• బీట్ రూట్ రసం మేలు చేస్తుందని విన్నాం. కానీ అందానికి కూడా బీట్ రూట్ ఉపయోగపడుతుందని బ్యూటీషియన్లు సెలవిస్తున్నారు. వాళ్లు ఏం చెపుతున్నారంటే బీట్ రూట్ ముక్కని గుజ్జుగా చేసి అందులో నాలుగు చుక్కల బాదం నూనె చెంచా ఆలివ్ నూనె కలిపి ముఖానికి రాసుకోవాలి. పావుగంట సేపు ఆరనిచ్చి కడిగేస్తే చర్మం నిగారింపుగా ఉంటుంది. బీట్ రూట్ గుజ్జులో రెండు స్పూన్ల ముల్తానీ నత్తి చెంచా నిమ్మ రసం కలిపి ఫెస్ ప్యాక్ వేసుకోవచ్చు, అరకప్పి పెరుగులో చిటికెడు పసుపు కొద్దిగా బీట్ రూట్ గుజ్జు కలిపి పదినిమిషాలు ఆగి శుభ్రం చేయూస్కుంటే చర్మం టైట్ గా కనిపిస్తుంది. బీట్ రూట్ రసం కమలా రసం సమపాళ్లలో తీసుకుని అందులో దూది ముంచి మొహం శుభ్రం చేసుకోవచ్చు. ఇదే రసంలో నిమ్మరసం కూడా కలుపుకుంటే పిగ్మెంటేషన్ దూరం అవుతుంది. సెనగపిండి బీట్ రూట్ రసం మెత్తగా చేసిన గులాబీ రేకుల మిశ్రమం కలిపి రాసుకుంటే ముఖం తాజాగా మారుతుంది.

    బీట్ రూట్ పూతతో గులాబీ రేకుల అందం

    బీట్ రూట్ రసం మేలు చేస్తుందని విన్నాం. కానీ అందానికి కూడా బీట్ రూట్ ఉపయోగపడుతుందని బ్యూటీషియన్లు సెలవిస్తున్నారు. వాళ్లు ఏం చెపుతున్నారంటే బీట్ రూట్ ముక్కని…

  • డెస్క్ వర్క్ చేసినప్పుడు అస్తమానం మోచేతులు టేబుల్ కి ఆనించటం వల అక్కడంతా నల్లగా అయిపోతుంది. ఈ మోచేతుల నలుపు వదిలించటం కాస్త కష్టమే. కానీ రెగ్యులర్ గా ఈ ఇంటి చిట్కాలు ఉపయోగించి ఆ నలుపు పోగొట్టచ్చు. సెనగపిండి పెరుగు కలిపి ప్రతిరోజు స్నానం చేసే ముందర మోచేతులకు పట్టించి కాసెప్పాయాక కడిగేస్తే ఆ నలుపు నెమ్మదిగా తగ్గిచర్మంలో కలిసిపోతుంది . అలాగే దోసకాయ బొప్పాయి గుజ్జుగా చేసి రాసినా సరే. ఒక టేబుల్ స్పున్ గంధంలో రెండు స్పూన్ల తేనే వేసి పేస్టులా కలపాలి . దాన్ని ఆరిపోయే దాకా మోచేతులు రాసి వదిలేసి తర్వాత కడిగేస్తే ఫలితం బావుంటుంది. ఈ మిశ్రమం మోచేతులు రాసి కనీసం అరగంట ఉంచుకోవాలి . పంచదార ఆలివ్ ఆయిల్ పేస్ట్ లా చేసి ఆ మిశ్రమం తో నలుపు ఉన్న భాగంలో మస్సాజ్ చేస్తే ఫలితం ఉంటుంది. ఏ చిట్కాలు ప్రతి రోజు చేస్తే ,మంచి ఫలితం ఉంటుంది. నలుపు తప్పకుండా పోతుంది.

