ఇనా అశ్విన్ డాని నాలుగు దశాబ్దాలుగా టెక్ రంగంలో ఉన్నారు.ఆసియన్ పెయింట్స్ లిమిటెడ్ ప్రమోటర్ గ్రూప్ సభ్యురాలు ఏషియన్ పెయింట్స్ మాజీ ఎండి అశ్విన్ సూర్యకాంత్ డాని ని పెళ్లాడిన ఇనా ఆ సంస్థకు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా.యోగా శిక్షకురాలు హోమ్ విల్లా యోగ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గర్భిణులకు తన ఫౌండేషన్ ద్వారా ప్రినేటల్ యోగ నేర్పిస్తున్నారు.అలాగే డాని ఫౌండేషన్ ద్వారా సామాజిక అభివృద్ధి విద్య సాధికారత వంటి వాటిలో సేవలు అందిస్తున్నారు.గత ఐదేళ్ల లో 141 కోట్ల విరాళాలు అందించారు.సామాన్య ప్రజల ఆరోగ్యం కోసం ఫిట్ నెస్ థెరపీ లు అందించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారమే.













