సంప్రదాయం అధునాతన కలిగిన వన్ పీస్ డ్రెస్ లు ఇవ్వాల్టి ట్రెండింగ్. డ్రెస్ మొత్తం ఒకే ఫ్యాబ్రిక్ తో రూపొందిస్తారు కనుక ఇది చూసేందుకు లాంగ్ ఫ్రాక్ లాగా కనిపిస్తుంది కింద భాగం వెడల్పుగా అంటే లూజ్ గా ఉన్నా పరికిణీ మోడల్ లో ఉంటుంది. అంబ్రెల్లా కట్, ప్రిల్స్ టైప్ మ్యాక్సీ మోడళ్లను యువతులు, సౌకర్యంగా ధరించేందుకు ఇష్టపడుతున్నారు. జార్జెట్ షిఫాన్ సిల్క్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్స్ తో రూపొందించిన డ్రెస్ లు గ్రాండ్ లుక్ తో ఉంటాయి. ఈ డ్రెస్ లో సింపుల్ మేకప్ చెవులకు పెద్ద జుంకీలు చేతికి వాచ్ పాదాలకు అందమైన శాండిల్స్ చాలు.













