• ఎండకు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేవి కళ్ళు. అత్యంత కాంతివంతమైన వాతావరణంలోకి వెళ్ళే సమయంలో కళ్ళకు తప్పనిసరిగా సన్ గ్లాస్సెస్ వాడతారు. ఏ రంగైనా పర్లేదు కంటికి పూర్తి రక్షణ ఇచ్చేదిగా వుండాలి. పోలరైజ్ డ్ సన్ గ్లాస్సెస్ వల్ల అంత ఉపయోగం లేకపోవచ్చు తెల్లని చాయ గలవారు సన్ స్క్రీన్ లోషన్ మొఖానికి అప్లయ్ చేయాలి. అంత పెద్దగా వున్న టోపీలు ధరిస్తే కళ్ళ పైకి నేరుగా ఎండ పడకుండా వుంటుంది. కళ్ళని చల్లని నీళ్ళతో కడుక్కుంటూ వుండాలి. పిల్లల్లో కంటి పోర పెద్దదిగా వుంటుంది. ఎండల్లో ఎక్కువగా ఆడుతుంటారు. వీలైనంత వరకు ఎండ ప్రభావం తగ్గే వరకు పిల్లల్ని ఎండలోకి వేల్లనివ్వక పోవడం మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్ వుండే మంచి పోషకాహారం పిల్లలకు ఇవ్వాలి. పెద్దలూ తీసుకోవాలి. అప్పుడే ఎండ నుంచి మనల్ని రక్షించుకో వచ్చు. ఎట్టి పరిస్తితుల్లోనూ సూర్యుడిని నేరుగా చూడకూడదు. ఇది వేసవికే కాదు అన్ని కాలాలకూ వర్తిస్తుంది.

    ఎండల్లో పిల్లలు జాగ్రత్త

    ఎండకు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేవి కళ్ళు. అత్యంత కాంతివంతమైన వాతావరణంలోకి వెళ్ళే సమయంలో కళ్ళకు తప్పనిసరిగా సన్ గ్లాస్సెస్ వాడతారు. ఏ రంగైనా పర్లేదు కంటికి పూర్తి…

  • ఇప్పుడు మూడేళ్ళకే స్కూల్ కి వెళ్లి పోతున్నారు కాబట్టి వాళ్ళకి వేసవి సెలవులోచ్చాయి అని చెప్పుకోవాలి. కనీసం నలుగు గంటలన్నా అమ్మకి రెస్ట్ దొరికేది. ఇప్పుడు పిల్లలంతా ఇంటి పట్టునే . వాళ్ళ బద్రత చాలా ముఖ్యం. పిల్లలు ఎక్కువగా మెట్లవైపే వెళతారు. అక్కడే సేఫ్టీ గుర్డ్స్ ఏర్పాటు చేసుకోవాలి. మెట్ల పైన ఆడకుండా , దుకకుండా చూడాలి. బల్కనీ ఎత్తు తక్కువగానే వుంటుంది. పిల్లలు కుర్చీలు ఈడ్చుకు పోయి, వాటి పైన ఎక్కి తొంగి చూస్తారు. రెయిలింగ్ కు కాళ్ళు పెట్టి ఎక్కేసి తొంగి చూస్తారు. అక్కడే కాపలా కాయాలి. టైల్స్ మార్బల్స్ పైన వాళ్ళే వాళ్ళే నీళ్ళు వలకస్తారు, జారి పడిపోతారు. ఇంట్లో వాష్ రూమ్ లో నీళ్ళు పడకుండా చూడాలి. ఓవెన్స్, హీటర్స్, చపాతి మేకర్స్, ఎలెక్ట్రిక్ కుక్కర్స్, ఇస్త్రీ పెట్టెలు ఏవీ పిల్లలకు అందకుండా సర్దుకోవాలి. కెమికల్స్, హానికరమైన క్లీనింగ్ లిక్విడ్స్ వాళ్ళకు అందనీయవద్దు. ఎదో కూల్ డ్రింక్ అనుకుని తాగేస్తే ... ఇలా వరస బట్టి ఎక్కడ ప్రమాదం జరిగే అవకాశం వుండదు. అవన్నీ ద్రుష్టిలో వుంచుకోవాలి.

