• ఎత్తు మడమల చెప్పులే అమ్మాయిలకిష్టం. పొడుగ్గా కనబడతారు మోడరన్ డ్రెస్ లకు తగ్గినట్లు ఉంటుందని కష్టపడి నడుస్తూ వుంటారు. కానీ ఇలా హీల్స్ వాడేవాళ్లలో మోకాళ్ళ నొప్పులొస్తాయి జాగ్రత్త అంటున్నారు డాక్టర్లు. హీల్స్ ఎత్తయ్యే కొద్దీ కాలి పిక్క కండరం బిగుసుకుపోతుందిట. రెండడుగుల మించి ఎత్తు చెప్పులు వాడనే వద్దంటున్నారు. ఇప్పటికే నొప్పులొస్తే కాళ్ళకి పుదీనా గుణాలున్న ఆయిల్ తో మస్సాజ్ చేసుకుంటే ఉపశమనం కలుగుతుంది. అలాగే రాళ్ల ఉప్పు వేసిన గోరు వెచ్చని నీళ్లతో కాళ్ళని ఉంచితే నొప్పులు తగ్గుతాయి. నొప్పుల బాధించేంతగా ఉంటే డాక్టర్ సాయంతో వ్యాయామాలు ట్రై చేయచ్చు.

    ఎత్తు మడమల చెప్పులతో పాదాల నొప్పులు

    ఎత్తు మడమల చెప్పులే అమ్మాయిలకిష్టం. పొడుగ్గా కనబడతారు మోడరన్ డ్రెస్ లకు తగ్గినట్లు ఉంటుందని కష్టపడి నడుస్తూ వుంటారు. కానీ ఇలా హీల్స్ వాడేవాళ్లలో మోకాళ్ళ నొప్పులొస్తాయి…

  • ప్రతి రోజు ఒక అర గ్లాస్ బీట్ రూట్ రసం తాగితే కండరాల శక్తి పెరుగుతుందని వాషింగ్టన్ వైద్య విద్యాలయ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇది హృద్రోగులకు కూడా చాలా శక్తినిస్తుంది. సరుకులు మోయటం మెట్లెక్కటం వంటి దైనందిన మైన పనులు చేయలేకపోవటం కండరాలు శక్తి క్షీణించటం వల్లనే అంటున్నారు ఎక్సపర్ట్స్. బీట్ రూట్ రసంతో నైట్రేట్ సుతఃయిలు అత్యధికంగా ఉన్నాయని వీటిని శరీరం నైట్రిక్ ఆక్సైడ్ గా మార్చుకుంటుందనీ దీని వల్ల కాంట్రక్షన్ స్పీడ్ శక్తి పెరుగుతుందంటున్నారు. ఏ జ్యూస్ పెద్దవాళ్ళు రెగ్యులర్ గా తీసుకుంటే కండరాల మెరుగుదల ఉంటుందనీ కండరాల బలహీనత అలసట ఇవన్నీ మాయమవుతాయని చెపుతున్నారు.

    బీట్ రూట్ జ్యూస్ తో సూపర్ పవర్

    ప్రతి రోజు ఒక అర గ్లాస్ బీట్ రూట్ రసం తాగితే కండరాల శక్తి పెరుగుతుందని వాషింగ్టన్ వైద్య విద్యాలయ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇది హృద్రోగులకు కూడా…

  • ఆర్గానిక్ కూరగాయలు పండ్లు సేంద్రియ ఎరువులు వేసి సహజమైన పద్ధతుల్లో పండిస్తారనీ ఆరోగ్యానికి మంచిదనీ ఖరీదైనా కొనాలనుకుంటాం. పళ్ళు ,కాయగూరల పై లేబుల్స్ ఉంటాయి. వాటిని బట్టి అవి ఆర్గానిక్ వా కాదా తెలుసుకోవచ్చు. ఆపిల్ కూడా లేబుల్ పైన నాలుగు అంకెలు వుండి మొదటి అంకె మూడు లేదా నాలుగు అని వుంటే అవి పురుగు మందులు వేసినవి అని అర్ధం. లేబుల్ పైన ఐదు అంకెలుండి మొదటి అంకె ఎనిమిది అయితే అది జన్యు మార్పిడి ద్వారా పండించినది అని అర్ధం. లేబుల్ పైన ఐదు అంకెలుండి మొదటి అంకె తొమ్మిదయితే అది ఆర్గానిక్ పండే. ఈ పళ్ళ పై వుండే లేబుల్ తినదగిన కాగితంతో జీర్ణమయ్యే జిగురుతో అంటిస్తారు. కానక పిల్లలు గబుక్కున లేబుల్ తో సహా తినేసినా ప్రాబ్లమ్ ఏవీ లేదు.

