సంగీతంతో తల్లికి గర్భంలో ఉండే బిడ్డ కు అనుబంధం ఏర్పడుతోంది అంటారు దివ్య లక్ష్మి బీటెక్ చదివిన దివ్య లక్ష్మి చెన్నైలో ఆరోహణ అనే పేరుతో సంగీత పాఠశాల నెలకొల్పింది. కుమార్తె ఆరోహి పుట్టాక తన బిడ్డ తన గర్భంలో ఉండగానే రోజు సంగీతం వినడం వల్ల ఎన్నో తెలివితేటలతో జన్మించిందని అర్థం చేసుకున్నది. సంగీతం గర్భిణీ లో ఉండే యాంగ్జైటీ బిపి వంటి సమస్యలను దూరం చేస్తుందని స్వీయ పరిశీలన తో అర్థం చేసుకున్నది. సంగీతం లోని నాదం గర్భిణీ లోని ఆరోగ్యాన్ని సమతుల్యం చేయడమే గాక శిశు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని చెబుతారు దివ్య లక్ష్మి ఆమె నేర్పే ఆరు నెలల సంగీత కోర్సు కోసం కాబోయే తల్లులు బారులు తీరుతున్నారు.