    ప్రమాదాల జోలికి పోనీకండి

    ఇప్పుడు మూడేళ్ళకే స్కూల్ కి వెళ్లి పోతున్నారు కాబట్టి వాళ్ళకి వేసవి సెలవులోచ్చాయి అని చెప్పుకోవాలి. కనీసం నలుగు గంటలన్నా అమ్మకి రెస్ట్ దొరికేది. ఇప్పుడు పిల్లలంతా…

  • పెరిగే వయస్సున్న చిన్న పిల్లల తల్లిదండ్రులు ఈ అధ్యయనాన్ని శ్రద్ధగా చదువుకోవాలి. రిపోర్టు ఇలా వుంది. పిల్లల ప్రవర్తనకు సంబందించిన చర్చలు, ఆరోగ్యవంతమైన నిబందనలు పెట్టే వారికి, ఏ మాత్రం చరచాలకు ఆస్కారం ఇవ్వకుండా. కఠినమైన నిబందనలు పెట్టేవారికి ఈ నిభందనల విశ్లేషనల్ని విస్తృత స్థాయిలో నిర్వహించినప్పుడు, ఎక్కువ ఆంక్షలకుగురయ్యే పిల్లలు అధిక బరువు తో ఉన్నాట్లు గుర్తించారు. బాగా కఠినంగా వుంటూ పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టాలని తల్లిదండ్రులు సంతృప్తిగా వుంటారు. అయితే ఈ కఠిన నియంత్రణకు లోనైన పిల్లలు విపరీతమైన వత్తిడికి గురై బరువు పెరిగిపోతారట. పిల్లల బరువు వాళ్ళు తినే పదార్ధాలు. ప్రభావితం చేస్తాయి అనడంలో సందేహం లేదు. పెంపకం తీరు,వాళ్ళ గురించి నిరంతరం చేసే చర్చలు, తీర్మానాలు, వాళ్ళు పిల్లలను శాశించే తీరుఇవి పిల్లల పైన ప్రభావం చూపెడతాయి. ఈ టెన్షన్ కు పెద్దవాళ్ళ లాగే ఎదో ఒక్కటి తియ్యనిది తినేస్తుంటారు. మనస్సు మరల్చుకునేందుకు తల్లిదండ్రుల నియమాల బాధ తప్పించుకోలేక పిల్లలు తిండిని ఆశ్రయిస్తారు. ఇలాంటి స్థితిని పిల్లలకు కల్పించ వద్దని పిల్లల పెంపకంలో పరిమితులు ఆంక్షలు నడుమ సరైన సమతుల్యం వుండాలని రిపోర్టు చెపుతుంది.

    బరువు పెంచుతున్న ఆంక్షలు

    పెరిగే వయస్సున్న చిన్న పిల్లల తల్లిదండ్రులు ఈ అధ్యయనాన్ని శ్రద్ధగా చదువుకోవాలి. రిపోర్టు ఇలా వుంది. పిల్లల ప్రవర్తనకు సంబందించిన చర్చలు, ఆరోగ్యవంతమైన నిబందనలు పెట్టే వారికి,…

  • పిల్లల విషయంలో స్లీప్ హైజీన్ అంటే ఆరోగ్యవంతమైన నిద్ర అలవాటు అంటే తగినంతగా, నాణ్యమైన నిద్ర పోయేలా సరైన చర్యలు తిసుకోమంటున్నారు. చిల్డ్రన్స్ స్పెషలిస్టులు. పిల్లల విషయంలో పడుకునే సమయం, స్లీప్ రోటీన్ సౌకర్యంగా నిర్ణీత పద్దతిప్రకారం వుండాలి. పడుకునే వెలలు, నిద్ర లేచే సమయాలు నిర్ణీత క్రమంలో సాగాలి. వారాంతాల్లో సైతం ఈ రోటీన్ కు ఇబ్బంది కలుగ కూడదు. నిద్రించే వేళల్లో ఓ గంట కూడా మార్పు లేనట్లు వుండాలి. పడుకునే ముందు ఆటలు, టెలివిషన్ చూడటం, కంప్యుటర్ గేమ్స్ అడనివ్వకూడదు. ఆకలితో నిద్ర పొమ్మనడం లేదా పడుకునే ముందు అతిగా ఆహారం పెట్టడం రెండు తప్పే. కాఫీ, టీలు, పానీయాలు చాక్లెట్స్ అస్సలు ఇవ్వకూడదు. క్రమం తప్పకుండా అవుట్ డోర్ ఆటలకు ప్రోత్సహించాలి. పిల్లల పడక గది చాలా ప్రశాంతంగా వుండాలి. బాల్యంలో నిద్ర లేమికి గల కారణాలు వైద్యులను సంప్రదించి తెలుసుకోవాలి. అప్పుడే సమస్య పరిష్కారం అవుతుంది.

