కార్తీక మాసంలో థాయిలాండ్ లో కూడా దీపోత్సవం జరుపుకుంటారు అదే లాయ్ క్రాథాంగ్ అంటే పూల సజ్జను నీటిలో విడిచే పండగ అని అర్థం. తామర పువ్వు ఆకారంలో అరటి ఆకులతో చేసిన బుట్టలో పూలు, ధూప దీపాల తో అచ్చం బతుకమ్మ లాగా అలంకరించి సాయంత్రం వేళ కుటుంబ సమేతంగా వెళ్లి ఈ పూల సజ్జను నీటిలో వదులుతారు. 80 ఏళ్ల నాటి ఉత్సవంలో హిందూ బౌద్ధచారులు కనిపిస్తాయి. కార్తీక పౌర్ణమి నాడే ఈ ఉత్సవం అక్కడ జరుగుతుంది.













