి ధరల మధ్య వ్యత్యాసం పై పన్ను కట్టాలి. కేంద్ర ప్రభుత్వం గోల్డ్ డిపాజిట్ స్కీం 1999 ప్రకారం 2000-01 నుంచి గోల్డ్ డిపాజిట్ బ్రాండ్లను జ్యూవెలరీ కేంద్రం పరిగణించకుండా సెక్షన్-2 కి సవరణ ఇచ్చింది. గోల్డ్ డిపాజిట్ బ్రాండ్లు ఆస్తులుగా పరిగణించారు. వ్యయసాయ ఆధారిత కుటుంబాలైతే వ్యవసాయ ఆదాయం పై పన్ను లేనట్లే వ్యవసాయ ఆదాయం తో కొనుగోలు చేసిన బంగారం పై ఎలాంటి పన్ను ఉండదు. పుట్టింటి నుంచో బహుమతిగానో మరేవిధంగానో వచ్చిన బంగారానికి ఆధార పత్రం ఉండేలా చూసుకుంటే చాలు. ఒక చిన్న మధ్య తరగతి కుటుంబంలో 60 తులాల కంటే ఎక్కువ బంగారం వుండే అవకాశం వుంటుందా చెప్పండి. ఆదాయానికి మించిన అక్రమార్జన ఉంటేనే లెక్కలు బయటకి వస్తాయి.

    బంగారం గురించి కంగారొద్దు

    బంగారం అరవై తులాలకు మించి ఉంటే ప్రభుత్వం లాగేసుకుంటుందా అనే సందేహం చాలా  మందిని వేధిస్తోంది. ప్రభుత్వం అలా  ఏమీ లాక్కోదు. పరిమితికి మించిన బంగారం ఎలా…

  • టీనేజ్ లోకొచ్చాక పిల్లల్ని గాజు బొమ్మల్లాగా హ్యాండిల్ చేయాలి. అంటున్నారు ఎక్స్పర్ట్స్. వాళ్ళతో భావోద్వేగాలు ఎక్కువే వుంటాయి. కానీ పెద్దవాళ్లలాగా వాటిని నియంత్రించుకోలేరు. వాళ్ళు ముభావంగా ఉన్నా కోపంగా వుంటున్నా ప్రతి దానికీ కనీళ్ళు పెట్టుకున్నా కారణాలు తెలుసుకునేందుకు సున్నితమైన ప్రయత్నం చేయాలి. తోటి పిల్లల్తో సర్దుకోలేకపోతున్నా ఏదైనా లైంగిక హింసకు గురవుతున్నారా లేదా ఏదైనా సున్నితమైన విషయాన్ని బయటకు చెప్పలేకపోతున్నారా? ఏదైనా వత్తిడి లోనయ్యారా ? అన్ని విషయాలను తరచి అడిగి తెలుసుకోవాలి. తల్లితండ్రుల కంటే దగ్గరైనవాళ్లు వాళ్ళకెవరూ ఉండరు. ఎలాంటి సమస్యకైనా అండదండలుగా ఉంటామనే నమ్మకాన్ని పిల్లలో చిన్నపటినుంచి కలిగించగలిగే గొడవే లేదు. వాళ్లకు సంబంధించిన ఈ ప్రాబ్లమైన మొదటిగా తల్లితండ్రికే చెప్పుకుంటురు. మార్కులు వచ్చినా తెలివిగా ప్రవర్తించలేకపోయిన ఇతరుల ముందు వాళ్ళను చిన్నపుచ్చటం చాలా తప్పు. ఆరోగ్యంగా లేకపోయినా శారీరిక లోపం ఒత్తిడీ సరిగా చదవలేక పోయినా వాళ్ళు భయపడాయి చెప్పుకోలేకపోతారు. లేదా దృష్టి లోపం విరికిది సమస్యలు తలెత్తినా వాటిని చెప్పుకోలేక మౌనంగా ఉన్న తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఎదిగే క్రమంలో ఎదురయ్యే ఎలాంటి అనుభవానికైనా తోడుగా ఉండాలి.

    పిల్లలకు నమ్మకం ఇవ్వండి

    టీనేజ్ లోకొచ్చాక పిల్లల్ని గాజు బొమ్మల్లాగా హ్యాండిల్ చేయాలి. అంటున్నారు ఎక్స్పర్ట్స్. వాళ్ళతో భావోద్వేగాలు ఎక్కువే వుంటాయి. కానీ పెద్దవాళ్లలాగా వాటిని నియంత్రించుకోలేరు. వాళ్ళు ముభావంగా ఉన్నా…