• చిన్న వయసు నుంచే ఆహారం విషయంలో కాస్త అప్రమత్తత తో ఉంటే గుండెకు పదిలంగా కాపాడుకోవచ్చు. చేపలు. ఓట్ మీల్ .స్ట్రా బెర్రీలు ,నిమ్మజాతి పండ్లు ,సొయా ఇవి గుండెకు చాలా మేలు చేస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలుండే చేపలు వారానికి రెండు సార్లయినా తీసుకోవాలి. ఓట్ మీల్ ఉదయపు అల్పాహారంగా తీసుకుంటే గుండె పనితీరు మెరుగవుతుంది. స్ట్రా బెర్రీ రక్త ప్రసరణ సరిగ్గా జరిగేలా చూస్తాయి. సి విటమిన్ పుష్కలంగా వుంటే సిట్రస్ పండ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. విటమిన్లు ఖనిజాలు అధికంగా వుండే సొయా హుద్రోగాలను దూరంగా ఉంచుతోంది.

    ఈ ఐదు గుండెకు మంచివి

    చిన్న వయసు నుంచే  ఆహారం విషయంలో కాస్త అప్రమత్తత తో ఉంటే గుండెకు పదిలంగా కాపాడుకోవచ్చు. చేపలు. ఓట్ మీల్ .స్ట్రా బెర్రీలు ,నిమ్మజాతి పండ్లు ,సొయా …

  • ఎన్ని ఫ్యాషన్లు మారుతున్నా ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ ట్రెండ్ మాత్రం జీన్స్. ఎన్నో రకాల జీన్స్ చిరుగులు జీన్స్ టోర్న ,హై వెయిస్టిడ్ ,స్ట్రెచ్ బూట్ కట్, ఫేర్డ్ , బాయ్ ఫ్రెండ్ బ్యాగీ స్కిన్స్ యాంగిల్ కట్ వగైరా వగైరా . డెనిమ్ క్లాత్ తో చేసిన జెగ్గింగ్స్ కూడా ఇప్పుడు ఫ్యాషన్. జీన్స్ కి తగట్టు టీ షర్ట్ ,కుర్తీ , కుర్తాలే కాదు. పొడుగ్గా చీలికలుండే మ్యాక్సి టాప్ లు బావుంటాయి. ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో అనుష్క శర్మ వేసుకున్న డ్రెస్ ఇదే. నీలం నలుపే కాకుండా ఎరుపు. గులాబీ ,పసుపు , రంగుల జీన్స్ కూడా వాడచ్చు. వాటి మెడకు సాదా ప్రింటెడ్ టాప్స్ బావుంటాయి. ఏదైనా పార్టీ కి వెళ్లాలనుకుంటే లేత రంగులు వున్న జీన్స్ ప్యాంట్ పైకి మెరుపులున్న టాప్స్ ట్రై చేస్తే పార్టీ లుక్ వచ్చేస్తుంది.

    ఎప్పటికీ మారని ఫ్యాషన్ జీన్స్

    ఎన్ని ఫ్యాషన్లు మారుతున్నా ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ ట్రెండ్ మాత్రం జీన్స్. ఎన్నో రకాల జీన్స్ చిరుగులు జీన్స్ టోర్న ,హై వెయిస్టిడ్  ,స్ట్రెచ్ బూట్ కట్,…

  • సిమ్రన్ చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్న కంగనా రనౌత్ రాణీ లక్ష్మీ బాయ్ పాత్రలో నటించబోతోంది. అందుకోసం జర్మనీ వెళ్లి గుర్రపు స్వారీ ప్రత్యేక శిక్షణ తీసుకోబోతోందిట. సాధారణంగా సినిమాల్లో మచ్చిక చేసిన గుర్రాలు వాడతారు. కానీ కంగనా అన్ని రకాల గుర్రాలపైనా స్వారీ చేసి బరువు సాధించాలనుకుంటుందిట. వివిధ జాతుల గుర్రాలు వాటిని మచ్చిక చేసుకునే విధానం గాయాలైతే ప్రధమ చికిత్స ఇవన్నీ జర్మనీ లో నేర్పిస్తారు. ఝాన్సీ రాణి వేషం వేయాలంటే ఈ మాత్రం కష్టపడకపోతే ఈ పాత్ర కు ఎలా న్యాయం చేస్తానంటోంది. కంగనా. తగిన బరువు పెరుగుతోందిట. ఆ అపాత్రకు కావలిసిన దుస్తుల విషయంలో కూడా చాల శ్రద్ధ తీసుకుంటోందిట. మనం తేర పైన నిజమైన వీరనారిని చూస్తామన్నమాట.

