• సాధారణంగా కొన్ని అలవాట్లు మనం అద్దెకు తెచ్చుకున్నవే. స్పూన్ తో, ఫోర్క్ లతో చేతికి ఏది అంటకుండా తినడం కూడా ఇలాంటిదే అల్పాహారం అయినా, భోజనమైనా చేత్తో తినటమే మంచిది. చేత్తో ఆహారం ముట్టుకోగానే మెదడుకు సంకేతం అందుతుంది. నోటిలో లాలాజలం ఊరుతుంది. చేత్తో ఆహారం తింటూ ఉండగానే మనం ఆహారం తింటున్నామన్న విషయాన్ని మెదడు మన పొట్టకు చెప్పేస్తుంది. ఈ సంకేతాలతో పొట్టలో జీర్ణ రాసాలు ఎంజైమ్స్ విదుదల అవ్వుతాయి. దీని వల్ల బాగా జీర్ణ శక్తి పెరుగుతుంది. ఎంత ఆహారం తినగలమో అన్న విషయం సరిగ్గా అంచనా వేయగలుగుతాము. అలాగే ఆహారం ప్లాస్టిక్ ప్లేట్ లో ప్లాస్టిక్ స్పూన్ తో అల్యూమినియం గరిటలు వాడుతూ తినడం కూడా అట క్షేమం కాదు. అవి వేడికి కొంత కరుగుతాయి. అందులో రసాయినాలు పొట్టలోకి చేరిపోతాయి. అందుకే ఇలాంటి సమస్యలు ఎవీ లేకుండా చేత్తోనే అన్నం తినటం మేలు కదా. కమ్మని పెరుగు అన్నంలో తియ్యని మామిడి పండు నంజుకొని చేత్తో ఎంజాయ్ చేస్తూ తినటానికి ఎంత ఖరీదైన ప్లాటినం స్పూన్ అయినా సరిపోలుతుందా?

    హాయిగా చేత్తోనే తినాలి

    సాధారణంగా కొన్ని అలవాట్లు మనం అద్దెకు తెచ్చుకున్నవే. స్పూన్ తో, ఫోర్క్ లతో చేతికి ఏది అంటకుండా తినడం కూడా ఇలాంటిదే అల్పాహారం అయినా, భోజనమైనా చేత్తో…

  • ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లిపాయ వల్ల కలిగే ఉపయోగపడే లిస్టు లో ఇప్పుడు జుట్టు సంరక్షణ కూడా చేరింది. వాతావరణంలో కలిగే ఎన్నో మార్పులతో జుట్టు వుదిపోతూ వుంటుంది. ఖరీదైన వైద్యాలకి కూడా లొంగని పక్షంలో ఉల్లిపాయ వైద్యం వైపు చూడొచ్చు. ఉల్లిపాయ వాసన భరించడం కాస్త కష్టమే కానీ అందమైన జుట్టు కావాలంటే ఆ కష్టం భరించాలి. ఉల్లిపాయ ముక్కలు కోసి మెత్తగా గ్రయిడ్ చేసి ఉల్లి రసం తీసుకోవాలి. కుదుళ్ళ లోపల దాకా పట్టించి ఓ అరగంట పాటు ఆరనిచ్చి ఆ తర్వాత గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే ఫలితం తెలుస్తుంది. అలాగే ఉల్లిపాయ రసం లో తేనె కలిపి ఈ మిశ్రమం తలకు అప్లయ్ చేసి ఆరనిచ్చి ఈ ఉల్లిపాయ లోనే కొబ్బరి నూనె కలిపి తలకు మసాజ్ చేసే కొంతసేపయ్యాక తలస్నానం చేసిన ఫలితం బావుంటుంది. ఉల్లి రసంలో రమ్ కలిపి ఒక రాత్రంతా అలాగే ఉంచాలి. తెల్లవారాక ఈ రసం తలకి పట్టించి స్నానం చేస్తే చాలా మంచి ఫలితం వుంటుంది. ఏ రకంగా వాడినా వట్టి ఉల్లిరసం లో నైనా ఫలితం మాత్రం అద్భుతంగానే వుంటుంది.

