• ఇందులో పెద్ద చిత్రం ఏవీ లేదనిపిస్తుంది. కానీ ఫ్యాషన్ గురుల కళ్ళలో చూడాలి. ఆలా చూస్తేనే పాదరక్షలు వందలాది డిజైన్స్ పుట్టుకొస్తున్నాయో తెలుస్తుంది. కార్పొరేట్ ఉద్యోగినుల దగ్గరనుంచి పల్లెటూరి అమ్మాయిల వరకు కొత్త హీల్ చెప్పులు వేయాల్సిందే. మడమల నొప్పులొస్తాయి తర్వాత బాధపడతారు అని చెప్పినా వినిపించుకోరు. హీల్స్ ఎత్తు చూస్తుంటే పదం కింద ఈఫిల్ టవర్ పెట్టినట్టుంటుంది. ఇంత క్రేజ్ ఉన్న హెల్త్ ఇంకా ఎన్ని ఫ్యాషన్ మెరుగులు అద్దాలు డిజైనర్లు. ఇలా ముస్తాబైన హీల్స్ తో ఎన్నెన్ని వెరైటీలున్నాయో చూడండి. చూసేసి ఇలా అర్దారిస్తే ఆలా వాకిట్లోకి వచ్చి కూర్చుంటాయి.

    హీల్స్ వెరైటీస్ సో మెనీ

    ఇందులో పెద్ద చిత్రం ఏవీ లేదనిపిస్తుంది. కానీ ఫ్యాషన్ గురుల కళ్ళలో చూడాలి. ఆలా చూస్తేనే పాదరక్షలు వందలాది డిజైన్స్ పుట్టుకొస్తున్నాయో  తెలుస్తుంది. కార్పొరేట్ ఉద్యోగినుల దగ్గరనుంచి…

  • బ్రిస్క్ వాక్, స్విమ్మింగ్, ఏరో బిక్స్ తో శరీరానికి వ్యాయామం సరే. కానీ మెదడుకు వ్యాయామం కావాలంటున్నారు ఎక్స్ పర్ట్స్ ముఖ్యంగా నగర జీవితంలో స్త్రీలకు ఇల్లు ఆఫీసు తప్ప వేరే జీవితం లేకుండా పోతుంది. మెదడుకి ఉత్సాహం తేవాలంటే ప్రకృతి తో సంబందం పెట్టుకోవాలి. బంధువులు, మిత్రులతో చెక్కని స్నేహం చేయాలి. మనస్పూర్తిగా మాట్లాడాలి. అప్పుడే వత్తిడి వుండదు అంటున్నాయి అధ్యాయనాలు. ఫజిల్స్, ఆటలు, ముఖ్యంగా పుస్తక పథనం మెదడులోని కణజాలన్నీ చురుగ్గా వుండేలా చేస్తాయి. సమయమంతా ఇంటి పనికీ, ఆఫీసు పనికీ పరిమితం చేసి అలసి పోయిన్న ఆడవాళ్ళు ఒక్క నిమిషం మెదడుకి విశ్రాంతి ఎలా విశ్రాంతి ఇస్తున్నారో గమనించండి.

    మెదడుకు వ్యాయామం ఇస్తున్నారా?

    బ్రిస్క్ వాక్, స్విమ్మింగ్, ఏరో బిక్స్ తో శరీరానికి వ్యాయామం సరే. కానీ మెదడుకు వ్యాయామం కావాలంటున్నారు ఎక్స్ పర్ట్స్ ముఖ్యంగా నగర జీవితంలో స్త్రీలకు ఇల్లు…

  • 13 మంది చిన్నారులను దత్తత తీసుకున్న హీరోయిన్ హంసిక దిపావళిని ముంబాయిలో ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటుంది. టపాసులు కల్చకూడదని ముందే నిర్ణయిచుకున్నానని ముందే చెప్పేస్తుంది. తను దత్తత తీసుకున్న చిన్న పిల్లలకు రకరకాల పోటీలు పెట్టి మంచి మంచి బహుమతులు ఇచ్చి దీపావళి ఆనందాన్ని వాళ్ళకు అందిస్తానంది. పెట్స్ కూడా మా ఇంట్లో ఎక్కువ దీపావళి టపాసుల శబ్దానికి అవి భయపడతాయి. ప్రకృతిని నోరులేని ప్రాణులనీ, చిన్న పిల్లలను కష్ట పెట్టడం ఇష్టం లేదు. అందరు హాయిగా సంతోషంగా గడపడమే దీపావళి అంటుందిహంసిక. ఈ హీరోయిన్ మనసు కూడా అందమే.