    కళ్ళ పైకి నిద్ర వచ్చి వాలాలి అంటే!

    పిల్లల విషయంలో స్లీప్ హైజీన్ అంటే ఆరోగ్యవంతమైన నిద్ర అలవాటు అంటే తగినంతగా, నాణ్యమైన నిద్ర పోయేలా సరైన చర్యలు తిసుకోమంటున్నారు. చిల్డ్రన్స్ స్పెషలిస్టులు. పిల్లల విషయంలో…

  • చక్కని తెలివైన సంతానం కావాలనుకుంటారు తల్లులు. తల్లి కడుపులో ఉండగానే యుర్ధతంత్రం విన్నాడట అభిమన్యుడు. ఇవి పురాణ కదలని కొట్టి పారేయకండి అంటున్నాయి అధ్యయినాలు. గర్బినీలు నిత్యం తమ కడుపులో వుండే శిశువుకి కధలు చెప్పి వినిపించాలంటున్నారు. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా వుండాలంటే, శిశువు మెదడు వృద్ది చెందటానికి ఒమేగా-3 ఫ్యాటి యాసిడ్స్ అవసరం. కాబట్టి సోయాబీన్స్, చేప, పాలకూర, వంటివి తల్లి నిత్యం తినాలి. అంతే కాదు నట్స్, వాల్ నట్స్, బాదాం వంటివి పొట్టలోని పాపాయి బ్రెయిన్ అభివృద్ధికి తోడ్పడతాయి. గర్బిణిలు మంచి ఫిట్ నెస్ తో వుండాలి. తప్పని సరిగా వాళ్ళు వ్యాయామం చేయవలసిందే. ఈ వ్యాయామాలు కడుపులోని బిడ్డకు ఆరోగ్యమే. పెరుగుతున్న బిడ్డకు తల్లి ఎదో ఒకటి మాట్లాడుతూ, పాటలు వినిపిస్తూ వుండాలి. పాటలకు శబ్దాలకు కడుపులోని బిడ్డ బాగా స్పందిస్తుంది, గర్భిణి స్త్రీలు సుప్ప్లిమెంట్స్ తీసుకోవాలి. డి-విటమిన్ చాలా అవరం కూడా ఇందుకోసం ఉదయపు ఎండలో కాసేపు నడిచినా మేలే.

    కడుపులో శిశువుకి వినిపించాలి

    చక్కని తెలివైన సంతానం కావాలనుకుంటారు తల్లులు. తల్లి కడుపులో ఉండగానే యుర్ధతంత్రం విన్నాడట అభిమన్యుడు. ఇవి పురాణ కదలని కొట్టి పారేయకండి అంటున్నాయి అధ్యయినాలు. గర్బినీలు నిత్యం…