    ఏ యాపిల్ మంచిది

    ఆర్గానిక్ కూరగాయలు పండ్లు సేంద్రియ ఎరువులు వేసి సహజమైన పద్ధతుల్లో పండిస్తారనీ  ఆరోగ్యానికి మంచిదనీ ఖరీదైనా  కొనాలనుకుంటాం. పళ్ళు ,కాయగూరల పై లేబుల్స్ ఉంటాయి. వాటిని బట్టి…

  • కార్తీక మాసం సందర్భంగా భక్తి టీవి నిర్వహిస్తున్న కోటి దీపోత్సవాల వేడుక కన్నుల పండుగ గా జరుగుతుంది. నవంబర్ 5వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరగనున్న ఈ వేడుకల్లో నిత్యం వివిధ ప్రత్యేక పూజలతో దైవాన్ని ఆరాదిస్తూ కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని వేడుకలా నిర్వహిస్తున్నారు. బుధవారం జరిగిన ప్రత్యేక పూజలు, కార్తీక దీపారాధనలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు దంపతులు పాల్గొన్నారు.

    కోటి దీపోత్సవంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు దంపతులు

    కార్తీక మాసం సందర్భంగా భక్తి టీవి నిర్వహిస్తున్న కోటి దీపోత్సవాల వేడుక కన్నుల పండుగ గా జరుగుతుంది. నవంబర్ 5వ తేదీ నుంచి 21వ తేదీ వరకు…

  • కోన్ ఐస్ క్రీమ్ తినేసాక చివరగా కోన్ కూడా బిస్కెట్ ఫ్లేవర్ తో తినేందుకు అనువుగా ఉంటుంది. ఇప్పుడు అచ్ఛంగా అలంటి వడ్డించే గిన్నెలొస్తున్నాయి. సూప్ లు, పాలు, పాయసం, తాగాక కప్పుల్ని కూడా అలాగే తినేయచ్చు. చివరికి కేక్ ముక్కని కూడా నేరుగా గిన్నెతో కలిపి తినేయచ్చు. అదెలాగంటే కుల్ఫీలు ,చాక్లేట్లు ,గోధుమ ,జొన్న ,రాగి , చీజ్ , మాంసం , కూడా గిన్నెల్లాగా చేసే మిషన్లోచ్చాయి. వాఫిల్ బౌల్ మేకర్ దానిపేరు. మనక్కావలిసిన రకం పిండి నాన్ వెజ్ ,స్వీట్ ,ఏదైనా టేస్టీ గా కలిపేసి ఇందులో ఆ పిండి పెట్టేసి మూత వేసేసి స్విచ్ నొక్కితే వెంటనే కాస్త పిండి పెడితే ఆ పిండి కాస్తా గిన్నె ఆకారం లోకో కోన్ ఆకారం లోకో కూడా మనం ఆర్డర్ ఇచ్చి తెచ్చుకున్న రకం రూపంలోకో మారిపోయి వచ్చేస్తాయి. ఇక చాక్లేట్ గిన్నెలకున్న పాపులారిటీ ఇంకా వేటికీ లేదుట. కరిగిన చాక్లేట్ ని వేరే అచ్చుల్లో పూసి కూడా ఈ గిన్నెల్ని తయారు చేయచ్చు. కూరలు ,సలాడ్లు, సూప్ లు , కోసం రకరకాల పిండి మాంసం కలిపి గిన్నెలను చేసేయచ్చు. రకరకాల ప్యాకింగులతో పర్యావరణనికి సమస్యలు లేకుండా చేసే ఇలాంటి వస్తువుల వల్ల చాలా ప్రయోజనం.