    మోచేతుల నలుపు సులువుగా పోతుంది

    డెస్క్ వర్క్ చేసినప్పుడు అస్తమానం మోచేతులు టేబుల్ కి ఆనించటం వల  అక్కడంతా నల్లగా అయిపోతుంది. ఈ మోచేతుల నలుపు వదిలించటం కాస్త కష్టమే. కానీ రెగ్యులర్…

  • వాతావరణంలో మార్పులకు ఎక్కువగా స్పందించేది చర్మమే . నెమ్మదిగా చలి తగ్గి మొహం పడుతోంది. చర్మం పేలవంతంగా అయిపోతుంది. క్యారెట్ చిన్న బీట్ రూట్ టమాటో కలిపి పేస్ట్ లాగా చేసి దీనికి పెరుగు కలిపి ఈ మిశ్రమం మొహానికీ మెదడు అప్లయ్ చేయాలి. అరగంట తర్వాత కడిగేస్తే ఖరీదైన మాస్క్ వేసుకున్నంత మెరుపుతో ఉంటుంది మొహం. పెరుగు పసుపు మిశ్రమం కూడా చాలా పనిచేస్తుంది. పాలలో మెంతులు నానబెట్టి పేస్ట్ చేసి ముఖ్నైకి మాస్క్ లా వేసుకోవాలి. వేడి నీళ్లతో కడిగేస్తే మొహం మెరుపుగా ఉంటుంది. జీడిపప్పు పచ్చి పాలతో కలిపి మెత్తగా పేస్ట్ చేసి ఫెస్ మాస్క్ వేసుకోవచ్చు . ఆవ నూనె నిమ్మరసం కూడా మంచి ఫలితం ఇస్తుంది. బాదం పప్పు నాననిచ్చి రోజ్ వాటర్ పచ్చి పాలతో కలిపి పేస్ట్ చేసి ఈ మిశ్రమంతో మొహం నృదువుగా మర్దనా చేయాలి. తర్వాత మొహానికి ఆవిరిపెట్టి తుడిచేయాలి. మొహంతో మెరుపు ఎంతోసేపు ఉంటుంది. చర్మం నిగారింపు కోసం ఇలా ఇంట్లోవాడే వస్తువులు ట్రై చేస్తే మొహం ఫ్రెష్ గానూ ఉంటుంది ఎలాంటి సైడ్ ఎఫెక్టులు వుండవు.

    పాలు జీడిపప్పు పేస్ట్ అప్లయ్ చేస్తే

    వాతావరణంలో మార్పులకు ఎక్కువగా స్పందించేది చర్మమే . నెమ్మదిగా చలి తగ్గి మొహం పడుతోంది. చర్మం పేలవంతంగా అయిపోతుంది. క్యారెట్ చిన్న బీట్ రూట్ టమాటో కలిపి…

  • చాలా మందికి చిన్న వయసులోనే పెదవుల చుట్టూ ముక్కు దగ్గర చెంపల పై సాగినట్లు పెద్దవాళ్లుగా కనిపిస్తాయి. ఇంట్లోనే ఈ సమస్య కో కొన్ని మంచి చికిత్సలున్నాయి. అనాస పండు యాంటీ ఏజింగ్ ఏజెంట్ రెండు ముక్కలు అనాస పండు మెత్తగా చేసి ఆ రసం ముఖానికి రాస్కుంటే ఫలితం ఉంటుంది. ఆముదంలో ప్లాటీ ఆమ్లాలుంటాయి. ఇవి సాగిన చర్మాన్ని బిగుతుగా చేస్తాయి. ఏదైనా నూనెలో ఆముదం కలిపి మర్దనా చేస్తే ఫలితం ఉంటుంది. బాదం నూనె తోకూడా ఇదే ఫలితం. రెండు పూటలా బాదం నూనె తో మర్దనా చేయాలి. చక్కెర మెత్తగా పొడిగా చేసి అందులో తేనె కలిపి పూతలా వేసుకుంటే చర్మానికి తేమ అంది సాగిపోకుండా ఉంటుంది. గుడ్డులోని తెల్లసొన తో పూతలాగా వేసినా మంచిదే. కలబంద గుజ్జయితే ప్రతిరోజు వాడవచ్చు. ఫ్రెష్ గా ఉన్న కలబంద నుంచి గుజ్జు తీసి పూతలా వేసి మర్దనా చేస్తే మంచి ఫలితాలుంటాయి.