  • పిల్లలకు తాజా పండ్లు కూరగాయలు పోషకాహరంగా ఇస్తారు. ఎక్కువ పోషకాల కోసం రెండు రకాల పండ్లు కలిపి పెడతారు. వాళ్ళకోసం ఈ కాంబినేషన్స్ ఇవ్వమంతున్నారు పోషకాహార నిపుణులు. పీచ్, యాపిల్, కర్జూర్, పుచ్చకాయ, ఫిగ్, వంటివి స్వీట్ ఫ్రూట్ రకానికి చెందిన పండ్లు కలిపి తినొచ్చు. నిత్రిన్ జాతి అంటే నారింజ, కమలాఫలం, బత్తాయి, నిమ్మ, కివి, ద్రాక్ష, పైనాపిల్, చెర్రి వంటి ఆమ్ల గుణాలన్నపండ్ల రసానికి, కలిపి చిన్నారులకు ఇవ్వొచ్చు. మామిడి రస్ చెర్రీ, గ్రీన్ చెర్రి, స్ట్రాబెర్రీ, ఆపిల్ వంటి సెమి సెమి ఆసిడ్ రకానికి చెందిన పండ్లు మిశ్రమం గా చేసి పిల్లలకు ఇస్తే మంచిది. ప్రోటీన్లు ఖనిజ లవణాలు నూనె లో వంటి గుణాలు కలగలిసిన తటస్థ రకానికి చెందిన అవకడో, బాదాం, కొబ్బరి, వాల్ నట్స్ కూడా కలిపి ఇవ్వొచ్చు. కానీ జమ పండు, అరటి పండు కలిపి ఇవ్వడం, బొప్పాయి, కమలా ఫలం, క్యారెట్ కలిపి ఇవ్వడం మంచిది కాదు. కూరగాయలు, పండ్లు కలిపి చేసే సలాడ్ కూడా పిల్లలకు మంచిది కాదు. కొన్ని తేలికగా అరిగే గుణం వల్ల, కొన్నింటిలో అలంటి లక్షణం లేకపోవడం వల్ల సమస్యలు వస్తాయి.

    ఇలా కలిపి ఇస్తే చాలా లాభం

    పిల్లలకు తాజా పండ్లు కూరగాయలు పోషకాహరంగా ఇస్తారు. ఎక్కువ పోషకాల కోసం రెండు రకాల పండ్లు కలిపి పెడతారు. వాళ్ళకోసం ఈ కాంబినేషన్స్ ఇవ్వమంతున్నారు పోషకాహార నిపుణులు.…

  • గతంలో వున్న కుటుంబ వాతావరణంలో పిల్లలకు క్రమశిక్షణ, మంచి అలవాట్లు, నిద్రా సమయం, భోజన సమయం అంటూ వుండేవి. ఇప్పిడా పరిస్థితి లేదు. తల్లిదండ్రులకు పరుగులెత్తే ఉద్యోగాలు, పిల్లలకు వత్తడి తెచ్చే వాతావరణంఎక్కువ కాలరీలున్న భోజనం, తియ్యని డ్రింకులు, తల్లిదండ్రుల కోసం ఎదరు చూస్తూగంటల కొద్దీ టీ.వి ల ముందు కూర్చోవడం పెద్దలతో సమానంగా నిద్ర ఇవన్నీ పిల్లల్ని ఉబకాయం వైపుగా లాగుతున్నాయి. తొందరగా తిని తొందరగా నిద్ర పొతే ఈ సమస్య వుండదు అంటారు పరిశోధకులు. కోరుకున్న స్థాయిలో లేదా అవసరమైనంత నిద్ర పోయేవారుతినే తిండి కంటే తక్కువ క్యాలరీలు తీసుకుంటారు. ఈ నిద్ర తోనే పిల్లల్లో తిండి పరిమాణం తగ్గడం గమనించారు. మితిమీరిన బరువు వల్లన వచ్చే బద్ధకం కొత్త విషయాలు నేర్చుకోవడం పట్ల కూడా శ్రద్ధ తక్కువై పోతుంది. తల్లిదండ్రుల గారాబం వల్లనే పిల్లలకు జంక్ ఫుడ్ తినడం ఎక్కువ అయ్యింది అని, పిల్లల క్షేమం కోరితే ముందుగా వాళ్ళ ఆహారం, నిద్ర, ఆటలాడే వేళల పైన దృష్టి పెట్టాలని పరిశోధనలు గట్టిగా చెపుతున్నాయి.

