బెంగళూరుకు చెందిన ఐశ్వర్య పిస్సే రేసింగ్ అబ్బాయిలకే అనే ముద్ర చెరిపేశారు. పోర్చుగల్ లో జరిగిన ఎఫ్.ఐ.ఎ.ఎమ్ వరల్డ్ ర్యాలీ రైడ్ ఛాంపియన్షిప్ లో ఉమెన్ విభాగంలో విజేతగా నిలిచారు. 2017 లో అత్యంత క్లిష్టమైన రైడ్ ది హిమాలయాస్ తో పాటు 2017 – 2022 వరకు ఇండియన్ నేషనల్ ర్యాలీ ఛాంపియన్ షిప్ లను సొంతం చేసుకున్నారు. ఎఫ్.ఐ.ఎమ్ బజాజ్ వరల్డ్ కప్ లో విజయం సాధించి మోటార్ స్పోర్ట్స్ విభాగంలో ప్రపంచ టైటిల్ సాధించిన తొలి భారతీయ మోటార్స్ స్పోర్ట్స్ అథ్లెట్ గా నిలిచారు.