    అందమైన కురుల కోసం ఉల్లిపాయ వైధ్యం

    ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లిపాయ వల్ల కలిగే ఉపయోగపడే లిస్టు లో ఇప్పుడు జుట్టు సంరక్షణ కూడా చేరింది. వాతావరణంలో కలిగే ఎన్నో…

  • పది నిమిషాలు ఎండలో ఉంటేనే శరీరంలో నీరు ఆవిరై పోయి నట్లు అవుతుంది. ఈ వేసవి తాపానికి కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు. సాధారణ రోజుల్లో కూడా కొబ్బరి నీళ్ళు ఆరోగ్యమె అయినప్పటికీ వేసవిలో ఆ ప్రయోజనాలు పుష్కలం. ఉక్కిరి బిక్కిరి చేసే వేసవి తాపం నుంచి చక్కని ఉపసమనం ఇచ్చే శక్తి కొబ్బరి నీళ్ళల్లో తక్షణ శక్తి వస్తుంది. నరాల వ్యవస్ధా మెదడు సక్రమంగా పని చేసేందుకు అవసరం అయిన పోటాషియం కొబ్బరి నీటిలో దొరుకుతుంది. వేసవి వేడికి మెదడు నరాలు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. మెగ్నీషియం కూడా శరీరం చెడు బాక్టీరియాకు గురవ్వకుండా ఈ యాంటీ ఆక్సిడెంట్లు పరిరక్షిస్తాయి. కొబ్బరి చేట్టుకు కనీస కాయిలో నిల్వ వున్న ఈ నీరు వల్ల ఎలాంటి సైడెఫెక్ట్ లు లేవు ఇంత కంటే మంచి రోగ నిరోధక ఔషధం కూడా ఇంకొకటి లేదు.

    వేసవి తపానికి విరుగుడు

    పది నిమిషాలు ఎండలో ఉంటేనే శరీరంలో నీరు ఆవిరై పోయి నట్లు అవుతుంది. ఈ వేసవి తాపానికి కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు. సాధారణ…

  • పని సామధ్యం పెంచే పవర్ న్యాప్

    పాశ్చాత్య దేశాల్లో చాలా కార్పోరేట్స్ పవర్ న్యాప్ కు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలా కాసేపు కునుకు తీయడం వల్ల చురుకుదనం పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. మూడ్…

  • మెటబాలిజం మాట వింటూ వుంటాం? ఏ విటీ మెటబాలిజం? శరీరంలో ప్రతి కణానికి శక్తి కావాలి. ఈ శక్తి మనం తీసుకునే ఆహారం నుంచే లభిస్తుంది. ఆహారం ద్వారా లభించే పోషకాలకు శక్తి మలిచే చర్యను జీవక్రియ అంటే మెటబాలిజం అంటారు. వయస్సు పెరిగే కొద్ది జీవక్రియ వేగం తగ్గుతుంది. దీని వల్ల చురుకుదనం తగ్గిపోతుంది బరువు పెరుగుతారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ మెటబాలిజం వేగాన్ని తిరిగి పెంచుకోవచ్చు. ఉదయం వీలైనంత త్వరగా బ్రేక్ ఫాస్ట్ చేయాలి. దీని వల్ల జీవక్రియ చురుకుగా వుంటుంది. మెటబాలిజం మెరుగు పరుచుకోవడానికి అలవాట్లు మార్చుకోవాలి. రాత్రి వేళ భోజనం చేయగానే నిద్ర పోగూడదు. కండరాళ్ళు బలోపేతం చేయగల వ్యయామాలు చేయాలి. తగినంత ప్రోటీన్ ఫుడ్ లేదా ప్రోటీన్లు తీసుకోవడం వల్ల జీవక్రియ చురుకుగా వుంటుంది. ఐరన్ లోపం లేకుండా సరైన ఆహారం తీసుకుంటు వుంటే మెటబాలిజం బావుంటుంది.

    మెటబాలిజం వేగంగా పెంచుకోవచ్చు

    మెటబాలిజం మాట వింటూ వుంటాం? ఏ విటీ మెటబాలిజం? శరీరంలో ప్రతి కణానికి శక్తి కావాలి. ఈ శక్తి మనం తీసుకునే ఆహారం నుంచే లభిస్తుంది. ఆహారం…

  • ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాల గురించి చాలా ప్రస్తావనలు వస్తూ ఉంటాయి కానీ డి విటమిన్ గురించి అంతగా ఆలోచించారు. కానీ ఈ విటమిన్ వల్ల ఎన్నో ప్రయోజనాలు శరీరానికి డి విటమిన్ అవసరం ఎంతో వుంది. ఎముక పుష్టికి విటమిన్-డి అత్యంత కీలకం. ఇది రక్త నాళాలను పరి రక్షిస్తుంది. రోగ నిరోధక శక్తిని దృడం చేస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తి సక్రమంగా జరిగేందుకు సహకరిస్తుంది. ఈ విటమిన్ లోపిస్తే బరువు తగ్గిపోతారు. ఆకలి వుండదు. నిస్సత్తువగా వుంటుంది. నిద్ర పట్టదు. విటమిన్-డి లోపం తో తలనొప్పి కూడా వస్తుంది. ఈ విటమిన్ స్థాయి సాదారణం కన్నా తగ్గిపోతే తలనొప్పి వస్తుందని తాజా అధ్యాయినాల్లో గుర్తించారు. ముఖ్యంగా మగ వారిలో ఈ సమస్య ఎక్కువ. ఎండ తగిలినప్పుడు మాత్రమే శరీరం ఈ విటమిన్ ని తయ్యారు చేసుకుంటుంది. ఆహరం ద్వారా లభించేది చాలా తక్కువ.

    ఈ విటమిన్ వల్ల ఎముకల శక్తి

    ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాల గురించి చాలా ప్రస్తావనలు వస్తూ ఉంటాయి కానీ డి విటమిన్ గురించి అంతగా ఆలోచించారు. కానీ ఈ విటమిన్ వల్ల ఎన్నో…

  • ముంబాయికి చెందిన ఐ.టి ప్రోఫెషనల్ అరుందతి మాత్రే తన ఇంటి బల్కనీలో పక్షుల కోసం వంద షెల్టర్స్ ఏర్పాటు చేసిందట. సీతాకోక చిలుక కోసం 350 ప్రత్యేకమైన గూళ్ళు ఏర్పాటు చేసారు. సరికొత్త రీతిలో, అద్భుతమైన ఏర్పాట్లలో ప్రక్రుతి సంరక్షణ కోసం నడుం కట్టారామె గూళ్ళు, ఆహారం, నీరు అందిస్తారు పక్షులకు. అరణ్య పేరు తో 2013 నుంచి వీటిని ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఈ షెల్టర్ బాక్స్ లు, పక్షుల పెంపకం కోసం, అటవీ ప్రాంతాల్లో పర్యటించి పక్షుల గురించి తెలుసుకున్నారామె. దీనికి సంబందించిన ఏడాది కోర్స్ చేసారు. సీతాకొక చిలుకలు గుడ్లు పెట్టేందుకు బాల్కనీలోనే నిమ్మ, సిట్రస్, కోడి పెట్ట లాంటి ఎన్నో మొక్కలు తెచ్చి పెట్టిందామె మట్టి, కొబ్బరి చిప్పలు, వెదురు తో పక్షులకోసం గూళ్ళు కట్టారు. ఇలా ఆలోచిస్తేనే కొన్ని అరుదైన పక్షులు అంత రించి పోకుండా ఉంటాయేమో.

    పక్షుల కోసం 100 గూళ్ళు

    ముంబాయికి చెందిన ఐ.టి ప్రోఫెషనల్ అరుందతి మాత్రే తన ఇంటి బల్కనీలో పక్షుల కోసం వంద షెల్టర్స్ ఏర్పాటు చేసిందట. సీతాకోక చిలుక కోసం 350 ప్రత్యేకమైన…

  • అనవసర కబుర్లు అతి జోకులు వద్దు

    నీహారిక, నీవు అడిగినట్లు సోషల్ గేదరింగ్స్ లో మనం కొన్ని జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలి. ముందుగా ఆ సందర్భానికి తగినట్లు డ్రెస్ వేసుకోవాలి. మరీ క్యాజువాల్…

  • ఒకసారి ఒక్క పనే చేయాలి

    మతిమరుపు మానవ సహజం, అయినా జ్ఞాపకశక్తికి ఎప్పటికప్పుడు పదును పెట్టవలసిందే. అంతేగాని ఎదుటి వాళ్ళ పేరు గుర్తుకు రావడం లేదని, వస్తువులు ఎక్కడ పెట్టామో మర్చిపోతున్నామని సమస్యను…

  • ఇవే వత్తిడికి చెక్ పెట్టే పనులు

    ప్రతి రోజు చేయ వలసిన పనుల్లో ఎదో ఒక సమస్య తో వత్తిడి వేదిస్తుంది. చిన్ని చిన్ని చర్యల తో వత్తిని ఇట్టే తగ్గించ వచ్చు. కామెడీ …