పాతకాలపు అందమైన చీరలకు పూర్వ వైభవాన్ని తెచ్చి పెట్టాలని కోరిక తో నెరిగే స్టోరీ పేరుతో చీరల వ్యాపారం మొదలుపెట్టింది పూజ నాడిగ్ బెంగళూరుకు చెందిన పూజ ఇంజనీరింగ్ చదివి టి సి ఎస్ లో ఐదేళ్లపాటు ఉద్యోగం చేసి తర్వాత చీరల వ్యాపారం చేయాలని నిశ్చయించుకున్నది.వారణాసి, మధురై, తమిళనాడు, కర్ణాటక, జైపూర్, కోల్కత్తా లోని చేనేత కళాకారులు చేత ప్రత్యేకంగా వస్త్రాలు నేయించి వాటిని డిజైన్ చేసి నెరిగే స్టోరీ లో అమ్మకాలు ప్రారంభించారు పూజ నాడిగ్ ఆమె భర్త శశాంక్ శివపురపు కూడా ఆమెతో కలిసి ఇదే వ్యాపారంలో ఉన్నారు.