    నిద్ర తగ్గడం వల్లనే ఈ శరీర భారం

    గతంలో వున్న కుటుంబ వాతావరణంలో పిల్లలకు క్రమశిక్షణ, మంచి అలవాట్లు, నిద్రా సమయం, భోజన సమయం అంటూ వుండేవి. ఇప్పిడా పరిస్థితి లేదు. తల్లిదండ్రులకు పరుగులెత్తే ఉద్యోగాలు,…

  • వేసవి తో పాటు పిల్లల వేసవి సెలవులోస్తాయి. వాళ్ళని ఉత్సాహం కలిగించే వ్యాపకాల కోసం తల్లి దండ్రులు చూస్తారు. సమ్మర్ క్యాంపులుసరే అనుకోండి. ఇక ఇంట్లో వుండే సమయంలో వాళ్ళకి క్రీడలపై ఇష్టం కలిగేలా చూడాలి. సైకిల్ తొక్కనివ్వచ్చు. వారి జీర్ణ క్రియ రేటు మెరుగు పడుతుంది. కంప్యూటర్ కు అత్తుక్కు పోయే ఆటలకు చెక్ పెట్టండి. పిల్లలకు బాట్మెంటెన్ రాకెట్ కొనివ్వాలి. అలాగే తాడాట, బంతి వంటివి ఆరు బయట ఆడుకునే దాగుడు మూతలు, కబడ్డీ వంటివి ఉత్సాహం ఇచ్చే ఆటలు ప్రోత్సహిస్తే ఇవి ఇవి వాళ్ళకి శారీరక బలం, సామాజిక చొరవ రెండూ వస్తాయి. అలాగే చాలా అప్పర్ట్ మెంట్స్ లో ఈత కొలను ఏర్పాటు చేస్తున్నారు. లేదా ఈత గురించి చెక్కని శిక్షకుల దగ్గర శిక్షణ ఇప్పిస్తే ఈ శిక్షణ వల్ల శరీరానికి మెదడుకి మంచి వ్యాయామం లభిస్తుంది. అన్నింటికంటే పిల్లలను, ఏ సమ్మర్ స్కూల్ లో పంపేసి ఈ సెలవుల్లో వాళ్ళతో ఎక్కువ గడిపే వీలు చూసుకోవడం ఎంతో మంచిది.

    ముందు వాళ్ళ కోసం సమయం కేటాయించండి

    వేసవి తో పాటు పిల్లల వేసవి సెలవులోస్తాయి. వాళ్ళని ఉత్సాహం కలిగించే వ్యాపకాల కోసం తల్లి దండ్రులు చూస్తారు. సమ్మర్ క్యాంపులుసరే అనుకోండి. ఇక ఇంట్లో వుండే…

  • ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే సహజంగా ఎప్పుడూ యుర్ధాలు నడుస్తాయి కొట్టుకుంటారు. ఒకే వస్తువు కోసం పోటీ పడతారు. మాములే కానీ అమ్మ మాత్రం మాత్రం ఇదరి విషయంలో ముఖ్యమైన ఒక్క జాగ్రత్త తీసుకోవాలి. ఇద్దరిలో ఏ ఒక్కరినో ఎప్పుడూ గరం చేయొద్దు. వెనకేసుకు రావద్దు చిన్న పిల్ల అనో, పోన్లే పాపం అన్నేకదా అనో ఇద్దరికీ సర్ది చెప్పరాదు. ఇలా చేస్తే అవతలి వాళ్ళు అంటే అమ్మకి ఇష్టం అని ఫిక్స్ అయ్యిపోయి రెండో వాళ్ళని శత్రువర్గంలో చేర్చేస్తారు. కాబట్టి ఇద్దరు సమానం అనే ఉద్దేశాన్ని వాళ్ళల్లో కలుగనివ్వాలి. ఆట వస్తువులు ఎవ్వరికి ఇష్టం అయినవి వాళ్ళకు కొనివ్వాలి. రెండో వాళ్ళ దగ్గరనుంచి బలవంతంగా ఇంకొకళ్ళ కోసం ఏ వశువు బలవంతంగా లాక్కోవద్దు. పిల్లలు ఇద్దరు పసివాల్లే. బలహీనమైన వాళ్ళే. కారణం తలుసుకుని అప్పుడు ఎవరి తప్పు అయితే న్యాయం గా వాళ్ళనే కారణం చూపించి మరీ కోప్పడాలి. సరైన జుడ్జిమెంట్ ఇవ్వాలి. ఒకళ్ళ ఫిర్యాదు తో ఇంకొక్కల్లను దండిస్తే పిల్లలు బాధపడతారు.తప్పు ఎవరిదో నిర్ధారించి చెప్పి మరీ కోప్పడాలి.