    దీపావళి టపాసులు కల్చనన్న హంసిక

    13 మంది చిన్నారులను దత్తత తీసుకున్న హీరోయిన్ హంసిక దిపావళిని ముంబాయిలో ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటుంది. టపాసులు కల్చకూడదని ముందే నిర్ణయిచుకున్నానని ముందే చెప్పేస్తుంది. తను దత్తత…

  • యునెస్కో గోల్డ్ మెడలిస్ట్ డి. దేవికా రాణి ఉదయార్, తడేపల్లి గూడెంలో ఉదయార్ అకాడమీ అండ్ ఫైనాన్సు వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించారు. దేవిక ఆల్ రౌండర్ నృత్యం, సంగీతం సాహిత్యం, జ్యోతిష్యం, వాస్తూ, వైద్యం, చిత్ర లేఖనం అన్నింటిలోనూ ప్రవేశం ఉంది. మహిళా శిల్పిగా గిన్నీస్ బుక్ లోకి ఎక్కాలి అని ఆమె ఆశయం ఇప్పటి వరకు 60 వేల విగ్రహాలు తాయారు చేసారు. అందులో ౩౦ విగ్రహాలు అంబేద్కర్ వే ఉన్నాయి. బడుగుల కుటుంబంలో జన్మించిన తొలి తెలుగు శిల్ప కారిణి దేవికా దేవి.

    60 వేల విగ్రహాలు తయారు చేసిన దేవికారాణి

    యునెస్కో గోల్డ్ మెడలిస్ట్ డి. దేవికా రాణి ఉదయార్, తడేపల్లి గూడెంలో ఉదయార్ అకాడమీ అండ్ ఫైనాన్సు వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించారు. దేవిక ఆల్ రౌండర్ నృత్యం,…

  • అమ్మాయిలు ఇప్పుడు ఆఫ్ షాల్టర్స్ పైన ఇష్టం పెంచుకుంటున్నారు. హైదరాబాద్ లో ఈ మధ్య జరిగిన ఓ వేడుకల్లో నటి త్రిషకూడా ఆఫ్ షాల్టర్స్ నే కనిపించింది. కొంచెం బొద్దుగా వుండే వాళ్ళకు వాదులుగా వుండే ఆఫ్ షాల్టర్స్ సరిగ్గా మ్యాచ్ అవుతుంది. పాల్కాడాట్ డిజైన్స్, లేత వర్ణాలతో ముఖ్యంగా తెలుపు నలుపు రంగులతో వుండే కాంబినేషన్స్ ఎంతో హుందాగా కనిపిస్తున్నాయి. ఆఫ్ షాల్టర్స్ లో ఇప్పుడు మాక్సీ డ్రెస్, ఆఫ్ షాల్టర్ లో పార్టీ వేర్ గా వద్దనుకుంటే నైట్ డ్రెస్ గా కూడా పనికొస్తుంది. ఆన్ లైన్ షాపింగ్ లో బోలెడన్ని వెరైటీలు చూడండి.

    ఆఫ్ షాల్టర్స్ సింపుల్ అండ్ కంఫర్ట్ బుల్

    అమ్మాయిలు ఇప్పుడు ఆఫ్ షాల్టర్స్ పైన ఇష్టం పెంచుకుంటున్నారు. హైదరాబాద్ లో ఈ మధ్య జరిగిన ఓ వేడుకల్లో నటి త్రిషకూడా ఆఫ్ షాల్టర్స్ నే కనిపించింది.…

  • నారింజ పండు తినేసి తొక్క పారేస్తాం కానీ ఈ తొక్కలో ఎన్నో ప్రయోజనాలున్నాయి. నారింజ తొక్కలోని సి-విటమిన్ చర్మం నిగారింపు వస్తుంది. నచురల్ సన్ స్క్రీన్ గా ఉపయోగ పడుతుంది. ఇవి బాగా ఎండ పెట్టి పొడి చేసి, ఇందులో పెరుగు తినే కలిపి పేస్టు చేసి మాస్క్ లా వేసుకోవచ్చు చర్మం పై ముడతలు పోగొట్టేందుకు ఈ పొడి చాలా పని చేస్తుంది. ఈ పొడిలో ఓట్ మీల్ తినే కలిపి మాస్క్ వేసుకునే మంచి ఫలితం ఉంటుంది.