    కలబంద తో చర్మం బిగుతవుతుంది

    చాలా మందికి చిన్న వయసులోనే పెదవుల చుట్టూ ముక్కు దగ్గర చెంపల పై సాగినట్లు పెద్దవాళ్లుగా కనిపిస్తాయి. ఇంట్లోనే ఈ సమస్య కో కొన్ని మంచి  చికిత్సలున్నాయి.…

  • మేకప్ తొలగించటంలో జొజోబా ఆయిల్ వాడటం చాలా మంచిది. అంటున్నారు ఎక్స్ పెర్ట్స్. ఇది మేకప్ రిమూవర్ గానే కాదు మాయిశ్చరైజర్ గా కూడా పనిచేస్తుంది. ఉదయానికి మొహం సాఫ్ట్ గా అయిపోతుంది. అలాగే వట్టి పెరుగు కాటన్ ప్యాడ్ నెమ్మదిగా గుండ్రముగా రుద్దుతూ మేకప్ తొలగిస్తే చర్మం క్లీన్ అవటమే కాదు. తాజాగా మెరుపుగా ఉంటుంది. ఇక పాలు నాచురల్ క్లీన్సర్ గా పనిచేస్తాయి. ఇందులో ఆలివ్ ఆయిల్ కలిపి మేకప్ రిమూవర్ గా ఉపయోగిస్తే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దోసకాయ ను జ్యూస్ లాగా తీసి అందులో బేబీ ఆయిల్ కలుపుకుని మొహం తుడుచుకుంటే చర్మం చక్కగా అయిపోతుంది. ఈ కాంబినేషన్ మేకప్ రిమూవర్. గ్రేప్ నీడ్ ఆయిల్ దూది ముంచి మేకప్ తుడిచేస్తే ఈ నూనె చర్మానికి నిగారింపు ఇవ్వటంతో పాటు మొటిమలు మడతలు నివారిస్తుంది. ఇదే విధంగా కొబ్బరినూనె కూడా మేకప్ తొలగించే రిమూవర్ గా పనికివస్తుంది.

    ఇవి మేకప్ తొలగించే సొల్యూషన్స్

    మేకప్ తొలగించటంలో జొజోబా ఆయిల్ వాడటం చాలా మంచిది. అంటున్నారు ఎక్స్ పెర్ట్స్. ఇది మేకప్ రిమూవర్ గానే కాదు మాయిశ్చరైజర్ గా కూడా పనిచేస్తుంది. ఉదయానికి…

  • ఉదయపు వేళ శ్రద్ధ తీసుకుంటేనే

    మొహం కడుక్కునే విధానం మార్చుకుంటే ముఖం ఇంకెంతో కాంతి వంతంగా మారుతుంది. అంటున్నారు ఎక్స్పెర్ట్స్. రాత్రివేళ మేకప్ తీసివేసేందుకు ఉదయం నుంచి మొహానికి తగ్గితే కాలుష్యం వదుల్చుకునేందుకు…

  • పది నిమిషాల పాటు ఏ పని మీదో బైక్ పైన బైటకు వెళ్ళొస్తే చేతులు మొహం మురిగ్గా అయిపోతాయి. అంత కాలుష్యం నిండి వుంటుంది. తప్పని సరిగా చేతులు, మొహం, కాళ్ళు కడుక్కొంటాం. నిపుణులు ఏం చెబుతున్నారంటే ముందస్తుగా చేతులు కడుక్కోండి. చేతులు శుభ్రంగా లేకపోతే ఆ చేతులకున్న బాక్టీరియా, ఇతర క్రిములు చర్మం లోకి వెళ్ళిపోయి మొటిమలు వచ్చే ప్రమాదం ఉంది. మేకప్ వేసుకొని వుంటే దాన్ని తప్పనిసరిగా తొలగించుకోన్నకే ముఖం కడుక్కోవాలి. మేకప్ ను క్లెన్సర్ తో తొలగించుకొని ఫేస్ వాష్ తో కడగాలి. ముఖం కడుక్కోనేందుకు వేడి నీళ్ళు వాడకూడదు. చర్మం పొడిబారిపోతుంది. ముఖానికి చన్నీళ్ళు వాడాలి. చలికాలంలో చర్మం అతిగా రుద్ది కడిగేయోద్దు. పొడిబారిన చర్మాన్ని స్క్రబ్ లు ఇబ్బంది పెడతాయి. రోజుకు రెండుసార్లు ఫేస్ వాష్ వాడవచ్చు. పొడిచర్మం ఉన్నవాళ్ళు మొహానికి కడుక్కున్న వెంటనే మాయిశ్చరైజర్ కాస్త కొబ్బరినూనె అప్లయ్ చేయాలి లేదంటే మొహం ఇంకా పొడిగా అయిపొయింది.