    పిల్లలు ఎంతో సెన్సిటివ్

    ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే సహజంగా ఎప్పుడూ యుర్ధాలు నడుస్తాయి కొట్టుకుంటారు. ఒకే వస్తువు కోసం పోటీ పడతారు. మాములే కానీ అమ్మ మాత్రం మాత్రం ఇదరి విషయంలో…

  • సైకాలజిస్టలకు ఎవరినైనా వప్పించటం చాలా సులభం. ఈ ట్రిక్స్ ని అమ్మలు కూడా ఉపయోగించి పిల్లలకు ఎలా చెప్పినా వింటారు. ఏది చెయ్యమన్నా చేస్తారని చెపుతున్నారు . పిల్లల్ని వప్పించాలి. కోప్పడతారు . ఉదాహరణకు చేతులు కడుక్కోండి. శుభ్రంగా ఉండమని అరచి గీ పెట్టినా వినరు. సరదాగా కొన్ని రూల్స్ పెట్టాలి. చేతులు కడుక్కోవాలి అంటే ఎ మొదలుపెట్టి z వచెట్లుగా అంకెలు పెద్దగా చదువుతూ కడుక్కురమ్మని అలాగైతే తాను అక్షరాలు ఎంత బాగా చెపుతున్నారో వినాలనుకుంటున్నానని చెప్పాలి. అలాగే కొన్ని స్టిక్కర్స్ తెచ్చి పెట్టుకుని ప్రతి మంచి పనికి ఒక స్టిక్కర్ ఇస్తానని చెప్పాలి. ముందుగా ఆ స్టిక్కర్లు లేదా గిఫ్ట్ లు ఎదో చెప్పకూడదు. గిఫ్ట్ స్టిక్కర్ కావచ్చు. చాక్లేట్ కావచ్చు . అమ్మకే తెలియాలి . పిల్లలు కన్విన్స్ అవుతారు. జస్ట్ ఇలాంటివి ఒకటి రెండు ఉదాహరణకు మనసులో పెట్టుకుఇ పిల్లల్ని మంచి అలవాట్ల వైపు మళ్లించేందుకు తల్లులు సైకాలజిస్టులు అవతారం ఎత్తాలని చెపుతున్నారు.

    సైకాలజీ తో పట్టుకోండి

    సైకాలజిస్టలకు ఎవరినైనా వప్పించటం చాలా సులభం. ఈ ట్రిక్స్ ని అమ్మలు కూడా ఉపయోగించి పిల్లలకు ఎలా చెప్పినా వింటారు. ఏది చెయ్యమన్నా చేస్తారని చెపుతున్నారు .…

  • గంటల కొద్దీ చదువుకునే వేళలు విశ్రాంతి లేని రోజులు కాస్సేపైనా ఆట లాడే అవకాశాలు లేకపోవటం వల్ల పిల్లలో ఫిట్ నెస్ లేకపోవటమే చిరాగ్గా విసుగ్గా అసహనంగా ప్రవర్తించటానికి కారణాలంటారు. హైస్కూల్ చదువుల సమయానికి పిల్లలపై అంతులేని చదువు బాధ్యత ఉంటోంది. మిగిలిన కాస్తో కూస్తో టైం సహజంగా ఏ కార్టూన్ నెట్వర్క్ చూస్తారు. నిద్ర వేళలు తగ్గిపోతున్నాయి. విశ్రాంతి సమయం కూడా తగ్గుతోంది. పిల్లల్ని శారీరిక ఫిట్ నెస్ వైపుగా ప్రోత్సహించమంటున్నాయి. అధ్యయనాలు. అప్పుడే వారి ఆలోచన ధోరణి జ్ఞాపకశక్తి పెరుగుతూ వున్నాయి. పిల్లలు అభ్యాస ప్రక్రియలోని వుంటారు . చూసి చదివి నేర్చుకుని గుర్తుపెట్టుకుంటారు. ఫిట్ నెస్ లేని వాళ్లలో ఈ జ్ఞాపక శక్తి చురుకుదనం నశిస్తున్నాయి. పిల్లల్ని ఇండోర్ గేమ్స్ కో కంప్యూటర్ గేమ్స్ కో పరిమితంచేయకుండా బయట ఆటలాడేందుకు లేదా ఇతర వ్యాయమాలకు ప్రోత్సహించండి చదువుకు ఫిట్ నెస్ చాలా ముఖ్యం అంటున్నారు.