    ఆ పాత్ర కోసం ఆ మాత్రం రిస్క్ వద్దా ?

    సిమ్రన్ చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్న కంగనా రనౌత్ రాణీ లక్ష్మీ బాయ్  పాత్రలో నటించబోతోంది. అందుకోసం జర్మనీ వెళ్లి గుర్రపు స్వారీ ప్రత్యేక శిక్షణ తీసుకోబోతోందిట. సాధారణంగా…

  • రాజస్థాన్ లోని బికనీర్ లో పుట్టింది మాల్వికా అయ్యర్ 13సంవత్సరాల వయసులో తన ఇంటి సమీపంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో రెండు చేతులు పోగొట్టుకుంది. కాళ్ళు ముక్కలయ్యాయి. ఎన్నో సర్జరీల తర్వాత కాళ్ళు కాపాడగలిగారు డాక్టర్లు. రెండు చేతులు కృత్రిమ ప్రొస్థెటిక్ హాండ్స్ పెట్టుకుని కాలేజీలో చదివి పి.జి చేసింది. అలా మొదలైన ఆమె జీవిత ప్రస్థానం ఆమెను దేశవిదేశాల్లో ప్రధాన మోటివేషన్ స్పీకర్ దాకా సాగింది. సోషల్ వర్క్ లో పి. జి చేసి యాక్సిడెంట్ సర్వైవర్ గా మొదలైన మాల్వికా యాక్టివిస్ట్ గా మారింది. వికలాంగుల కోసం ఆమె సాగిస్తున్న కృషికి గానూ న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు ఎమర్జింగ్ లీడర్ అవార్డు ఇచ్చారు. జీవితం మొత్తం మోటివేషన్ స్పీకర్ గానే కొనసాగాలంటోంది మాల్వికా. ఈమె పూర్తి కథను your story. com లో చదవచ్చు.

    చైతన్య దీపిక మాల్వికా అయ్యర్

    రాజస్థాన్ లోని బికనీర్ లో పుట్టింది మాల్వికా అయ్యర్ 13సంవత్సరాల వయసులో తన ఇంటి సమీపంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో రెండు చేతులు పోగొట్టుకుంది. కాళ్ళు…

  • ఛత్తీస్గఢ్ కు చెందిన స్మిత తందిని ఫేస్ బుక్ లు పది లక్షల కంటే ఎక్కువ మంది అనుకరిస్తున్నారు. వృత్తి రిత్యా కాని స్టేబుల్ వైద్యం చేఇంచుకోలేని పేద వాళ్ళ కోసం స్మిత చాలా కష్టపడుతుంది. ఫేస్ బుక్ ద్వారా వివరాలు తెలుసుకుని తనను ఫాలో అయ్యే వారి దగ్గర విరాళాలు సేకరించి ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టింది స్మిత. ఇలా నిత్యం ఆసుపత్రుల్లో వివరాలు సేకరించి ఆడుకునే స్మిత కర్యదిక్షకు ఉన్నతాధి కారులు ఎంతగానో మెచ్చుకుని విమెన్స్ హెల్ప్ ప్రారంబించి ఆ బాధ్యత స్మితకు అప్పగించారు. నిరుపేద కుటుంబంలో పుట్టి అతి సాదరణమైన ఉద్యోగంలో వున్న ఇంత మందికి స్పూర్తిగా నిలబడినందుకు స్మిత సల్యుట్ చేయాల్సిందే.