    నారింజ తొక్కలతో చెక్కని ఫేస్ పాక్

    నారింజ పండు తినేసి తొక్క పారేస్తాం కానీ ఈ తొక్కలో ఎన్నో ప్రయోజనాలున్నాయి. నారింజ తొక్కలోని సి-విటమిన్ చర్మం నిగారింపు వస్తుంది. నచురల్ సన్ స్క్రీన్ గా…

  • అయోడైజ్డ్ ఉప్పు వాడకండి కళ్ళు ఉప్పు కు మారండి అంటున్నారు డాక్టర్లు. సోడియం,క్లోరైడ్,అయోడిన్ అనే మూడు రసాయనాలతో ఈ అయోడైజ్డ్ ఉప్పు తయారు చేస్తారు. ఉప్పు కోసం చేసె బ్రహ్మండమైన ప్రచారం తో ఇది ఆరోగ్య కరమని చక్కని స్పటికాల్లా మెరిసిపోతుందని ప్రచారం జరుగుతుంది. కాని ఇది కర్మాగారాలలో తయరయ్యె ఉప్పు . అసలైన ఉప్పు అంటే సముద్ర జలాలను ఎండబెడితే వచ్చేది. ఇందులో 72 రకాల సహజ సిద్దమైన ఖనిజ,లవణాలున్నాయి. ఇందులో కుడా క్లొరైడ్,అయోడిన్,సోడియం ఉంటాయి కాని సహజసిద్దంగా ఉండి తెలిగ్గా కరిగిపొతాయి.ఈ రాళ్ళ ఉప్పు తో మూత్రపిండాల్లో రాళ్ళు ఎర్పడవు. రాత్రి వేళలొ పిక్కల నొప్పులు,కండరాలు మొద్దుబారటం తిమ్మిర్లు లాంటివి వస్తే ఒక అరగ్లాసు నీళ్ళలో చెంచా కళ్ళు ఉప్పు వేసి తాగితే ఐదు నిమిషాల్లొ ఆ నొప్పులు మాయం అవుతాయి. రాళ్ళ ఉప్పు వాడకంతొ అధిక రక్త పోటు సమస్యకు శాస్వత విముక్తి లభిస్తుంది. బీపి సాధరణ స్థితిలో ఉండాలంటే రాళ్ళ ఉప్పు వాడాటం,మిరప కాయలు వాడటం,అరటి కాయలు తినటం అనివార్యం. రాతి ఉప్పుతో శరీరంలో 90 శాతం నీళ్ళు నిలుస్తాయి. వీలైతే ఈ పాత కాలపు కళ్ళు ఉప్పు పై దృష్టి పెట్టండి.

    అయోడైజ్డ్ ఉప్పు తో ఎంతో నష్టం

    అయోడైజ్డ్ ఉప్పు వాడకండి కళ్ళు ఉప్పు కు మారండి అంటున్నారు డాక్టర్లు. సోడియం,క్లోరైడ్,అయోడిన్ అనే మూడు రసాయనాలతో ఈ అయోడైజ్డ్ ఉప్పు తయారు చేస్తారు. ఉప్పు కోసం…