    మొహం అస్తమానం కడిగినా నష్టమే

    పది నిమిషాల పాటు ఏ పని మీదో బైక్ పైన బైటకు వెళ్ళొస్తే చేతులు మొహం మురిగ్గా అయిపోతాయి. అంత కాలుష్యం నిండి వుంటుంది. తప్పని సరిగా…

  • మాయిశ్చరైజర్ ని ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అదేంపెద్ద కష్టం కాదు ఇంట్లో ఉండే వస్తువుల తోనే చెంచా తేనె అంతే కొబ్బరి నూనె నిమ్మరసం కలిపితే అదే సహజమైన మాయిశ్చరైజర్. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదినిమిషాల [ఆటు మృదువుగా రుద్దుతూ ఉండాలి. కాస్సేపటికి కడిగేసుకోవచ్చు. రాత్రిపూట పడుకునే ముందర అప్లయ్ చేసి రాత్రంతా ఉంచుకున్నా పర్లేదు. ఆలాగే పాలు నిమ్మరసం ఆలివ్ ఆయిల్ మిశ్రమం కూడా ఎంతో బాగా పనిచేస్తుంది. పాలల్లో వుండే లాక్టిక్ ఆమ్లం చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ఆలివ్ నూనె చర్మాన్ని మెరిపిస్తుంది . నిమ్మరసం మృతకణాలను తొలగించటం తో పాటు మొటిమలు రాకుండా కాపాడుతుంది.చర్మం మెత్తగా తాజాగా ఉంటుంది. అలాగే ఒక కప్పుడు గులాబీ రెక్కల్ని కప్పు వేడి నీళ్ళల్లో మరిగించాలి. అందులో కొంత రోజ్ వాటర్ చేర్చాలి. ఈ నీళ్లు చల్లారాక నాడులో చెంచా ఆలివ్ ఆయిల్ కలిపి ఫ్రిజ్ లో పెట్టేసుకోవచ్చు . ఈ నీటిని ముఖానికి రాస్తుంటే తేమగా కనిపిస్తుంది. ఇవన్నీ మాయిశ్చరైజర్ లాగే పనిచేస్తాయి.

    సహజమైన మాయిశ్చరైజర్ ఇదే

    మాయిశ్చరైజర్ ని ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అదేంపెద్ద కష్టం కాదు ఇంట్లో ఉండే వస్తువుల తోనే  చెంచా తేనె  అంతే కొబ్బరి నూనె నిమ్మరసం కలిపితే అదే…

  • వింటర్ కేర్ ప్రాడక్ట్స్ ఎన్నో కనిపిస్తాయి మార్కెట్ లో. ఒక్కటి తెచ్చి నాలుగు రోజులు వాడి చూసుకునే సరికి చలికాలం కాస్తా వెళ్లిపోతుంటుంది. ఇక మళ్ళీ సమ్మర్ కేర్ కోసం పరుగెత్తాలి. ఇప్పడూ ఇంట్లో చేసుకున్న వస్తువులతో ఆ ప్రయత్నాలు ఏవో చేస్తే సగం సమయం కలిసొస్తుంది. ఎంత ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటున్నా చర్మం చక్కగా కనిపించటం కోసం కొంత పోషణ అవసరం. రసాయనాల కంటే సహజ మైన వస్తువులు నయం కదా. ముఖ చర్మం ఎండిపోయి పగుళ్లు వచ్చినట్లు అయితే బనానా ఫేస్ మాస్క్ ట్రై చేయచ్చు. అరటిపండు పేస్ట్ గా చేసి కొత్త వెన్న కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. వెన్న లేకపోయినా మీగడ అయినా సరే. ఇవే ముఖానికి కావలిసినంత తేమను ఇస్తాయి. అరటిపండు గుజ్జు ఆ తేమను ఇంకొంత సేపు నిలబెడుతుంది. అలాగే అరటిపండు గుజ్జుకు తేనె ఒక టీస్పూన్ రోజ్ వాటర్ జతచేసి ఆ మిశ్రమాన్ని అప్లయ్ చేసినా ఇది ఫలితం ఉంటుంది. తేనె సహజమైన మాయిశ్చరైజర్ గా రోజ్ వాటర్ టోనర్ గా పనిచేస్తాయి. చలికాలంలో చర్మకాంతి కోసం ఈ కాంబినేషన్ ట్రై చేయండి.

