రాజస్థాన్ కు చెందిన సంతోష్ దేవి ఖేదర్ యాపిల్ పంట వేసి తోటి రైతులకు ఒక కొత్త దారి చూపించింది. సాధారణంగా చల్లని ప్రదేశాల్లో పండే యాపిల్ ను ఎంచుకోవడం సంతోష్ మొదటి విజయం.2019లో ఆమె సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో 220 దానిమ్మ మొక్కలను నాటింది. ఆ చెట్టు ఫలితాలు ఇచ్చాయి. అటు తరువాత ఆమె తన పొలంలో వంద యాపిల్ మొక్కలు నాటారు. రాజస్థాన్ ప్రాంతంలో ఉండే వేడి వాతావరణంలో యాపిల్ పంట గురించి ఆలోచించటం ఒక సాహసం కానీ అధిక ఉష్ణోగ్రత తట్టుకున్న విధంగా రూపొందించిన ఈ యాపిల్ చెట్లను ఆమె నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సాయంతో తీసుకోగలిగింది.నాలుగేళ్ళ కష్టం తర్వాత ఒక చెట్టుకు 368 యాపిల్స్ కాపు ఇచ్చాయి నర్సరీ లో ఉండే మొక్కల కోసం గుజరాత్, హర్యానా, ఆంధ్ర ప్రదేశ్ నుంచి రైతులు వస్తున్నారు.