  • మార్కెట్ లొ దొరికే మంచి మంచి బ్రాండ్స్ ను బట్టి మనం వస్తువులను ఎంచుకుంటాం. ఒక్కసారి పేరు చదివిన మన కళ్ళు ...మోసపొయే వస్తువులు ఒక అక్షరం అటు ఇటుగా ఉండి మనం షాపింగ్ బ్యాగ్ లో దూరి పొతాయి. మార్కెట్ లో ఉన్న అన్ని ప్రముఖ బ్రాండ్ల డిటర్జంట్లు,చాక్ లెట్స్,ఫేస్ క్రీంలు అన్నింటికి నకిలీ బ్రాండ్ లు ఉన్నాయి. ఉదహరణకు కోల్గెట్ తీసుకొండి అచ్చం అదే ప్యాకింగ్ మధ్యలొ నీలి రంగు అక్షరాలలో coolgate అని ఉంటుంది.colgate అనుకుని కనురెప్ప పాటులో మోసపోతాం. క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లేట్ అదే ప్యాకింగ్ తో డైరీ మిల్క్ అని ఉంటుంది. రేపర్ చించి నోట్లో పెట్టుకుంటే రుచి మారిందని అది నకిలీ అని చూసే వరకు తెలియదు. పల్లెటుళ్ళలొ ఉండే చాల మంది చదువుకున్న వాళ్ళు కాస్తా పరిశీలన ద్రుష్టి ఉన్న వాళ్ళు కనిపెడతారెమో గాని ఇక చదువుకోని వాళ్ళు అది గమనించక చెప్పేదాక వీలులెనంతగా మోసపోతారు. ఇక పల్లెటుళ్ళలొ పేరు,ప్యాకింగ్ ఒక్కటిగా ఉండే సరుకులు తేలికగా వెళ్ళిపోతాయి.వస్తువు పేరు చివరలో ఉండే ఆంగ్ల అక్షరం ఒక్కటి తప్పుగా కనిపిస్తుంది. కానీ చదువుకున్న వాళ్ళు కుడా తొందరలో గమనించకుండ తిసేసుకుంటారు. ఈ నకిలీ బ్రాండ్స్ విలువ 15 వేల కోట్లు ఉంటుందని అంచనా. భారత్ లోను చైనా లొనో అయితే ప్రముఖ బ్రాండ్ ఉన్న షాపులు అచ్చం అలాగే ఉండే అక్షరాలు, లొగోలు అటు ఇటు గా మార్చి అదే పేర్లతో రన్ చేస్తుంటారు. పిజ్జాహాట్ ఉందనుకోండి పిజ్జాహిట్ అంటారు. లగో కలర్ షాపు రూపం అన్ని మోసమే. ఈ బ్రాండ్స్ చూసి కొనుక్కోవాలి మరి

    ఇది అసలా? నకిలీ నా?

    మార్కెట్ లొ దొరికే మంచి మంచి బ్రాండ్స్ ను బట్టి మనం వస్తువులను ఎంచుకుంటాం. ఒక్కసారి పేరు చదివిన మన కళ్ళు …మోసపొయే వస్తువులు ఒక అక్షరం…

  • గ్లామర్ హీరోయిన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అలనాటి హీరోయిన్ పర్వీన్ బాబీ . ఆమె చనిపోయిన 11 సంవత్సరాల తర్వాత ఆమె రాసిన వీలునామాను ఆమె కోరిక ప్రకారమే పంచాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఆమె చనిపోయే ముందు రాసిన వీలునామా చెల్లదని ఆమె బంధువులు కోర్టు కెక్కారు. ఆమె ఆస్తిలో 80 శాతం అనాధ మహిళల పిల్లలకు చెందాలని మిగిలిన 20 శాతం ఆమె బంధువు మురద్ ఖాన్ కు దక్కాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఆమె చనిపోతూ కుడా ఔనత్యాన్ని చాటుకుంది. ఇంగ్లిష్ లిటరేచర్ లో మాస్టర్స్ పర్వీన్ బాబీ సుహాగ్ ,దీవార్ ,కాలా సోనా, షాన్ వంటి బ్లాక్ బస్టర్స్ సినిమాల్లో నటించింది. 1970 నుంచి 80 దాకా ఆమె బాలీవుడ్ ఫస్ట్ వుమెన్ సూపర్ స్టార్ గానే ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించింది. అమితాబ్ తో అయితే వరసగా 8 సినిమాల్లో నటించింది. వాళ్లిద్దరూ హిట్ పెయిర్ అనేవాళ్ళు. కానీ హఠాత్తుగా సినిమాల్లో నుంచి మాయమైన పర్వీన్ చివరి రోజులు చాలా దారుణం.ఆమె చనిపోయిన మూడు రోజుల వరకు ప్రపంచానికి తెలియదు. షుగర్ తో ఒక చెయ్యి గాంగ్రీన్ వచ్చి పూర్తిగా పడిపోయిన స్థితిలో కనీసం లేచి నడవలేని స్థితిలో ఆమె మరణించి ఉంది. ఆమెకు పోస్ట్ మార్టం చేసిన కూపర్ హాస్పటల్ రిపోర్ట్ ప్రకారం ఆమె కడుపులో ఒక్క మెతుకు ఆహరం లేదు. ఎన్నో కోట్లు ఆస్తి వదిలిపోయిన ఆమె జీవితంలో చివరి మూడు రోజులు ఆకలితో తపించి చనిపోయిందని తలుచుకుంటేనే బాధగా వుంటోంది. ఒకనాటి సూపర్ స్టార్ అందాల తార జీవితం ఇది.