    ఇంట్లోనే వింటర్ కేర్ ఫేస్ మాస్క్

    వింటర్ కేర్ ప్రాడక్ట్స్ ఎన్నో కనిపిస్తాయి మార్కెట్ లో. ఒక్కటి తెచ్చి నాలుగు రోజులు వాడి చూసుకునే సరికి చలికాలం కాస్తా వెళ్లిపోతుంటుంది. ఇక మళ్ళీ సమ్మర్…

  • ఈ వాతావరణానికి చర్మం పొడిబారి పోతూవుంటుంది. చర్మం పొట్టు రేగటం దురదలు కూడా వస్తాయి. మందుగా కావలిసింది చర్మానికి కావలిసిన నూనెను అందించటం. తేలికైన ఆలివ్ ఆయిల్ తో మస్సాజ్ చేస్తే మృదువుగా వుంటుంది. సబ్బుకుబదులు సోప్ ప్రీ క్లీన్సర్ వాడాలి స్నానం చేయగానే క్రీమ్ మాయిశ్చరైజర్ లేదా బాడీ బటర్ ను అప్లయ్ చేయాలి . పాలు అవిసెగింజల పొడి బ్రౌన్ షుగర్ కలిపి వారానికి ఒక్కసారి స్క్రబ్ చేయాలి. బ్రౌన్ షుగర్ లేకపోయినా మాములు పంచదార కలిపినా అదే ఫలితం ఉంటుంది. తేనె నిమ్మరసం అలోవెరా జెల్ బాదం నూనె లేదా నిమ్మరసం కలిపినా అవకాడో రాయటం వల్ల కూడా చర్మానికి తేమ లభిస్తుంది. రోజుకు 8 నుంచి పది గ్లాసుల మంచి నీళ్లు దాహం వేయకపోయినా తాగాలి సోయా టోఫు డైరీ ఉత్పత్తులు చికెన్ చేపలు ఆహారంలో భాగంగా ఉండాలి. క్యారెట్లు టమాటో బీట్ రూట్ బొప్పాయి కమలా నారింజ ఆకుకూరలు పుచ్చ వంటి ఆక్సిడెంట్స్ అధికంగా లభించే వివిధరంగుల పండ్లు కూరగాయలు తినాలి.

    పొడిబారి చర్మానికి ఈ జాగ్రత్తలు

    ఈ వాతావరణానికి చర్మం పొడిబారి పోతూవుంటుంది. చర్మం పొట్టు రేగటం దురదలు కూడా వస్తాయి. మందుగా కావలిసింది చర్మానికి కావలిసిన  నూనెను అందించటం. తేలికైన ఆలివ్ ఆయిల్…

  • టీనేజర్ల పెద్ద సమస్య మొటిమలు జిడ్డు చర్మ తత్త్వం ఉంటే చాలు మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. వేప తులసి లవంగాలు పుదీనా వంటి వాటిలో చాలా సహజమైన చిట్కాలతో ఈ మొటిమలు తగ్గించవచ్చు. సమపాళ్లలో తేనే నిమ్మరసం మొటిమల పైన రాస్తే ఫలితం ఉంటుంది. నువ్వులు నీళ్లలో నాననిచ్చి నూరిముద్దగా చేసి మొటిమల పై రాసి కడిగేస్తే చాలు. ముఖానికి బంగాళా దుంప రాస్తే ఇవి మొటిమలు తగ్గించటం కాక మెరిసేలా చేస్తుంది. మొటిమలు ఎక్కువగా ఉన్న చోట లవంగాలు నీళ్లు లేదా పాలతో కలిపి మెత్తగా నూరి అప్లయ్ చేసి పదినిమిషాలు పాటు ఆరనిచ్చి కడిగేస్తే మొటిమలు తగ్గుతాయి. పూదీనా ఆకులు నూరి ఆ పేస్ట్ ను మొటిమల పై రాసినా మార్పు కనిపిస్తుంది. పుదీనా తో చర్మానికి చల్లదనాన్ని పాక్ లాగా అప్లయ్ చేసినా మంచిదే. ఎండా బెట్టిన తులసి ఆకులు షాపుల్లో దొరుకుతాయి. దాన్ని నీళ్లలో కలిపి పేస్ట్ లాగ చేసిన రాసినా మొటిమలు తగ్గుతాయి. బజార్లో దొరికే ఖరీదైన మందుల కంటే ఈ సహజమైన పద్ధతులే ఫలితాలు ఇస్తాయి.

