ఎన్ 2 గ్రోత్ ప్రకటించిన ఉత్తమ మానవ వనరుల విభాగ సారధుల జాబితాలో ఇరా బింద్రా పేరు చోటు చేసుకున్నది. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఐరా ఎంబిఏ చదివారు. జి.ఇ క్యాపిటల్ లో హెచ్ ఆర్ మేనేజర్ గా కెరియర్ ప్రారంభించారు. అదే గ్లోబల్ కంపెనీ లో టాలెంట్ అండ్ డెవలప్మెంట్ లీడర్ గా ఐరా కు పదోన్నతి కల్పించారు. ఈమె నైపుణ్యాలు రిలయన్స్ గ్రూప్ కు చాలా అవసరం అనుకున్నారు ముఖేష్ అంబానీ. అందుకే ఈమెను పీపుల్,లీడర్ షిప్ టాలెంట్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా, చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ గా నియమించారు. ప్రక్రియ లో కృత్రిమ మేధ ను ఉపయోగించి కంపెనీ 20 శాతం వ్యయాన్ని తగ్గించిన అనుభవాలు ఆమె కెరీర్ ను విజయ పథం లో నడిపిస్తుంది.