    జ్ఞాపక శక్తి పెంచే ఫిట్ నెస్

    గంటల కొద్దీ చదువుకునే వేళలు విశ్రాంతి లేని రోజులు కాస్సేపైనా ఆట లాడే అవకాశాలు లేకపోవటం వల్ల  పిల్లలో ఫిట్ నెస్ లేకపోవటమే చిరాగ్గా విసుగ్గా అసహనంగా…

  • పిల్లలు పెద్దలు అన్న తేడా లేదు. అందరు సెల్ ఫోన్స్ కు అతుక్కుపోయి కనిపిస్తారు. చదువుకునే పిల్లలు కూడా ఇలా సెల్ ఫోన్స్ తో బిజీగా వుండటం వల్ల ఎంతో సమయం వృధా అవుతోందని వాళ్ళు ఎంతో యాంగ్జైటీ లో ఉండటం వల్ల సగటు పాయింట్ గ్రేడ్స్ తగ్గిపోయున్నాయని కెంట్ స్టేట్ విశ్వవిద్యాలయ అధ్యయనాల్లో గుర్తించారు . పిలల్లు సెల్ ఫోన్స్ వాడిన స్థాయిలు వాళ్ళు పరీక్షల్లో తెచ్చుకునే గ్రేడ్స్ మ్యాచ్ చేసి చూసారు . గ్రేడ్స్ సరిగా లేవు . వత్తిడీ అధికంగా కనిపించింది. ఫోన్ ద్వారా నిరంతరం నెట్ వర్క్ కు కనెక్టయి ఉండటం ఆబ్లిగేషన్ అనుకోవటమే ఇందుకు కారణమని అధ్యయనాలు చెప్పాయి. ఈ ఆబ్లిగేషన్ ఇంట్లో కాలేజీలోజిమ్ లో షాపింగ్ మాల్ లో ఎక్కడున్నా వెంటాడుతూ ఉంటుంది. ఇదే యువత పై వత్తిడి తెస్తోంది. అలాగే పని లో వుండే పెద్దలకు ఇదే ఆబ్లిగేషన్. వాళ్ళకీ కాస్తంత రిలాక్స్ గా వుండే అవకాశం లేదు. మానసిక ఆరోగ్యం బావుండాలంటే ఈ సెల్ ఫోన్స్ కు కాస్త దూరంగా ఉండమని అధ్యయనాలు చెపుతున్నాయి .

    సెల్ ఫోన్ లతో చదువులకు అంతరాయం

    పిల్లలు పెద్దలు అన్న తేడా లేదు. అందరు సెల్ ఫోన్స్ కు అతుక్కుపోయి కనిపిస్తారు. చదువుకునే పిల్లలు కూడా ఇలా సెల్  ఫోన్స్ తో బిజీగా వుండటం…