    మొటిమలు ఈ పూతలతో తగ్గుతాయి

    టీనేజర్ల పెద్ద సమస్య మొటిమలు జిడ్డు చర్మ తత్త్వం ఉంటే చాలు మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. వేప తులసి లవంగాలు పుదీనా వంటి వాటిలో చాలా సహజమైన…

  • చర్మం అందంగా ఆరోగ్యంగా కాంతివంతంగా కనిపించాలంటే ప్రతి రోజు రెండు లీటర్ల నీరు తాజా పండ్లు కూరగాయలు నట్స్ తినటం తొలిచర్య. ప్రశాంతంగా పదినుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి . నేరుగా సూర్యకిరణాలు తగలకుండా శ్రద్ద తీసుకోవాలి. ఒత్తిడి లేకుండా ఉండాలి. మేకప్ తొలగించుకోకుండా నిద్రపోకూడదు. కనీసం రెండు సార్లు ముఖం అతిచల్లటి నీళ్లతో వాష్ చేసుకోవాలి. చర్మం ఊపిరితలం ఎప్పుడూ జిడ్డు లేకుండా వుండాలి. క్లార్ ఫోక్స్ ఇన్ఫలమేటరీ ప్రక్రియల లేకుండా చూసుకోవటం అవసరం. వారంలో రెండు సార్లు స్క్రబ్ చేస్తే మృత కణాలు పోతాయి. టేబుల్ స్పూన్ పంచదార లేదా ఓట్ మీల్ తో స్క్రబ్ చేయచ్చు. క్లే మాస్క్ తో మృత కణాలు పోతాయి. మొటిమలు డ్రై అవుతాయి. బ్లాక్ హెడ్స్ సులువుగా తీసేయచ్చు. చర్మంలోని అదనపు నూనెను జిడ్డును ఈ మాస్క్ లు పీల్చేస్తాయి. పోర్స్ ష్రింక్ అయి చర్మం టెక్చర్ మెరుగుపడుతుంది. పెరుగు అవకాడో విటమిన్ సి వంటివి చర్మం కొలెజాన్ రూపొందించటానికి సహకరించి చర్మం టెక్చర్ ను మెరుగుపరుస్తాయి . తేలికైన బేబీ ఆయిల్ ను చేతిలోకి తీసుకుని మెల్లగా మసాజ్ చేస్తే చర్మం కాంతివంతమవుతుంది.

    చర్మం కాంతి మెరుగుపరిచేందుకు ఇవన్నీ

    చర్మం అందంగా ఆరోగ్యంగా కాంతివంతంగా కనిపించాలంటే ప్రతి రోజు రెండు లీటర్ల నీరు తాజా పండ్లు కూరగాయలు నట్స్ తినటం తొలిచర్య. ప్రశాంతంగా పదినుంచి ఎనిమిది గంటలు…