    తినేసే గిన్నెలొచ్చాయి

    కోన్ ఐస్ క్రీమ్  తినేసాక చివరగా కోన్  కూడా బిస్కెట్ ఫ్లేవర్ తో తినేందుకు అనువుగా ఉంటుంది. ఇప్పుడు అచ్ఛంగా అలంటి వడ్డించే గిన్నెలొస్తున్నాయి. సూప్ లు,…

  • వ్యాయామం అలవాటై పోయిన ఒక్క పూట మానేసినా ఎదో వెలితిగా ఉంటుంది. మరి వణికించే ఈ చలి రోజుల్లో వర్కవుట్స్ చేయటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. చలికి నొప్పులొస్తాయి. చలిగాలులకు శరీరం ప్రభావితం కాకుండా నిండుగా చెమట పట్టే దళసరి వస్త్రాలు ధరించాలి. నేరుగా చలిలోకి పరుగు తీయకుండా ఇంట్లో వార్మ్ అప్ చేయాలి. అప్పుడు శరీరం వ్యాయామం కోసం సిద్ధం అవుతుంది.ఎండ తీవ్రత లేకపోయినా సన్ స్క్రీన్ రాసుకుని తీరాలి. లేకపోతే చర్మం చలికి పగిలి పాడవుతుంది. ఉదయాన్నే కాకపోతే సాయంత్రం కాస్త ఎండా వుండగానే వ్యాయామం పూర్తి చేసినా మేలే. ఎంతయినా చల్లని ఆహ్లాదకరమైన వాతావరణం కొన్ని జాగ్రత్తలు తీసుకుని జాగింగ్ మానక పోవటమే హాయి.

    చల్లగా వున్నా సరే మానకండి

    వ్యాయామం అలవాటై పోయిన ఒక్క పూట  మానేసినా  ఎదో వెలితిగా ఉంటుంది. మరి వణికించే ఈ చలి రోజుల్లో వర్కవుట్స్ చేయటం వల్ల  లాభం కంటే నష్టమే …

  • పిల్లల్ని బాగా పెంచటం అంటే ఖరీదైన వస్తువులు దుస్తులు ఖరీదైన పెంపకపు పోకడలు కాదు. చిన్న పిల్లలకు ఈ ప్రపంచంలో వస్తువుల ఖరీదు తెలియదు. వాళ్ళ దృష్టిలో జామపండు పిజ్జా రెండు ఒకటే. ఏది ఇష్టమో దాన్ని కోరుకుంటారు. ఖరీదు బట్టి కాదు. వాళ్ళ తల్లి తండ్రుల ఆసరా స్నేహం వాళ్లతో కలిసి గడిచే సమయం కావాలి. ఎదిగే వయసులో వాళ్ళకి ప్రోత్సాహం కావాలి. రెండు మార్కులు తక్కవొస్తే పర్లేదు ఈ సారి వస్తాయి లెద్దూ అనే ప్రేమ కావాలి. పెళ్లిళ్లు పేరంటాలకు పిల్లల్ని తీసుకుపోయినట్లే స్నేహితులు బంధువుల ఇళ్లలో జరిగే విషాదాలు కూడా వాళ్ళకి తెలియాలి. పుట్టిన రోజుకి ఫ్రెండ్స్ కిజిఫ్టు ఇమ్మని చెప్పటం కాకుండా ఎవరైనా అనారోగ్యాల తో వుండే దగ్గరుండి తీసుకుపోయి స్నేహితుల బాధను పంచుకునే అలవాటు చేయాలి. మనం దేన్నీ ఇస్తే దాన్నే అమూల్యమనుకుంటారు.

    కష్టం , సుఖం , తెలుసుకోనివ్వండి

    పిల్లల్ని బాగా పెంచటం అంటే ఖరీదైన వస్తువులు దుస్తులు ఖరీదైన పెంపకపు పోకడలు కాదు. చిన్న పిల్లలకు ఈ ప్రపంచంలో వస్తువుల ఖరీదు తెలియదు. వాళ్ళ దృష్టిలో…

  • పదహారేళ్ళ అమ్మాయి లంగా ఓణీలో కనపడితేనే అందం. పైగా మంచి మంచి డిజైనర్ లంగాలు ఓణీలు, బోలెడన్ని వెరైటీస్ వస్తున్నాయి. ప్లైన్ పరికిణీలు, హైలీ డిజైన్ బ్లవుజు, చిన్న అంచున్న ఓణి అందమే అందం. అలాగే పరికిణీ బ్లౌవుజ్ లు చాలా హెవీ వర్క్ తో వుండి వాటి పైన చెక్కని సారీ ఓణీ ఇంకా అందం అలాగే డిజైనర్ బ్లౌవుజులు, మోచేతి వరకు వస్తున్నాయి లేదా స్లీవ్ లెస్లూ వున్నాయి. ప్రేత్యేకమైన వేడుకల కోసం మంచి వర్క్ డిజైనర్ లు, లంగా ఓణీ కలిపి కుట్టేసి ఇంకెన్నో ఫ్యాషన్ ప్రపంచంలోకి పాతబడి పోకుండా కొత్తగా అడుగు పెడుతున్నాయి.

