అడవుల్ని కాపాడటం కోసం శిక్షణ

అడవుల్ని కాపాడటం కోసం శిక్షణ

అడవుల్ని కాపాడటం కోసం శిక్షణ

దేశంలో మొదటిసారిగా నేచర్ గైడ్ అకాడమీ స్థాపించి అడవుల్లో క్యాంప్ లు నిర్వహిస్తూ టూరిస్ట్ లకు అడివిని పరిచయం చేస్తున్నారు పాయల్ మెహతా. ముంబై కు చెందిన పాయల్ కు ప్రకృతి అంటే ఇష్టం. పర్వత రోహకురాలిగా శిక్షణ పొందారు.ఆమె భర్త హర్ష.జె తో కలిసి అకాడమీ స్థాపించి  కన్హా నేషనల్ పార్క్ లో 18 మంది ప్రకృతి ప్రేమికులకు శిక్షణ ఇచ్చారు. బర్డ్స్ వాచర్స్, నేచురలిస్ట్ లు ఫారెస్ట్ హైకర్స్ కు గైడ్ ల కొరత ఉండదంటారు పాయల్. ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ నేచర్ గైడ్స్ కు కూడా శిక్షణ ఇస్తున్నారామె. భర్త హర్ష తో కలిసి భారతదేశం అంతటా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సఫారీ గైడ్స్ ఎక్కువ మంది శిక్షణ తీసుకుంటే పర్యావరణం కాపాడుకోవచ్చు అంటారు పాయల్ మెహతా.