  • అనేక పోషక పదార్ధాలున్న ధాన్యం కాంతివంతమైన చర్మాన్ని ఇవ్వటంలో ముందుంటుంది. సహజ స్థిరమైన శరీర కాంతి కోసం బియ్యం పిండి లో పాలు కలిపి స్పా ట్రీట్మెంట్ లో వాడతారు. పెద్ద పెద్ద ఒబెరాయ్ బాలినీస్ స్పా ముంబై లోని నారిమన్ పాయింట్ స్పా ల్లో ఈ ట్రీట్మెంట్ ను అతిధుల కోసం ఇస్తారంటే బియ్యంలో శరీర లావణ్యలను పెంచే పోషకాలు ఉండటమే కారణం. మస్సాజ్ తర్వాత స్క్రబ్బింగ్ చేయటం వల్ల మృత కణాలు పూర్తిగా పోయి శరీరం శుభ్రపరుస్తుంది. మంచి మెరుపు నిగారింపు పటుత్వం వస్తుంది. ఇదే బియ్యపిండి పాలు మిశ్రమానికి అలొవెరాని కలిపి పెదవులు ఎండిపోకుండా తేమతో మెరిసిపోయేందుకు వాడతారు. తాజాగా ఉన్న బియ్యపిండి రైస్ బ్రాన్ నూనె లో రకరకాల పదార్ధాలు కలిపి రకరకాల ప్రయోజనాలకు ఉపయోగిస్తారు. ఆర్గానిక్ కొబ్బరి షియా బటర్ లతో కలిపి డ్రై స్కిన్ కు అధిక తేమను ఇచ్చేందుకు వాడతారు. బియ్యం పిండి శరీరానికి రుద్దుకొనే సబ్బు లాంటిది. బియ్యం పిండి తేనె పాలు మిశ్రమం ఫేస్ ప్యాక్ గా చక్కగా ఉంటుంది. ఈ మిశ్రమాన్నే బాడీ స్క్రబ్బర్ లాగా ఉపయోగిస్తారు.అయితే శరీరానికి దీన్ని మృదువుగా అప్లయ్ చేయాలి. బియ్యం వండి తినేందుకే కాదు మంచి బ్యూటీ ట్రీట్ మెంట్ కూడా.

    బియ్యంతో అద్భుత సౌందర్యం

    అనేక పోషక పదార్ధాలున్న ధాన్యం కాంతివంతమైన చర్మాన్ని ఇవ్వటంలో ముందుంటుంది. సహజ స్థిరమైన శరీర కాంతి కోసం బియ్యం పిండి లో పాలు కలిపి స్పా ట్రీట్మెంట్…

  • ఈ రుతువు లో ఎంత సేపు వేడిగా తిన్నా తాగిన బాగుంటుంది అనుకుంటాము కానీ చర్మాన్ని మృదువుగా వుంచడంలో పండ్లు చాలా ఉపయోగ పడతాయి అంటున్నారు పోషకాహార నిపుణులు. ఘూస్ బెర్రీ ని సహజ సిద్దమైన కాస్మెటిక్ ఉత్పత్తులలో ఎక్కువగా వాడతారు. శరీరంలోని మలినాలను తొలగించడంలో రక్త సుద్ధి చేయడంలో ఈ పండ్లు ఎంతో ఉపయోగ పడతాయి. ఎంజైమ్స్ పుష్కలంగా వుండే బొప్పాయి చర్మానికి మృదుత్వాన్ని, మెరుపును ఇస్తుంది వృద్దాప్య లక్షణాలను దూరం చేస్తుంది. అవకాడో చలికాలం సమస్యలు చర్మం దెబ్బతినకుండా కాపాడుటుంది. దీన్ని ఒక్క సహజమైన మాయిశ్చురైజర్ గా కూడా వాడుతారు. ఇక దానిమ్మ పండు చెర్మంలో తేజస్సు నింపుతుంది. చర్మ రంద్రాల్ని శుబ్రం చేయడంతో పాటు ముడతలను పోగొడుతుంది. పైనాపిల్ ఇది విటమిన్-సి పుష్కలంగా వున్నా పండు. మొటిమలు మచ్చలు తగ్గిస్తుంది. ఇక అరటిపండు లో వున్న పొటాషియం చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచుతుంది. ఋతువులతోనే సంబంధం లేకుండా కూడా సహజంగా దొరికే ఏ పండైనా వదలకుండా తినేయడం మంచిది అంటున్నారు నిపుణులు.

    చర్మ సంరక్షణ కోసం ఈ పండ్లు

    ఈ రుతువు లో ఎంత సేపు వేడిగా తిన్నా తాగిన బాగుంటుంది అనుకుంటాము కానీ చర్మాన్ని మృదువుగా వుంచడంలో పండ్లు చాలా ఉపయోగ పడతాయి అంటున్నారు పోషకాహార…