    ఆమె ఏడు లక్షల మంది ఫాలోవర్స్

    ఛత్తీస్గఢ్ కు చెందిన స్మిత తందిని ఫేస్ బుక్ లు పది లక్షల కంటే ఎక్కువ మంది అనుకరిస్తున్నారు. వృత్తి రిత్యా కాని స్టేబుల్ వైద్యం చేఇంచుకోలేని…

  • సినిమాల్లో నటన తో ఆకట్టుకొవడం మాత్రమే కాదు. కొందరు సమాజం పట్ల స్పందించడంలో ముందుంటారు. వాళ్ళల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈ హీరోయిన్ వాళ్ళతో మాట్లాడుతుంది నా మనస్సు బరువెక్కి పోయింది. ఆడపిల్లలకు రక్షణ పద్ధతుల పై శిక్షణ ఇవ్వాలనిపించింది. శారీరకంగా ధృడంగా వుండటం కంటే ముందు మానసిక ధృడత్వం కూడా చాలా అవసరం. దేశంలో అత్యాచారాలు పెరిగిపోయాయి. మహిళల పై దాడులు జరగడం వంటి వార్తలు ప్రతి రోజు కనబడి నిద్రలేకుండా పోతుంది. అసలు బాధితులకు అందంగా నేను నిలబడతాను. నా వంతు వాళ్ళు కోలుకునేందుకు సాయం చేస్తా అంటుంది రాకుల్ ప్రీత్ సింగ్.

    బాధితుల కోసం నేనున్నానన్న రకుల్

    సినిమాల్లో నటన తో ఆకట్టుకొవడం మాత్రమే కాదు. కొందరు సమాజం పట్ల స్పందించడంలో ముందుంటారు. వాళ్ళల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈ హీరోయిన్ వాళ్ళతో మాట్లాడుతుంది…

  • ధనుష్ భార్య,రజనీకాంత్ కూతురు అన్న ట్యాగ్స్ కంటే ఐశ్వర్య కు మంచి రచయత్రి అన్న ట్యాగ్ బాగా నప్పుతుంది. ఈమె ఐక్యరాజ్య సమితి మహిళ సమాఖ్య సలహాదారు. లింగ సమస్య సాధికారత పై సలహలిచ్చే భాద్యత ఈమెది. ఈ మద్య జరిగిన్ ఐక్యరాజ్యసమితి మహిళ సమావేశంలో ఐశ్వర్య ఐక్యరాజ్యసమితి మహిళా కార్యచరణ నిర్దేశకురాలు పూంజిల్ ,ఉపకార్యచరణ నిర్దేశకురాలు......కలిసి పాల్గొంది.మనం కోత్త సమాజాన్ని నెలకోల్పలని ఆ సమాజం రేపటి తరానికి ఇవ్వాలని ఐశ్వర్య తన ప్రసంగం లో చెప్పింది. పూర్తి పాఠం విశేషాలు వెబ్ సైట్ లో చూడొచ్చు. మన గురించి ఏం చెప్పుకొవాలో ఏం తెలుసుకోవాలో ఇలాంటి సమావేశాల్లో అర్ధం అవుతుంది.

    ఐరాస మహిళ ఐశ్వర్య

    ధనుష్ భార్య,రజనీకాంత్ కూతురు అన్న ట్యాగ్స్ కంటే ఐశ్వర్య కు మంచి రచయత్రి అన్న ట్యాగ్ బాగా నప్పుతుంది. ఈమె ఐక్యరాజ్య సమితి మహిళ సమాఖ్య సలహాదారు.…

  • చిన్ననాటి అలవాట్ల వల్లే నేనిలా సృజనాత్మకంగా ఉండగలుగుతున్నాను అంటోంది శృతి హాసన్. స్కూల్ కు వెళ్లే రోజుల్లో అదేపనిగా కట్టు కధలు చెప్పేదట. అలాగే స్కూల్లో ఇచ్చిన హోమ్ వర్క్ ని ఎవ్వరి సాయం అడగకుండానే తానే కష్టపడి చేసేదట. తనకు సంబంధించిన ప్రతి పనీ పెద్దవాళ్ళు వాదిస్తున్నా వినకుండా తనే చేసుకునేదట. ఆలా అలవాటై ఇవ్వాళ మంచి కధలు పాటలు రాయగలుగుతున్నానంటోంది. బాల్యం ప్రభావం వల్లనే స్వతంత్రంగా ఆలోచించటం నిర్ణయాలు తీసుకోవటం చేతనైందట. ప్రేమమ్ , సక్సెస్ తర్వాత కాటమ రాయుడు ,సింగం 3 లో నటిస్తున్న శృతి ఆల్ రౌండర్ మ్యూజిక్ ఆల్బమ్స్ పాటలు యాక్టింగ్ షార్ట్ ఫిల్మ్స్ ఒకటేమిటి సినిమాకు సంబంధించిన ఎన్నో విభాగాల్లో ఆమె తేలిగ్గా ఇమిడిపోతోంది.