    పర్వీన్ బాబీ కోరిక ప్రకారమే వీలునామా

    గ్లామర్ హీరోయిన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అలనాటి హీరోయిన్ పర్వీన్ బాబీ . ఆమె చనిపోయిన 11 సంవత్సరాల తర్వాత ఆమె రాసిన వీలునామాను ఆమె…

  • కూరల్లో కరివేపాకు లాగా తీసిపారేసారు. అని నిష్టురంగా అంటుంటారు. రుచికోసం కరివేపాకు వేసి దాని అవసరం తేరిపోయాక తీసి పక్కన పెట్టినట్టు మమ్మల్ని మీ అవసరాలకు వాడుకుని పక్కన పడేశారు. అని తిట్టటం లాగా అన్నమాట. కానీ నిష్టురాల సంగతి ఎలా వున్నా ప్రతీ కారపచ్చడి తాలింపులో మంచి వాసన కోసం కరివేపాకు రెబ్బలు వేసి తినేటప్పుడు తీసి పక్కన పారేస్తా. ఇక చారు కయితే కరివేపాకు తోనే అంతటి కమ్మని వాసన. ఇలా ఏరి పారేసే కరివేపాకులో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఫైబర్ ,కాల్షియం , పాస్ఫరస్ C.A ,B,E విటమిన్లు,కార్బోహైడ్రేట్స్ ,కరివేపాకులో లభిస్తాయి. గుండె సక్రమంగా పనిచేయాలంటే కూడా కరివేపాకే ఔషధం. చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు ఫంగల్ ఇన్ఫెక్షన్లు కరివేపాకులో తగ్గిపోతాయి. కరివేపాకులో గోరువెచ్చని నీరు పోసి ముద్దచేసి ఆ ముద్ద ఇన్ఫెక్షన్లు ఉన్న చోట రాస్తే నిమిషాల పైన ఫలితం తెలుస్తుంది. మజ్జిగ లో మిరియాల పొడి ,ఉప్పు , కరివేపాకు కలిపి తాగితే నిజంగా అదే ఔషధం లాంటిది. ఎండా కాలం లో ఇది ప్రాణదాత లాంటిది. ఆకులే కాదు కరివేపాకు వేరు కూడా గాయాలను తగ్గించగలదు. కరివేపాకు కడిగి ఎండపెట్టి మిరపకాయలు,చింతపండు , ఉప్పు కలిపి చేసే కరివేపాకు కారంలో రోజూ ఒక్క ముద్ద అన్నం తింటే ఆరోజు తిన్న ఎక్కువైన భోజనపు బరువును తగ్గించగలదు. పిల్లలు ,పెద్దవాళ్ళు కుడా కూరల్లో వాడిన కరివేపాకు ఏరి పారేయకుండా సన్నగా తరిగి కూరల్లో వేస్తె ఎంతో ఆరోగ్యం.

    రుచి దొరికాక పడేయకండి. ఇది ఔషధం

    కూరల్లో కరివేపాకు లాగా తీసిపారేసారు. అని నిష్టురంగా అంటుంటారు. రుచికోసం కరివేపాకు వేసి దాని అవసరం తేరిపోయాక తీసి పక్కన పెట్టినట్టు మమ్మల్ని మీ అవసరాలకు వాడుకుని…