    ఎప్పటికీ మారని అందం లంగా ఓణీ

    పదహారేళ్ళ అమ్మాయి లంగా ఓణీలో కనపడితేనే అందం. పైగా మంచి మంచి డిజైనర్ లంగాలు ఓణీలు, బోలెడన్ని వెరైటీస్ వస్తున్నాయి. ప్లైన్ పరికిణీలు, హైలీ డిజైన్ బ్లవుజు,…

  • ఇప్పటి దాకా అచస్ట్రక్టివ్ స్లీప్ అప్లియా అంటే గురక పెట్టడం, పగటి వేల నిద్ర, నిద్ర లేమి పురుషులకే వుంటాయి అనుకుంటున్నారు. 20 నుంచి 70 సంవత్సరాల వయస్సున్న మహిళలపై చేసిన ఒక అధ్యయినంలో మహిళల్లో 70 శాతం మందికి ఈ ప్రాబ్లం ఉన్నట్లు తేలింది. ఇది పగటి నిద్ర వల్ల కాదని ఈ నిద్ర లేమి స్థూలకాయం, హైపర్ టెన్షన్ ల తో సంబంధం కలిగి వుందని పరిశోధనలు తేల్చాయి. స్థూలకాయం ఉన్న మహిళల్లో 31 శతం మంది సరైన నిద్ర పట్టకపోవడం, గురక, నిద్ర మధ్యలో మెలకువ వంటి సమస్యలు వున్నాయిని అధ్యయినం తేల్చింది. అన్నింటికీ కారణమైన శరీరపు బరువుని ఎలాగైనా తగ్గించుకోమని రేపోర్ట్లు స్పష్టం చేస్తున్నాయి.

    స్త్రీలకి ఈ సమస్య సహజమే

    ఇప్పటి దాకా అచస్ట్రక్టివ్ స్లీప్ అప్లియా అంటే గురక పెట్టడం, పగటి వేల నిద్ర, నిద్ర లేమి పురుషులకే వుంటాయి అనుకుంటున్నారు. 20 నుంచి 70 సంవత్సరాల…

  • సంగీతానికి రుగ్మతల్ని దూరం చేసే శక్తి ఉందని ఇప్పటిదాకా ఎంతో మంది అధ్యయన కారులు చెప్పారు. ఇప్పుడు తాజాగా డిప్రెషన్ కు కారణం అయ్యే అనేక మానసిక సమస్యలు నృత్యం ద్వారా దూరమవైతాయంటున్నారు. క్లినికల్ డిప్రెషన్ చికిత్సలు సాధారణ థెరపీ తో నృత్యం ప్రత్యామ్నాయ చికిత్స అంటున్నాం. డాన్స్ కారణంగా డిప్రెషన్ నుంచి బయట పడటమే కాదు శారీరికంగా ఫిట్నెస్ తో ఉంటారంటున్నారు. డిప్రెషన్ బాధితులే కాదు సాధారణ ఆరోగ్యంతో ఉండేవారు కూడా డాన్స్ ప్రాక్టీస్ చేస్తే ఆహ్లాదంగా విశ్రాంతిగా ఉంటుందని ఎన్నో వత్తిడులకు సంగీతం ,నృత్యం ఒక థెరపీ లాంటిదంటున్నారు. నడక ఏరోబిక్స్ యోగ వంటివి చేసేందుకు విసుగైతే డాన్స్ నేర్చుకోండి లేదా టీవీ ల్లో చూసయినా నాలుగు అడుగులు వేయనాదంటున్నారు నిపుణులు.

    డిప్రెషన్ తగ్గించే డాన్స్

    సంగీతానికి రుగ్మతల్ని దూరం చేసే శక్తి ఉందని ఇప్పటిదాకా ఎంతో మంది అధ్యయన కారులు చెప్పారు. ఇప్పుడు తాజాగా డిప్రెషన్ కు కారణం అయ్యే అనేక మానసిక…