పి.హెచ్.డి చేస్తూ టిక్ టాక్ వీడియోలు మొదలుపెట్టింది మృణాల్ పంచల్. పూణే లో ఉండే మృణాల్ కు లక్షల్లో ఫాలోవర్స్ తో సెలబ్రిటీ అయింది. గుజ్జు యునికార్న్ పేరుతో యూట్యూబ్ లోకి తర్వాత ఇంస్టాగ్రామ్ లోకి వచ్చింది ఫ్యాషన్, మేకప్, ట్రావెల్ వీడియోలు చేసింది. దీనితో ఆమె కోలాబరేషన్స్ ఎండార్స్ మెంట్ లు వచ్చి పడ్డాయి. హాలీవుడ్ గాయని నటి సెలీనా గోమెజ్ తో కలిసి యాడ్స్ లో నటించిన మృణాల్. బెస్ట్ ఇన్‌ఫ్లుయెన్సర్ అవార్డులు వచ్చాయి. మృణా డ్యూటీ పేరుతో బ్యూటీ ఉత్పత్తుల సంస్థ ప్రారంభించింది ఇంత పాపులారిటీ ఉంది కనుక ఈమెను హరూన్ ఇండియా లీడింగ్ వుమెన్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఫౌండర్స్ జాబితాలో ఎంపిక చేసింది.













