సాహసానికి సత్కారం  

సాహసానికి సత్కారం  

సాహసానికి సత్కారం  

కాజిరంగా నేషనల్ పార్క్ కు తొలి మహిళ ఫీల్డ్ డైరెక్టర్ సోనాలి ఘోష్ వన్యప్రాణుల శాస్త్రంలో పీజీ ఎన్విరాన్మెంటల్ లా లో పీజీ డిప్లమా చేసిన సోనాలి 2000 సంవత్సరంలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో చేరారు. అస్సాం లోని కాజిరంగా నేషనల్ పార్క్ లో సహాయ కన్జర్వేటర్ గా వృత్తి జీవితంలో అడుగుపెట్టారు. 430 కిలో మీటర్ల పరిధిలో వ్యాపించిన ఈ నేషనల్ పార్క్ లో ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలు ఎక్కువ.ఈ పార్క్ లో ఎన్నో హోదాలతో పనిచేసిన సోనాలి రెండేళ్ల క్రితం ఫీల్డ్ డైరెక్టర్ అయ్యారు పాతికేళ్లుగా ఆమె చేస్తున్న సేవలకు గాను ఈ సంవత్సరం కెంటన్ మిల్లర్ పురస్కారం అందుకున్నారు సోనాలి. పర్యావరణ రంగంలో ఇది అత్యున్నత పురస్కారం ఇది.