    ఇప్పటి ధైర్యానికి బాల్యంతో పునాది

    చిన్ననాటి అలవాట్ల వల్లే నేనిలా సృజనాత్మకంగా ఉండగలుగుతున్నాను అంటోంది శృతి హాసన్. స్కూల్ కు వెళ్లే రోజుల్లో అదేపనిగా కట్టు  కధలు చెప్పేదట. అలాగే స్కూల్లో ఇచ్చిన…

  • ప్రతి నలుగురిలో ఒక్కరిది ఈ సమస్య.ముఖ్యంగా అమ్మయిలు ఎక్కువ వర్రి అయ్యే సంమస్య జుట్టు రాలిపొవడం. జుట్టు పలుచబడి పొతే అంతే మనసు బెంగపడిపోతుంది ఇదిగో అలా ఫీలయ్యే వాళ్లా కోసం ఈ హోం రెమిడీస్. కాస్తా శ్రద్ద పాటిస్తే ఒత్తయిన జుట్టు మిదే. కొబ్బరికాయ కొట్టెసి ఆ కొబ్బరి నుంచి పాలు తీసి అప్లయ్ చేస్తే ఇందులో ఉండే పొటాషియం, ఐరన్ ఇతర పోషకాలు కురులు బలంగా చేసి పోషణ ఇస్తాయి. అలాగే ఉల్లిపాయల జ్యుస్ కుడా ఇది కోల్లజన్ ఉత్పత్తి ని పెంచి జుట్టు తిరిగి పెరిగేలా చేస్తుంది. వాసన కొంచం ప్రాబ్లాం అయిన షాంపు లతో వదిలించవచ్చు. ప్రోటిన్ల కోసం ఎగ్ మాస్క్ కుడా జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగం. ఇవన్ని తప్పనిసరిగా ఫలితం చూపించే రెమిడీలు.

    ఒత్తైన జుట్టు కోసం బెస్ట్ మెడిసిన్

    ప్రతి నలుగురిలో ఒక్కరిది ఈ సమస్య.ముఖ్యంగా అమ్మయిలు ఎక్కువ వర్రి అయ్యే సంమస్య జుట్టు రాలిపొవడం. జుట్టు పలుచబడి పొతే అంతే మనసు బెంగపడిపోతుంది ఇదిగో అలా…

  • కుంకుడు కాయలు తలస్నానానికి ఎప్పుడో వద్దన్నాం. షాంపూ తో కుంకుళ్ళు వెనుకబడ్డాయి. కానీ కుంకుడు రసం పట్టు నేత చీరలు మిలమిలా మెరిసేట్టు చేస్తుంది. కుంకుడు రసంతో కొత్త చీరలు ఉతికితే రంగుపోదు ,కొత్తదనం కూడా పోదు. అలాగే కుంకుడు రసంతో కాస్త వెనిగర్ కలిపి గాజు సామాన్లు కిటికీలు అద్దాలు తుడిస్తే మెరిసిపోతాయి. ఎన్ని క్లీనింగ్ రసాయనాలు వాడినా స్నానాల గది మురికిగానే ఉన్నటుంటుంది. కుంకుడు రసంలో బేకింగ్ సోడా ఒక స్పూన్ బొరాక్స్ పౌడర్ ను కలిపి ఇందులో కాస్త యూకలిఫ్టస్ ఆయిల్ కలిపి బాత్ రూమ్ క్లీన్ చేస్తే నేల గోడలు కూడా క్లీన్ గా అయిపోతాయి. కుంకుడు రసంతో ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ కలిపి గూడాల వారగా చల్లితే దోమలు ఈగల బెడద వుండదు. పోనీ కుంకుడు కాయలు ఇలాగైనా సద్వినియోగం చేయచ్చు.

    కుంకుడు కాయతో ఎన్నో ఉపయోగాలు

    కుంకుడు కాయలు తలస్నానానికి ఎప్పుడో వద్దన్నాం. షాంపూ తో కుంకుళ్ళు వెనుకబడ్డాయి. కానీ కుంకుడు రసం పట్టు నేత చీరలు మిలమిలా మెరిసేట్టు చేస్తుంది. కుంకుడు రసంతో…