కర్ణాటక లో పుట్టి పెరిగిన పుష్ప ప్రకాష్ 65 ఏళ్ల వయసులో కుటుంబ బాధ్యతలు పూర్తిచేసిన తర్వాత ట్రెక్కింగ్ మొదలుపెట్టారు మూడేళ్లలో దేశవ్యాప్తంగా 49 ట్రెక్కింగ్స్ పూర్తి చేశారు. వీటిలో మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కూడా ఉంది ట్రెక్కింగ్ మాత్రమే కాక విదేశాల్లో స్కై డ్రైవింగ్ స్కూబా డ్రైవింగ్ బంగి జంప్ లు కూడా చేశారు 2024 లో ట్రెక్కర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు. జిమ్ లకు వెళ్లలేదని తన జీవనశైలి వల్లే యోగాసనాల వల్లే తాను ఇదంతా సాధించానని చెపుతారు పుష్ప ప్రకాష్.