  • టెక్సాస్ లోని ఓ డే కేర్ సెంటర్ దగ్గర గెట్ ఆఫ్ యువర్ ఫోన్ అని ఒక నోట్ అంటించారట. ఆడే కేర్ సెంటర్ నుంచి పిల్లలను తీసుకుపోవడానికి వచ్చే పేరెంట్స్ అందరిచేతుల్లో ఫోన్లే . ఆ బిజీ గా మాట్లాడటం పిల్లలను మెకానికల్ గా ఎదో వస్తువుల్ని కలెక్ట్ చేసుకున్నట్లు తీసుకుపోవటం చూసి వళ్ళు మండి వర్కింగ్ పేరెంట్లు స్మార్ట్ గా వుండే అమ్మానాన్నలు మీ పిల్లల కోసం ఆ ఫోన్ లు కాసేపు అవతల పారేసి నవ్వు మొహాలేసుకుని పిల్లల కోసం రండి. పిల్లాడ్ని ఎత్తుకుని వాడి మొహం వాడి ఆటపాటలు కాస్సేపైనా చూడండి. అవి నోట్ అర్ధం వచ్చేదెలా వుంది. ఆ నోట్ ను చూసి ముచ్చట పడి టెక్సాస్ కు చెందిన మజూత్ క్వీజ్ అన్నావిడ ఆ నోట్ ఫోటో తీసి పేస్ బుక్ లో అప్ లోడ్ చేస్తే ఆ పోస్ట్ ని లక్షల మంది చూసి తమ స్పందన తెలియజేసారు. బోలెడు మంది పేరెంట్స్ ఆ నోట్ చూసి నాలుక కొరుక్కున్నారట . కరెక్ట్ కదా !!

    ఫోన్ కాస్సేపు ఆపండి బాబూ

    టెక్సాస్ లోని ఓ డే కేర్ సెంటర్ దగ్గర గెట్ ఆఫ్ యువర్ ఫోన్ అని ఒక నోట్ అంటించారట. ఆడే కేర్ సెంటర్ నుంచి పిల్లలను…

  • పిల్లలకు స్టార్ కిడ్స్ ట్రీట్ మెంట్ వద్దనుకుంటున్నారు సెలబ్రెటీస్. పిల్లలకి జీవితపు విలువలు తెలుసుకోవటం ముఖ్యం అంటున్నారు. కోట్ల కొద్దీ డబ్బు సంపాదిస్తూ పిల్లలకి వారసత్వంగా వట్టి సంపద మాత్రమే కాదు. డబ్బు విలువ తెలియజెప్పి సొంతంగా సంపాదించేలా పెంచాలంటున్నారు. కెరీర్ పీక్ లోఉండగా అజయ్ దేవగన్ ని పెళ్లాడిన కాజోల్ కు ఇద్దరు పిల్లలు నైసా ,యుగ్. వాళ్ళని అజయ్ దేవగన్ కాజోల్ పిల్లలుగా సెలబ్రేటీలుగా ప్రపంచం ముందు పెట్టటం కాకుండా డిసిప్లిన్ తో స్ట్రిక్ట్ గా మళ్ళీ ఫ్రెండ్లీ గా పెంచుతున్నానంటోంది కాజోల్. పిల్లలు పెద్దవుతూ నీ డ్రెస్ బావుంది అన్న రోజునుంచి నా డ్రెస్సింగ్ విషయంలో ఆచి తూచి అడుగులు వేసాను. వాళ్లిద్దరూ వాళ్ళ 15 సంవత్సరాల వయసు నుంచే సంపాదన మొదలుపెట్టాలి. వాళ్ళ మనసులో పని నీతి నాటాలనుకున్నానంటోంది కాజోల్. వాళ్ళకి అవసరమైన వాటికంటే ఎక్కువే వున్నాయి. కానీ ఆ విషయం వాళ్లకు తెలియనివ్వను. వాళ్ళు పరిపూర్ణ వ్యక్తిత్వంతో పెరిగి పెద్దవాళ్లవ్వనివ్వాలి అంటోందామె.

    వాళ్ళు మాములు పిల్లల్లా ఎదగాలి

    పిల్లలకు స్టార్ కిడ్స్ ట్రీట్ మెంట్ వద్దనుకుంటున్నారు సెలబ్రెటీస్. పిల్లలకి జీవితపు విలువలు తెలుసుకోవటం ముఖ్యం అంటున్నారు. కోట్ల కొద్దీ డబ్బు సంపాదిస్తూ పిల్లలకి వారసత్వంగా వట్టి…