నాలుగు లక్షల కోట్ల విలువైన కోటాక్ బ్యాంక్ డిప్యూటీ ఎం డి శాంతి ఏకాంబరం సి.ఏ చదివి బ్యాంకింగ్ లో అడుగు పెట్టారు. 1991 లో కొటాక్ లో చేరారు. 2013లో సి.ఎ విమెన్ బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు హరూన్ ఆమెను ప్రతిభావంతమైన భారతీయ నాయకురాలు అని చెబుతూ ప్రొఫెషనల్స్ విభాగంలో చోటు ఇచ్చారు. మారథాన్ రన్నర్. అలాగే బుద్ధి మాంద్యా పిల్లల కోసం పనిచేసే సోపాన్ సహా పలు స్వచ్ఛంద సంస్థలకు నిధులు అందిస్తారు. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఐ పి ఓ లు, ప్రైవేట్ ఈక్విటీ కార్పొరేట్ బ్యాంకింగ్ విభాగాల్లో నిపుణురాలు.













