నెమలీక
ఇచ్చుటలో ఉన్న హాయీ…
నీహారికా, మనం నిముష నిముషం గుర్తు తెచ్చుకోవలసిన విషయం ఒకటుంది. జీవితాన్ని ఆనందంగా గడపాలంటే, మనిషి జీవితం సంతోషమయం కావాలంటే ఏం చేయాలి. మనిషి ముందర సంతృప్తిగా జీవించాలి. ఆ సంతృప్తి ఎక్కడ దొరుకుతుందీ అని అన్వేషిస్తే ఇవ్వడంలో అని తేలిందట. అవును ఎవరో సినిమా కవి చెప్పినట్లు “ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటనూ లేనేలేదని” మనకున్నదానిలో ఎదుటి మనిషికి ఏదైనా ఇవ్వడం, సాయం చేయడంలో కలిగే తృప్తి వర్ణించతరం కాదని తేలింది. నిజమే మనకి సంతృప్తి […]
నిబ్బరంతో బయట పడాలి.
నీహారికా, నీ అనుభవం నీ వయసులో ఉండే ఎంతో మందికి ఎదురయ్యిందే. ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకుని కష్టపడి పనిచేస్తావు గుర్తింపు రాదు. ఆఫీసులో ఒక సెక్షన్ హెడ్ గా అవుతావు, మిగతా వాళ్ళు సరిగ్గా మాట వినరు. ఇలా ఒక్క కెరీర్ లోనే కాదు వ్యక్తిగత జీవితంలోను ఎన్నో ఓటములు ఉంటాయి. వాటి నుంచి బయట పడాలంటే చాలా నిబ్బరం కావాలి. అలా ఎప్పుడైనా ఓటమి ఎదురయితే ఉద్వేగంతో స్పందించకూడదు, నియంత్రణలో ఉండాలి. వీలైతే అలాంటి […]
అతి ముఖ్యమైన పనేదో ఎంచుకొంటే చాలు
నీహారికా, కరెక్ట్ గా చెప్పావు. నిముషానికో వాట్సప్ మెసేజ్ వస్తుంది. స్మార్ట్ ఫోన్ కదా న్యూస్ అలర్ట్ లు వస్తాయి. మెసేజులు, ఫోనులు, చదువు, పార్ట్ టైం జాబ్… అసలు ఏకాగ్రత ఒక్క పని మీద కూడా వుండటం లేదు అన్నావు. నిజమే ఇన్ని విషయాల మధ్య పని పై తదేక ధ్యాస నిలపటం కష్టం. కానీ అలవాటు చేసుకోవాలి. ప్రాధాన్యం లేని విషయాలు మనసు నుంచి, పరిసరాల నుంచి దూరం చేస్తేనే అసలైన వాటి పైన […]
జీవితకాలపు జ్ఞాపకంగా మలచుకోవాలి
నీహారికా, పెళ్ళవగానే వెంటనే హనీమూన్ అంటుంటారు. అలా వెంటనే ఆనవాయితీనా, వెల్లితీరాలా అన్నావు. అదేం కాదు. ఒకళ్లనోకళ్లు అర్ధం చేసుకొనే ఏకాంతo కోసం అని ఒక పద్ధతి అలవాటు చేసుంటారు కానీ పెళ్లి అయ్యి అవ్వగానే ఫ్లయిట్ ఎక్కేయడం గురించి మాత్రం కొంచెం ఆలోచించుకోవాలి. పెళ్ళికి ఎంతోమంది బంధువులు, మిత్రులు వస్తారు. అటూ ఇటూ పాటించవలసిన సంప్రదాయాలు వుంటాయి. వెంటనే ప్రయాణం కాస్త ఒత్తిడే. అసలు భార్యాభర్తలు ముందే కొత్త. ఒకళ్ళ అలవాట్లు, ఇష్టాలు ఇంకొకరికి తెలియవు. […]
ఈ ఒక్క పదాన్ని పక్కన పెడితే చాలు
నీహారికా, ఈ ప్రపంచంలో అందరూ నేర్చుకోవలసిన విషయం ఒకటి చెప్పనా! మనం సుఖంగా జీవించాలంటే ఎన్నో రకాలైన కోరికలను కోరుకోవడం, ఎన్నో కావాలని ఆశపడటం చివరకు అవి లభించకపోతే నిరాశ పడటం అందరికీ ఎదురయ్యే అనుభవం. అయితే సుఖంగా ఉండాలంటే మాత్రం నిరాశను అనుభవంలోకి తెచ్చుకోకుండా ఉండాలి. అసలు ముందుగా ఎలాంటి కోరికలు కోరుకుంటున్నారు, అవి తీరగలవా? మనం దేన్నీ ఆశిస్తున్నాం అది సాధ్యపదేడా అని ఆలోచిస్తే వరసగా సమాధానాలోస్తాయి.మనం కోరుకునేవి మన పరిధిలో వుంటేఅవి తీర్చుకోవడం […]
ఖర్చుల విషయంలో నిక్కచ్చిగా వుండాలి
నీహారికా, మానవ సంబంధాల్లో డబ్బు పాత్ర ఎంతో చిత్రమైంది. సంబంధాలు విడదీసేదీ, కలిపేదీ డబ్బే అందుకే అయినవాళ్ళ మధ్య, స్నేహితుల మధ్య డబ్బుకు సంబంధించిన ఇచ్చిపుచ్చుకోవడాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం స్నేహితులతో కలిసి ఏ హోటలుకో, సినిమాకో వెళతాం.ఖర్చు ఎవరు పెట్టుకోవాలి. ఈ స్నేహాలు కలకాలం ఉండాలంటే ఖర్చు షేర్ చేసుకోవడం ముందు నుంచి మొదలు పెట్టాలి. ఎవరో ఒకరు మొత్తం ఖర్చు పెట్టేలా చూసి, ఆ ఖర్చును అణాపైసలతో సహా లెక్క వేసి ఇచ్చేసే ఏర్పాటు […]
